
చంద్రబాబు చేతికి 'రాజధాని మాస్టర్ ప్లాన్'
హైదరాబాద్ : ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో సింగపూర్ మంత్రి ఈశ్వరన్ సోమవారం సచివాలయంలో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడుకు ఆంధ్రప్రదేశ్ నూతన రాజధాని నగర(కేపిటల్ సిటీ) మాస్టర్‌ప్లాన్ను ఈశ్వరన్ సమర్పించారు. ఇప్పటికే సింగపూర్ కంపెనీలు రాజధాని ప్రాంత(కేపిటల్ రీజియన్) మాస్టర్‌ప్లాన్‌ను రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పించిన విషయం తెలిసిందే.
రాజధాని మాస్టర్ ప్లాన్పై కాసేపట్లో ఉన్నత స్థాయి సమావేశం జరగనుంది. చంద్రబాబుతో పాటు సింగపూర్ ప్రతినిధులు పాల్గొంటారు. మధ్యాహ్నం మూడు గంటల వరకూ ఈ రాజధాని హైలెవల్ కమిటీ భేటీ కొనసాగనుంది. ఈ సమావేశంలో మాస్టర్‌ప్లాన్‌లో పొందుపరిచిన అంశాలపై చర్చిస్తారు. అలాగే భూములు ఇచ్చిన రైతులకు సమీప గ్రామాల్లో భూములను ఏపీ సర్కార్ కేటాయించనుంది. అలాగే మాస్టర్ ప్లాన్పై ప్రజాభిప్రాయాన్ని కూడా సేకరించనుంది.