Finance Department officials
-
పీఎస్‌బీలపై నేడు ఆర్థిక శాఖ సమీక్ష
న్యూఢిల్లీ: ప్రభుత్వరంగ బ్యాంక్‌ల చీఫ్‌లతో కేంద్ర ఆర్థిక శాఖ ఉన్నతాధికారులు మంగళవారం భేటీ కానున్నారు. అందరికీ ఆర్థిక సేవలను చేరువ చేసే విషయంలో కేంద్ర ప్రభుత్వం వివిధ రకాల పథకాలను లోగడ తీసుకురావడం తెలిసిందే. వీటి కింద ఆయా వర్గాలకు బ్యాంకుల నుంచి రుణసాయం ఏ విధంగా అందుతోందన్న దానిపై భేటీలో సమీక్షించనున్నట్టు అధికార వర్గాలు తెలిపాయి. పీఎం విశ్వకర్మ, స్టాండప్ ఇండియా, పీఎం స్వనిధి, ముద్రా యోజన తదితర పథకాల పురోగతిపై పరిశీలన జరగనుంది. ఆర్థిక సేవల కార్యదర్శి వివేక్ జోషి ఈ సమావేశానికి అధ్యక్షత వహించనున్నారు. అందరికీ ఆర్థిక సేవల చేరువ విషయంలో ఇతర అంశాలు కూడా చర్చకు రానున్నట్టు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. గతేడాది సెపె్టంబర్లో ప్రధాని ప్రారంభించిన పీఎం విశ్వకర్మ పథకం కింద హస్త కళాకారులు, చేతివృత్తుల వారికి నామమాత్రపు వడ్డీపై రుణ సాయం లభించనుంది. ఐదేళ్ల కాలంలో ఈ పథకం కింద రూ.13,000 కోట్ల సాయం అందించనున్నారు. 30 లక్షల మందికి లబ్ధి చేకూరనుందని అంచనా. 2016 ఏప్రిల్ 5న ప్రారంభించిన స్టాండప్ ఇండియా పథకం కింద సొంతంగా సంస్థలను స్థాపించే ఎస్సీ, ఎస్టీ, మహిళలకు బ్యాంక్‌ల ద్వారా రుణ సాయం లభించనుంది. -
ప్రత్యేక కేటాయింపుల్లేవు
సాక్షి, అమరావతి: రాష్ట్ర విభజన కారణంగా అనేక రంగాల వారీగా, మౌలిక సదుపాయాల రూపేణ భారీ నష్టం ఏర్పడిందని, ఈ నేపథ్యంలో కేంద్ర బడ్జెట్ పట్ల ఆశగా చూశామని, అయినా ఈ అంశాలను పరిగణనలోకి తీసుకుని రాష్ట్రానికి ప్రత్యేక కేటాయింపులు ఏమీ చేయలేదని ఆర్థిక శాఖ అధికారులు సీఎం జగన్‌కు వివరించారు. 2021–22 సంవత్సరానికి సంబంధించి కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్ నేపథ్యంలో రాష్ట్ర ఆర్థిక శాఖ అధికారులతో సీఎం జగన్ సోమవారం తన క్యాంపు కార్యాలయంలో సమావేశమయ్యారు. వివిధ రంగాల వారీగా బడ్జెట్ కేటాయింపుల వివరాలను అధికారులు సీఎంకు వివరించారు. తమిళనాడు, కర్ణాటక లాంటి రాష్ట్రాలతో సమాన స్థాయిలో రాష్ట్రానికి బడ్జెట్ కేటాయించలేదన్నారు. వివిధ రంగాలకు అన్ని రాష్ట్రాల తరహాలోనే ఏపీకి వస్తాయి తప్ప, రాష్ట్రానికి ప్రత్యేకించి ఏమీ లేవని పేర్కొన్నారు. పీఎం కిసాన్, పీఎం ఆవాస్ యోజన, ఉపాధి హామీ పథకాలకు గత ఏడాదితో పోలిస్తే కేటాయింపులు తగ్గాయని.. ఆహారం, పెట్రోల్, ఫెర్టిలైజర్స్ సబ్సిడీలను కూడా తగ్గించారని నివేదించారు. ఈ సందర్భంగా సీఎం జగన్ స్పందిస్తూ.. కేంద్ర బడ్జెట్లో వివిధ రంగాలకు చేసిన కేటాయింపుల్లో వీలైనన్ని నిధులను రాష్ట్రానికి తీసుకు రావడానికి అధికారులు గట్టి ప్రయత్నాలు చేయాలని ఆదేశించారు. కేంద్ర ప్రభుత్వ శాఖలతో సంప్రదింపులు జరిపి సకాలంలో నిధులు వచ్చేలా చూడాలని స్పష్టం చేశారు. -
ప్రభుత్వ బ్యాంకులు 12 చాలు!
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ బ్యాంకుల మధ్య విలీ నాల ప్రక్రియ దాదాపు పూర్తయినట్టేనని కేంద్ర ఆర్థిక శాఖ కార్యదర్శి రాజీవ్ కుమార్ వ్యాఖ్యానిం చారు. తాజాగా 10 ప్రభుత్వ రంగ బ్యాంకులను 4 బ్యాంకులకు కుదిస్తూ విలీన నిర్ణయాన్ని కేంద్రం ప్రకటింన సంగతి తెలిసిందే. నవ భారత ఆకాంక్షలను తీర్చేందుకు ఇప్పుడు మిగలనున్న 12 బ్యాంకులు సరిపోతాయని కుమార్ పేర్కొన్నారు. పంజాబ్ నేషనన్ బ్యాంక్, యూనియన్ బ్యాంక్, కెనరా బ్యాంక్, ఇండియన్ బ్యాంకుల్లో ఆరు బ్యాం కులను విలీనం చేయడంతో దేశంలో మొత్తం ప్రభుత్వ రంగ బ్యాంకుల సంఖ్య 2017లో ఉన్న 27 నుంచి ప్రస్తుతం 12కు పరిమితం తగ్గను న్నాయి. దీంతో ప్రపంచస్థాయిలో ఆరు మెగా బ్యాంకులు ఆవిర్భవించనున్నాయి. ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్న 5 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థ సాకారంలో భాగంగానే బ్యాంకుల విలీన నిర్ణయం తీసుకున్నారని కుమార్ చెప్పారు. ‘ఆర్థిక వృద్ధి రేటును పరుగులు పెట్టించాలంటే భారీ స్థాయి బ్యాంకులు అవసరం. తాజా మెగా విలీన నిర్ణయం ఈ దిశగా అడుగులు వేయడం కోసమే. భారీ మూలధన నిధులతో మనకు ఇప్పుడు ఆరు మెగా బ్యాంకులు ఉంటాయి’ అని అన్నారు. -
దుష్ప్రచారాన్ని ఖండించిన ఏపీ ఆర్థిక శాఖ
సాక్షి, అమరావతి: కొన్ని సామాజిక మాద్యమాలు, పలు టీవీ చానల్స్‌లో ప్రసారం అవుతున్న కథనాలను ఆంధ్రప్రదేశ్ ఆర్థిక శాఖ ఖండించింది. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు చెల్లించలేకపోవడానికి నిధుల కొరత కారణం కాదని ప్రకటన చేసింది. ‘సాధారణంగా ప్రతి నెల 1వ తేదీన ఆర్బీఐ ఈ-కుబేర్ (ఈ-కుబేర్ పద్ధతిలో వేతనాలు రిజర్వ్ బ్యాంకు నుంచి నేరుగా ఉద్యోగుల ఖాతాల్లో ప్రతి నెలా 1న జమ అవుతాయి) ద్వారా చెల్లింపులు జరుగుతాయి. అదే ప్రకారం అన్ని జిల్లాల పింఛన్లు, జీతాల ఫైళ్లు యథాతథంగా జులై 31నే ఆర్బీఐకి పంపడం జరిగింది. 1వ తేదీ మధ్యాహ్నంకు పింఛన్లు పూర్తిగా, కొన్ని జీతాల ఫైళ్లు చెల్లించాం. అయితే సాంకేతిక కారణాల వల్ల ఈ-ముద్ర ద్వారా పొందిన సర్టిఫికెట్లు పని చేయకపోవడం వల్ల మిగిలిన ఫైళ్లు చెల్లింపు ఆలస్యం అయింది. ఈ సమస్యను వెంటనే పరిష్కరించి మిగిలిన జీతాలు చెల్లించేందుకు తగు చర్యలు తీసుకుంటాం’అని ఆర్థికశాఖ అధికారులు వెల్లడించారు. తొలగిన సాంకేతిక సమస్య ఉద్యోగుల జీతాలు, ఫించన్ల చెల్లింపుల్లో ఏర్పడ్డ సాంకేతిక సమస్య తొలగింది. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులందరికీ జీతాలు చెల్లించినట్లు ఆర్థిక శాఖ శుక్రవారం ఓ ప్రకటన చేసింది. -
హోదా సాధన దిశగా...
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా సాధన కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం వేగం పెంచింది. ప్రతిపక్షంలో ఉండగా హోదా కోసం అన్ని వేదికలపైనా పోరాడిన వైఎస్సార్ సీపీ అధికారం చేపట్టాక తన బాధ్యత మరింత పెరిగిందని భావిస్తోంది. ఏపీకి సంజీవని లాంటి హోదా ఆవశక్యతను ప్రస్తావిస్తూ అధికారులను సైతం ఈ దిశగా కార్యోన్ముఖులను చేసి కేంద్ర ప్రభుత్వ విభాగాల ఎదుట సమర్థ వాదన వినిపించేందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సమాయత్తం చేస్తున్నారు. ఆర్థిక సమస్యలపై నివేదిక రూపొందించండి రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధించే దిశగా 15వ ఆర్ధిక సంఘం ఎదుట ఆంధ్రప్రదేశ్ వాదనను సమర్థవంతంగా వినిపించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆర్థికశాఖ అధికారులను ఆదేశించారు. రాష్ట్ర ఆర్థిక స్థితిగతులు, ఎదుర్కొంటున్న ఆర్ధిక సమస్యలను వివరిస్తూ సమగ్ర నివేదిక రూపొందించి ప్రత్యేక హోదా ఎంత అత్యవసరమో కేంద్రానికి నివేదించాలని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. ఇప్పటికీ రెవెన్యూ లోటులో కొనసాగుతున్న రాష్ట్రానికి మరో ఐదేళ్ల పాటు రెవెన్యూ లోటు భర్తీ చేసేలా 15వ ఆర్థిక సంఘాన్ని కోరాలని సూచించారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, ఆదాయ వనరులు, ఆర్జన స్థితిగతులపై సంబంధిత శాఖల ఉన్నతాధికారులతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి శనివారం రెండు గంటల పాటు సమీక్ష నిర్వహించారు. సామాన్యులపై భారం లేకుండా ఆదాయ మార్గాలపై అన్వేషణ రాష్ట్ర ఆర్ధిక పరిస్థితిని మెరుగుపరిచే చర్యలు వెంటనే ప్రారంభించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అధికారులను ఆదేశించారు. రాష్ట్రం ఆర్థిక సమస్యల్లో ఉన్నందున ఆర్థిక క్రమశిక్షణకు అత్యధిక ప్రాధాన్యం ఇవ్వాలని, హంగు ఆర్భాటాలకు ఏమాత్రం అవకాశం ఇవ్వరాదని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. సామాన్యులపై భారం పడకుండా రాష్ట్ర ఆదాయ వనరులను పెంచడంపై ప్రణాళికలు రూపొందించాలని ఈ సందర్భంగా అధికారులను సీఎం కోరారు. హరిత పన్ను (గ్రీన్ టాక్స్), వ్యర్థ పదార్థాలపై పన్ను, ఎర్ర చందనం అమ్మకం, తక్కువ వడ్డీకే రుణాలు పొందడం, సరైన ఇసుక విధానం అమలు లాంటి చర్యల ద్వారా ఆదాయాన్ని పెంచడంపై కసరత్తు చేయాలని సూచించారు. పన్నేతర ఆదాయం పెంపుపై దృష్టి సారించాలని నిర్దేశించారు. దారి మళ్లిన అప్పులు.. గత ప్రభుత్వ హయాంలో ఆర్థిక నిర్వహణ తీరును పరిశీలించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి విస్మయం వ్యక్తం చేశారు. టీడీపీ ఐదేళ్ల పాలనలో పలు కార్పొరేషన్ల ద్వారా ప్రభుత్వ గ్యారంటీతో విచ్చలవిడిగా అప్పులు తీసుకుని దారి మళ్లించిన వైనాన్ని చూసి ముఖ్యమంత్రి నివ్వెరపోయారు. ఈ నేపథ్యంలో అస్తవ్యస్థంగా మారిన రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని చక్కదిద్దేందుకు సృజనాత్మక ఆలోచనలతో ముందుకు రావాలని అధికారులను సీఎం కోరారు. అవినీతిపై ఉపేక్షించేది లేదు.. రెవెన్యూ శాఖలో ఎక్కడా అవినీతికి తావులేకుండా సమగ్ర ప్రణాళికలను రూపొందించాలని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశించారు. అవినీతి రహిత పాలనే తమ ప్రభుత్వ లక్ష్యమని, అందుకు అనుగుణంగానే అధికార యంత్రాంగం అంతా పనిచేయాలని, ఈ విషయంలో రాజీ పడబోమని ముఖ్యమంత్రి జగన్ స్పష్టం చేశారు. ఇది ప్రాథమిక సమీక్ష మాత్రమేనని, రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని మెరుగు పరచడానికి ప్రత్యేక ప్రణాళికలను రూపొందించి క్షుణ్నంగా అధ్యయనం చేసిన అనంతరం తగిన చర్యలు తీసుకుందామని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. సమీక్షా సమావేశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం, ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి అజేయ కల్లాం, ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు డి.సాంబశివరావు, పీవీ రమేష్, ముఖ్య కార్యదర్శి ఎస్ఎస్ రావత్, ఆర్థిక శాఖ కార్యదర్శి ముద్దాడ రవిచంద్, ముఖ్యమంత్రి కార్యదర్శి ఆరోఖ్యరాజ్, అదనపు కార్యదర్శి కె.ధనుంజయరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
మనమే ఆదర్శం: కేసీఆర్
సాక్షి, హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వ బడ్జెట్‌తో రాష్ట్రానికి పెద్దగా ఒరిగిందేమీ లేదని సీఎం కేసీఆర్ అభిప్రాయపడ్డారు. వ్యవసాయరంగాన్ని సుభిక్షం చేసేలా తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన రైతుబంధు పథకాన్ని కేంద్రం కాపీ కొట్టిందని ఆయన పేర్కొన్నారు. అయితే ఆ పనిని కూడా కేంద్రం సరిగా చేయలేకపోయిందని ఎద్దేవా చేశారు. రైతుబంధు తరహాలోనే కేంద్రం రైతులకు సరిపడా సాయం చేస్తే బాగుండేదని చెప్పారు. కేంద్ర బడ్జెట్ నేపథ్యంలో ఆర్థికశాఖ ఉన్నతాధికారులు శనివారం ప్రగతిభవన్‌లో సీఎం కేసీఆర్‌ను కలిశారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ అధికారులతో బడ్జెట్‌పై ఇష్టాగోష్టిగా మాట్లాడారు. ఎన్నికల్లో ప్రజలకిచ్చిన హామీలన్నింటినీ అమలు చేసే దిశగా రాష్ట్ర బడ్జెట్ రూపకల్పన జరగాలని కేసీఆర్ ఆదేశించారు. నీటి పారుదల ప్రాజెక్టుల నిర్మాణానికి అవసరమైన నిధుల కేటాయింపు జరగాలని చెప్పారు. ఈ సందర్భంగా బడ్జెట్ రూపకల్పనపై పలు సూచనలు చేశారు. ఎన్నికల సందర్భంగా టీఆర్ఎస్ పార్టీ తరఫున ప్రజలకు పలు హామీలు ఇచ్చామని, వాటి అమలుకు ప్రభుత్వం సంకల్పించిందన్నారు. ఈ హామీల అమలు జరిగే విధంగా బడ్జెట్ రూపకల్పన జరగాలన్నారు. నీటిపారుదల ప్రాజెక్టుల నిర్మాణం శరవేగంగా జరుగుతోందని.. వీటికి నిధుల కొరత లేకుండా బడ్జెట్లో ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. ఈ సమావేశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్కే జోషి, ఆర్థిక సలహాదారు జీఆర్ రెడ్డి, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణ రావు, పంచాయతీ రాజ్ ముఖ్య కార్యదర్శి వికాస్ రాజ్, నీటి పారుదల శాఖ ఈఎన్సీ మురళీధర్, ఆర్ అండ్ బీ ఈఎన్సీలు గణపతి రెడ్డి, రవీందర్ రావు తదితరులు పాల్గొన్నారు. ఇంకా మెరుగైన పథకం కావాలి ‘రైతుబంధు పథకం చాలా గొప్పది. రైతులకు నేరుగా సాయం చేసేలా మన పథకం ఉంది. మనం ఇచ్చే సాయం మరీ ఎక్కువ కాకున్నా రైతులకు ఊరట కలిగిస్తోంది. కేంద్ర ప్రభుత్వం ఇదే పథకాన్ని కొత్తగా ప్రవేశపెట్టినట్లు చెబుతోంది. అయితే కేంద్రం ఇచ్చే సాయం తక్కువగా ఉంది. రైతులకు ఈ మొత్తం దేనికీ సరిపోదు. పెట్టుబడి సాయం విషయంలో కేంద్రం ఇప్పటికైనా ఇంకా మెరుగైన పథకం ప్రవేశపెట్టేలా యోచిస్తే బాగుంటుంది. కేంద్రం తరహాలోనే తెలంగాణ బడ్జెట్‌ను రూపొందించాలి. దీనిపై మరోసారి వివరంగా సమీక్షించుకుందాం. 15వ ఆర్థిక సంఘం రాష్ట్ర పర్యటనకు వస్తోంది. మన రాష్ట్రం ఎక్కువ నిధులు పొందేలా సమగ్ర నివేదిక రూపొంచాలి. దీనిపై దృష్టి పెట్టండి. గ్రామపంచాయతీల్లో కొత్త పాలకవర్గాలు కొలువుదీరాయి. గ్రామాల అభివృద్ధి లక్ష్యంగా మన ప్రణాళిక ఉండాలి. వచ్చే ఐదేళ్లల్లో అన్ని గ్రామాల్లో మెరుగైన మౌలిక వసతులు ఉండాలి. బడ్జెట్ రూపకల్పనలో ఈ దిశగా చర్యలు తీసుకోవాలి’అని సీఎం అన్నారు. 18న ఆర్థిక సంఘం రాక 15వ ఆర్థిక సంఘం ఈ నెల 18న తెలంగాణకు రానుంది. మూడ్రోజుల పాటు రాష్ట్రంలో పర్యటించనుంది. మొదటి రెండ్రోజులు సీఎం కేసీఆర్‌తో, రాష్ట్రంలోని వివిధ శాఖల ఉన్నతాధికారులతో సమావేశం కానుంది. 20న రాష్ట్రంలో పర్యటించనుంది. కాళేశ్వరం ప్రాజెక్టును సందర్శించనుంది. మిషన్ భగీరథ పనులను పరిశీలించనుంది. ఆర్థిక సంఘం పర్యటన ముగిసిన తర్వాతే బడ్జెట్ సమావేశాలు నిర్వహించాలని సీఎం కేసీఆర్ భావిస్తున్నట్లు తెలిసింది. కేంద్ర ప్రభుత్వం తరహాలోనే రాష్ట్రంలోనూ తాత్కాలిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టే యోచనలో ప్రభుత్వం ఉంది. అప్పటికప్పుడు పరిస్థితులకు అనుగుణంగా ఏమైనా మార్పులు జరిగే అవకాశం ఉందని ఆర్థిక శాఖ వర్గాలు చెబుతున్నాయి. సాగుకు 25వేల కోట్లు! రాష్ట్రంలోని సాగునీటి ప్రాజెక్టులకు ఈసారి కూడా గతేడాదిలాగే భారీగా బడ్జెట్ కేటాయింపులు జరపాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రాజెక్టుల పనుల్లో ప్రస్తుత పురోగతి, వాటి ప్రాధాన్యతలను పరిగణనలోకి తీసుకుంటూ రూ.25 వేల కోట్ల బడ్జెట్‌ను సర్దుబాటు చేయాలనే నిర్ణయానికి వచ్చినట్టు తెలిసింది. నీటిపారుదల శాఖ గతంలో పంపిన బడ్జెట్ ప్రతిపాదనలను పరిశీలించిన ఆర్థికశాఖ రూ.25 వేల కోట్లకు సీలింగ్ ఇచ్చింది. సాగునీటి ప్రాజెక్టులకు ఈ ఏడాది జనవరిలో నీటిపారుదల శాఖ రూ.26,700 కోట్లతో ఆర్థిక శాఖకు ప్రతిపాదనలు పంపింది. చాలా ప్రాజెక్టుల పరిధిలో నెలకొన్న భూసేకరణ, సహాయ పునరావాస, అటవీ, పర్యావరణ సమస్యలు, గతేడాది పనుల పురోగతిని దృష్టిలో పెట్టుకొని ఈ మేర నిధులు అవసరమని తెలిపింది. దీనిపై ప్రాజెక్టుల వారీగా సమీక్ష జరిపిన అనంతరం రూ.25వేల కోట్ల బడ్జెట్‌కే ఆర్ధిక శాఖ సీలింగ్ ఇచ్చింది. ఇందులో రూ.1,316.13 కోట్లు నిర్వహణ పద్దుకై ప్రతిపాదించగా, మిగతా 23,683.87 కోట్లు ప్రగతి పద్దుకై ప్రతిపాదించారు. ప్రగతి పద్దు కింద ప్రతిపాదించిన నిధుల్లో రాష్ట్ర ప్రణాళిక కింద రూ.13,253.77 కోట్లు కేటాయించేలా ప్రతిపాదనలు సిధ్ధం కాగా.. మిగతా రూ.10,430.10కోట్లను ఇప్పటికే ఏర్పాటు చేసిన కార్పొరేషన్ల ద్వారా రుణాల రూపంలో తీసుకోవాలని ప్రతిపాదించారు. ఇక ప్రాజెక్టుల వారీగా చూస్తే అంతా ఊహిస్తున్నట్లే కాళేశ్వరం ప్రాజెక్టుకు గరిష్టంగా రూ.5,988.10 కోట్లు కేటాయించాలని, సీతారామకు రూ.2,915కోట్లు, పాలమూరు–రంగారెడ్డికి రూ.2,732కోట్లు, మైనర్ ఇరిగేషన్‌కు రూ.1,601కోట్లు కేటాయించేలా ప్రతిపాదనలు సిద్ధమయ్యాయి. కాగా, సాగునీటి ప్రాజెక్టుల పరిధిలో పెండింగ్ బిల్లులు, బడ్జెట్ కేటాయింపులపై సీఎం కేసీఆర్ శనివారం బడ్జెట్‌పై సమీక్ష సందర్భంగా అధికారులతో చర్చించారు. వచ్చే బడ్జెట్లో రూ.25వేల కేటాయింపులకు ఓకే చెప్పినట్లుగా తెలిసింది. పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టుకు రుణాల ప్రక్రియను వేగిరం చేయాలని సూచించినట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. నేడు యాదాద్రికి సీఎం ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు ఆదివారం యాదాద్రికి వెళ్లనున్నారు. యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీ నరసింహస్వామి వారిని దర్శించుకుని యాదాద్రి ఆలయంలో జరుగుతున్న ఆలయ విస్తరణ పనులను అధికారులతో కలిసి పరిశీలించనున్నారు. అనంతరం అభి వృద్ధి పనులపై అధికారులతో సమీక్షించనున్నారు. కేసీఆర్ రెండోసారి సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత మొదటిసారి యాదాద్రికి వెళ్తున్నారు. -
విదేశీ కంపెనీలపై ఎంత ప్రేమో..
-
జనం సొమ్ము.. సింగపూర్ సోకు
సాక్షి, అమరావతి: రాష్ట్ర రాజధాని అమరావతిలో సింగపూర్ ప్రైవేట్ కంపెనీల కన్సార్టియంకు కట్టబెట్టిన స్టార్టప్ ఏరియా వ్యవహారం సొమ్ము ఒకరిది.. సోకు ఇంకొకరిది అన్నట్లుగా తయారైంది. స్టార్టప్ ఏరియాలో తొలి దశలో మౌలిక వసతుల కల్పనకు రూ.350 కోట్లు విడుదల చేయాలని రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ (సీఆర్డీఏ) తాజాగా ఆర్థిక శాఖకు ప్రతిపాదనలు పంపించింది. రాజధాని ప్రాంతంలో రాష్ట్ర ప్రభుత్వం సింగపూర్ కంపెనీలకు 1,691 ఎకరాల విలువైన భూములను అప్పగించిన విషయం తెలిసిందే. ఈ భూముల్లో రోడ్లు, విద్యుత్, మంచినీటి సరఫరా, మురుగు నీటి పారుదల వంటి మౌలిక వసతుల ఏర్పాటుకయ్యే పూర్తి వ్యయాన్ని రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తుందని ముఖ్యమంత్రి చంద్రబాబు అంగీకరించారు. ఇందుకు రూ.5,500 కోట్లు అవసరమని సీఆర్డీఏ అంచనా వేసింది. మరి వేలాది కోట్లు ఖర్చు పెట్టి అన్ని సదుపాయాలు కల్పిస్తే రాష్ట్ర ప్రజలకు ఏదైనా ఉపయోగం ఉంటుందా అంటే గుండుసున్నా అని చెప్పక తప్పదు. స్టార్టప్ ఏరియా పేరిట ఇచ్చిన భూములను సింగపూర్ కంపెనీలు ప్లాట్లుగా మార్చి ఎంచక్కా విక్రయించుకుంటాయి. అందులో షాపింగ్ కాంప్లెక్స్‌లు, సినిమా థియేటర్లు నిర్మించి, వ్యాపారాలు కూడా చేసుకుంటాయి. విదేశీ కంపెనీలపై ఎంత ప్రేమో.. స్టార్టప్ ఏరియాలో ప్రభుత్వ సొమ్ముతో మౌలిక సదుపాయాలు కల్పించాలన్న ప్రతిపాదనను రాష్ట్ర ఆర్థిక శాఖ తీవ్రంగా వ్యతిరేకించింది. అయినా ముఖ్యమంత్రి చంద్రబాబు ఏమాత్రం లెక్కచేయలేదు. విలువైన భూములను సింగపూర్ కంపెనీలకు ఇచ్చే బదులు ప్రభుత్వమే స్వయంగా అక్కడ ప్లాట్లు వేసి విక్రయిస్తే మంచి ఆదాయం వస్తుంది కదా? అని ఎవరైనా ప్రశ్నిస్తే ముఖ్యమంత్రి నోటి వెంట సమాధానం రావడం లేదు. రాష్ట్ర ఖజానాకు నష్టం చేకూరుస్తూ సింగపూర్ కంపెనీలకు అనుకూలంగా వ్యవహరిస్తుండడం వెనుక లోగుట్టు ఏమిటన్నది సులభంగా అర్థం చేసుకోవచ్చు. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు గుదిబండ స్టార్టప్ ఏరియా ప్రాజెక్టు విషయంలో చేసుకున్న రాయితీ, షేర్ హోల్డర్స్ ఒప్పందాలు పూర్తిగా సింగపూర్ కంపెనీలకే అనుకూలంగా ఉండడంతో అప్పటి ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజేయ కల్లాం తీవ్రంగా వ్యతిరేకించారు. సింగపూర్ కంపెనీలు పెట్టే పెట్టుబడిలో ప్రభుత్వ రాయితీలు 20 శాతానికి మించి ఇవ్వరాదని స్పష్టం చేశారు. అంతేకాకుండా సింగపూర్ కంపెనీలతో చేసుకుంటున్న ఒప్పందాలు రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు గుదిబండగా మారుతాయని, ఆ ఒప్పందాల వల్ల రాష్ట్రం ఆర్థికంగా దివాలా తీస్తుందని, మౌలిక వసతుల కల్పనకు బడ్జెట్ నుంచి నిధులు ఇవ్వడం సాధ్యం కాదని అజేయ కల్లాం తేల్చిచెప్పారు. అనంతరం జరిగిన పరిణామాల నేపథ్యంలో సింగపూర్–అమరావతి ఇన్వెస్ట్మెంట్ హోల్డింగ్ అనే సంస్థ తెరపైకి వచ్చింది. సింగపూర్ ప్రైవేట్ కంపెనీల బదులు ఈ సంస్థే రాయితీ, షేర్ హోల్డర్స్ ఒప్పందాలు చేసుకుంటుందని సీఆర్డీఏ పేర్కొంది. ఒప్పందం చేసుకునే సంస్థ మారిపోవడాన్ని ప్రస్తుత ఆర్థిక శాఖ ఇన్చార్జి ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రవిచంద్ర తప్పుపట్టారు. అయినా రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోలేదు. స్టార్టప్ ఏరియా ప్రాజెక్టు వల్ల రాష్ట్ర ఖజానాపై ఎలాంటి ఆర్థిక భారం పడదని సీఆర్డీఏ స్పష్టం చేసింది. ఒప్పందాలన్నీ తప్పుల తడకలే స్టార్టప్ ఏరియాలో తొలి దశలో మౌలిక వసతుల కల్పనకు రూ.350 కోట్లు విడుదల చేయాలని ఆర్థిక శాఖకు ఇటీవల సీఆర్డీఏ ప్రతిపాదించింది. ఈ ప్రతిపాదనలను చూసి ఆర్థిక శాఖ విస్తుపోయింది. ఈ ప్రాజెక్టు వల్ల ఖజానాపై ఆర్థిక భారం పడదని గతంలో పేర్కొని, ఇప్పుడు మౌలిక వసతుల కల్పనకు రూ.350 కోట్లు ఎలా అడుగుతారంటూ అభ్యంతరం వ్యక్తం చేసింది. సింగపూర్ కంపెనీలతో చేసుకున్న ఒప్పందాల వివరాలను పంపాలని ఆదేశించింది. అయితే, ఈ వివరాలను ఆర్థిక శాఖకు పంపించకుండా సీఆర్డీఏ తాత్సారం చేస్తోంది. సింగపూర్ కంపెనీలతో కుదుర్చుకున్న ఒప్పందాలన్నీ తప్పుల తడకలేనని, అందువల్లే సీఆర్డీఏ వెనుకాడుతోందని ప్రభుత్వ ఉన్నతాధికారి ఒకరు చెప్పారు. ఒప్పందాలను లోతుగా అధ్యయనం చేసిన తరువాతే మౌలిక వసతులకు నిధులు ఇచ్చేది లేనిది తేల్చేస్తామని ఆర్థిక శాఖ స్పష్టం చేస్తోంది. -
చెరో సగం పంచుకున్నారు..!
సాక్షి, హైదరాబాద్: రెండు రాష్ట్రాల మధ్య ఆస్తులు.. అప్పుల పంపిణీ వివాదం ఒకవైపు కొనసాగుతూనే ఉంది. మరోవైపు తెలంగాణ, ఏపీ రాష్ట్రాల విద్యుత్తు నియంత్రణ మండళ్లు విచిత్రమైన నిర్ణయం తీసుకున్నాయి. విభజన చట్టాలన్నీ పక్కన పెట్టి నీకు సగం.. నాకు సగం అన్నట్లుగా టీఎస్ఈఆర్సీ, ఏపీఈఆర్సీ ఆస్తులను పంచేసుకున్నాయి. అంతటితో ఆగకుండా ఉమ్మడి ఖాతాలో ఉన్న రూ.12 కోట్ల డిపాజిట్లను చెరిసగం పంపిణీ చేసుకునేందుకు తెలంగాణ ఆర్థిక శాఖను అనుమతి కోరాయి. దీంతో ఈ నిర్వాకం బయటపడింది. ఏపీఈఆర్సీ నుంచి అందిన ఈ లేఖను చూసి ఆర్థిక శాఖ అధికారులు బిత్తరపోయారు. రాష్ట్ర పునర్విభజన చట్టం ప్రకారం ఆస్తులు, అప్పులను జనాభా ప్రాతిపదికన పంచుకోవాలి. అందుకు భిన్నంగా ఏపీ విద్యుత్తు నియంత్రణ మండలి (ఏపీఈఆర్సీ) ఆస్తులు పంచుకున్న తీరు విస్మయం కలిగిస్తోంది. రాష్ట్ర విభజన అనంతరం ఏపీఈఆర్సీ రెండుగా విడిపోయింది. కొత్తగా తెలంగాణ విద్యుత్తు నియంత్రణ మండలి ఏర్పడింది. విద్యుత్తు వివాదాలు తారాస్థాయికి చేరిన సమయంలో రెండు రాష్ట్ర ప్రభుత్వాలు పోటాపోటీగా వీటికి కమిషన్లను నియమించాయి. ప్రస్తుతం ఏపీఈఆర్సీకి జస్టిస్ భవానీప్రసాద్ చైర్మన్‌గా, టీఎస్ఈఆర్సీకి ఇస్మాయిల్ అలీఖాన్ చైర్మన్‌గా వ్యవహరిస్తున్నారు. వీరికి జ్యుడీషియల్ అధికారాలున్నాయి. హైదరాబాద్‌లోని సింగరేణి భవన్లో ఉన్న ఏపీఈఆర్సీ కార్యాలయం విభజన అనంతరం.. చెరో ఫ్లోర్‌ను, చెరి సగం ఫర్నిచర్‌ను, ఉద్యోగులను పంచుకున్నాయి. వివాదాలు, విభేదాలేమీ లేకుండా సామరస్యపూర్వకంగా టీఎస్ఈఆర్సీ, ఏపీఈఆర్‌సీలు ఆస్తులు పంచుకున్నట్లుగా కనిపిస్తోంది. కానీ రాష్ట్ర పునర్విభజన చట్టం పూర్తిగా పక్కదారి పట్టింది. జనాభా ప్రకారం పంచుకుంటే ఆస్తుల్లోనూ.. అప్పుల్లోనూ తెలంగాణకు 42 శాతం, ఆంధ్రప్రదేశ్‌కు 58 శాతం వాటా రావాల్సి ఉంది. ఏపీఈఆర్సీకి అప్పుల భారం లేనందున కేవలం ఆస్తులను చెరి సమానంగా పంచుకున్నట్లు అర్థమవుతోంది. కానీ.. ఎవరి ఇష్టారాజ్యంగా వారు ఆస్తులను పంచుకుంటే పెద్ద ప్రమాదం ముంచుకొస్తుందని తెలంగాణ ఆర్థిక శాఖ అప్రమత్తమైంది. చట్టాన్ని పక్కనబెట్టి రెండు రాష్ట్రాల ఈఆర్సీలు ఆస్తులు పంచుకున్న తీరుపై అభ్యంతరం వ్యక్తం చేసింది. ఏపీఈఆర్సీ ఖాతాలో ప్రస్తుతం రూ.12 కోట్ల డిపాజిట్లు ఉన్నాయి. తాము సామరస్యంగా వీటిని చెరిసగం పంచుకున్నామని.. ఆమోదించాలని ఏపీఈఆర్సీ ఆర్థిక శాఖకు లేఖ రాసింది. ఈ లెక్కన చెరో రూ.ఆరు కోట్లు పంపిణీ జరగాలి. విభజన చట్టంలోని జనాభా శాతం ప్రకారం పంపిణీ జరిగితే.. తెలంగాణకు రూ. 5.76 కోట్లు, ఆంధ్రప్రదేశ్‌కు రూ. 6.24 కోట్లు దక్కుతాయి. ఈ లెక్కన ఫిప్టీ.. ఫిప్టీ చొప్పున పంచుకుంటేనే తెలంగాణకు లాభమనిపిస్తోంది. కానీ.. ఆ మాత్రం దానికి ఆశ పడితే తెలంగాణ ప్రభుత్వం చిక్కుల్లో పడుతుందని ఆర్థిక శాఖ అధికారులు పసిగట్టారు. ఏపీఈఆర్సీలో ఆస్తులను చెరిసగం పంచుకున్నారనే ఒక్క నిర్ణయాన్ని వేలెత్తి చూపించి.. వేలాది కోట్ల అప్పులను సైతం అదే పద్ధతిన పంచుకోవాలని ఏపీ ప్రభుత్వం తిరకాసు పెట్టే ప్రమాదం ఉందని అప్రమత్తమయ్యారు. ఏపీఈఆర్సీ పంపించిన ఫైలును తిప్పిపంపారు.