చెన్నై: లక్షలాది మందికి ఉపాధి కల్పించే సూక్ష్మ, చిన్న, మధ్య స్థాయి పరిశ్రమల (ఎంఎస్‌ఎంఈ) పనితీరుపై కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ శనివారం సమీక్షించారు. ఈ సందర్భంగా నిర్మలా సీతారామన్ మీడియాతో మాట్లాడుతూ..ఎమ్‌ఎస్‌ఎమ్‌ఈల ఏర్పాటుకై ప్రజలు బ్యాంకులను సంప్రదిస్తే, హేతుబద్ద కారణం లేకుండా బ్యాంకులు నిరాకరించినట్లయితే ఆర్థిక మంత్రిత్వ శాఖకు ఫిర్యాదు చేయవచ్చని తెలిపారు. ఫిర్యాదులను పరిష్కరించడానికి త్వరలోనే ఆర్థిక శాఖ ప్రత్యేక సెంటర్‌ను ఏర్పాటు చేయనుందని పేర్కొన్నారు.
ఫిర్యాదులు స్వీకరించడానికి ఆర్థిక శాఖ ఏర్పాటు చేసిన ప్రత్యేక సెంటర్ సిద్దంగా ఉంటుందని, అలాగే రుణాలను నిరాకరించిన ఉద్యోగిపై సంబంధిత బ్యాంక్ మేనేజర్‌కు ఫిర్యాదు చేయాలని ఆమె తెలిపింది. దేశంలో ఎమ్‌ఎస్‌ఎమ్‌ఈల పునాదులు బలంగా ఉన్నాయని ..వాటిని మరింత అభివృద్ధి చెందే విధంగా మౌళిక సధుపాయాలకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నామని తెలిపారు. మెరుగైన మౌలిక సధుపాయాల కల్పన వల్ల ప్రభుత్వానికి ఆస్తులు సృష్టించుకునే అవకాశం ఏర్పడుతుందని అన్నారు. ఇటీవల ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్ అన్ని వర్గాలు అభివృద్ధి చెందే విధంగా ఉందని నిర్మలా సీతారామన్ ఆశాభావం వ్యక్తం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment