సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి సీడ్ కేపిటల్‌కు 4,227 ఎకరాల భూమి అవసరమని మాస్టర్ ప్లాన్‌లో పేర్కొన్నారు. ఇందులో ఏకంగా 2,861 ఎకరాలను ప్రైవేట్ కంపెనీలకే కేటాయించారు. ప్రభుత్వ పరిపాలన భవనాలకు 150 ఎకరాలు సరిపోతుందని పేర్కొంటూ బిజినెస్ పార్కులు, వాణిజ్య అవసరాలు, ప్రత్యేక అభివృద్ధి జోన్, మిశ్రమ వినియోగం రంగాలకు ఏకంగా 2,861 ఎకరాలను కేటాయిస్తూ ప్రణాళికను రూపొందించారు.
ఈ మొత్తం భూమిని ప్రైవేట్ సంస్థలు, వ్యక్తులకు అభివృద్ధి పేరుతో 99 సంవత్సరాల పాటు లీజుకు ఇవ్వనున్నారు. అలాగే తుళ్లూరు దగ్గరలో తక్షణం 280 ఎకరాల భూమిని ఎలక్ట్రానిక్స్, హార్డ్‌వేర్, ఫుడ్, బేవరేజెస్, ప్రింటింగ్ తదితర పరిశ్రమలకు కేటాయించాల్సిందిగా ప్రణాళికలో స్పష్టం చేశారు. లింగాయపాలెం, ఉద్దండరాయ పాలెం, మందడ గ్రామాల్లోనే ప్రభుత్వ పరిపాలన భవనాలు వస్తాయని ప్రణాళికలో స్పష్టం చేశారు.
ఈ గ్రామాల్లో నివ సించే వారికి సీడ్ కేపిటల్ బయట మూడు అంతస్థుల భవనాల్లో నివాసాలను ఏర్పాటు చేయాలని ప్రణాళికలో పేర్కొన్నారు. ఈ మూడు గ్రామాల్లో 29 హెక్టార్ల పరిధిలో 4,157 కుటుంబాలు నివసిస్తున్నట్లు తేల్చారు. వీరికి మూడు అంతస్థుల భవనాల్లో నివాసాలను కేటాయించాల్సి ఉందన్నారు. దీన్ని పారిశ్రామిక క్లస్టర్‌గా అభివృద్ధి చేయాలని ప్రణాళికలో పేర్కొన్నారు. సీడ్ కేపిటల్ భూమిని ఎకరాల లెక్కన రంగాల వారీగా కేటాయించారు.
రాజధాని రోడ్లకు 693 ఎకరాల సేకరణ
సాక్షి, హైదరాబాద్: సీడ్ కేపిటల్ ప్రాంతంలో విశాలమైన రోడ్లను నిర్మించేందుకు 693 ఎకరాల భూమి అవసరమని ప్రభుత్వం తేల్చింది. రాజధాని ప్రాంతంలో సమీకరించిన భూములు కాకుండా కేవలం రోడ్ల విస్తరణకు 277.27 హెక్టార్లు (693 ఎకరాలు) కావాలని భావిస్తోంది. సింగపూర్ ప్రణాళికను అనుసరించి విజయవాడ నుంచి అమరావతి వరకూ, మంగళగిరి నుంచి అమరావతి వరకూ మొత్తం 88 కి.మీ. మేర ఐదు కేటగిరీలుగా రోడ్లను నిర్మించేందుకు కసరత్తు మొదలైంది. ఇందుకు కన్సల్టెన్సీల సేవలు వినియోగించుకునేందుకు ప్రభుత్వం నిర్ణయించింది.
సీడ్ కేపిటల్‌కు 4,227 ఎకరాలు
Published Mon, Aug 10 2015 2:54 AM | Last Updated on Sun, Sep 3 2017 7:07 AM
Advertisement
Advertisement