బీజేపీ డిమాండ్
సాక్షి, హైదరాబాద్: హెచ్‌ఎం డీఏ మాస్టర్ ప్లాన్‌ను పునస్సమీక్షించాలని బీజేపీ డిమాండ్ చేసింది. ఈ మాస్టర్‌ప్లాన్ బడాబాబులు, రియల్ ఎస్టేట్ వ్యాపారులకు తప్ప రైతులకు ఏమాత్రం అనుకూలంగా లేదని ధ్వజమెత్తిం ది. హెచ్‌ఎండీఏ, స్థానిక సంస్థల మధ్య సమ న్వయం ఉండాలని, హెచ్‌ఎండీఏ ఆదాయం లో కనీసం సగం స్థానిక సంస్థలకు కేటాయిం చాలని కోరింది. నగరానికి మణిహారంగా ఉన్న ఔటర్ రింగ్‌రోడ్డును మరింత మెరుగ్గా తీర్చిదిద్దేందుకు అవసరమైన చర్యలు తీసు కోవాలని సూచించింది.
ప్రధాన రింగ్‌రోడ్డు, సర్వీసు రోడ్లకు వెంటనే మరమ్మతులు చేపట్టా లని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎస్.మల్లారెడ్డి మంగళవారం డిమాండ్ చేశారు. ఔటర్ రింగ్‌రోడ్డుపై టోల్ వసూలు పెంపుదల ప్రతి పాదనను ఉపసంహరించుకోవాలన్నారు. అన్ని రేడియల్ రోడ్లను పూర్తిచేయాలని, నాలుగేళ్లుగా నత్తనడకన సాగుతున్న జీడిమెట్ల–సారగూడ రేడియల్ రోడ్డు పనులు యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలని విజ్ఞప్తి చేశారు. సమావేశంలో పలు జిల్లాల అధ్యక్షులు పాల్గొన్నారు.