సాక్షి, బెంగళూరు: ఆంధ్రప్రదేశ్‌లో 60 వేల కోట్ల రూపాయలతో పోలవరం ఆనకట్టను నిర్మించడం ద్వారా గోదావరి ఉప నది అయిన ఇంద్రావతిలో ప్రవాహానికి అడ్డుకట్ట వేయనున్నామని జల వనరుల శాఖ మంత్రి గడ్కారీ చెప్పారు. ఆ తర్వాత 1,300 కిలో మీటర్ల పైపులైను నిర్మించి 450 టీఎంసీల నీటిని తమిళనాడు చివరి వరకు తీసుకెళ్లొచ్చన్నారు. భారత పరిశ్రమల సమాఖ్య (సీఐఐ) బెంగళూరులో ఏర్పాటు చేసిన ఓ సమావేశంలో ఆయన ప్రసంగించారు.
గోదావరిని, కృష్ణా, పెన్నా నదుల మీదుగా కావేరితో అనుసంధానం చేయడం ద్వారా కర్ణాటక రాష్ట్రానికి కూడా తాగు, సాగు నీరు అందించడానికి ప్రణాళికలు రూపొందిస్తున్నామనీ, త్వరలోనే నదుల అనుసంధాన ప్రక్రియ ప్రారంభమవుతుందని గడ్కారీ పేర్కొన్నారు. భారత్ నుంచి పాకిస్తాన్‌లోకి ప్రవహిస్తున్న నదుల్లోని జలాలను వాడుకోవడం ద్వారా పంజాబ్, హరియాణ, రాజస్తాన్ రాష్ట్రాల్లో నీటి సమస్యను తీర్చాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించినట్లు గడ్కారీ చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment