
'పార్టనర్‌షిప్ సమ్మిట్ ఒక బోగస్'
విజయవాడ: విశాఖ జిల్లాలో ప్రభుత్వం నిర్వహించిన పార్టనర్‌షిప్ సమ్మిట్ ఒక బోగస్' అని మాజీ స్పీకర్ నాదెండ్ల మనోహర్ విమర్శించారు. సోమవారం ఆయన విజయవాడలో మీడియాతో మాట్లాడారు. సమ్మిట్ పేరుతో రూ. 28 కోట్ల ప్రజాధనం దుర్వినియోగం చేశారని మండిపడ్డారు. సమ్మిట్ ద్వారా 361 ఎంవోయిలు, రూ. 4 లక్షల 76 వేల కోట్లు పెట్టుబడులు పెట్టినట్టు ఆరోపించారు.
10 లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు వస్తాయని టీడీపీ సర్కార్ చెప్పిందన్నారు. ఆర్టీఐ కింద సమాచారం సేకరిస్తే ఇంతవరకు ఏపీకి, ఒక పరిశ్రమ, ఒక్క ఉద్యోగం కూడా రాలేదని అన్నారు. ప్రభుత్వం తమ అవినీతిని బయటపెడుతుందనే ఈ వివరాలను గోప్యంగా ఉంచుతోందని విమర్శించారు. ప్రజాదుర్వినియోగంపై విజిలెన్స్ కమిషన్‌కు ఫిర్యాదు చేస్తామని నాదెండ్ల మనోహర్ చెప్పారు.