సాక్షి, హైదరాబాద్: గత ప్రభుత్వాలు అంచనా, అధ్యయనం లేకుండా ఇబ్బడిముబ్బడిగా విశ్వవిద్యాలయాలు, కళాశాలలకు అనుమతించి.. విద్యా ప్రమాణాలు దెబ్బతినడానికి కారణమయ్యాయని ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి విమర్శించారు. తాము కళాశాలల సంఖ్య పెంచకుండా.. ఉన్నవాటిని బలోపేతం చేయడానికి ప్రాధాన్యమిస్తున్నామన్నారు. గురువారం శాసనసభలో విద్యాశాఖ బడ్జెట్‌పై చర్చకు కడియం సుదీర్ఘంగా సమాధానమిచ్చారు. వివిధ మార్గాల్లో రూ.1,500 కోట్లు సమీకరించి పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పన, భవనాల నిర్మాణం చేపట్టామని తెలిపారు.
భారీగా పోస్టుల భర్తీ..
వేసవి సెలవుల తర్వాత పాఠశాలలు తిరిగి తెరిచే నాటికి 8,792 మంది కొత్త ఉపాధ్యాయులు అందుబాటులోకి వస్తారని కడియం చెప్పారు. ఇక జూనియర్ కళాశాలలకు 1,202 పోస్టులు, డిగ్రీ కాలేజీలకు 1,384, పాలిటెక్నిక్‌లకు 519, విశ్వవిద్యాలయాలకు 1,551 పోస్టులు మంజూరు చేశామని తెలిపారు. కాంట్రాక్టు సిబ్బందిని ఎలా రెగ్యులరైజ్ చేయవచ్చనే మార్గాలను పరిశీలిస్తున్నామని కడియం తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment