KTR: Future Developments For Warangal and Hyderabad | 2020 Developments in Telangana - Sakshi Telugu
Sakshi News home page

వరంగల్‌కు మాస్టర్‌ప్లాన్‌.. పాతబస్తీకి మెట్రో

Published Mon, Dec 30 2019 3:13 AM | Last Updated on Mon, Dec 30 2019 9:31 AM

Warangal City Master Plan ready for execution says KTR - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: హైదరాబాద్‌ నగరంలో తీవ్ర నీటి కొరత ఏర్పడుతుందని నీతి ఆయోగ్‌ చెప్పిందన్న ఒక ప్రశ్నకు సమాధానంగా.. ఇతర నగరాలతో పోల్చితే హైదరాబాద్‌లో నీటి కొరత చాలా తక్కువగా ఉంద ని, కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తయిన తర్వాత హైదరా బాద్‌కి నీటి సరఫరా సమస్య తలెత్తదని కేటీఆర్‌ చెప్పారు. హైదరాబాద్‌ను టూరిస్ట్‌ డెస్టినేషన్‌గా మార్చేందుకు, ప్రముఖ పర్యాటక ప్రాంతాల్లో పారిశుధ్య నిర్వహణ ప్రైవేట్‌ సంస్థలకు అప్పగిం చామని, చార్మినార్, గోల్కొండలకు ప్రపంచ వారసత్వ హోదా సంపాదించేందుకు ప్రయత్నిస్తు న్నామన్నారు. యూరప్, అమెరికా వంటి ప్రాంతా ల నుంచి మరిన్ని ఎక్కువ విమాన సౌకర్యాలను కల్పించేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు. హైదరాబాద్‌లో చేపట్టిన ఎస్‌ఆర్‌డీపీ ప్రాజెక్టులకు నిధుల కొరత లేదని, అవసరమైన మౌలిక వసతుల కల్పనే లక్ష్యంగా కార్యక్రమం కొనసాగుతుందన్నారు. హైదరాబాద్‌లో నూతనంగా 50 ఫుట్‌ ఓవర్‌ బ్రిడ్జిలు, స్కైవాక్‌ నిర్మాణాలకు ఆమోదం తెలిపామన్నారు.

తెలంగాణ ప్రజలు తెలివైన వారు
రాష్ట్రంలో పౌరసత్వ సవరణ చట్టం అమలుపై సీఎం నేతృత్వంలోని కేబినెట్‌ సరైన నిర్ణయం తీసుకుంటుందని, ఈ చట్టాన్ని పార్లమెంట్‌లో వ్యతిరేకించినందుకు మద్దతుగా నిలుస్తున్న నెటిజ న్లకు కేటీఆర్‌ ధన్యవాదాలు తెలిపారు. రాష్ట్రంలో రాజకీయంగా బలోపేతం కావడానికి బీజేపీ హిందూ–ముస్లిం కమ్యూనల్‌ కార్డుని వాడుతుం దని, దీన్ని ఎదుర్కొనేందుకు ఏం చేస్తారని ఒకరు అడిగిన ప్రశ్నకు.. ప్రజలను విభజించే ఎలాంటి ఎజెండానైనా ఎదుర్కొనేంత తెలివైనవారు తెలంగాణ ప్రజలు అని కేటీఆర్‌ బదులిచ్చారు. తెలంగాణ దేశంలోని ఇతర రాష్ట్రాలతో పోల్చితే శాంతియుతమైందని, ఈ శాంతిని ఇలాగే కొనసాగించేందుకు ప్రయత్నం చేస్తామన్నారు.

సల్వకాలమే అవి సక్సెస్‌..
హైదరాబాద్‌లో శాంతియుత ధర్నాలకు అనుమతు ల విషయాన్ని అడగ్గా, కొద్దిరోజుల సమయంలోనే ఆర్‌ఎస్‌ఎస్, ఎంఐఎం లాంటి సంస్థలు తమ కార్యక్రమాలను నిర్వహించిన విషయాన్ని కేటీఆర్‌ గుర్తు చేశారు. దేశంలో 45 ఏళ్లల్లో ఎన్నడూ లేనంత నిరుద్యోగం, ఐదు త్రైమాసికాల్లో వరుసగా తగ్గుతున్న ఆర్థికాభివృద్ధి, పెరుగుతున్న ద్రవ్యోల్బణం వంటి అంశాలను పక్కదారి పట్టించేందుకు కేంద్రం ప్రయత్నాలను చేస్తుందన్న ప్రశ్నకు సమాధానంగా ఒకవేళ ఇలాంటి ప్రయత్నాలు చేస్తే అవి స్వల్పకాలం మాత్రమే సక్సెస్‌ అవుతాయని, అంతిమంగా ఉద్యోగాల కల్పన, ఆర్థికాభివృద్ధి వంటి కఠిన ప్రశ్నలకు కచ్చితంగా ప్రభుత్వాలు సమాధానం చెప్పుకోవాల్సి ఉంటుందన్నారు.

అత్యధికంగా ప్రభావితం చేసే రాజకీయ నేత ఆయనే..
రాష్ట్రంలో బలమైన ప్రతిపక్షం లేకున్నా, తమ 60 లక్షల కార్యకర్తలతో ఎప్పటికప్పుడు ప్రభుత్వ పనితీరుపై తమకు అవసరమైన క్షేత్రస్థాయి సమాచారం వస్తుందని కేటీఆర్‌ అన్నారు. 2009లో రోడ్లపైన తెలంగాణ కోసం ఉద్యమాలు చేస్తున్న పరిస్థితి నుంచి, 2019లో మంత్రి స్థాయిలో పాలన చేస్తున్న పరిస్థితి వరకు జరిగిన పరిణామ క్రమాన్ని ‘టెన్‌ ఇయర్‌ చాలెంజ్‌’అంటూ స్పందించారు. టీఆర్‌ఎస్‌ కార్యకర్తల కృషి వల్లనే తనకు మంత్రి పదవి దక్కిందన్న కేటీఆర్, మంత్రి పదవి కన్నా తనకు పార్టీ పదవే విలువైందని తెలిపారు. తనను అత్యధికంగా ప్రభావితం చేసే రాజకీయ నాయకుడు సీఎం కేసీఆరే అని చెప్పారు. 2019 లో అన్ని జిల్లా పరిషత్‌ లను గెలుచు కోవడం ఒక మంచి జ్ఞాపకంగా మిగిలిందన్నారు.

పాతబస్తీకి మెట్రో.. గచ్చిబౌలికి బీఆర్‌టీఎస్‌!
హైదరాబాద్‌లో బీఆర్‌టీఎస్‌ (బస్‌ ర్యాపిడ్‌ ట్రాన్సిట్‌ సిస్టమ్‌)లో కూకట్‌పల్లి, హైటెక్‌ సిటీ, గచ్చిబౌలి ఏరియాలను కలిపే ప్రణాళిక ప్రారంభమైందన్నారు. పాతబస్తీకి కూడా మెట్రో రైలు సౌకర్యం వస్తుందని కేటీఆర్‌ తెలిపారు. హైదరాబాద్‌ తూర్పు వైపు ఐటీ పరిశ్రమలను తీసుకెళ్లాలని తాము చేస్తున్న ప్రయత్నానికి మంచి స్పందన వస్తోందన్నారు. గోపనపల్లిలో విస్తృతంగా పెరుగుతున్న పలు గేటెడ్‌ కమ్యూనిటీలకు ఫైనాన్సియల్‌ డిస్ట్రిక్ట్‌ నుంచి రోడ్డు లేదని, దీన్ని నూతన స్లిప్‌ రోడ్డు నిర్మాణంలో కవర్‌ చేస్తామన్నా రు.

ఎల్బీనగర్‌లో ఇప్పటికే ఒక ఫ్లైఓవర్‌ పూర్తయిం దని మరో మూడు ఫ్లై ఓవర్ల నిర్మాణాలు వస్తాయ న్నారు. 111 జీవోలో ఏదైనా మార్పు, చేర్పులు అవసరమైతే ఉస్మాన్‌సాగర్, హిమాయత్‌సాగర్‌ గురించి ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలన్నారు. అనంతగిరి, వికారాబాద్‌ ప్రాంతాలను గత ప్రభుత్వాల మాదిరిగా నిర్లక్ష్యం చేస్తారా అన్న ప్రశ్నకు ఈ ప్రాంతాల అభివృద్ధి కోసం అనేక ప్రణాళికలు సిద్ధంగా ఉన్నాయని వాటి ఫలాలు త్వరలో చూస్తారని చెప్పారు.

చేనేతకు పెద్ద ఫ్యాన్‌..
సోషల్‌ మీడియా ద్వారా ప్రజల నుంచి నేరుగా స్పందన తెలుస్తుందని, తన పైన మర్యాద పూర్వకమైన మీమ్‌లు (హాస్యపూరిత చిత్రాలు) వచ్చినా తనకు ఎలాంటి ఇబ్బంది లేదన్నారు. ఇప్పటికే దాదాపు మంత్రులంతా సోషల్‌ మీడియా  లో చురుగ్గా భాగస్వాములయ్యారన్నారు. చేనేత వస్త్రాలకు తాను పెద్ద అభిమానినని చెప్పారు. పెద్దఎత్తున చేపట్టిన సాగునీటి ప్రాజెక్టులు పూర్తవుతున్న నేపథ్యంలో ప్రభుత్వం ఆరోగ్యం విద్య పట్టణ గ్రామీణ మౌలిక వసతుల రంగాలకు ప్రాధాన్యత ఇచ్చే అవకాశం ఉందన్నారు.

జనవరిలో వరంగల్‌కు మాస్టర్‌ప్లాన్‌
నూతన మున్సిపల్‌ చట్టంతో పౌరులకు అనేక ప్రయోజనాలు కలుగుతాయని, మున్సిపల్‌ అధికా రుల విచక్షణతో సంబంధం లేకుండా ప్రజల అవస రాలు తీరుతాయని, ఈ మార్పులను వ్యవస్థీకృతం చేసేందుకు నూతన చట్టాన్ని కఠినంగా అమలు చేస్తామన్నారు. రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీల్లో డంప్‌ యార్డులు, వేస్టు టు ఎనర్జీ ప్లాంట్లను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందన్నారు. వరంగల్‌ అర్బన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ మాస్టర్‌ ప్లాన్‌ జనవరి మొదటి వారంలో ఉంటుందన్నారు.

ఇంకా వెతుకుతున్నా..
తన కూతురితో ఉన్న ఫొటోపై ఓ నెటిజన్‌ కోరిక మేరకు కేటీఆర్‌ స్పందించారు. నా కూతురు వేగం గా ఎదుగుతోందని ఉప్పొంగిపోయారు. రాష్ట్ర పోలీసులు చేపట్టిన ఆపరేషన్‌ స్మైల్‌ కార్యక్రమాన్ని అభినందించారు. డీజీపీ, హైదరాబాద్‌ సీపీకి శుభా కాంక్షలు తెలిపారు. కుటుంబాన్ని, వృత్తిని ఎలా సమన్వయం చేసుకుంటారన్న నెటిజన్‌ ప్రశ్నకు.. ‘ఇంకా వెతుకుతున్నా’అని సమాధానమిచ్చారు.

జగన్‌ పాలన.. మంచి ప్రారంభం
ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి జగన్‌ ఆరు నెలల పాలనపైన స్పందించిన కేటీఆర్‌.. ‘ఒక మంచి ప్రారంభం’అని అన్నారు. ఏపీలో మూడు రాజధానుల ఏర్పాటు సరైందో కాదో ఆ రాష్ట్ర ప్రజలే నిర్ణయిస్తారని, తాను కాదని చెప్పారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పుడు నాయకత్వ లేమితో తెలంగాణ తల్లడిల్లుతుందన్న కామెం ట్లు చేసిన పలువురు, ఆంధ్ర రాష్ట్రంలో తమ పార్టీ పోటీ చేయాలని కోరడం, ఆ దిశగా తెలం గాణ రాష్ట్రాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్‌ నడిపినం దుకు సంతోషంగా ఉందన్నారు.

వచ్చే ఏడాది పూర్తయ్యేవి ఇవే..!
అంతర్జాతీయ స్థాయి తయారీ రంగ కంపెనీల నుంచి హైదరాబాద్‌ తీసుకొస్తామని.. ఇప్పటికే టెక్స్‌టైల్స్, ఎలక్ట్రానిక్, ఫుడ్‌ ప్రాసెసింగ్‌లో పలు కంపెనీలు పెట్టుబడులు పెట్టడానికి ముందుకొ చ్చాయని కేటీఆర్‌ చెప్పారు. 2020లో ఫార్మా సిటీ ప్రారంభమవుతుందన్నారు. హైదరాబాద్‌ లో రెండో దశ టీహబ్‌–టీవర్క్స్‌ 2020 మొదటి అర్ధసంవత్సరంలో, జూన్‌లో కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తవుతాయన్నారు. 4వ పారిశ్రామిక విప్లవం దిశగా అనేక ప్రభుత్వాలు వివిధ చర్యలు తీసు కుంటున్నాయని, ఇందులో భాగంగా తెలం గాణ ప్రభుత్వం కూడా ఇన్నొవేషన్, ఇన్‌ఫ్రా స్ట్రక్చర్, ఇన్‌క్లూజివ్‌ గ్రోత్‌ అనే త్రీ ఐ మంత్రాన్ని పాటిస్తోందని, పట్టణాభివృద్ధితో పాటు మౌలిక వసతులు, ఉద్యోగాల కల్పన వంటి అంశాలకు కూడా సమాన ప్రాధాన్యత ఇస్తుందన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement