
'విశాఖలో పార్టనర్‌షిప్ సమ్మిట్‌కు భారీ భద్రత'
విశాఖ: విశాఖ జిల్లాలో రేపటినుంచి మూడురోజుల పాటు జరిగే భాగస్వామ్య సదస్సు(పార్టనర్‌షిప్ సమ్మిట్)కు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నట్టు విశాఖ సీపీ అమిత్ గార్గ్ పేర్కొన్నారు. శనివారం ఆయన విశాఖలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. 800 నుంచి 1000 వరకు దేశ, విదేశీ ప్రతినిధులు హాజరుకానున్నట్టు చెప్పారు. పఠాన్‌కోట్ ఉగ్రవాద ఘటనల నేపథ్యంలో మంత్రుల నుంచి ముఖ్యమంత్రులు ఉన్నతస్థాయి హైకమిషనర్లు, కౌన్సిలర్ జర్నల్‌లు బస చేసే హోటళ్లు, సదస్సు వేదిక వద్ద పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నట్టు ఆయన తెలిపారు.
రెండు వేల మంది సిబ్బందితో బందోబస్తు, విశాఖ నగరం మొత్తం మీద 12 చెక్ పోస్టులు, 30 సీసీ కెమెరాలను అమర్చుతామని వెల్లడించారు. ఎయిర్‌పోర్ట్, వేదిక వద్ద రెండు కమండ్ సెంటర్లు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. ఉగ్రవాద, తీవ్రవాద కార్యకలాపాలపై స్పెషల్ బ్రాంచ్ పోలీసుల నిఘా, మెరైన్, కోస్ట్‌గార్డ్, నేవీ తీర భద్రతలో పాల్గొంటాయని సీపీ అమిత్ గార్గ్ పేర్కొన్నారు.