‘ప్లాన్’ మారింది
♦ మారిన ఏపీ రహదార్ల డిజైన్లు
♦ సమాంతరంగా ఆరు ఆర్టీరియల్ రహదార్లు
సాక్షి, విజయవాడ బ్యూరో: రాజధాని గ్రామాల ప్రజల ఆందోళనతో దిగివచ్చిన ప్రభుత్వం తుది మాస్టర్‌ప్లాన్‌లో పలు మార్పులు చేసింది. గ్రామాల్లోని ఇళ్లను తొలగించేలా రూపొందిం చిన పలు రోడ్ల డిజైన్లను మార్చింది. అయినా ఇంకా 360 ఇళ్లు పోనున్నాయి. సీఎం నివాసం సమీపంలో కృష్ణా కరకట్టలోనూ మార్పులు జరిగాయి. స్వల్ప మార్పులతో రాజధాని నగర ప్రణాళికను సోమవారం సీఆర్‌డీఏ ఖరారు చేసింది. ఈ ప్లాన్‌ను సీఆర్‌డీఏ కార్యాలయం లో మంత్రి నారాయణ విడుదల చేశారు.
మార్పులివే..: రాజధానిలోని ఉత్తర-దక్షిణ దిశలో 5 ఆర్టీరియల్ రోడ్లు, తూర్పు-పడమర దిశలో ఒక ఆర్టీరియల్ రోడ్డు డిజైన్లను మార్చా రు. గ్రామాల గుండా వెళ్తున్న ఈ రోడ్లను 20 నుంచి 30 మీటర్లకు పక్కకు జరిపి సమాంతరంగా ఉండేలా చర్యలు తీసుకున్నారు. ముసాయిదా ప్రకారం అనంతవరం, నెక్కల్లు గ్రామా ల మీదుగా వెళ్లే రోడ్డును 20 మీటర్లు పక్కకు జరిపారు. దొండపాడు, తుళ్లూరు, రాయపూడి గ్రామాల మీదుగా వెళ్లే మూడు రోడ్లను పక్కకు మార్చారు. నెక్కల్లు, శాఖమూరు, ఐనవోలు గ్రామాల మీదుగా వెళ్లే రోడ్లను స్వల్పంగా కిందకు మార్చడం వల్ల తొలగించే ఇళ్ల సంఖ్య తగ్గింది. అయినా ఐనవోలు, మందడం, తుళూ ్లరు గ్రామాల్లో 360కిపైగా ఇళ్లు తొలగించనున్నా రు. ఎక్స్‌ప్రెస్‌హైవే వల్ల కృష్ణాయపాలెం గ్రామం పూర్తిగా తొలగించే పరిస్థితి ఏర్పడడంతో దాని ఎలైన్‌మెంట్‌ను స్వల్పంగా మార్చారు. దీంతో ఆ గ్రామం యథావిధిగా ఉండనుంది. తుది ప్రణాళిక ప్రకారం 29 గ్రామాల్లో రోడ్లు అలాగే ఉంటాయి. నవులూరు వద్ద రోడ్డు కొంత తొలగించనున్నారు.
కృష్ణా కరకట్టలో మార్పు..: తుది ప్రణాళికలో కృష్ణా కరకట్టలో స్వల్పంగా మార్పుచేశారు. ఇక్కడ లోతట్టు ప్రాంతంలో నిర్మించే నివాస సముదాయాల ఎత్తును పెంచేందుకు పాలవా గు, కొండవీటి వాగులు ప్రవహించేచోట 10% కరకట్ట డిజైన్‌లో మార్పు చేశారు. లోతట్టు ప్రాంతం ఎత్తు పెంచేందుకు కురగల్లు, ఐనవోలు వద్ద రెండు ట్యాంక్‌బండ్‌లను అభివృద్ధి చేయనున్నారు. దీనివల్ల సీఎం నివాసం ఉంటు న్న ప్రాంతాన్ని కొంతవరకూ కరకట్ట నుంచి విడదీసే పరిస్థితి ఉన్నట్లు తెలుస్తోంది. కాగా పలు గ్రామాల్లో సమస్యల్ని పరిష్కరించకుండా తుది ప్రణాళికను ఖరారు చేయడంతో స్థాని కుల విజ్ఞప్తులను పక్కనపెట్టినట్లు తెలుస్తోంది. రాజధాని నగర ముసాయిదా ప్రణాళికపై అన్ని గ్రామాల్లోనూ సదస్సులు పెట్టి పలు మార్పులు చేసినట్లు మంత్రి నారాయణ చెప్పారు. ఈ నెల 28 నుంచి వచ్చే ఏడు వరకూ భూసమీకరణ మాస్టర్‌ప్లాన్లను విడుదల చేస్తామన్నారు. ఆ తర్వాత 30 రోజులు అభ్యంతరాలు స్వీకరించి తుది ప్రణాళికలను ఖరారు చేస్తామన్నారు.