
ప్రతీకాత్మక చిత్రం
నిజామాబాద్: నిజామాబాద్‌లోని మహిళా పోలీస్‌స్టేషన్‌లో ఎస్సై నారాయణ డబ్బులు ఇవ్వాలని తనను డిమాండ్ చేసి వేధిస్తున్నాడని ఓ మహిళ ఆరోపించారు. దీనికి సంబంధించిన ఆడియోక్లిప్‌ను ఆమె ప్రెస్‌క్లబ్‌లో గురువారం విడుదల చేశారు. వివరాలు.. నిజామాబాద్‌కు చెందిన ఓ మహిళకు సంగారెడ్డి జిల్లాకు చెందిన ఘట్‌కేసర్‌కు చెందిన వ్యక్తికి వివాహం అయ్యింది. తన భర్త, అత్తింటి వారు తనను అదనపు కట్నంకోసం వేధిస్తున్నారని సదరు మహిళ ఆరోపించారు.
దీనిపై ఐదునెలల క్రితం మహిళా పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. కేసు గురించి ఎస్పై నారాయణను ఇటీవల సంప్రదించగా రూ.లక్ష ఇవ్వాలని డిమాండ్ చేశారని ఆమె ఆరోపించారు. ‘రూ. లక్ష నా బ్యాంక్ అకౌంట్‌లో వేస్తే నీకు న్యాయం చేస్తా’ అంటూ ఎస్సై చెప్పినట్లు ఉన్న ఆడియో టేప్‌ను ఆమె బయటపెట్టింది. ఎస్సైతో పాటు మరికొందరు పోలీసులు డబ్బులు అడిగినట్లు ఆమె ఆరోపించారు. దీనిపై సదరు మహిళ సీపీకి ఫిర్యాదు చేస్తామన్నారు.
Comments
Please login to add a commentAdd a comment