హైదరాబాద్: రాష్ట్రానికి పెద్ద ఎత్తున పెట్టుబడులను ఆకర్షించేందుకు వీలైనన్ని ప్రయత్నాలు చేస్తున్నామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పారు. అసెంబ్లీలోని తన కార్యాలయంలో సీఐఐ ప్రతినిధులతో భేటీ అయ్యారు. వచ్చే నెల 10, 11, 12 తేదీల్లో విశాఖలో జరిగే పార్టనర్‌షిప్ సదస్సు ఏర్పాట్లపై చర్చించారు. ఈ సదస్సును ప్రారంభించాల్సిందిగా రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని కలిసి విజ్ఞప్తి చేశామని ప్రతినిధులకు సీఎం వివరించారు. ఈవెంట్‌ను విజయవంతం చేసి ఆంధ్రప్రదేశ్‌ను పెట్టుబడుల ఆకర్షణ కేంద్రంగా వార్తల్లో నిలపాలని వారిని కోరారు.
సీఎంని కలిసిన వారిలో సీఐఐ డైరెక్టర్ జనరల్ చంద్రజిత్‌తో పాటు పలువురు ప్రతినిధులు వున్నారు. మరోవైపు ఏపీఎన్జీఓ అధ్యక్షుడు అశోక్‌బాబు ముఖ్యమంత్రిని కలిసి ఫిబ్రవరి 12న శ్రీకాకుళంలో జరిగే ఏపీఎన్జీఓస్ స్టేట్ కాన్ఫరెన్స్‌కు ముఖ్య అతిథిగా పాల్గొనాలని ఆహ్వానించారు. అలాగే ఉద్యోగుల డీఏ బకాయిలు విడుదల చేయడంతో పాటు, అసంపూర్తిగా వున్న హెల్త్ కార్డుల అంశాన్ని పరిష్కరించాల్సిందిగా చంద్రబాబుకు ఎన్జీఓ నేత అశోక్ బాబు విజ్ఞప్తి చేశారు.
సీఐఐ ప్రతినిధులతో చంద్రబాబు భేటీ
Published Tue, Dec 22 2015 3:33 PM | Last Updated on Sat, Jul 28 2018 6:51 PM
Advertisement