విశాఖపట్నం : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, సీఐఐ సహకారంతో ఈ నెల 10వ తేదీ నుంచి విశాఖపట్నం నగరంలో భాగస్వామ్య సదస్సు నిర్వహిస్తున్నట్లు రాష్ట్ర ఉన్నత విద్యా శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు వెల్లడించారు. ఈ సదస్సు ప్రాంతంలో ఏపీ తాత్కాలిక సచివాలయం ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. సదస్సు తర్వాత ఏపీ నైసర్గిక స్వరూపం మారే అవకాశం ఉందని గంటా ఆశాభావం వ్యక్తం చేశారు.
ఈ సదస్సు సందర్భంగా ఏపీ ప్రభుత్వంతో రూ. 1 నుంచి 2 లక్షల కోట్లు ఎంఓయూ జరిగే అవకాశం ఉందని గంటా శ్రీనివాసరావు తెలిపారు. ఈ సమావేశానికి ముఖ్యమంత్రి చంద్రబాబు, కేంద్రమంత్రులు జైట్లీ, వెంకయ్య, నిర్మలా సీతారామన్, రాజీవ్ ప్రతాఫ్ రూడీసహా 1200 మంది ప్రతినిధులతోపాటు 350 మంది విదేశీ ప్రతినిధులు హాజరవుతారని గంటా శ్రీనివాసరావు వెల్లడించారు.ఈ సదస్సు 12వ తేదీతో ముగుస్తుందని గంటా శ్రీనివాసరావు చెప్పారు.