partnership summit
-
పెట్టుబడులు - కట్టుకథలు..!
-
‘భాగస్వామ్యం’ వెలవెల!
అట్టహాసం, ఆర్భాటంతో ప్రారంభమైన భాగస్వామ్య సదస్సు రెండో రోజు వెలవెలబోయింది. ప్రధాన వేదిక హాలులో వేసిన కుర్చీలు కూడా నిండలేదు. పెట్టుబడిదారులు, దేశవిదేశాల నుంచి వచ్చిన ప్రతినిధుల కోసం వేసిన కుర్చీలు ఖాళీగా దర్శనమిచ్చాయి. కళాశాల విద్యార్థులను రప్పించడంతో మొదటి సెషన్ వరకు ఫర్వాలేకున్నా.. తర్వాత సెషన్ బోసిపోయింది. 1,2,5 నంబరు హాళ్లలో జరిగిన ప్లీనరీ సదస్సుల్లోనూ ఇదే పరిస్థితి కనిపించింది. మరోవైపు తొలిరోజుతో పోల్చుకుంటే ఎంవోయూల సంఖ్య పెరిగింది. ఈ రెండు రోజుల్లో కుదుర్చుకున్న ఒప్పందాలతోరూ.2 లక్షల 18 వేల 814 కోట్ల పెట్టుబడులకు చేరింది. సాక్షి, విశాఖపట్నం : గత భాగస్వామ్య సదస్సుల్లో కూర్చోవడానికి కుర్చీలు దొరికేవి కావు. ప్రతినిధులు, ఎంవోయూలు కుదుర్చుకోవడానికి వచ్చిన వారు చాలాసేపు నిలబడి ఉండాల్సిన పరిస్థితి ఉండేది. చోటు లేక మీడియా కోసం కేటాయించిన సీట్లలో కూర్చుండిపోయేవారు. మరి ఈ ఏడాది మూడోసారి జరుగుతున్న సదస్సు అందుకు భిన్నం. ప్రధాన వేదిక హాలులో వేసిన కుర్చీలు నిండడం లేదు. పెట్టుబడిదార్లు, దేశవిదేశాల నుంచి వచ్చిన ప్రతినిధుల కోసం వేసిన కుర్చీల్లో చాలావరకు ఖాళీగానే ఉండిపోతున్నాయి. తొలిరోజు అట్టహాసం, ఆర్భాటంతో పాటు అధికార పార్టీ నాయకులు కూడా సదస్సులోకి చొరబడడంతో ఒకింత కుర్చీలు నిండినట్టు కనిపించాయి. కానీ రెండో రోజు కుర్చీలు ఖాళీగా ఉంటే పరువు పోతుందన్న భావనతో కాలేజీ విద్యార్థినీ విద్యార్థులను రప్పించారు. తొలి ప్లీనరీ సెషన్లో ‘ది రిఫారŠమ్స్ కాల్క్లస్–ప్రమోటింగ్ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్’ అనే అంశంపై ముఖ్యమంత్రి చంద్రబాబుతో పాటు ఇతర ప్యానలిస్టులు ప్రసంగించారు. విద్యార్థినుల రాకతో ఆ సెషన్లో మాత్రమే కుర్చీలు నిండాయి. ఆ తర్వాత జరిగిన సెషన్లలో కుర్చీలు సగానికి పైగానే ఖాళీగా దర్శనమిచ్చాయి. హాల్ నంబరు 1,2,5 నంబరు హాళ్లలో జరిగిన ప్లీనరీ సదస్సుల్లోనూ ఇదే పరిస్థితి కనిపించింది. దీంతో వేదికపై నుంచి వక్తలు ఇచ్చిన ప్రసంగాలు ఖాళీ కుర్చీలకేనన్నట్టుగా మారింది. ఇక అరకొరగా వచ్చిన ప్రతినిధుల్లో కొందరు బయటే ఎక్కువగా కనిపించారు. తొలిరోజులా రెండో రోజు భోజనాల వద్ద కూడా ప్రతినిధుల తాకిడి అంతగా లేదు. ఇవన్నీ వెరసి సదస్సు రెండోరోజు సదస్సు సందడి కానరాలేదు. వివిధ శాఖల అధికారులు కూడా భాగస్వామ్య సదస్సు ప్రాÆ గణంలో ఇదే చర్చించుకున్నారు. ఇక ఎంఓయూలు కుదుర్చుకోవడానికి వచ్చిన కొంతమంది ఔత్సాహికులు హడావుడి పడ్డారు. ఇలాంటి వారు హాల్నంబరు–2లో ఉన్న కుర్చీలు, టేబుళ్లపైనే ఎంవోయూ పత్రాలను సర్దుబాటు చేసుకున్నారు. పెరిగిన ఎంవోయూలు : మరోవైపు తొలిరోజుతో పోల్చుకుంటే రెండో రోజు ప్రతినిధుల సంఖ్య తగ్గినా ఎంవోయూల సంఖ్య గణనీయంగా పెరిగింది. మొదటి రోజు శనివారం రూ.44,246 కోట్ల పెట్టుబడులకు 79 సంస్థలు ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. రెండో రోజు ఆదివారం 285 ఎంవోయూల ద్వారా లక్షా 74 వేల 568 కోట్ల పెట్టుబడులు పెట్టడానికి ముందుకొచ్చారు. ఇందులో ఎనర్జీ రంగంలోనే లక్షా 11 వేల 921 కోట్ల పెట్టుబడులకు ఆసక్తి కనబరిచారు. ఇందుకోసం 34 సంస్థలు ఎంఓయూలు కుదుర్చుకున్నాయి. ఈ ఏడాది జరుగుతున్న మూడో భాగస్వామ్య సదస్సులో రూ.3 లక్షల కోట్ల పెట్టుబడులు వస్తాయని ప్రభుత్వం అంచనా వేసింది. ఇప్పటికే ఈ రెండు రోజుల్లో కుదుర్చుకున్న ఒప్పందాలతో రూ.2 లక్షల 18 వేల 814 కోట్ల పెట్టుబడులకు చేరింది. మిగిలినవి సదస్సు ఆఖరి రోజైన సోమవారం నాటికి పూర్తవుతాయని అంచనా వేస్తున్నారు. ఇక వన్మన్ అంబులెన్సులు పెదవాల్తేరు (విశాఖ తూర్పు) : నగరంలో జరుగుతున్న భాగస్వామ్య సదస్సు మరో కొత్తరకం వాహనానికి వేదికగా నిలిచింది. చిన్నచిన్న వీధుల్లో రోడ్డు ప్రమాదాలు జరిగితే అంబులెన్సులు వెళ్లడానికి ఆస్కారం ఉండదు. అందుకే వన్మన్ సర్వీస్ అంబులెన్సులకు రాష్ట్రప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఈ మేరకు భాగస్వామ్య సదస్సులో ఈ వాహనాలను ప్రదర్శించారు. ప్రమాదం జరిగిందని ఫిర్యాదు అందిన వెంటనే సింగిల్‌మన్ ఆపరేట్ చేసే ఈ మినీ అంబులెన్సుల ద్వారానే ఆస్పత్రికి తరలిస్తారు. ముందుగా ప్రాథమిక వైద్యం చేయడానికి అవసరమైన సామగ్రి కూడా ఈ వాహనంలో అందుబాటులో ఉంచుతారు. ఫీడర్ పేరిట రూపొందించిన ఈ వాహనంలో రోగికి సీటుబెల్టు బిగించి ఆస్పత్రికి తరలిస్తారు. ముఖ్యంగా బైకు ప్రమాదాలలో గాయపడేవారిని తరలించడానికిగాను ఈ వాహనం ఎంతో సదుపాయంగా ఉంటుందని భావిస్తున్నారు. డేటా షేరింగ్ ఎంవీపీకాలనీ (విశాఖ తూర్పు): పెవీలియన్‌లో ఏర్పాటు చేసిన డేటా షేరింగ్ విధానం ఆకట్టుకుంది. ఐటీ, ఇండస్ట్రీస్, ఆరోగ్యం, ఇలా అనేక రంగాలకు చెందిన సంక్తిప్త సమాచారాన్ని పుస్తకాల రూపంలో డిజిటల్ స్క్రీన్స్‌పై ప్రదర్శించడం ఆకట్టుకుంది. ఆ సమాచారాన్ని సందర్శకులకు అక్కడి సిబ్బంది వివరించడంతో పాటు డిజిటల్ స్క్రిన్స్ నుంచి నేరుగా మోబైల్స్‌కు ఎక్కించే సౌలభ్యాన్ని అక్కడ ప్రదర్శించారు. వినియోగదారుల మొబైల్స్ ద్వారా వారి మెయిల్‌కు వారు కోరుకున్న సమాచారాన్ని సిబ్బంది ఎక్కించారు. దీంతో అనేక మంది సందర్శకులు నచ్చిన సమాచారాన్ని మొబైల్స్‌లోకి ఎక్కించుకునేందుకు ఆసక్తి కనబరిచారు. రూ.20 కోట్లతో విశాఖలో ఐటీపార్కు పెదవాల్తేరు(విశాఖతూర్పు): విశాఖలో రూ.20కోట్లతో ఐటీపార్కు ఏర్పాటు చేస్తామని సెల్ఫ్పాసెడ్టెక్ సంస్థ అధినేత కె.ధరణి పేర్కొన్నారు. భాగస్వామ్య సదస్సులో ఎంవోయూ చేయడానికి వచ్చిన ఆమె ఆదివారం ‘సాక్షి’తో మాట్లాడారు. తాను ఇప్పటికే దుబాయ్, కెనడా దేశాలలో ఐటీ కేంద్రాలు నిర్వహిస్తున్నానన్నారు. అలాగే, హైదరాబాద్, రాజమండ్రి ప్రాంతాలలో కళాశాలలు నిర్వహిస్తున్నానని తెలిపారు. విశాఖలోని రుషికొండ లేదా గంభీరంలో స్థలం కేటాయిస్తే ఐటీపార్కు ఏర్పాటు చేస్తామన్నారు. ఇక్కడ దశలవారీగా 50 నుంచి 150 మందికి ఉపాధి కల్పిస్తామని పేర్కొన్నారు. ప్రభుత్వంతో ఎంఓయు కుదుర్చుకోనుండడం ఆనందంగా ఉందన్నారు. -
‘తెలంగాణకూ చంద్రబాబే సీఎం’
సాక్షి, విశాఖపట్నం : రెండు తెలుగు రాష్ట్రాలకూ చంద్రబాబునాయుడే సీఎం.. నరసింహన్ కేవలం ఏపీకి మాత్రమే గవర్నర్.. ఏపీ అధికారుల స్వామిభక్తో, నిర్లక్ష్యానికి నిదర్శనమో కానీ వైజాగ్‌లో జరుగుతున్న భాగస్వామ్య సదస్సులో ఈ పొరపాట్లు దొర్లాయి. రాష్ట్రానికి భారీగా పెట్టుబడులు ఆకర్షించి, యువతకు ఉపాధి అవకాశాలు సమకూర్చేందుకు అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించాల్సిన భాగస్వామ్య సదస్సు షెడ్యూల్ తప్పులతడకగా రూపొందింది. ఆయా కంపెనీలతో భాగస్వామ్య ఒప్పందాలపై సంతకాలు చేయాల్సిన సెషన్లోనే చంద్రబాబును అధికారులు ఉభయరాష్ట్రాలకూ సీఎంను చేసేసి..గవర్నర్‌ను ఏపీకి పరిమితం చేసేశారు. ఇక కంపెనీలు నిర్ధిష్టంగా ఎంతమేర పెట్టుబడులు పెడుతున్నాయో వివరించకుండా లక్షల కోట్ల పెట్టుబడులంటూ ఆర్భాటంగా ప్రకటించేశారు. అసలు ఈ పెట్టుబడులు కాగితాలకే పరిమితమవుతాయా..? కార్యాచరణకు కదిలివస్తాయా..? అనే ప్రశ్నలు ముందుకొస్తున్నాయి. -
'పార్టనర్షిప్ సమ్మిట్ ఒక బోగస్'
-
'పార్టనర్షిప్ సమ్మిట్ ఒక బోగస్'
విజయవాడ: విశాఖ జిల్లాలో ప్రభుత్వం నిర్వహించిన పార్టనర్షిప్ సమ్మిట్ ఒక బోగస్' అని మాజీ స్పీకర్ నాదెండ్ల మనోహర్ విమర్శించారు. సోమవారం ఆయన విజయవాడలో మీడియాతో మాట్లాడారు. సమ్మిట్ పేరుతో రూ. 28 కోట్ల ప్రజాధనం దుర్వినియోగం చేశారని మండిపడ్డారు. సమ్మిట్ ద్వారా 361 ఎంవోయిలు, రూ. 4 లక్షల 76 వేల కోట్లు పెట్టుబడులు పెట్టినట్టు ఆరోపించారు. 10 లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు వస్తాయని టీడీపీ సర్కార్ చెప్పిందన్నారు. ఆర్టీఐ కింద సమాచారం సేకరిస్తే ఇంతవరకు ఏపీకి, ఒక పరిశ్రమ, ఒక్క ఉద్యోగం కూడా రాలేదని అన్నారు. ప్రభుత్వం తమ అవినీతిని బయటపెడుతుందనే ఈ వివరాలను గోప్యంగా ఉంచుతోందని విమర్శించారు. ప్రజాదుర్వినియోగంపై విజిలెన్స్ కమిషన్‌కు ఫిర్యాదు చేస్తామని నాదెండ్ల మనోహర్ చెప్పారు. -
'విద్యార్థులపై చర్యలను ఖండిస్తున్నాం'
హైదరాబాద్: అమెరికాలో తెలుగు విద్యార్థులపై కఠిన చర్యలను ఖండిస్తున్నామని వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి అన్నారు. సోమవారం పార్టీ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ... అమెరికాకు వెళుతున్న విద్యార్థులకు ఇబ్బందులు ఎదురవుతున్నా చంద్రబాబు ఎందుకు పట్టించుకోవడం లేదని, కనీసం భారత్‌లోని అమెరికా రాయబార కార్యాలయంతో ఎందుకు సంప్రదింపులు జరపడం లేదని చంద్రబాబును ప్రశ్నించారు. అమెరికాలో 22 మంది తెలుగు విద్యార్థులను హింసించి వెనక్కి పంపేయడాన్ని వైఎస్సార్సీపీ తీవ్రంగా ఖండిస్తోందన్నారు. తమిళనాడులో తెలుగును రెండో అధికారభాషగా లేకుండా తొలగించే ప్రయత్నం జరుగుతున్నా ఉభయ తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు అసలు పట్టించుకోక పోవడం శోచనీయమని ఆయన అన్నారు. ఎన్నికలకు ముందు తెలుగువారికి ఎక్కడ హాని జరిగినా స్పందిస్తామని గొప్పలు చెప్పుకున్న వారు ఇపుడు ఎందుకు మిన్నకుండి పోయారన్నారు. తక్షణం అమెరికాకు వెళ్లే విద్యార్థుల సమస్యలపైనా, తమిళనాడులో తెలుగు భాషను రెండో అధికారభాషగా రద్దు చేసే యత్నంపైనా స్పందించాలని గడికోట డిమాండ్ చేశారు. చంద్రబాబు గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నపుడు నిర్వహించిన 6 భాగస్వామ్య శిఖరాగ్ర సదస్సు(పార్ట్నర్షిప్ సమ్మిట్)లకు సంబంధించి శ్వేతపత్రం ప్రకటించాలని గడికోట శ్రీకాంత్‌రెడ్డి టీడీపీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గతంలో చంద్రబాబు హయాంలో జరిగిన ఈ ఆరు సదస్సుల్లో ఎన్ని లక్షల కోట్లతో ఒప్పందాలపై (ఎంఓయూలపై) సంతకాలు జరిగాయి? వాటిలో ఎన్ని వాస్తవరూపం దాల్చాయి? ఎన్ని ఉద్యోగాలు వచ్చాయి? వంటి వివరాలను ధైర్యంగా ప్రభుత్వం వెల్లడిస్తుందా? అని ప్రశ్నించారు. విశాఖ భాగస్వామ్య సదస్సును ఆయన ప్రస్తావిస్తూ ఇలాంటివి చంద్రబాబు ఎప్పుడూ నిర్వహిస్తూనే ఉంటారని వీటిపై ఆర్భాటం ఎక్కువ చేస్తారని అన్నారు. సదస్సులో ఒక్క రోజులోనే రూ.1.95 లక్షల కోట్ల మేరకు ఎంవోయూలు జరగ్గా అందులో రూ.1.15 లక్షల కోట్లు ఒక్క విద్యుత్ ఉత్పాదనారంగంలోనే అంటూ పత్రికల్లో పతాక శీర్షికల్లో వచ్చిందని ఆయన తెలిపారు. 2015 సెప్టెంబర్ 23వ తేదీ కూడా ముఖ్యమంత్రి తన చైనా పర్యటనలో ఒక చైనా కంపెనీతో పది వేల మెగావాట్ల విద్యుత్ ఉత్పాదనా కేంద్రం నెలకొల్పడానికి ఒప్పందం కుదుర్చుకున్నారని, నాలుగు నెలలు గడిచినా అదేమైందో తెలియడం లేదని గడికోట అన్నారు. ఇలాంటి సదస్సుల్లో ఫోటోలు తీయించుకుని చేస్తున్నంత హడావుడి క్షేత్రస్థాయిలో ఆ తరువాత కనిపించదని చెప్పారు. ఇలా సదస్సులు పెట్టి పారిశ్రామిక వేత్తలను బతిమాలి ఆహ్వానించే బదులు ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా కావాలని చంద్రబాబు కేంద్రాన్ని ఎందుకు గట్టిగా అడగరని గడికోట సూటిగా ప్రశ్నించారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా వస్తే ఎక్కడెక్కడి పారిశ్రామివేత్తలు తలుపులు తోసుకుని ఆంధ్రప్రదేశ్‌లోకి మూకుమ్మడిగా వస్తారు కదా అని అన్నారు. ప్రత్యేక హోదా వస్తే పరిశ్రమలొస్తాయని, నిరుద్యోగ సమస్య పరిష్కారం అవుతుందని రాష్ట్ర ప్రజలు సుఖశాంతులతో ఉంటారని వైఎస్సార్సీపీ తొలి నుంచీ చెబుతున్నా టీడీపీ వారు మాత్రం హేళనగా మాట్లాడారని ఆయన అన్నారు. చట్టబద్ధంగా మనకు దక్కాల్సిన ప్రత్యేక హోదా గురించి అసలు చంద్రబాబు ఎందుకు పట్టించుకోవడం లేదని భాగస్వామ్య సదస్సుల్లో హోదా గురించి గాని, ప్రత్యేక హోదా గురించి గాని ఎందుకు మాట మాత్రంగానైనా ప్రస్తావించలేదని నిలదీశారు. సదస్సులో కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీని పక్కనే కూర్చో బెట్టుకున్నారు కానీ ఈ విషయమే ప్రస్తావనకు తీసుకు రాలేదన్నారు. గతంలో రాజధాని శంకుస్థాపనకు వచ్చిన ప్రధాని నరేంద్రమోదీ కూడా ప్రత్యేక హోదా గురించి ఏమీ మాట్లాడలేదని చెప్పారు. జనవరి 3వ తేదీన రాష్ట్రానికి వచ్చిన నీతీ ఆయోగ్ అధ్యక్షుడు అరవింద్ ఫనాతో చంద్రబాబు సమావేశమైనపుడు ఆయనతో పొగిడించుకున్నారు కానీ ప్రత్యేక హోదా గురించి ఏమీ చెప్పలేదన్నారు. -
'విద్యార్థులపై చర్యలను ఖండిస్తున్నాం'
-
2వ రోజు భాగస్వామ్య సదస్సు ప్రారంభం
-
'విశాఖలో పార్టనర్షిప్ సమ్మిట్‌కు భారీ భద్రత'
విశాఖ: విశాఖ జిల్లాలో రేపటినుంచి మూడురోజుల పాటు జరిగే భాగస్వామ్య సదస్సు(పార్టనర్షిప్ సమ్మిట్)కు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నట్టు విశాఖ సీపీ అమిత్ గార్గ్ పేర్కొన్నారు. శనివారం ఆయన విశాఖలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. 800 నుంచి 1000 వరకు దేశ, విదేశీ ప్రతినిధులు హాజరుకానున్నట్టు చెప్పారు. పఠాన్‌కోట్ ఉగ్రవాద ఘటనల నేపథ్యంలో మంత్రుల నుంచి ముఖ్యమంత్రులు ఉన్నతస్థాయి హైకమిషనర్లు, కౌన్సిలర్ జర్నల్‌లు బస చేసే హోటళ్లు, సదస్సు వేదిక వద్ద పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నట్టు ఆయన తెలిపారు. రెండు వేల మంది సిబ్బందితో బందోబస్తు, విశాఖ నగరం మొత్తం మీద 12 చెక్ పోస్టులు, 30 సీసీ కెమెరాలను అమర్చుతామని వెల్లడించారు. ఎయిర్పోర్ట్, వేదిక వద్ద రెండు కమండ్ సెంటర్లు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. ఉగ్రవాద, తీవ్రవాద కార్యకలాపాలపై స్పెషల్ బ్రాంచ్ పోలీసుల నిఘా, మెరైన్, కోస్ట్‌గార్డ్, నేవీ తీర భద్రతలో పాల్గొంటాయని సీపీ అమిత్ గార్గ్ పేర్కొన్నారు. -
విశాఖలో భాగస్వామ్య సదస్సు: గంటా
విశాఖపట్నం : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, సీఐఐ సహకారంతో ఈ నెల 10వ తేదీ నుంచి విశాఖపట్నం నగరంలో భాగస్వామ్య సదస్సు నిర్వహిస్తున్నట్లు రాష్ట్ర ఉన్నత విద్యా శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు వెల్లడించారు. ఈ సదస్సు ప్రాంతంలో ఏపీ తాత్కాలిక సచివాలయం ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. సదస్సు తర్వాత ఏపీ నైసర్గిక స్వరూపం మారే అవకాశం ఉందని గంటా ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ సదస్సు సందర్భంగా ఏపీ ప్రభుత్వంతో రూ. 1 నుంచి 2 లక్షల కోట్లు ఎంఓయూ జరిగే అవకాశం ఉందని గంటా శ్రీనివాసరావు తెలిపారు. ఈ సమావేశానికి ముఖ్యమంత్రి చంద్రబాబు, కేంద్రమంత్రులు జైట్లీ, వెంకయ్య, నిర్మలా సీతారామన్, రాజీవ్ ప్రతాఫ్ రూడీసహా 1200 మంది ప్రతినిధులతోపాటు 350 మంది విదేశీ ప్రతినిధులు హాజరవుతారని గంటా శ్రీనివాసరావు వెల్లడించారు.ఈ సదస్సు 12వ తేదీతో ముగుస్తుందని గంటా శ్రీనివాసరావు చెప్పారు. -
సీఐఐ ప్రతినిధులతో చంద్రబాబు భేటీ
హైదరాబాద్: రాష్ట్రానికి పెద్ద ఎత్తున పెట్టుబడులను ఆకర్షించేందుకు వీలైనన్ని ప్రయత్నాలు చేస్తున్నామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పారు. అసెంబ్లీలోని తన కార్యాలయంలో సీఐఐ ప్రతినిధులతో భేటీ అయ్యారు. వచ్చే నెల 10, 11, 12 తేదీల్లో విశాఖలో జరిగే పార్టనర్షిప్ సదస్సు ఏర్పాట్లపై చర్చించారు. ఈ సదస్సును ప్రారంభించాల్సిందిగా రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని కలిసి విజ్ఞప్తి చేశామని ప్రతినిధులకు సీఎం వివరించారు. ఈవెంట్‌ను విజయవంతం చేసి ఆంధ్రప్రదేశ్‌ను పెట్టుబడుల ఆకర్షణ కేంద్రంగా వార్తల్లో నిలపాలని వారిని కోరారు. సీఎంని కలిసిన వారిలో సీఐఐ డైరెక్టర్ జనరల్ చంద్రజిత్తో పాటు పలువురు ప్రతినిధులు వున్నారు. మరోవైపు ఏపీఎన్జీఓ అధ్యక్షుడు అశోక్‌బాబు ముఖ్యమంత్రిని కలిసి ఫిబ్రవరి 12న శ్రీకాకుళంలో జరిగే ఏపీఎన్జీఓస్ స్టేట్ కాన్ఫరెన్స్‌కు ముఖ్య అతిథిగా పాల్గొనాలని ఆహ్వానించారు. అలాగే ఉద్యోగుల డీఏ బకాయిలు విడుదల చేయడంతో పాటు, అసంపూర్తిగా వున్న హెల్త్ కార్డుల అంశాన్ని పరిష్కరించాల్సిందిగా చంద్రబాబుకు ఎన్జీఓ నేత అశోక్ బాబు విజ్ఞప్తి చేశారు.