న్యూఢిల్లీ: ప్రభుత్వరంగ సంస్థలు (పీఎస్‌యూ) సైతం ప్రైవేటు కంపెనీల మాదిరే పాలనా ప్రమాణాలను అనుసరించే విధంగా ఉండాలని సీఐఐ ప్రభుత్వానికి సూచించింది. సీవీసీ, కాగ్, సీబీఐ దర్యాప్తు వంటివి తరచుగా ప్రభుత్వరంగ సంస్థల నిర్ణయాల్లో అతి జాగ్రత్త లేదా నిర్ణయాలు నిలిచిపోవడానికి కారణమవుతున్నాయని, ఇలా కాకుండా చూసి, ప్రైవేటు సంస్థల మాదిరే పనిచేసే వాతావరణం కలి్పంచాలని పేర్కొంది. భారత ప్రభుత్వరంగ సంస్థలు అంతర్జాతీయంగా పోటీ పడగలవని సీఐఐ డైరెక్టర్ జనరల్ చంద్రజిత్ బెనర్జీ అన్నారు. ‘ది రైజ్ ఆఫ్ ఎలిఫెంట్:ఎన్‌హాన్సింగ్ కాంపిటీటివ్‌నెస్ ఆఫ్ సెంట్రల్ పబ్లిక్ సెక్టార్ ఎంటర్‌ప్రైజెస్’ పేరుతో ప్రభుత్వరంగ సంస్థలపై రూపొందించిన పరిశోధన నివేదికను విడుదల చేశారు.
Comments
Please login to add a commentAdd a comment