![Jagtial Womens Attempt To Suicide Over Master Plan - Sakshi](/styles/webp/s3/article_images/2023/01/20/19JGL54-180019_1_59.jpg.webp?itok=hMOyahMP)
పురుగు మందు డబ్బాలతో మహిళా రైతులు
జగిత్యాల రూరల్: జగిత్యాల జిల్లాకేంద్రంలో మాస్టర్‌ప్లాన్ – 2041 మంటలు ఇంకా కొనసాగుతున్నాయి. పట్టణ సమీప గ్రామాల్లోని తమ వ్యవసాయభూములను రిక్రి యేషన్, ఇండస్ట్రియల్, సెమీ పబ్లిక్జోన్లలో చే ర్చుతూ ముసాయిదా మాస్టర్‌ప్లాన్ ప్రకటించారని రైతులు భగ్గుమంటున్నారు. వారంరోజులుగా వివిధ రూపాల్లో ఆందోళనలు చేస్తున్నారు. ఈ క్రమంలో గురువారం కూడా రైతులు పెద్దఎత్తున తరలివచ్చి జగిత్యాల నలువైపులా రహదారులను దిగ్బంధించారు. రోడ్లపైన వంటావార్పు నిర్వ హించారు.
తాము పండించిన మక్కకంకులను విక్రయిస్తూ, ప్రభుత్వ దిష్టిబొమ్మ దహనం చేస్తూ నిరసన తెలిపారు. హుస్నాబాద్ శివారులోని జగిత్యాల–నిజామాబాద్ ప్రధాన రహదారిపై రైతులు ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా కొందరు మహిళారైతులు పురుగుమందు డబ్బాలు వెంట తెచ్చుకున్నారు. మాస్టర్‌ప్లాన్ నుంచి తమ భూములను తొలగించకుంటే ఆత్మహత్య చేసుకుంటామంటూ అధికారులను హెచ్చరిస్తూ. మందు తాగేందుకు యత్నించగా, అక్కడే ఉన్న పోలీసులు పురుగుమందు డబ్బాలను లాక్కున్నా రు. మధ్యాహ్నం 2.30 గంటల తర్వాత అన్నిచోట్ల ధర్నాలను ఉపసంహరించుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment