రాష్ట్ర రాజధాని అమరావతిలో సింగపూర్ ప్రైవేట్ కంపెనీల కన్సార్టియంకు కట్టబెట్టిన స్టార్టప్ ఏరియా వ్యవహారం సొమ్ము ఒకరిది.. సోకు ఇంకొకరిది అన్నట్లుగా తయారైంది. స్టార్టప్ ఏరియాలో తొలి దశలో మౌలిక వసతుల కల్పనకు రూ.350 కోట్లు విడుదల చేయాలని రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ (సీఆర్‌డీఏ) తాజాగా ఆర్థిక శాఖకు ప్రతిపాదనలు పంపించింది. రాజధాని ప్రాంతంలో రాష్ట్ర ప్రభుత్వం సింగపూర్ కంపెనీలకు 1,691 ఎకరాల విలువైన భూములను అప్పగించిన విషయం తెలిసిందే.