ఒక ఎక్సే్చంజీలో ఫైల్ చేస్తే రెండో దానిలో ఆటోమేటిక్‌గా అప్‌లోడింగ్
రూ. 250 నుంచి సిప్ ప్లాన్లు
సెబీ చీఫ్ మాధవి పురి వెల్లడి
ముంబై: లిస్టెడ్ కంపెనీలకు సంబంధించి సింగిల్ ఫైలింగ్ ప్రతిపాదన త్వరలోనే అమల్లోకి రాగలదని మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ చీఫ్ మాధవి పురి బుచ్ వెల్లడించారు. దీనితో, లిస్టింగ్ నిబంధనల ప్రకారం కంపెనీలు తాము వెల్లడించాల్సిన సమాచారాన్ని ఒక ఎక్సే్చంజీలో ఫైలింగ్ చేస్తే రెండో ఎక్సే్చంజీలో కూడా అది ఆటోమేటిక్‌గా అప్‌లోడ్ అవుతుందని పేర్కొన్నారు.
పరిశ్రమల సమాఖ్య సీఐఐ నిర్వహించిన ఫైనాన్సింగ్ 3.0 సదస్సులో ప్రత్యేక ప్లీనరీ సెషన్‌లో పాల్గొన్న సందర్భంగా మాధవి ఈ విషయాలు తెలిపారు. సెబీ మాజీ హోల్‌టైమ్ సభ్యుడు ఎస్‌కే మొహంతి సారథ్యంలోని కమిటీ ఈ సిఫార్సులు చేసింది. మరోవైపు, నెలకు అత్యంత తక్కువగా రూ. 250 నుంచి ప్రారంభమయ్యే సిప్‌ల (సిస్టమాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్) ప్రతిపాదన కూడా త్వరలో సాకారం కాగలదని కాగలదని మాధవి వివరించారు. అన్ని ఆర్థిక సాధనాలను సామాన్యులకు అందుబాటులోకి తెచ్చే దిశగా ఇది కీలక పరిణామం కాగలదని చెప్పారు.
ప్రాంతీయ భాషల్లో ఐపీవో పత్రాలు..: భాషాపరమైన అడ్డంకులను తొలగించేందుకు, ఇన్వెస్టర్లలో అవగాహన పెంచేందుకు ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్ (ఐపీవో) పత్రాలను బహుళ భాషల్లో అందుబాటులోకి తేవాలన్న నిబంధనను కూడా ప్రవేశపెట్టే యోచన ఉందని మాధవి చెప్పారు. మరింత మంది ఇన్వెస్టర్లు మార్కెట్లలో పాలుపంచుకునేందుకు ఐపీవో ప్రాస్పెక్టస్ 15–16 ప్రాంతీయ భాష ల్లో ఉండాలని ఆమె పేర్కొన్నారు. ఇన్వెస్టరు తీరుకు అనుగుణమైన వివిధ ఆర్థిక సాధనాలను అందుబాటులోకి తెచ్చేందుకు ప్రయ త్నాలు జరుగుతున్నాయని తెలిపారు. మారుతున్న ఇన్వెస్టర్ల అవసరాలకు తగ్గట్లుగా కొత్త సాధనాలను ప్రవేశపెట్టడంపై పరిశ్రమతో కలిసి పనిచేయనున్నట్లు చెప్పారు.
‘హోల్డ్’లో జేఎస్‌డబ్ల్యూ సిమెంట్ ‘ఆఫర్’
జేఎస్‌డబ్ల్యూ గ్రూప్ కంపెనీ జేఎస్‌డబ్ల్యూ సిమెంట్ ఇనీíÙయల్ పబ్లిక్ ఆఫర్ (ఐపీవో) దరఖాస్తును సెబీ ‘హోల్డ్’లో పెట్టింది. ‘పరిశీలన జారీ చేశాం. దీంతో నిలుపుదల చేశాం’అని సెబీ పేర్కొంది. కారణాలను తెలియజేయలేదు. ఈ ఏడాది ఆగస్ట్ 16న ఐపీవో పత్రాలను సెబీకి జేఎస్‌డబ్ల్యూ సిమెంట్ సమరి్పంచడం గమనార్హం. ప్రతిపాదిత దరఖాస్తు ప్రకారం.. తాజా షేర్ల జారీ ద్వారా రూ.2,000 కోట్లు, ఆఫర్ ఫర్ సేల్ ద్వారా రూ.2,000 కోట్లు సమీకరించాలని కంపెనీ భావిస్తోంది. తాజా షేర్ల జారీ ద్వారా సమకూరిన నిధుల్లో రూ.800 కోట్లతో రాజస్థాన్‌లోని నాగౌర్‌లో కొత్త సిమెంట్ ప్లాంట్‌ను ఏర్పాటు చేయాలనుకుంటోంది. ప్రస్తుతం కంపెనీ నిర్వహణలో 19 మిలియన్ టన్నుల వార్షిక సిమెంట్ తయారీ సామర్థ్యం (ఎంటీపీఏ) ఉండగా.. 60 ఎంటీపీఏ చేరుకోవాలన్నది కంపెనీ లక్ష్యం.
ఐపీవోకు ఐడెంటికల్ బ్రెయిన్ స్టూడియోస్: వీఎఫ్‌ఎక్స్ సేవల కంపెనీ ‘ఐడెంటికల్ బ్రెయిన్ స్టూడియోస్’ ఐపీవోకి రావాలనుకుంటోంది. ఎన్‌ఎస్ ఈ ‘ఎమర్జ్’ ప్లాట్‌ఫామ్‌పై (సూక్ష్మ కంపెనీలకు ఉద్దేశించిన) లిస్ట్ అయ్యేందుకు వీలుగా పత్రాలు సమరి్పంచింది. ఐపీవోలో భాగంగా 36.94 లక్షల షేర్లను తాజాగా జారీ చేయనుంది. సమీకరించే నిధులతో ముంబైలోని అంధేరిలో ఉన్న స్టూడియో, ఆఫీస్ నవీకరణ, అంధేరిలోనే కొత్త శాఖలో సౌండ్ స్టూడియో సెటప్ ఏర్పాటుకు వినియోగించనుంది. లక్నోలో నూతన బ్రాంచ్ ఆఫీస్ ఏర్పాటు చేయనుంది. సినిమాలు, వెబ్ సిరీస్‌లు, టీవీ కార్యక్రమాలకు కావాల్సిన వీఎఫ్‌ఎక్స్ సేవలను ఈ సంస్థ అందిస్తుంటుంది. 2024 మార్చితో ముగిసిన ఆర్థిక సంవత్సరానికి రూ.20 కోట్ల ఆదాయంపై, రూ.5.34 కోట్ల లాభాన్ని ప్రకటించింది.
ఐపీవో షేర్లు.. వారంలోనే విక్రయం!
లాభాల స్వీకరణకే ఇన్వెస్టర్ల మొగ్గు
ఇనీíÙయల్ పబ్లిక్ ఆఫర్ (ఐపీవో)లలో ఉత్సాహంగా పాల్గొంటున్న ఇన్వెస్టర్లలో ఎక్కువ మంది స్వల్పకాల దృష్టితోనే వస్తున్నట్టు సెబీ అధ్యయనంలో వెల్లడైంది. ఐపీవోలో తమకు కేటాయించిన షేర్లలో 54 శాతం మేర (విలువ పరంగా) లిస్ట్ అయిన వారంలోనే విక్రయిస్తున్నారు. ఐపీవో ధరతో పోలి్చతే లాభాలతో లిస్టింగ్ అయ్యేవి ఎక్కువ ఉంటుండగా, కొన్ని నష్టాలతో లిస్ట్ కావడం లేదా లిస్ట్ అయిన వెంటనే నష్టాల్లోకి వెళ్లడం సాధారణంగా చూస్తుంటాం. అయితే, నష్టాలతో లిస్ట్ అయిన వాటి కంటే, లాభాలతో లిస్ట్ అయిన వాటిని విక్రయించే స్వభావం ఇన్వెస్టర్లలో కనిపిస్తోంది. ఇటీవలి కాలంలో ఐపీవోలలో వ్యక్తిగత ఇన్వెస్టర్లు పెద్ద సంఖ్యలో పాల్గొంటున్నారు.
రిటైల్ కోటా సైతం పదులు, వందల సంఖ్యలో అధిక సబ్‌్రస్కిప్షన్లను అందుకుంటోంది. దీంతో ఐపీవోల పట్ల ఇన్వెస్టర్ల ధోరణి తెలుసుకునేందుకు సెబీ లోతైన అధ్యయనం నిర్వహించింది. 2021 ఏప్రిల్ నుంచి 2023 డిసెంబర్ మధ్య కాలంలో 144 ఐపీవోలకు సంబంధించిన డేటాను విశ్లేíÙంచింది. యాంకర్ ఇన్వెస్టర్లు మినహా మిగిలిన ఇన్వెస్టర్లు 54 శాతం మేర షేర్లను (విలువ పరంగా) లిస్ట్ అయిన వారంలోనే విక్రయించారు. ఇందులో 50.2 శాతం షేర్లు వ్యక్తిగత ఇన్వెస్టర్లకు చెందినవి కాగా, నాన్ ఇనిస్టిట్యూషనల్ ఇన్వెస్టర్లు సైతం 63.3 శాతం షేర్లను వారంలోనే విక్రయించారు. ఇక రిటైల్ ఇన్వెస్టర్లు సైతం 42.7 శాతం షేర్లను లిస్ట్ అయిన వారంలోపే విక్రయించి లాభాలు స్వీకరించినట్టు తెలుస్తోంది. ముఖ్యంగా ఐపీవోల్లో పాల్గొన్న వ్యక్తిగత ఇన్వెస్టర్లు 70 శాతం మేర తమకు కేటాయించిన షేర్లను ఏడాదిలోపు విక్రయించినట్టు సెబీ అధ్యయనంలో తెలిసింది.
Comments
Please login to add a commentAdd a comment