సాక్షి, అమరావతి : 'గ్లోబల్ వర్చువల్ సమ్మిట్-2021'కు ఆంధ్రప్రదేశ్ పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డికి కాన్ఫిడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ (సీఐఐ) ఆహ్వానం అందించింది. దేశాలు, రంగాల వారీగా ఫిబ్రవరిలో నిర్వహించే ఈ భారీ సదస్సుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డితో సహా పాల్గొనాలని ఆహ్వానించింది. ఏపీ పారిశ్రామిక ప్రగతికి సీఐఐ వినూత్న ఆలోచనలతో ముందుకొచ్చింది. చదవండి: రిమోట్ వర్క్‌పై తర్వలోనే ఎంవోయూలు
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని మంత్రి క్యాంపు కార్యాలయంలో శుక్రవారం సీఐఐ రీజనల్ డైరెక్టర్ సతీష్ రామన్ శుక్రవారం మంత్రి గౌతమ్ రెడ్డితో సమావేశమయ్యారు. ఈ మేరకు ఎలక్ట్రిక్ వెహికిల్ పాలసీలో సీఐఐతో భాగస్వామ్యానికి మంత్రి మేకపాటి సానుకూలంగా స్పందించారు. ఆంధ్రప్రదేశ్‌లో 'ఒక జిల్లా-ఒక వస్తువు'పై పూర్తి స్థాయి నివేదిక అందించేందుకు సీఐఐ ప్రతిపాదన అందించింది. ఎమ్ఎస్ఎమ్ఈ, నైపుణ్యం, వైద్య, మౌలికసదుపాయాల కల్పన, సీఎస్ఆర్ నిధుల అంశాలపై మంత్రి మేకపాటితో సీఐఐ రీజనల్ డైరెక్టర్ చర్చించారు.
Comments
Please login to add a commentAdd a comment