demanding
-
జైలులో బీడీలు, గుట్కా ఇవ్వాలని ఖైదీల డిమాండు
దొడ్డబళ్లాపురం: బీడీలు, గుట్కా ఇవ్వాలని డిమాండు చేస్తూ కలబుర్గి జైలులో ఖైదీలు ధర్నా చేశారు. ఇటీవల జైలులో అన్నీ నిలిపివేసారని ముస్తఫా అనే ఖైదీ ఆధ్వర్యంలో సుమారు 70 మంది ధర్నా చేసినట్లు తెలిసింది. కొత్తగా వచ్చిన జైలు అధికారి అనిత లంచం అడిగారని ముస్తఫా ఒక మహిళ ద్వారా ప్రభుత్వానికి ఫిర్యాదు ఇప్పించాడు. డబ్బులు ఇస్తేనే పొగాకు, గుట్కాలను అనుమతిస్తానని ఆమె స్పష్టం చేసిందన్నారు. అతడు, మిగతా ఖైదీలు తనను బ్లాక్మెయిల్ చేస్తున్నారని జైలర్ అనిత సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశారు. అతడు సోదరితో మాట్లాడిన ఆడియోలో తనకు బెదిరింపులు ఉన్నాయని అనిత చెబుతున్నారు. గుట్కా తదితరాలను అడ్డుకోవడంతో తనపై కక్ష గట్టారని ఆమె చెప్పారు. -
బిల్లులు ఇస్తారా.. చావమంటారా?
కరీంనగర్: ‘గ్రామాభివృద్ధిలో పాలుపంచుకోవడం, అప్పులు తెచ్చి పనులు చేయడమే తప్పా. తక్షణమే మా బిల్లులు చెల్లించండి’అంటూ మాజీ సర్పంచ్‌లు సోమవారం కరీంనగర్ కలెక్టరేట్ ఎదుట ఆందోళన చేపట్టారు. పెండింగ్ బిల్లులు మంజూరు చేయాలంటూ మాజీ సర్పంచులు దశలవారీగా కలెక్టరేట్ వద్దకు చేరుకుని ప్లకార్డులతో నిర్వహించిన ప్రదర్శన ఉద్రిక్తతకు దారి తీసింది. ఉదయం నుంచే పోలీసులు ప్రధాన గేట్ వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేసి ప్రజావాణికి వచ్చే వారిని సైతం క్షుణ్ణంగా పరిశీలిస్తూ లోపలికి పంపించారు.మాజీ సర్పంచ్‌లు దఫదఫాలుగా బృందాలుగా ఏర్పడి ప్రధాన గేట్ ముందుకు చొచ్చుకురావడంతో పోలీసులు ఎక్కడికక్కడ అరెస్టులు చేసి పీటీసీ సెంటర్‌కు తరలించారు. తాజా మాజీ సర్పంచ్‌లు పంజాల జగన్మోహన్గౌడ్, శ్రీధర్, సమ్మయ్య, మల్లారెడ్డి తదితరులు మాట్లాడుతూ, గత ప్రభుత్వ హయాంలో చేపట్టిన పనుల బిల్లులు ఏడాదిగా మంజూరు చేయకపోవడంతో ఇక్కట్లు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది గడిచినా బిల్లుల మంజూరు చేయకపోవడం బాధాకరమన్నారు. బిల్లులు ఇవ్వకపోతే చావే శరణ్యమన్నారు. -
రోడ్డు వేస్తేనే.. ఓట్లు వేస్తాం.. లేదంటే ఎన్నికల బహిష్కరనే
నిర్మల్: తమ గ్రామానికి రోడ్డు వేస్తేనే వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఓట్లు వేస్తామని, లేదంటే ఎన్నికలను బహిష్కరిస్తామని మండలంలోని గంగాపూర్, రానిగూడ, కొర్రతండా జీపీల పరిధిలోని 12 గ్రామాల ప్రజలు నిర్ణయించారు. ఆయా గ్రామాల నుంచి కడెం వరకు పాదయాత్రగా వచ్చేందుకు ప్రజలు యత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో గంగాపూర్ గ్రామ సమీపంలోని వాగు వద్ద నిరసన తెలిపారు. నాయకులు, ప్రభుత్వాలు మారుతున్నా తమ ఊళ్ల రాతలు మారడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. తమ గ్రామానికి పక్కా రోడ్డు సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు. లేకుంటే ఎన్నికలను బహిష్కరిస్తామని తెలిపారు. గ్రామాల్లోకి అధికారులను, నాయకులను కూడా రానివ్వమని హెచ్చరించారు. మూడు గ్రామ పంచాయతీల కార్యదర్శులు, పాఠశాలల ఉపాధ్యాయులు ఇక నుంచి విధులకు రావొద్దని తెలిపారు. నిరసనలో గంగాపూర్, రానిగూడ, కొర్రతండా సర్పంచులు శాంత, భీంబాయి, సదర్లాల్, నాయకులు చంద్రహాస్, ఆనంద్‌రావు తదితరులు పాల్గొన్నారు. -
పునీత్‌కు పద్మ శ్రీ ఇవ్వాల్సిందే !!
బెంగళూరు: ఇటీవల మరణించిన కన్నడ సినీ నటుడు పునీత్ రాజ్‌కుమార్‌కు మరణానంతరం 'పద్మశ్రీ' అవార్డు వచ్చే విధంగా కేంద్ర ప్రభుత్వానికి సిఫార్సు చేయండి అంటూ కర్ణాటక ప్రభుత్వంలోని ఇద్దరు మంత్రలు కర్ణాటక రాష్ట్ర ముఖ్యమంత్రిపై పెద్ద ఎత్తున ఒత్తిడి తీసుకువస్తున్నారు. (చదవండి: ట్యాక్సీల్లో వాళ్లను తప్ప ఇంకెవ్వరని ఎక్కించుకుని తీసుకురావద్దు!) కన్నడ సూపర్‌స్టార్ ఇటీవల అక్టోబర్ 29న 46 ఏళ్ల వయసులో గుండెపోటుతో మరణించిన సంగతి తెలిసిందే. ఈ మేరకు కర్ణాటక వ్యవసాయ శాఖ మంత్రి బీసీ పాటిల్ మాట్లాడుతూ" పునీత్ రాజ్‌కుమార్ జీవించి ఉన్నప్పుడే ఆయనకు పద్మశ్రీ అవార్డు ఇచ్చి ఉండాల్సిందని, అయితే దురదృష్టవశాత్తు ఆయన భౌతికంగా మన మధ్య లేకపోవడంతో మరణానంతరం ఇవ్వాల్సిందే. నేను అతని అభిమానినే. పునీత్‌కి నటుడిగానే కాకుండా, సమాజానికి అందించిన సేవల కోసమైన ఇవ్వాల్సిందే. పైగా అతనికి ఆ అర్హత ఉంది. అని అన్నారు. అంతేకాదు పర్యాటక శాఖ మంత్రి ఆనంద్‌సింగ్ మాట్లాడుతూ.. 'పునీత్ రాజ్‌కుమార్ మానవాళికి సేవ చేయాలనే మనస్తత్వం ఉన్న వ్యక్తి, నేను సామాజిక సేవలో ఉన్నప్పుడు పల్స్ పోలియో వంటి అనేక ప్రజా సంక్షేమ కార్యక్రమాల్లో మాతో కలిశాడు. ఆయనకు పద్మశ్రీని ఇవ్వాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని డిమాండ్ చేయాలి " అని అన్నారు. అయితే ఇటీవల కర్ణాటక రాష్ట్ర ప్రతిపక్ష కాంగ్రెస్ నేత సిద్ధరామయ్య.. పునీత్‌కు మరణానంతరం పద్మశ్రీ ప్రదానం చేయాలని ప్రధాని నరేంద్ర మోదీని ట్విట్టర్లో కోరిన సంగతి తెలిసిందే. ఈ మేరకు కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై మాట్లాడుతూ... “పద్మ అవార్డులకు ఎప్పుడు, ఏ రంగాల వ్యక్తులను సిఫారసు చేయాలనే దానిపై కొన్ని నియమాలు ఉన్నాయి. ఇది ఒక విధంగా పునీత్ రాజ్‌కుమార్‌కు ఏకగ్రీవ సిఫార్సు అవుతుందేమో. ఏదిఏమైన ప్రభుత్వ పరంగా అన్నీ విషయాలు పరిశీలించి సరైన నిర్ణయం తీసుకుంటాం’ అని అన్నారు. (చదవండి: విచిత్రమైన వంటకం...అదే ఏం పకోడి రా బాబు!) -
వ్యవసాయాధికారి బాగోతం.. ముడుపుల కోసం ఏకంగా వాట్సాప్ గ్రూప్..
సాక్షి, చండ్రుగొండ (ఖమ్మం): షాపుల్లో తనిఖీచేయకుండా ఉండేందుకు లంచం డిమాండ్ చేసిన మండల వ్యవసాయాధికారి(ఏఓ) వ్యాపారుల నుంచి డబ్బు తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు. చండ్రు గొండలో సోమవారం ఈ సంఘటన జరిగింది. ఏసీబీ డీఎస్పీ ఎస్వీ రమణమూర్తి తెలిపిన వివరాలిలా ఉన్నాయి. ఫర్టిలైజర్, పెస్టిసైడ్ షాపుల్లో తనిఖీచేయకుండా ఉండేందుకు ఏఓ ఎన్ఎంసీ.చటర్జీ ప్రతీ షాపు నుంచి రూ.15 వేలు లంచం ఇవ్వాలని డిమాండ్ చేశాడు. ప్రతి నెల లంచం కోసం ఒక వాట్సప్ గ్రూప్‌నే ఏర్పాటు చేశాడు. దీంతో డీలర్లు గోదా సత్యం,ఎర్రం సీతారాములు, చెవుల చందర్రావు, నన్నక వెంకటరామయ్య, ముఖేష్, మచ్చా కుమార్ గతనెల 30వ తేదీన ఏసీబీని ఆశ్రయించారు. ఈ మేరకు విచారించిన అధికారులు వాస్తవవమేనని నిర్ధారించుకున్నారు. ఈ సందర్భంగా అధికారుల సూచన మేరకు డీలర్లు గోదా సత్యం, ఎర్రం సీతారాములు మండల కేంద్రంలోని రైతువేదిక ఆవరణలో ఏఓ చటర్జీకి రూ.90 వేలు లంచం ఇస్తుండగా ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకు న్నారు. కాగా, ఏఓ చటర్జీ స్థానికంగా తనకు తెలిసిన వ్యక్తితో పురుగు మందులు, విత్తనాల షాపు పెట్టించి రైతులందరినీ అదే షాపులో కొనాలని సూచిస్తన్నాడనే ఆరోపణలున్నాయి. ఏఓ నివాసంలో సోదాలు చండ్రుగొండ ఏఓ చటర్జీ స్వగ్రామమైన అశ్వారావుపేటలో కూడా అధికారులు సోదాలు చేశారు. ఖమ్మం ఏసీబీ ఇ¯న్స్పెక్టర్ రఘుబాబు ఆధ్వర్యంలో తనిఖీలు చేపట్టి పలు డాక్యుమెంట్లు, బంగారు అభరణాలు సీజ్ చేశారు. -
‘లక్ష అకౌంట్లో వేస్తేనే న్యాయం ’.. ఓ కేసులో ఎస్సై!
నిజామాబాద్: నిజామాబాద్‌లోని మహిళా పోలీస్‌స్టేషన్‌లో ఎస్సై నారాయణ డబ్బులు ఇవ్వాలని తనను డిమాండ్ చేసి వేధిస్తున్నాడని ఓ మహిళ ఆరోపించారు. దీనికి సంబంధించిన ఆడియోక్లిప్‌ను ఆమె ప్రెస్‌క్లబ్‌లో గురువారం విడుదల చేశారు. వివరాలు.. నిజామాబాద్‌కు చెందిన ఓ మహిళకు సంగారెడ్డి జిల్లాకు చెందిన ఘట్కేసర్కు చెందిన వ్యక్తికి వివాహం అయ్యింది. తన భర్త, అత్తింటి వారు తనను అదనపు కట్నంకోసం వేధిస్తున్నారని సదరు మహిళ ఆరోపించారు. దీనిపై ఐదునెలల క్రితం మహిళా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. కేసు గురించి ఎస్పై నారాయణను ఇటీవల సంప్రదించగా రూ.లక్ష ఇవ్వాలని డిమాండ్ చేశారని ఆమె ఆరోపించారు. ‘రూ. లక్ష నా బ్యాంక్ అకౌంట్లో వేస్తే నీకు న్యాయం చేస్తా’ అంటూ ఎస్సై చెప్పినట్లు ఉన్న ఆడియో టేప్‌ను ఆమె బయటపెట్టింది. ఎస్సైతో పాటు మరికొందరు పోలీసులు డబ్బులు అడిగినట్లు ఆమె ఆరోపించారు. దీనిపై సదరు మహిళ సీపీకి ఫిర్యాదు చేస్తామన్నారు. -
నిలదీయడమే నేరం!
వేదిక ఏదని కాదు, సందర్భం ఏమిటని కాదు... చుట్టూ జరుగుతున్న అన్యాయా లపై అసమ్మతిని వ్యక్తం చేయడం, నిరసన గళాన్ని వినిపించడం తమ కర్తవ్యంగా భావించేవారు ఎప్పుడూ ఉంటారు. లాస్ ఏంజెలస్‌లో సోమవారం అత్యంత వైభ వంగా జరిగిన ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవంలో ఉత్తమ విదేశీ చిత్రానికి బహు మతి గెల్చుకున్న ఇరాన్ దర్శకుడు అస్ఘర్ ఫర్హాదీ చేసింది ఇదే. అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ అనుసరిస్తున్న విధానాలకు నిరసనగా ఆ కార్యక్రమాన్ని బహిష్కరి స్తున్నానన్న సందేశాన్ని పంపి అస్ఘర్ అందరినీ దిగ్భ్రమపరిచారు. జీవితంలో ఒక్క సారైనా ఆస్కార్ అవార్డు సొంతం చేసుకోవాలని... దాన్ని ఆ వేదికపై నుంచే వేలాదిమంది హర్షధ్వానాలమధ్య అందుకోవాలని సినీ ప్రపంచంలోని సృజ నాత్మక దిగ్గజాలు ప్రగాఢంగా ఆశిస్తారు. కానీ తన నిరసనను బలంగా విని పించడానికి ఆ ఉత్సవం బహిష్కరణే ఏకైక మార్గమని అస్ఘర్ భావించారు. ఆయన వ్యక్తం చేసిన నిరసన కొన్నేళ్లక్రితం జాతీయ చలనచిత్ర బహుమతుల ప్రదా నోత్సవ వేదికపై ప్రముఖ నటీమణి షబనా అజ్మీ వినిపించిన నిరసన గళాన్ని స్ఫురణకు తెచ్చింది. ఇందిరాగాంధీ హత్య అనంతరం దేశ రాజధాని వీధుల్లో హంతక ముఠాలు చెలరేగి సిక్కులను ఊచకోత కోసిన అమానుషంపై ఆమె నిప్పులు చెరిగారు. వేదికపై ఉన్న కేంద్రమంత్రులను నిలదీశారు. ప్రజల పక్షాన అలా నిలదీయగలిగిన సినీ దిగ్గజా లను ఇప్పుడైతే ఊహించగలమా? ఎక్కడివరకో అవసరం లేదు.. అదే ఆస్కార్ వేది కపై మెరిసిన బాలీవుడ్ నటీమణి ప్రియాంక చోప్రా అంతకు రెండు రోజుల ముందే శ్రీనివాస్ కూచిభొట్లను పొట్టనబెట్టుకున్న జాత్యహంకార ఉన్మాదం గురించి ఒక్క మాట కూడా మాట్లాడలేకపోయారు. భిన్న రంగాల్లో సెలబ్రిటీలుగా ఉన్నవారు దేశాన్ని వేధిస్తున్న సమస్యలపై, సాధారణ పౌరుల వెతలపై మాట్లాడాలని కోరుకోవడం ఇప్పుడున్న పరిస్థితుల్లో అత్యాశ. పైగా ఒక రంగంలో నిష్ణాతులైనంత మాత్రాన అన్ని విషయాల్లో వారికి అవగాహన ఉంటుందని, ఉండాలని భావించనవసరం లేదు. కానీ ఢిల్లీ రాంజాస్ కళాశాల కేంద్రంగా చెలరేగిన వివాదంలో మాత్రం కొందరు సెలబ్రిటీలు తలదూ ర్చారు. సామాజిక మాధ్యమం వేదికగా విపరీత వ్యాఖ్యలకు దిగారు. కార్గిల్ అమర వీరుడి కుమార్తె, ఢిల్లీ యూనివర్సిటీ విద్యార్థిని గుర్మెహర్ కౌర్‌ను లక్ష్యంగా చేసుకుని ఈ దాడులు సాగాయి. చివరకు తమ ఉద్దేశం అది కాదంటూ వారంతా పలాయనం చిత్తగించారు. వివిధ సామాజిక సమస్యలపైనా, వాటి పరిష్కారాల పైనా భిన్నాభిప్రాయాలుండటం నేరం కాదు. ఈ విషయంలోనే గుర్మెహర్ కౌర్ ధ్వజమెత్తారు. రాంజాస్ కళాశాలలో వారం క్రితం జరగాల్సిన సెమినార్‌ను అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ (ఏబీవీపీ) భగ్నం చేయడంతో పాటు విద్యార్థులపై, అధ్యాపకులపై దాడులకు దిగడాన్ని నిరసిస్తూ సామాజిక మాధ్యమంలో ప్లకార్డుతో ఉన్న తన ఫోటోను పెట్టారు. ఆ ప్లకార్డుపై ఏబీవీపీకి అభ్యంతరాలుంటే ఉండ వచ్చు. ఆమె వాదన తప్పని నిరూపించడానికి ప్రయ త్నిస్తే కాదనేవారెవరూ ఉండరు. కానీ ఇందులో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి రిజిజు ఎందుకు జోక్యం చేసుకోవాల్సి వచ్చిందో అర్ధంకాదు. పైగా ఆమె గతంలో భారత్–పాక్ ఉద్రిక్తతలపై పెట్టిన వీడియోను రీపోస్ట్ చేస్తూ ‘ఈ అమ్మాయి బుర్రను పాడుచేస్తున్నది ఎవరు?’ అంటూ వ్యాఖ్యానించాల్సిన అవసరమేమిటో తెలియదు. ప్రస్తుతం సామాజిక మాధ్యమంలో రేగిన వివాదమంతటికీ ఆ వ్యాఖ్యే మూలం. ఇదే అదునుగా దుండగులు కొందరు గుర్మెహర్ను అసభ్య పద జాలంతో దూషించడం, అత్యాచారం చేస్తామని, చంపేస్తామని హెచ్చరించడం ప్రారంభించారు. ఢిల్లీలో మూడేళ్లక్రితం నిర్భయకు పట్టిన గతే పడుతుందని బెదిరించారు. హోంశాఖను చూస్తున్న మంత్రిగా రిజిజు ఇలాంటి విపత్తును ఊహించాలి. సామాజిక మాధ్యమాల్లో మహిళలను కించపరుస్తూ, బెదిరిస్తూ దుండగులు ఎలా చెలరేగుతుంటారో ఆయనకు తెలియనిదేమీ కాదు. ప్రస్తుత అంశంతో సంబంధంలేని ఒక అంశాన్ని రీపోస్ట్ చేయడంలో ద్వారా ఆయన సాధించిందేమిటి? రాంజాస్ కళాశాల వ్యవహారంలో ఆమె తీసుకున్న వైఖరి బల హీనపడుతుందనుకున్నారా? గుర్తు తెలియని దుండగుల బెదిరింపులు, హెచ్చరికల మాట అలా ఉంచి, క్రికె టర్ వీరేంద్ర సెహ్వాగ్, రెజ్లర్ యోగేశ్వర్‌దత్, బీజేపీ ఎంపీ ప్రతాప్ సింహ్లాంటి వారు గుర్మెహర్ వీడియోపై చేసిన వ్యాఖ్యలు వారి అజ్ఞానానికీ, అవగాహన లేమికీ అద్దంపట్టాయి. ‘మా నాన్నను చంపింది పాకిస్తాన్ కాదు... యుద్ధం’ అంటూ ఆమె చూపించిన ప్లకార్డును హేళన చేస్తూ ‘నేను ట్రిపుల్ సెంచరీలు చేయలేదు. వాటిని నా బ్యాట్ చేసింది’ అంటూ ఉన్న ప్లకార్డుతో ఉన్న ఫోటోను వీరూ ట్వీట్ చేస్తే... దాన్ని అనుకరిస్తూ కొందరు, సమర్థిస్తూ కొందరు ట్వీట్లు చేశారు. కొందరు ప్రబుద్ధులు దావూద్ ఇబ్రహీంతో, హిట్లర్‌తో, లాడెన్‌తో కూడా పోలిక తెచ్చారు. తాను చదువుకుంటున్న యూనివర్సిటీలో భావ ప్రకటనా స్వేచ్ఛకు అడ్డంకులు కల్పించ డాన్ని నిరసిస్తూ ధైర్యంగా తన వైఖరిని ప్రకటించిన ఇరవైయ్యేళ్ల యువతికి చేతనైతే దీటైన సమాధానం ఇవ్వగలగాలి. ఆమె అవగాహన తప్పని రుజువు చేయాలి. అందుకు భిన్నంగా కించపరచడం, అవమానిం చాలని చూడటం వారి స్థాయికి తగనిది. శేఖర్ గుప్తాలాంటి పాత్రికేయులు, జావేద్ అఖ్తర్వంటి కవులు చీవాట్లు పెట్టాక వీరంతా వెనక్కి తగ్గారు. కానీ అప్పటికే గుర్మెహర్ను వారు మానసికంగా గాయపరిచారు. ‘20 ఏళ్లకే చాలా చవిచూశాను. నన్ను ఒంటరిగా విడిచిపెట్టండ’ ంటూ సామాజిక మాధ్యమంలో ఆమె పెట్టిన సందేశం ఇక్కడ నెలకొన్న వర్తమాన స్థితికి అద్దం పట్టింది. ఒక యువతి నోరు మూయించడానికి సాగిన ఇలాంటి చేష్టలు ఏవగింపు కలిగిస్తాయి. ఈ తరహా పోకడలను గట్టిగా ప్రతిఘటించకపోతే ఇవి మున్ముందు మరింత వెర్రితలలు వేస్తాయి. ఈ దేశంలో భావప్రకటనాస్వేచ్ఛను పరిరక్షించుకోవడానికి అందరూ కలిసికట్టుగా కదలాల్సిన అవసరం ఉన్నదని ఈ పరిణామాలు తెలియ జెబుతున్నాయి. -
డబ్బు దండుతున్న జన్మభూమి కమిటీలు
బోట్‌క్లబ్ (కాకినాడ సిటీ): జన్మభూమి కమిటీ సభ్యులు ప్రజల నుంచి డబ్బు దండుకుంటున్నారని, ప్రభుత్వ పథకాలు అనర్హులకు అందిస్తున్నారని బీజేపీ జిల్లా అధ్యక్షుడు ఎనిమిరెడ్డి మాలకొండయ్య ఆవేదన వ్యక్తం చేశారు. కాకినాడ ఆర్అండ్బీ అతిథిగృహంలో మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. జన్మభూమి కమిటీ సభ్యులు దళారులుగా తయారయ్యారన్నారు. పిఠాపురంలో పింఛన్లు, కాకినాడ కార్పొరేషన్లో వ్యక్తిగత మరుగుదొడ్లు అనర్హులకు అందించిన విషయం ఇప్పటికే బయట పడిందన్నారు. కేంద్ర ప్రభుత్వ పథకాల్లో సైతం కమిటీల పెత్తనం ఏమిటని ప్రశ్నించారు. నిజమైన లబ్ధిదారులకు అందాల్సిన పథకాలు కమిటీల కారణంగా పక్కదోవ పడుతున్నాయన్నారు. కాకినాడలో ఇష్టానుసారంగా కార్పొరేషన్ స్థలాలు ఆక్రమించి భవనాలు నిర్మించుకుంటున్న వారికి అధికారులు అనుమతులు ఇస్తున్నారన్నారు. ఇటీవల రూ.రెండుకోట్ల స్థలం ఆక్రమణకు గురయిందని , కార్పొరేషన్ కమిషనర్‌కు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదన్నారు. మూడు సంవత్సరాలుగా కార్పొరేషన్ నిధులు పక్కదారి పట్టాయని, కలెక్టర్, కార్పొరేషన్ ప్రత్యేక అధికారి అరుణ్‌కుమార్ ఈ విషయంపై విచారణ చేపట్టాలని , వెంటనే బాధ్యుడైన కమిషనర్‌ను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. కాకినాడకు కేంద్ర ప్రభుత్వం 4,600 ఇళ్లు మంజూరు చేసిందని, ఇప్పటివరకూ ఎంతమంది లబ్ధిదారులను ఎంపిక చేశారో అ«ధికారులు చెప్పడం లేదన్నారు. కార్పొరేషన్లో ప్రతి విభాగంలోను అవినీతి పేరుకుపోయిందన్నారు. వెంటనే విచారణ చేపట్టి అధికారులపై చర్యలు తీసుకోవాలని లేకుంటే అవినీతికి వ్యతిరేకంగా పెద్దఎత్తున ఉద్యమం చేపడతామన్నారు. జిల్లాలోని పలు ప్రాంతాల్లో నిర్మిస్తున్న పరిశ్రమల్లో స్థానికులకు ఉద్యోగ అవకాశాలు ఇవ్వడం లేదన్నారు. బీజేపీ నగర అధ్యక్షుడు పెద్దిరెడ్డి రవికిరణ్, మహిళామోర్చా నాయకురాలు కోరాడ లక్ష్మీతులసి పాల్గొన్నారు. -
హెచ్ఎండీఏ మాస్టర్‌ప్లాన్ పునస్సమీక్షించాలి
బీజేపీ డిమాండ్ సాక్షి, హైదరాబాద్: హెచ్ఎం డీఏ మాస్టర్ ప్లాన్‌ను పునస్సమీక్షించాలని బీజేపీ డిమాండ్ చేసింది. ఈ మాస్టర్‌ప్లాన్ బడాబాబులు, రియల్ ఎస్టేట్ వ్యాపారులకు తప్ప రైతులకు ఏమాత్రం అనుకూలంగా లేదని ధ్వజమెత్తిం ది. హెచ్ఎండీఏ, స్థానిక సంస్థల మధ్య సమ న్వయం ఉండాలని, హెచ్ఎండీఏ ఆదాయం లో కనీసం సగం స్థానిక సంస్థలకు కేటాయిం చాలని కోరింది. నగరానికి మణిహారంగా ఉన్న ఔటర్ రింగ్‌రోడ్డును మరింత మెరుగ్గా తీర్చిదిద్దేందుకు అవసరమైన చర్యలు తీసు కోవాలని సూచించింది. ప్రధాన రింగ్‌రోడ్డు, సర్వీసు రోడ్లకు వెంటనే మరమ్మతులు చేపట్టా లని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎస్.మల్లారెడ్డి మంగళవారం డిమాండ్ చేశారు. ఔటర్ రింగ్‌రోడ్డుపై టోల్ వసూలు పెంపుదల ప్రతి పాదనను ఉపసంహరించుకోవాలన్నారు. అన్ని రేడియల్ రోడ్లను పూర్తిచేయాలని, నాలుగేళ్లుగా నత్తనడకన సాగుతున్న జీడిమెట్ల–సారగూడ రేడియల్ రోడ్డు పనులు యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలని విజ్ఞప్తి చేశారు. సమావేశంలో పలు జిల్లాల అధ్యక్షులు పాల్గొన్నారు. -
మద్యం నియంత్రణకు చర్యలు చేపట్టాలి
ప్రభుత్వానికి బీజేపీ డిమాండ్ సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో విచ్చలవిడి మద్యం అమ్మకాల నియంత్రణకు వెంటనే చర్యలు తీసుకోవాలని బీజేపీ డిమాండ్ చేసింది. ప్రభుత్వపరంగా పది రోజుల్లో కఠిన చర్యలు తీసుకోకపోతే రాష్ట్రవ్యాప్త ఉద్యమానికి సిద్ధం కానున్నట్లు హెచ్చరించింది. సోమవారం బీజేపీ మహిళా మోర్చా ఆధ్వర్యంలో ఇందిరా పార్కువద్ద నిర్వహించిన ధర్నాలో పెద్ద సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు. పార్టీ అధ్యక్షుడు కె.లక్ష్మణ్ మాట్లాడుతూ.. బెల్ట్ షాపులను వెంటనే తొలగించాలని.. బడి, గుడి, కళాశాలల సమీపంలోని దుకాణాలను ఎత్తేసేందుకు చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మద్యంపై పన్నులు, లైసెన్స్‌ల ద్వారా ప్రభుత్వానికి రూ.14 వేల కోట్లు సమకూరుతున్నాయని, మొత్తం రూ.35 వేల కోట్ల మద్యం అమ్మకాల్లో రూ.30 వేల కోట్లు పేదలే కొనుగోలు చేస్తున్నారన్నారు. ప్రజల వద్దకు పాలన ఏమోగాని ప్రజల మధ్యకు మద్యాన్ని ఎంతో శ్రద్ధగా ప్రభుత్వం సరఫరా చేస్తోందన్నారు. హైదరాబాద్‌లో 15 గంటల పాటు బార్లు, మద్యం షాపులు తెరిచి ఉండటంతో, రోజుకు 30వేల మంది విద్యార్థులు కాలేజీలు మాని అక్కడే ఉంటున్నారన్నారు. మద్యం నియంత్రణకు వెంటనే చర్యలు తీసుకోకపోతే మహిళల ఆగ్రహానికి గురికావా ల్సి వస్తుందని మహిళా మోర్చా అధ్యక్షురాలు ఆకుల విజయ హెచ్చరించారు. -
ఎస్సీ, ఎస్టీల సంక్షేమానికి రూ.15 వేల కోట్లు ఇవ్వాలి
వైఎస్సార్ కాంగ్రెస్ తెలంగాణ డిమాండ్ సాక్షి, హైదరాబాద్: వచ్చే బడ్జెట్లో ఎస్సీ, ఎస్టీ వర్గాల సంక్షేమానికి రూ.15 వేల కోట్లు కేటాయించి, ఈ నిధులు పక్కదారి పట్టకుండా పూర్తిగా ఖర్చు చేయాలని వైఎస్సార్ కాంగ్రెస్ తెలంగాణ డిమాండ్ చేసింది. రాష్ట్రంలో సబ్‌ప్లాన్ అమలు అధ్వానంగా ఉందని కేంద్ర మంత్రి రాందాస్ అథవాలే ఇటీవల అసంతృప్తి వ్యక్తం చేసిన నేపథ్యంలో.. కంటి తుడుపు చర్యగా టీఆర్ఎస్ ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ అమలుకు కమిటీలు వేసిందని పేర్కొంది. తెలం గాణ ఏర్పడి 31 నెలలు గడుస్తున్నా ఎస్సీ, ఎస్టీ వర్గాలకు న్యాయం జరగలేదని ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బోయినిపల్లి శ్రీనివాస్‌రావు శనివారం ఒక ప్రకటనలో విమర్శించారు. మూడేళ్లుగా ఈ వర్గాలకు కేటాయించిన బడ్జెట్లో సగం కూడా ఖర్చు చేయలేదన్నారు. హక్కుల కోసం పోరాడిన దళితులు, గిరిజనులు.. వాటి అమలు కోసం మరో పోరాటం చేయాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. రాష్ట్రవ్యాప్తంగా భూమి లేని దళిత కుటుంబాలు 1.5 లక్షల వరకు ఉండగా, రెండున్న రేళ్లలో కేవలం 3,671 కుటుంబాలకు 9,663 ఎకరాల భూపంపిణీ మాత్రమే జరిగిందన్నారు. ఈ ఏడాది నిధులు ఖర్చు కాకపోతే వాటిని క్యారీ ఫార్వర్డ్ చేసి వచ్చే బడ్జెట్లో మిగులుగా చూపించాలని.. అయితే ఈ ప్రభుత్వం ఆ నిధులను ఇతర పథకాలకు తరలిస్తోందని చెప్పారు. అసెంబ్లీలో అన్ని అంశాలను స్వయంగా వివరించిన సీఎం కేసీఆర్ సబ్‌ప్లాన్‌పై చర్చలో మాత్రం పాల్గొనకపోవడాన్ని బట్టి ఎస్సీ, ఎస్టీల విషయంలో ఆయన వైఖరి ఏమిటో స్పష్టమవుతోందని విమర్శించారు. -
‘చుక్క’ల అంగళ్లపై.. సొంత సుంకం
బ్రాందీ షాపులతో ప్రజాప్రతినిధుల దందా ప్రతి దుకాణం నుంచీ రూ.లక్షలు వసూలు ‘సీనియర్, జూనియర్’ తేడా లేకుండా దండుడు విరాళాల మాటున రసీదులూ ఇచ్చిన ఓ నేత వాటాల కోసం ‘అనాయాస’ నేతల ఆరాటం ‘ఎంకి పెళ్లి.. సుబ్బి చావుకు’లా నిషాజీవులపై భారం సాక్షి, రాజమహేంద్రవరం : ‘కాదేదీ కవితకు అనర్హం’ అని కవి అంటే మన ప్రజా ప్రతినిధులు దానికి కొంచెం మార్చి ‘కాదేదీ కలెక్షన్ కు అనర్హం’ అంటున్నారు. కాంట్రాక్టులు, ఇసుక రవాణా, మద్యం వ్యాపారం.. ఇలా ప్రతి దాంట్లో తమ మామూళ్లు దండుకుంటున్నారు. ఇవ్వకుంటే ఎక్కడ తమ పని, వ్యాపారం సక్రమంగా జరగనివ్వరోనన్న భయంతో వ్యాపారులు కిమ్మనకుండా అడిగినంతా సమర్పించుకుంటున్నారు. రాజమహేంద్రవరం నగర, రూరల్ నియోజకవర్గాల్లో కొందరు ప్రజా ప్రతినిధులు తమ నుంచి లక్షలకు లక్షలు గుంజినట్టు మద్యం వ్యాపారులు చెపుతున్నారు. ‘ఎన్నికల్లో రూ. 15 కోట్లు ఖర్చయింది. అదంతా రాబట్టుకోవాలి కదా’ అంటూ ఓ సీనియర్ నేత మామూళ్ల వసూళ్లకు శ్రీకారం చుట్టారు. ఇప్పటికే ఆయన ఇసుక రవాణాలో ప్రత్యేక ‘రుసుము’ వసూలు చేస్తున్నారన్న ఆరోపణలున్నాయి. తమ పార్టీ ‘ముఖ్యనేత’ కంటే సీనియర్‌ననే ఆ నేత మామూళ్ల వసూళ్లలో కూడా ముఖ్యనేతను మించిపోయారని అనుచరులు వ్యాఖ్యానిస్తున్నారు. నగర, రూరల్ నియోజకవర్గాల్లో 15 బార్లు, 23 మద్యం దుకాణాలు ఉన్నాయి. ఒక్కో దుకాణం నుంచి సదరు సీనియర్ నేతకు రూ. లక్ష చొప్పున చేరినట్లు సమాచారం. ఈ మధ్య ఇసుక దందాపై ఆ నేతను ముఖ్యనేత పిలిచి ‘క్లాస్’ తీసుకున్నట్లు పార్టీ వర్గాల్లో చర్చ నడుస్తోంది. అయినా ముఖ్యనేతే రూ. వందల కోట్లలో ముడుపులు తీసుకుంటున్నప్పుడు తాను రూ. లక్షల్లో తీసుకుంటే తప్పేంటన్నట్లుగా ఆ ‘సీనియర్ నేత’ తన దారిలో ‘ముందుకు’ పోతూనే ఉన్నారంటున్నారు. కొత్త అయినా.. సరికొత్త పంథాలో.. కొత్తగా ఎన్నికైన మరో నేత మామూళ్ల వసూళ్లలో సరికొత్తగా వ్యవహరిస్తూ అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తున్నారు. ప్రజా ప్రతినిధిగా అన్ని వ్యవహారాలనూ వ్యాపార పంథాలోనే ‘చక్క’బెడుతూ సీనియర్ నేతలకే పాఠాలు చెప్పగలనంటున్నారు. స్వచ్ఛంద సంస్థను స్థాపించి మరీ ‘విరాళాలు’ వసూలు చేస్తున్నారు. ఎవరైనా తనను అభినందిస్తూ ఇచ్చే విరాళాలు ఆ సంస్థ ఖాతాలో జమ చేస్తున్నారు. ‘విరాళాలు’ ఇచ్చిన వారికి ప్రత్యేకంగా రసీదులు కూడా ఇస్తున్నారు. అసలు మొదట మద్యం వ్యాపారుల నుంచి మామూళ్లు ఈ నేతే డిమాండ్ చేసినట్లు సమాచారం. ఆ నేతకు దుకాణాల వారీగా ‘విరాళాలు’ వెళ్లడంతోనే సీనియర్ నేత రంగంలోకి దిగారని, ’ఉభయ నియోజకవర్గాల్లోనూ నాదే ముఖ్య భూమిక’ అంటూ కన్నెర్ర జేశారని సమాచారం. స్టంట్లు చేస్తున్న అనాయాస నేతలు.. ఇద్దరు నేతలకూ మద్యం వ్యాపారుల నుంచి ముడుపు లు వెళ్లడంతో తామే తీసిపోయామా అని ‘అనాయాసం’ గా ప్రజాప్రతినిధులైన వారు వారి వాటా ల కోసం రం గంలోకి దిగారు. ‘ప్రత్యక్ష’ నేతలకే తప్ప మాకు ముడుపు లు ఇవ్వరా’ అంటూ రాయ‘బేరాలు’ నడిపారు. అప్పటికే రెండు నెలల ఆదాయాన్ని కోల్పోయిన మ ద్యం వ్యా పారులు ఇచ్చుకోలేమనడంతో తమ ధనాశకు జనప్రయోజనం ముసుగు తొడిగారు. వీరిలో ఒకరు మ ద్యం అధిక ధరలకు విక్రయిస్తున్నారంటూ, అరికట్టాలని పై అధికారులకు లేఖ రాస్తే మరొకరు ఎక్సైజ్ కార్యాల యం వద్ద ఏకంగా ఆందోళనే చేశారు. సదరు నేతలి ద్దరూ ఆ తర్వాత ఈ విషయాన్నే విస్మరించడానికి కా రణం.. వారి వాటాలు వారికి ముట్టడమేనంటున్నారు. ధర పెంచకతప్పదు.. ప్రజాప్రతినిధులు ఇలా ముడుపులు దండుకోవడంతో మద్యం వ్యాపారులు ఆ నష్టాన్ని భర్తీ చేసేందుకు ఒక్కొక్క బాటిల్‌పై రూ.10 చొప్పన అధికంగా తీసుకుంటున్నారు. ‘నేతలకు ముడుపులు ఇవ్వడంతో మూడు నెలల ఆదాయం కోల్పోయాం. ఇక నెలవారీగా అధికారులకు ఇచ్చే మామూళ్లు సరేసరి. ఇవన్నీ తట్టుకుని వ్యాపారం చేయాలంటే సరుకు ధర పెంచకుండా సాధ్యం కాదు’ అని ఓ మద్యం వ్యాపారి చెప్పారు. చేతనైతే జనం కన్నీరు తుడిచి, వారి జీవితాల్లో వెలుగు నింపాల్సిన వారు.. తమ స్వార్థం కోసం చివరికి ఇలా.. ఇల్లూ, ఒళ్లూ గుల్ల చేసుకుని, కుటుంబాలకు కటికచీకటిని మిగిల్చే నిషాజీవుల జేబులపై అదనపు భారం పడడానికి కారకులవడం ఎంత నీచం! -
రేవంత్ రెడ్డి రాజీనామా చేయాలని డిమాండ్
-
చేవెళ్లలో ప్రజాగ్రహం
జిల్లా కేంద్రం చేయాలంటూ స్థానికుల ఆందోళన చేవెళ్ల: రంగారెడ్డి జిల్లా చేవెళ్లను జిల్లా కేంద్రంగా చేయాలనే డిమాండ్‌తో అఖిలపక్ష నాయకులు, జిల్లా సాధన సమితి ఆధ్వర్యంలో చేపట్టిన రెండు రోజుల చేవెళ్ల బంద్ విజయవంతమైంది. పెద్ద సంఖ్యలో స్థానికులు ఆందోళనలో పాల్గొనడంతో జనజీవనం స్తంభించింది. హైదరాబాద్- బీజాపూర్, ముంబై - బెంగళూరు రహదారులను దిగ్బంధించడంతో వందలాది వాహనాలు గంటల తరబడి నిల్చిపోయారుు. ఇప్పటికే చేవెళ్లను జిల్లా కేంద్రం చేయాలని ఆందోళన చేస్తున్న స్థానికుల్లో మొరుునాబాద్, శంకర్పల్లి, షాబాద్ మండలాలను శంషాబాద్ జిల్లాలో కలపాలనే ప్రభుత్వ నిర్ణ యం ఆగ్రహాన్ని పెంచింది. బంద్ సందర్భంగా బస్సులు నడవలేదు. ప్రధాన రహదారుల కూడళ్ల వద్ద కనీసం బైక్‌లను సైతం వెళ్లనివ్వలేదు. మిషన్ భగీరథ పైపులను రోడ్డుకు అడ్డంగా ఉంచి వాహనాలను అడ్డుకున్నారు. రహదారులపై టైర్లకు నిప్పం టించి నిరసన తెలిపారు. పోలీసుల ప్రేక్షక పాత్ర చేవెళ్లలో అఖిలపక్షం ఆధ్వర్యంలో నిరసన నిర్వహిస్తున్న సమయంలో పోలీసులు ప్రేక్షకపాత్ర వహించారు. బంద్ సందర్భంగా హైదరాబాద్ - బీజాపూర్, ముంబై- బెంగళూరు జాతీయ లింకు రహదారులపై వేలాది వాహనాలు నిలిచిపోరుు ప్రయాణికులు నరకయాతన అనుభవిస్తున్నా పోలీసులు ఏ మాత్రం పట్టించుకోలేదు. గంటల తరబడి ప్రయాణికులు రోడ్లపైనే నిరీక్షించాల్సి వచ్చింది. మధ్యాహ్నం తర్వాత డీఎస్పీ శ్రుతకీర్తి, ఎస్ఐ భీంకుమార్ ఆధ్వర్యంలో సిబ్బంది ఆందోళనకారులకు నచ్చజెప్పి ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించారు. కానీ చేవెళ్లలో మాత్రం ట్రాఫిక్ సాయంత్రం వరకు క్లియర్ కాలేదు. పొద్దుపోయేవరకు వాహనదారులు తిండీ తిప్పలు లేక అవస్థలు పడ్డారు. కేసీఆర్‌ది తుగ్లక్ పాలన: షబ్బీర్ తాండూరు వెళ్తున్న మండలిలో కాంగ్రెస్ పక్ష నేత షబ్బీర్‌అలీ వాహనం సైతం ట్రాఫిక్‌లో చిక్కుకుపోరుుంది. దీంతో ఆయన సైతం ఆందోళనకారులకు మద్ద తు తెలిపి మాట్లాడారు. కేసీఆర్ చేష్టలు పిచ్చితుగ్లక్ పాలనను తలపిస్తోందన్నారు. -
పించన్లు పెంచాలంటూ సెల్‌టవర్ ఎక్కిన వికలాంగుడు
-
రాష్ట్రన్ని సమైక్యంగా ఉంచాలని డిమాండ్