తెలుగు ప్రజలకు ఇది దుర్దినం | this is very bad day for telugu people, says vasireddy padma | Sakshi
Sakshi News home page

తెలుగు ప్రజలకు ఇది దుర్దినం

Published Mon, May 25 2015 6:49 PM | Last Updated on Wed, May 29 2019 3:19 PM

తెలుగు ప్రజలకు ఇది దుర్దినం - Sakshi

తెలుగు ప్రజలకు ఇది దుర్దినం

ఆంధ్రప్రదేశ్ రాజధాని మాస్టర్ప్లాన్ను సింగపూర్ మంత్రి విడుదల చేయడం బాధాకరమని వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ అన్నారు. ఈరోజు తెలుగుప్రజలకు దుర్దినమని ఆమె వ్యాఖ్యానించారు. మాస్టర్ ప్లాన్ రూపొందించుకోలేని దీనస్థితిలో తెలుగు ప్రజలున్నారా అని ప్రశ్నించారు. పరిపాలన కూడా సింగపూర్కో, జపాన్కో ఇచ్చేయాలని ఎద్దేవా చేశారు.

ఇక్కడివారితో మాస్టర్ ప్లాన్ రూపొందించాల్సింది పోయి విదేశీ సంస్థలతో రూపొందించడం ఏంటని నిలదీశారు. పేరుకే అమరావతి కానీ, మేడిన్ సింగపూర్లా తయారుచేశారని ఆమె మండిపడ్డారు. ఇంతకన్నా దౌర్భాగ్యం ఏమైనా ఉంటుందా అని వాసిరెడ్డి పద్మ నిలదీశారు. మాస్టర్ ప్లాన్ వెనుక మీ ఎజెండా ఏంటో బయటపెట్టాలని ఆమె అన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement