Seed Capital
-
ఏపీలో మెటాలిక్స్ విత్తన కేంద్రం
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: టాటా గ్రూప్‌కు చెందిన అగ్రికల్చర్ బయోటెక్నాలజీ కంపెనీ మెటాలిక్స్ లైఫ్ సైన్సెస్ ఆంధ్రప్రదేశ్‌లో విత్తన ఫ్యాక్టరీని ఏర్పాటు చేయనుంది. ఆంధ్రప్రదేశ్ సీడ్ క్యాపిటల్‌గా అభివృద్ధి చెందుతోందని, ఎగుమతులక్కూడా అవకాశం ఉండటంతో ఫ్యాక్టరీ ఏర్పాటుకు నిర్ణయించామని తెలియజేసింది. ప్రస్తుతం హైదరాబాద్‌లో రెండు విత్తన ఫ్యాక్టరీలతో పాటు కరీంనగర్, వరంగల్, ఏలూరు, కడప వంటి ప్రాంతాల్లో విత్తన ఉత్పత్తి కేంద్రాలున్నాయి. మంగళవారమిక్కడ ‘జెనిటికల్లీ మోడిఫైడ్ ఆర్గానిజం’ (జీఎంవో) అనే అంశంపై జరిగిన చర్చలో మెటాలిక్స్ లైఫ్ సైన్సెస్ ఎండీ అండ్ సీఈఓ ఎస్ నాగరాజన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ‘సాక్షి బిజినెస్ బ్యూరో’తో మాట్లాడారు. ప్రస్తుతం మెటాలిక్స్.. ధాన్య సీడ్స్ బ్రాండ్ పేరిట విత్తనాలను విక్రయిస్తోంది. ప్రస్తుతం ధాన్య నుంచి గోధుమ, పత్తి, మిరప, టమోటా, బెండ, జొన్న, సజ్జ వంటి విత్తనాలున్నాయని.. త్వరలోనే ఆవ విత్తనాలను మార్కెట్లోకి తీసుకురానున్నట్లు ఆయన తెలిపారు. గత ఆర్ధిక సంవత్సరంలో రూ.315 కోట్ల టర్నోవర్‌ను చేరుకున్నామని.. ఇందులో ఏపీ, తెలంగాణ నుంచి రూ.15 కోట్ల వాటా ఉంటుందని తెలిపారు. -
సీడ్ క్యాపిటల్ అభివృద్ధికి కొత్త నోటిఫికేషన్
-
సీడ్ క్యాపిటల్‌గా వరదముంపు ప్రాంతం
-
సీడ్ క్యాపిటల్‌గా వరదముంపు ప్రాంతం
రాజధాని నిర్మాణంపై ఎన్జీటీలో పిటిషనర్ల తరఫు న్యాయవాది సాక్షి, న్యూఢిల్లీ: వరదముంపు ప్రాంతాన్ని రాష్ట్ర ప్రభుత్వం సీడ్ క్యాపిటల్‌గా ఎంపిక చేసి నిర్మాణాలు చేపడుతోందని, ఈ విషయాన్ని పర్యావరణ ప్రభావ అంచనా (ఈఐఏ) కమిటీ ధ్రువీకరించిందని రాజధాని నిర్మాణంపై జాతీయ హరిత ట్రిబ్యునల్(ఎన్జీటీ)లో విచారణ సందర్భంగా పిటిషనర్ల తరఫు న్యాయవాది సంజయ్ పరిఖ్ పేర్కొన్నారు. అమరావతి నిర్మాణానికి సంబంధించిన పర్యావరణ అనుమతులను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లను జస్టిస్ స్వతంత్రకుమార్ నేతృత్వంలోని ధర్మాసనం బుధవారం కూడా విచారించింది. రాజధాని నిర్మాణం ద్వారా చేసే అభివృద్ధి, జరిగే నష్టం, రైతులకు జీవనోపాధి ఏ విధంగా కల్పిస్తారో చెప్పాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని మంగళవారం ఎన్జీటీ కోరిన విషయం తెలిసిందే. ఆ వివరాలేవీ అని ధర్మాసనం బుధవారం ప్రభుత్వ న్యాయవాదిని ప్రశ్నించగా.. ఇంకా నివేదిక సిద్ధం కాలేదని ఆయన సమాధానం ఇచ్చారు. దీనిపై ధర్మాసనం అసంతృప్తి వ్యక్తం చేస్తూ.. ఇంకా నివేదిక ఎందుకు సిద్ధం చేయలేదని ప్రశ్నించింది. అభివృద్ధి కార్యక్రమాలు, నష్టంపై వివరాలు అందించాల్సిందిగా సంబంధిత రాష్ట్ర అధికారులను కోరామని, వాటిని త్వరలోనే సమర్పిస్తామని ప్రభుత్వం తరఫు న్యాయవాది వివరణ ఇచ్చారు. -
28న సీడ్ క్యాపిటల్ భవనాలకు శంకుస్థాపన
హాజరుకానున్న కేంద్రమంత్రి అరుణ్‌జైట్లీ తుళ్లూరు రూరల్: రాజధాని ప్రాంతంలోని సీడ్ క్యాపిటల్ పరిధిలో ప్రభుత్వ భవనాల సముదాయాల నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం ముహూర్తం ఖరారు చేసింది. ఈ నెల 28న కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ, సీఎం చంద్రబాబు చేతులమీదుగా శంకుస్థాపన చేయనున్నారు. లింగాయపాలెం, రాయపూడి గ్రామాల పరిధిలోని 950 ఎకరాల్లో ఈ భవన నిర్మాణం జరుగుతుందని సీఆర్డీఏ అధికారులు చెబుతున్నారు. శంకుస్థాపన పురస్కరించుకొని 100 ఎకరాల భూమిని చదును చేస్తున్నట్లు చెప్పారు. ఈ మేరకు గుంటూరు కలెక్టర్ కాంతిలాల్ దండే, సీఆర్డీఏ కమిషనర్ చెరుకూరి శ్రీధర్ మంగళవారం ఏర్పాట్లను పర్యవేక్షించారు. -
సింగపూర్ కంపెనీలకు దాసోహం
- ఆ సంస్థల ఆర్థిక ప్రయోజనాలకే సర్కార్ పెద్దపీట - స్విస్ చాలెంజ్ ముసుగులో నామినేషన్‌పై కట్టపెట్టిన సీఎం సాక్షి, హైదరాబాద్: రాజధాని నిర్మాణం విషయంలో రాష్ట్ర ప్రభుత్వం సింగపూర్ సంస్థలకు సాగిలపడింది. ఆ సంస్థలు పెట్టిన అడ్డగోలు షరతులన్నింటినీ సీఎం తలూపేశారు. అమరావతి డెవలప్మెంట్ భాగస్వామి ఎంపిక విషయంలో సింగపూర్ సంస్థలు అసెండాస్, సెమ్బ్‌కార్ఫ్ కన్సార్టియం స్విస్ చాలెంజ్ విధానంలో ప్రతిపాదించిన రాయితీ అండ్ డెవలప్మెంట్, షేర్ హోల్డర్స్ అగ్రిమెంట్లు రైతుల భూములతో పాటు రాష్ట్ర ఖజానాను కొల్లగొట్టేలా ఉన్నా అంగీకరించారు. స్విస్ చాలెంజ్ పేరిట నామినేషన్‌పై సింగపూర్ సంస్థలకు కట్టపెట్టడానికే ప్రాధాన్యం ఇచ్చారు. భవిష్యత్‌లో పరిహారాలు చెల్లించాల్సి వచ్చినా సింగపూర్ సంస్థలకు సంబంధం ఉండదని, ఏపీ ప్రభుత్వానికి మాత్రం ఉంటుందనే నిబంధనతో రాష్ట్ర ప్రయోజనాలను ఫణంగా పెట్టారు. ఎస్క్రో అకౌంట్ తెరిచేందుకు సింగపూర్ సంస్థలు అంగీకరించకపోయినా పట్టించుకోలేదు. నిబంధనలన్నింటినీ ఉల్లంఘిస్తూ సింగపూర్ సంస్థల ఆర్థిక ప్రయోజనాలకే పెద్దపీట వేశారని, 20 ఏళ్ల పాటు అవసరమైతే మరో ఐదేళ్ల పాటు వాణిజ్యపరంగా భూములను అభివృద్ధి చేసి విక్రయించుకునే అధికారం ఆ సంస్థలకు కట్టపెట్టారని అధికార వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. సింగపూర్ సంస్థలు రూపొందించిన రాయితీ అండ్ డెవలప్మెంట్ అగ్రిమెంట్ ఉద్దేశాలను, లక్ష్యాలను, బిజినెస్ ప్రణాళికలను నెరవేర్చడమే లక్ష్యంగా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ తరహాలో అమరావతి డెవలప్మెంట్ భాగస్వామి పనిచేయనుంది. ఆ కంపెనీల చేతిలో అమరావతి డెవలప్మెంట్ భాగస్వామి కీలు బొమ్మ కానుంది. ఈ వ్యవహారాలను స్వయంగా సీఎం చంద్రబాబు చూడటం గమనార్హం. కొండంత రాయితీలు కల్పించినా.. చంద్రబాబు సర్కారు కొండంత రాయితీలు కల్పించినా సింగపూర్ సంస్థలు పెట్టే మూల పెట్టుబడి కేవలం రూ.306.40 కోట్లు మాత్రమే. రాజధాని భూములను తనఖా పెట్టడం ద్వారా బ్యాంకుల నుంచి రుణంగా మిగతావి సేకరిస్తాయి. ఆ రుణాలకు రాష్ట్ర ప్రభుత్వం గ్యారెంటీ ఇవ్వాలి.అంటే రాజధాని రైతుల భూములను తాకట్టు పెట్టి సింగపూర్ సంస్థలు రుణాలు తీసుకుని, ఆ డబ్బుతో రాజధాని నిర్మిస్తాయన్నమాట. ఇందుకు సీఎం చంద్రబాబు అంగీకరించారు. భవిష్యత్‌లో సింగపూర్ సంస్థలతో ఒప్పందాన్ని రద్దు చేసుకోవాల్సి వస్తే అప్పటివరకు ఆ సంస్థలు పెట్టిన పెట్టుబడులకు పది రెట్లు పరిహారంగా చెల్లించాలనే నిబంధనకు సైతం ప్రభుత్వం అంగీకరించింది. అంటే సింగపూర్ సంస్థలు వచ్చే ఐదేళ్లలో రూ.వెయ్యి కోట్లు పెట్టుబడి పెట్టిన తరువాత తొలగిస్తే ఆ సంస్థలకు రాష్ట్ర ప్రభుత్వం రూ. పది వేల కోట్ల పరిహారం చెల్లించాలి. సీడ్ కేపిటల్ పరిధిలో సింగపూర్ సంస్థలు అభివృద్ధి చేసే 1691 ఎకరాల్లో మౌలిక వసతుల కల్పన ప్రాజెక్టులను సీఆర్డీఏ సొంత నిధులతో చేపట్టాలి.రహదారులు నిర్మాణం, మంచినీటి సరఫరా, విద్యుత్ సరఫరా, ఇతర డ్రైనేజీ వంటి వసతులను సీఆర్డీఏనే చేపట్టాలి. వీటిని ఆరు నెలల నుంచి 12 నెలల్లోగా చేపట్టాలి.లేకుంటే సింగపూర్ సంస్థలకు పెనాల్టీని చెల్లించాలి. మౌలిక వసతుల కల్పనకు రూ.5వేల కోట్ల వ్యయం అవుతుందని సీఆర్డీఏ అంచనా వేసింది. అంత వ్యయం చేసి వసతులు కల్పిస్తే సింగపూర్ సంస్థలు ప్లాట్లు వేసి మూడో పార్టీకి లీజుకు విక్రయిస్తాయి. రైతుల భూముల్లో ప్రభుత్వ ఖర్చులతో మౌలిక సదుపాయాలు కల్పిస్తే.. సింగపూర్ సంస్థలు వాటిని బ్యాంకుల్లో తాకట్టుపెట్టి వాణిజ్య, వ్యాపారపరమైన అభివృద్ధిని మాత్రమే చేపడతాయి. ఇందులో రెవెన్యూ వాటా ఎంతనేది సింగపూర్ సంస్థలు సీల్డ్ కవర్లో రహస్యంగా ఇస్తాయి. అది ఎంతి స్తారో తెలియకపోతే ఇతర సంస్థలు ఏ విధంగా చాలెంజ్ చేస్తాయనే అభిప్రాయాన్ని అధికార వర్గాలు వ్యక్తం చేస్తున్నాయి. స్విస్ చాలెంజ్ ముసుగు మాత్రమేనని, నామినేషన్‌పై కట్టపెట్టడమేనని అధికార వర్గాలు అంటున్నాయి. స్వయంగా సీఎం సింగపూర్ సంస్థల ప్రతినిధులతో ఫోన్లో మంతనాలు జరపడం,వాటి ప్రతిపాదనలన్నింటికీ అంగీకరించడం,మంత్రుల కమిటీచే అంగీకరింపచేయడం అంతా ఏకపక్షంగా సాగిపోయాయని అధికార యంత్రాంగం పేర్కొంటోంది. -
అమరావతి ఎస్టేట్స్..!
సింగపూర్ ప్రైవేట్ లిమిటెడ్ వెంచర్.. ఇది ఒక శాంపిల్ ‘స్టార్టప్’ కథ సీడ్ కేపిటల్లో సింగపూర్ కంపెనీలకు 1,691 ఎకరాలు అప్పనంగా ధారాదత్తం సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర రాజధాని నిర్మాణం పేరిట ప్రభుత్వ పెద్దలు ఫక్తు రియల్ ఎస్టేట్ వ్యాపారానికి తెరతీస్తున్నారు అనడానికి మరో గట్టి ఆధారం దొరికింది. రాజధాని ప్రాంతంలో రైతుల నుంచి బలవంతంగా సేకరించిన భూములను తమకు నచ్చిన విదేశీ సంస్థలకు కట్టబెట్టి రూ.వేల కోట్లు దండుకోవడమే వారు లక్ష్యంగా పెట్టుకున్నారు. సింగపూర్ ప్రైవేట్ కంపెనీల కన్సార్టియంతో కలిసి రాజధానిలో భారీ దోపిడీకి రంగం సిద్ధం చేస్తున్నారు. సీడ్ కేపిటల్లో అత్యంత విలువైన 1,691 ఎకరాలను అప్పనంగా చేజిక్కించుకొని కాసుల పంట పండించుకునేందుకు పన్నాగాలు పన్నుతున్నారు. సీడ్ కేపిటల్లో స్టార్టప్ ఏరియా పేరిట సాగిస్తున్న ఈ నయా దందాలో సింగపూర్ కంపెనీలకు స్వల్ప వ్యవధిలోనే రూ.15 వేల కోట్లకుపైగా లబ్ధి కలగనుంది. రూ.వందల కోట్లలో పెట్టుబడి పెట్టి రూ.వేల కోట్లు కొల్లగొట్టనున్నాయి. ఈ కంపెనీల వెనుక ఉన్న ముఖ్య నేత ఎవరో రాష్ట్ర ప్రజలకు తెలియంది కాదు. సీడ్ కేపిటల్ ఏరియాలో 6.84 చదరపు కిలో మీటర్లు (1,691 ఎకరాలను) స్టార్టప్ ప్రాంతంగా అభివృద్ధి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు సింగపూర్ కంపెనీల కన్సార్టియం, ప్రభుత్వం మధ్య అవగాహన కుదిరింది. ఇక రాయితీ, అభివృద్ధి, వ్యాపార ప్రణాళిక ఒప్పందాలు చేసుకోవడమే తరువాయి. ఈ కుంభకోణం ఎలా సాగుతుందంటే... ► సింగపూర్ ప్రైవేట్ కంపెనీలైన అసెండాస్, సెమ్బ్‌కార్ప్, సెమ్‌బ్రిడ్జిలతో కూడిన కన్సార్టియం, రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన కేపిటల్ సిటీ డెవలప్మెంట్ అండ్ మేనేజ్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ (సీసీడీఎంసీఎల్) కలిసి ఉమ్మడిగా అమరావతి డెవలప్మెంట్ పార్ట్నర్(ఏడీపీ)ను ఏర్పాటు చేస్తాయి. ► సింగపూర్ కంపెనీల కన్సార్టియం రూపొందించిన రాయితీ, డెవలప్మెంట్ అగ్రిమెంట్, బిజినెస్ ప్రణాళిక ఉద్దేశాలకు లోబడి ఏడీపీ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీగా రూపొందుతుంది. ► ఏడీపీలో సీసీడీఎంసీఎల్ పెట్టుబడి రూ.221.9 కోట్లు. సింగపూర్ కంపెనీల కన్సార్టియం పెట్టుబడి రూ.306.4 కోట్లు. ► ఏడీపీపై పూర్తిస్థాయి పెత్తనం సింగపూర్ కంపెనీలదే. ► ఏడీపీలో సింగపూర్ సంస్థల కన్సార్టియం వాటా 58 శాతం, సీసీడీఎంసీఎల్ వాటా 42 శాతం. ► ఏడీపీకి స్టార్టప్ ఏరియా(1,691 ఎకరాలు)ను కట్టబెడతారు. ఈ సంస్థ స్టార్టప్ ఏరియాలో ప్లాట్లు వేసి, వాటిని అభివృద్ధి చేయడానికి మూడో పార్టీకి విక్రయిస్తుంది. ► విజయవాడలోని బందరు రోడ్డులో గజం భూమి విలువ రూ.2 లక్షలకు పైగానే పలుకుతోంది. ఇక రాజధానిలో అత్యంత కీలకమైన సీడ్ కేపిటల్లో గజం విలువ హీనపక్షం రూ.లక్ష అనుకున్నా 1,691 ఎకరాల విలువ రూ.50 వేల కోట్లకు పైగానే ఉంటుంది. ► ఒప్పందం అమల్లోకి వచ్చిన ఐదేళ్ల తర్వాత సింగపూర్ కంపెనీల కన్సార్టియం కనీసం 26 శాతం వాటాను కలిగి ఉండాలి. మిగతా 32 శాతం విక్రయించుకోవచ్చు. ►1,691 ఎకరాల్లో 32 శాతం వాటాను సింగపూర్ కంపెనీలు అమ్ముకోవచ్చు. దీని విలువ రూ.15 వేల కోట్లకుపైగానే.. 20 ఏళ్లలో స్టార్టప్ ఏరియా అభివృద్ధి మొత్తం భూముల విక్రయం, లీజుల లావాదేవీలతో వచ్చిన ఆదాయంలో ఏడీపీ వాటా పొందుతుంది. మొత్తం ప్లాట్లను తొలి దశలో నిర్ణయించిన కనీస రిజర్వ్ ధరలకు విక్రయిస్తారు. ప్రతీ దశకు రిజర్వ్ ధరలను సవరిస్తారు. సింగపూర్ కంపెనీలకు స్టార్టప్ ఏరియాలో 50 ఎకరాలను నామమాత్రపు ధరకు ఇవ్వాలి. ఈ భూమిని ఏడీపీకి బదిలీ చేయడంతో పాటు పూర్తి హక్కులు కల్పించాలి. ఈ భూమిలో 8 లక్షల చదరపు అడుగుల్లో ఏడీపీ ఉత్ప్రేరక (కేటలిటిక్) అభివృద్ధిని చేపడుతుంది. ఈ అభివృద్ధి పనులను ఏడీపీ నామినేషన్‌పై ఎవరికైనా అప్పగించవచ్చు. వసతుల కల్పనకు అయిన వ్యయంతోపాటు నిర్వహణ చార్జీలను వసూలు చేసేందుకు ఏడీపీకి హక్కు ఉంది. స్టార్టప్ ఏరియాలోనే మరో 200 ఎకరాలను సింగపూర్ కంపెనీల కన్సార్టియంకు రెండు దశల్లో ఫ్రీ హోల్డ్ విధానంలో ఇవ్వాలి. ఈ భూములను ఏడీపీ భవిష్యత్ అభివృద్ధికి వినియోగిస్తుంది. మొత్తం 1,691 ఎకరాల స్టార్టప్ ఏరియాను మూడు దశల్లో అంటే 20 సంవత్సరాల్లో అభివృద్ధి చేస్తారు. ప్లాట్లు అమ్ముడు కాకుండా మిగిలిపోతే గడువును మరో ఐదేళ్లు పొడిగిస్తారు. చైర్మన్‌ను నియమించే అధికారం సింగపూర్ కంపెనీలదే.. ఆరుగురు సభ్యులతో ఏడీపీ పాలక మండలిని ఏర్పాటు చేస్తారు. ఇందులో నలుగురు సభ్యులు సింగపూర్ కంపెనీల కన్సార్టియం నుంచే ఉంటారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇద్దరు సభ్యులే ఉంటారు. పాలక మండలి చైర్మన్‌ను నియమించే అధికారం సింగపూర్ కంపెనీల కన్సార్టియంకే ఉంటుంది. పాలక మండలిలో కొత్తగా ఎవరినైనా సభ్యుడిగా చేర్చుకోవాలంటే కనీసం 15 శాతం వాటా పెట్టుబడి పెట్టాలి. వివాదాలొస్తే లండన్ కోర్టుకు... స్టార్టప్ ఏరియాలో ప్లాట్లు కొనుగోలు చేసేవారు, ప్రాజెక్టులను అభివృద్ధి చేసే వారు ఏవైనా వివాదాలు తలెత్తితే లండన్ కోర్డును ఆశ్రయించాల్సిందే. ఏడీపీలో సింగపూర్ కంపెనీలు పెట్టిన పెట్టుబడికి రాష్ట్ర సర్కారు నేతృత్వంలోని సీసీడీఎంసీఎల్ బాధ్యత వహించాల్సి ఉంటుంది. సింగపూర్ కంపెనీలకు ఏదైనా నష్టం వాటిల్లితే పరిహారం కోసం లండన్ కోర్టునే ఆశ్రయిస్తాయి. ఏడీపీకి సర్వాధికారాలు స్టార్టప్ ఏరియాలో అభివృద్ధి చేసిన భూములను లీజుకు ఇవ్వడం లేదా విక్రయించడం, తనఖా పెట్టడం, కొనుగోలుదారుల నుంచి తగిన ఆదాయం రాబట్టే అధికారాలను పూర్తిగా ఏడీపీకి ఇస్తారు. ఇందుకోసం ఏడీపీకి ఏపీ సీఆర్డీఏ జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ (జీపీఏ) ఇస్తుంది. ఇందుకయ్యే వ్యయాన్ని సీఆర్డీఏ భరించాలి. స్టార్టప్ ప్రాంతంలో ఏడీపీకి మౌలిక సదుపాయాలను కల్పించాల్సిన బాధ్యత సీసీడీఎంసీఎల్దే. 6 నుంచి 12 నెలల్లోగా కల్పించకపోతే ఆ ప్రాజెక్టు జాప్యానికి సీసీఎండీసీఎల్దే బాధ్యత. ఒప్పందం మేరకు ఏడీపీకి పరిహారం చెల్లించాల్సి ఉంటుంది. -
‘రియల్’ వ్యాపారానికే బాబు ప్రాధాన్యం
మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ధ్వజం సాక్షి, హైదరాబాద్: రాజధాని పేరుతో సింగపూర్ ప్రైవేట్ కంపెనీలను అడ్డం పెట్టుకొని రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకోవడానికే చంద్రబాబు ప్రాధాన్యత ఇస్తున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ధ్వజమెత్తింది. మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి గురువారం హైదరాబాద్‌లోని పార్టీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ.. రాజధాని కోసం భూములిచ్చిన రైతులకు న్యాయం జరిగే పరిస్థితి ఏమాత్రం కనిపించడం లేదని విమర్శించారు. గతంలో కేవలం 5 గ్రామాలకు సంబంధించి 8 చ.కి.మీ. పరిధిలోనే సీడ్ క్యాపిటల్ నిర్మాణం జరుగుతుందని ప్రకటించి.. ఇప్పుడు ఆ పరిధిని 20 చ.కి.మీ పెంచి 20 గ్రామాల ప్రజలను బలి చేయబోతున్నారని దుయ్యబట్టారు. సీడ్ క్యాపిటల్‌లో ఎలాంటి ప్రైవేట్ నిర్మాణాలకు అనుమతి ఉండదని సీఆర్డీఏ చట్టంలో స్పష్టంగా రాశారని.. అంటే ఆ పరిధిలో ఉండే 20 గ్రామాల్లో రైతులకు ఏ కేటాయింపులు ఉండవని తేలిపోతోందన్నారు. 20 చ.కి.మీ పరిధి బయట కొండవీటి వాగు ముంపు ప్రాంతంలో రైతులకు భూములు దక్కినా ఆ ప్రాంతంలో నిర్మాణాలు చేపట్టాలంటే కనీసం 10 మీటర్లు ఎత్తు పెంచుకోవాల్సిన పరిస్థితి ఉందని పేర్కొన్నారు. తిరుమల కొండలన్నింటినీ తవ్వినా అక్కడి భూముల ఎత్తు పెంచుకోవడానికి మట్టి సరిపోదన్నారు. భూములిచ్చిన రైతులకు ప్రభుత్వం ఇచ్చిన హామీలేవి అమలుచేయడం లేదని విమర్శించారు. ‘ఇంటికో ఉద్యోగం.. ఉద్యోగాల్లో రిజర్వేషన్లు వంటి హామీలను పక్కన పెట్టేశారు. రాజధాని ప్రాంత వ్యవసాయ కూలీలకు ఇస్తామన్న సామాజిక పింఛన్లను 5-6 నెలల నుంచి చెల్లించడం లేదు. భూములిచ్చిన రైతులకు ఈ ఏడాది కౌలు చెక్కులు ఇవ్వలేదు’ అని దుయ్యబట్టారు. -
సింగపూర్ కంపెనీలదే పెత్తనం!
♦ రాజధాని నిర్మాణంలో ఒప్పందాలు, కేబినెట్ నిర్ణయాలకు మంగళం ♦ సీడ్ క్యాపిటల్ ఏరియా 20 చదరపు కిలోమీటర్లకు పెంపు సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర రాజధాని అమరావతి మాస్టర్ ప్రణాళిక అమలు వ్యవహారం సింగపూర్ ప్రైవేట్ కంపెనీలు, సర్కారు పెద్దల ఇష్టారాజ్యంగా మారిపోయింది. సింగపూర్ ప్రభుత్వం, ఏపీ ప్రభుత్వం మధ్య కుదిరిన ఒప్పందానికి తూట్లు పొడిచారు. కేబినెట్ నిర్ణయానికి మంగళం పలికారు. ప్రస్తుతం సింగపూర్ ప్రైవేట్ కంపెనీలు మాస్టర్ డెవలపర్‌గా స్విస్ ఛాలెంజ్ విధానంలో చేసిన ప్రతిపాదనలకే ప్రభుత్వం మొగ్గు చూపుతోంది. తొలుత సింగపూర్ ప్రభుత్వ కంపెనీలనే మాస్టర్ డెవలపర్‌గా ఎంపిక చేయాలని నిర్ణయించారు. ఇప్పుడు సింగపూర్‌కు చెందిన ప్రైవేట్ కంపెనీలైన అసెండాస్, సెంబ్బ్రిడ్జి గ్రూపు అండ్ సెంబ్‌కార్ప్ డెవలప్మెంట్ లిమిటెడ్ మాస్టర్ డెవలపర్‌గా స్విస్‌చాలెంజ్ విధానంలో రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపాయి. తొలి ఒప్పందంలో తొలి దశలో సీడ్ క్యాపిటల్ ఏరియా 8 చదరపు కిలోమీటర్లుగా పేర్కొన్నారు. ఇందుకు రాష్ట్ర కేబినెట్ కూడా ఆమోదం తెలిపింది. అయితే, సింగపూర్ ప్రైవేట్ కంపెనీలు స్విస్ ఛాలెంజ్ విధానంలో సీడ్ క్యాపిటల్ ఏరియాను 16.9 చదరపు కిలోమీటర్లకు పెంచాయి. ఈ పెంపు గతంలో కుదిరిన ఒప్పందానికి భిన్నంగా ఉందని అధికారులు అభ్యంతరం వ్యక్తం చేస్తుండగా.. తాజాగా సింగపూర్ ప్రైవేట్ కంపెనీలు సీడ్ క్యాపిటల్ ఏరియాను 20 చదరపు కిలోమీటర్లకు పెంచేశాయి. ప్రణాళికలు యథాతథంగా అమలు సింగపూర్ కంపెనీలు రూపొందించిన మాస్టర్ ప్రణాళికల అమలుపై బుధవారం సచివాలయంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సత్యప్రకాశ్ టక్కర్ ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో సింగపూర్‌కు చెందిన ‘సెంటర్ ఫర్ లివబుల్ సిటీస్’ ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్ ఖూ టెంగ్ చాయ్ ప్రజెంటేషన్ ఇచ్చారు. -
రాజధానికి ‘ప్లాట్‌ఫామ్’ ముప్పు?
♦ సీడ్ క్యాపిటల్ నిర్మాణ ప్రాంతంలో పెరగనున్న ఎత్తు ♦ 5 చ.కిమీల పరిధిలో 8 అడుగుల మేర ఎత్తు పెంచాలని నిర్ణయం ♦ తీవ్ర ఆందోళనలో రాజధాని గ్రామాల ప్రజలు సాక్షి,హైదరాబాద్ : పిచ్చి కుదిరింది తలకు రోకలి చుట్టమన్నాట్ట వెనకటికి.. ఆంధ్రప్రదేశ్‌లో చంద్రబాబు నాయుడు ప్రభుత్వ తీరు ఇపుడు అచ్చం అలానే ఉంది. రాజధానికి ఏ ప్రాంతం పనికి వస్తుందో చెప్పిన శివరామకృష్ణన్ కమిటీ నివేదికను పట్టించుకోలేదు. ఎంపిక చేసిన అమరావతి ప్రాంతం రాజధానికి పనికిరాదు అన్న నిపుణుల మాట కొట్టిపడేశారు. అమరావతి లోటుపాట్ల గురించి, అక్కడ రాజధాని పేరుతో జరుగుతున్న వృథా ఖర్చుల గురించి ఎవరు మాట్లాడినా వారు రాజధానికి వ్యతిరేకులు అనే ముద్ర వేసే ప్రయత్నం చేస్తున్నారు. అయినా అక్కడ రాజధాని నిర్మాణం సరికాదని అనేక రకాలుగా నిరూపణ అవుతూ వస్తోంది. రాజధానిలో 13,600 ఎకరాలు, సీడ్ క్యాపిటల్ ప్రాంతంలో 10,600 ఎకరాలు వరద నీటిలో మునిగిపోతాయని సీఆర్డీఏ తేల్చడం తాజా నిదర్శనం. దాంతో రాష్ర్టప్రభుత్వం నష్టనివారణ చర్యలు హడావిడిగా చేపట్టింది. రాజధానిలో ఐదు చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఎత్తయిన ఫ్లాట్‌ఫాంను నిర్మించాలని నిర్ణయించింది. ఇందుకోసం ఏకంగా రూ.750 కోట్ల వ్యయం అవుతుందని తేల్చింది. ఎక్కడ ఎంత మేర ఫ్లాట్ ఫాం ఎత్తును పెంచాలో అధ్యయనం చేసి నివేదిక ఇచ్చేందుకు ఆర్వీ అసోసియేట్స్ కన్సల్టెంట్‌ను సీఆర్డీఏ నియమించింది. ఈ కన్సల్టెంట్ నివేదిక వస్తే గానీ ఎక్కడ ఎంత మేర ఫ్లాట్ ఫాం స్థాయిని పెంచాలో చెప్పలేమని సీఆర్డీఏ అధికారులు చెబుతున్నారు. అయితే దాదాపు 8 అడుగుల మేర నిర్మాణ ప్రాంతం ఎత్తు పెరగనుందని అంటున్నారు. రాజధానిలో మొత్తం వరద నీటి నియంత్రణ పనులు చేపట్టడానికి రూ.2,941 కోట్లు వ్యయం అవుతుందని సీఆర్డీఏ అంచనా వేసింది. వర్షాకాలంలో కొండవీటి వాగు వరద వల్ల రాజధాని ప్రాంతంలో 13,600 ఎకరాలు ముంపునకు గురవుతుందని పేర్కొంది. ఇందులో సీడ్ కాపిటిల్ పరిధిలోనే 10,600 ఎకరాలు వరద నీటితో మునిగిపోతాయని సీఆర్డీఏ తేల్చింది. 3.84 టీఎంసీ వరద వస్తుందని, ఇందులో 80 శాతం కేపిటల్ సిటీలోనే వరద ఉంటుందని, అయితే ఈ వరద నీటి వినియోగం ఉండదని, కృష్ణా నది ద్వారా సముద్రంలోకి వెళ్లి పోతుందని సీఆర్డీఏ పేర్కొంది. వరద నియంత్రణ చర్యల్లో భాగంగా కొండవీటి వాగుకు వరద కాల్వను 30 కిలో మీటర్ల మేర నిర్మిస్తారు. అలాగే ఎర్రవాగు, కోటివాగు, అయ్యన్నవాగు, పాలవాగుకు 53 కిలోమీటర్ల మేర వరద కాల్వను నిర్మిస్తారు. అలాగే ఒక్కో టీఎంసీ చొప్పున వరద నీటిని నిలువరించేందుకు నీరుకొండ, కృష్ణయ్యపాలెం వద్ద పాండ్స్ నిర్మాణం చేపడతారు. కృష్ణా నది ఒడ్డున 29 కిలోమీటర్ల మేర వరద నీరు సులువుగా వెళ్లిపోవడానికి వీలుగా నిర్మాణం చేపడతారు. అలాగే 40 కిలోమీటర్ల మేర వరద నీటి డ్రైనేజీ నిర్మాణం చేపట్టనున్నారు. ఈ పనులను ఇంజనీరింగ్ ప్రొక్యూర్మెంట్ కన్స్ట్రక్షన్ (ఈపీసీ) విధానంలో చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. రాజధాని గ్రామాలకు ముప్పే... క్యాపిటల్ పరిధిలోని కొన్ని ప్రాంతాల్లో ఎత్తు పెంచితే రాజధానిలోని ఇతర గ్రామాల పరిస్థితి ఏంటనే ఆందోళన స్థానికుల నుంచి వ్యక్తమవుతోంది. గ్రామాలు ముంపునకు గురవుతాయని భయపడుతున్నారు. కృష్ణానదికి అభిముఖంగా నిర్మించనున్న రాజధానికి కొండవీటి వాగు నుంచి వచ్చే వరద ముప్పు పొంచి ఉందని తొలి నుంచే నిపుణులు హెచ్చరిస్తున్నారు. కృష్ణా నదికి, కొండవీటి వాగుకు ఏకకాలంలో వరద వస్తే రాజధాని ప్రాంతం రోజుల తరబడి వరద ముంపులో ఉంటుంది. కృష్ణా నదిలో 4.50 లక్షల క్యూసెక్కుల వరద కొనసాగుతున్న సమయంలో కొండవీటి వాగు వరద నదిలోకి చేరదు. వెనక్కు తన్నుతుంది. 2009లో సుమారు 11 లక్షల క్యూసెక్కుల వరద కృష్ణాకు వచ్చింది. ప్రకాశం బ్యారేజీ నుంచి అమరావతి వైపు ఉన్న కరకట్టను వరద తాకింది. అది సముద్ర మట్టానికి సుమారు 24 మీటర్ల ఎత్తున ఉంది. భవిష్యత్తులో రాజధాని భద్రత దృష్ట్యా ఆ మేరకు నిర్మాణాల ఫ్లాట్‌ఫాం 8 అడుగుల మేర పెంచాలనేది ప్రతిపాదన. సింగపూర్ మాస్టర్ ప్లాన్ ప్రకారం కూడా సీడ్ రాజధాని, తాత్కాలిక సచివాలయం నిర్మిస్తున్న డౌన్‌టౌన్ ప్రాంతాన్ని సముద్ర మట్టం కన్నా ఎత్తు పెంచాలని నిర్ణయించారు. ప్లాట్‌ఫాం ఎత్తు పెంచాల్సి వస్తే రాజధాని పరిధిలోని తక్కిన గ్రామాల పరిస్థితి ఏమిటనే విషయాన్ని ప్రభుత్వం పట్టించుకోవడంలేదు. వరద నీరు పోవడానికి కొండవీటి వాగు వరదను మళ్లిస్తామని, రిజర్వాయర్లు ఏర్పాటు చేస్తామని చెపుతున్నా ఫ్లాష్‌ఫ్లడ్స్ వస్తే తమ గ్రామాలు మునగక తప్పదని స్థానికులు ఆందోళనకు లోనవుతున్నారు. పైగా రాజధాని ప్రాంతంలో ఎక్స్‌ప్రెస్ హైవేలు, ఇన్నర్, అవుటర్ రింగ్ రోడ్లు, ఆర్టీరియల్స్ రోడ్లు నిర్మాణం పెద్ద ఎత్తున చేపట్టనున్నట్లు మాస్టర్‌ప్లాన్‌లో పొందుపరిచారు. అవన్నీ రూపుదిద్దుకుంటే వరదనీరు సాఫీగా నదివైపు, దిగువనకు వెళ్లకుండా ఎక్కడికక్కడ అడ్డుకునే పరిస్థితులు ఎదురవుతాయని నిపుణులంటున్నారు. -
'గ్లోబల్ టెండర్ల ద్వారా సీడ్ క్యాపిటల్ నిర్మాణం'
విజయవాడ : గ్లోబల్ టెండర్ల ద్వారా సీడ్ క్యాపిటల్ నిర్మాణం చేపడతామని ఏపీ మున్సిపల్ పరిపాలన శాఖ మంత్రి పి.నారాయణ వెల్లడించారు. శనివారం విజయవాడలో పి.నారాయణ మాట్లాడుతూ... సీడ్ క్యాపిటల్ ప్రాంతంలోని మూడు గ్రామాల రైతులకు ఆయా గ్రామాల పరిధిలో భూములిచ్చే అవకాశం లేదని స్పష్టం చేశారు. మరోసారి ల్యాండ్ పూలింగ్ అభ్యంతరాలపై ఫిబ్రవరి1 నోటిఫికేషన్ విడుదల చేస్తామని చెప్పారు. గ్రామాల నుంచి అభ్యంతరాలు వస్తే.. రోడ్లను బైపాస్ చేస్తామని నారాయణ స్పష్టం చేశారు. -
రాజధాని రోడ్లకు 693 ఎకరాల భూ సేకరణ
సాక్షి, హైదరాబాద్: సీడ్ కేపిటల్ ప్రాంతంలో విశాలమైన రోడ్లను నిర్మించేందుకు 693 ఎకరాల భూమి అవసరమని ప్రభుత్వం తేల్చింది. రాజధాని ప్రాంతంలో సమీకరించిన భూములు కాకుండా కేవలం రోడ్ల విస్తరణకు 277.27 హెక్టార్లు (693 ఎకరాలు) కావాలని భావిస్తోంది. సింగపూర్ ప్రణాళికను అనుసరించి విజయవాడ నుంచి అమరావతి వరకూ, మంగళగిరి నుంచి అమరావతి వరకూ మొత్తం 88 కి.మీ. మేర ఐదు కేటగిరీలుగా రోడ్లను నిర్మించేందుకు కసరత్తు మొదలైంది. ఇందుకు కన్సల్టెన్సీల సేవలు వినియోగించుకునేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. రోడ్ల విస్తరణకు అవసరమైన ఫీజిబిలిటీ, డీపీఆర్ (డీటెయిల్డ్ ప్రాజెక్టు రిపోర్టులు) కన్సల్టెన్సీ సంస్థలు అందించాల్సి ఉంటుంది. రోడ్ల విస్తరణలో ఎక్కడెక్కడ ఆర్వోబీలు, ఫై్ల ఓవర్లు నిర్మించాలి.. భూ సేకరణ ఎంత చేపట్టాలి అనే అంశాలను అధ్యయనం చేసి కన్సల్టెన్సీ సంస్థలు నివేదిక రూపొందించాల్సి ఉంటుంది. రోడ్ల విస్తరణకు సర్వే, గ్రామాల మ్యాప్‌లు, మట్టి స్థితి గతులతో కూడిన సమగ్ర అధ్యయనం కన్సల్టెన్సీలు చేపట్టాలి. కన్సల్టెన్సీ సేవలకు సంబంధించి దరఖాస్తుల స్వీకరణకు నేటితో గడువు ముగియనుంది. రాజధాని సీడ్ ప్రాంతంలో రోడ్లను 60 మీటర్లు, 40 మీటర్లు, 25 మీటర్లుగా విస్తరించనున్నారు. డిజైన్ 2016 జూన్ నాటికి పూర్తి చేసి, 2017 సంవత్సరం ఆఖరు నాటికి రోడ్ల నిర్మాణం పూర్తి చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. సీడ్ కేపిటల్లో 34 కిలోమీటర్ల ప్రజా రవాణా వ్యవస్థ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. 12 కి లోమీటర్ల మేర మెట్రో రైలు, 15 కి లోమీటర్ల మేర బీఆర్టీ, 7 కిలోమీటర్ల మేర జలరవాణా వ్యవస్థ అందుబాటులోకి తెచ్చేందుకు అధ్యయనానికి కన్సల్టెన్సీ సేవలు వినియోగించుకోవాలని భావిస్తోంది. -
సీడ్ కేపిటల్‌కు 4,227 ఎకరాలు
సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి సీడ్ కేపిటల్‌కు 4,227 ఎకరాల భూమి అవసరమని మాస్టర్ ప్లాన్‌లో పేర్కొన్నారు. ఇందులో ఏకంగా 2,861 ఎకరాలను ప్రైవేట్ కంపెనీలకే కేటాయించారు. ప్రభుత్వ పరిపాలన భవనాలకు 150 ఎకరాలు సరిపోతుందని పేర్కొంటూ బిజినెస్ పార్కులు, వాణిజ్య అవసరాలు, ప్రత్యేక అభివృద్ధి జోన్, మిశ్రమ వినియోగం రంగాలకు ఏకంగా 2,861 ఎకరాలను కేటాయిస్తూ ప్రణాళికను రూపొందించారు. ఈ మొత్తం భూమిని ప్రైవేట్ సంస్థలు, వ్యక్తులకు అభివృద్ధి పేరుతో 99 సంవత్సరాల పాటు లీజుకు ఇవ్వనున్నారు. అలాగే తుళ్లూరు దగ్గరలో తక్షణం 280 ఎకరాల భూమిని ఎలక్ట్రానిక్స్, హార్డ్‌వేర్, ఫుడ్, బేవరేజెస్, ప్రింటింగ్ తదితర పరిశ్రమలకు కేటాయించాల్సిందిగా ప్రణాళికలో స్పష్టం చేశారు. లింగాయపాలెం, ఉద్దండరాయ పాలెం, మందడ గ్రామాల్లోనే ప్రభుత్వ పరిపాలన భవనాలు వస్తాయని ప్రణాళికలో స్పష్టం చేశారు. ఈ గ్రామాల్లో నివ సించే వారికి సీడ్ కేపిటల్ బయట మూడు అంతస్థుల భవనాల్లో నివాసాలను ఏర్పాటు చేయాలని ప్రణాళికలో పేర్కొన్నారు. ఈ మూడు గ్రామాల్లో 29 హెక్టార్ల పరిధిలో 4,157 కుటుంబాలు నివసిస్తున్నట్లు తేల్చారు. వీరికి మూడు అంతస్థుల భవనాల్లో నివాసాలను కేటాయించాల్సి ఉందన్నారు. దీన్ని పారిశ్రామిక క్లస్టర్‌గా అభివృద్ధి చేయాలని ప్రణాళికలో పేర్కొన్నారు. సీడ్ కేపిటల్ భూమిని ఎకరాల లెక్కన రంగాల వారీగా కేటాయించారు. రాజధాని రోడ్లకు 693 ఎకరాల సేకరణ సాక్షి, హైదరాబాద్: సీడ్ కేపిటల్ ప్రాంతంలో విశాలమైన రోడ్లను నిర్మించేందుకు 693 ఎకరాల భూమి అవసరమని ప్రభుత్వం తేల్చింది. రాజధాని ప్రాంతంలో సమీకరించిన భూములు కాకుండా కేవలం రోడ్ల విస్తరణకు 277.27 హెక్టార్లు (693 ఎకరాలు) కావాలని భావిస్తోంది. సింగపూర్ ప్రణాళికను అనుసరించి విజయవాడ నుంచి అమరావతి వరకూ, మంగళగిరి నుంచి అమరావతి వరకూ మొత్తం 88 కి.మీ. మేర ఐదు కేటగిరీలుగా రోడ్లను నిర్మించేందుకు కసరత్తు మొదలైంది. ఇందుకు కన్సల్టెన్సీల సేవలు వినియోగించుకునేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. -
రోడ్డు పడితేనే రాజధాని నిర్మాణం
సాక్షి, విజయవాడ బ్యూరో: రాజధాని మాస్టర్ ప్లాన్‌కు అనుగుణంగా ప్రధాన రోడ్లను నిర్మిస్తేనే సీడ్ కేపిటల్లో నగర నిర్మాణ పనులు వేగవంతమవుతాయని ప్రభుత్వం భావిస్తోంది. ఇందుకోసం మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, సీఆర్డీఏ ఉన్నతాధికారులు కసరత్తు మొదలు పెట్టారు. అక్టోబరు 22న రాజధాని నిర్మాణానికి శంకుస్థాపన జరపాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ లోగానే మాస్టర్ డెవలపర్ ఎంపిక పూర్తవుతుంది. పనులు మొదలయ్యాక భారీ యంత్రాలు, వాహనాల రాకపోకలు పెరుగుతాయి. చెన్నై, కృష్ణపట్నం, కాకినాడ పోర్టుల నుంచి భారీ నిర్మాణ సామాగ్రి వస్తుంది. మంగళగిరి వై జంక్షన్ దగ్గర భారీ మెటీరియల్ స్టాక్ పాయింట్‌ను ఏర్పాటు చేసి అక్కడి నుంచి సీడ్ కేపిటల్ వరకూ చిన్నచిన్న వాహనాల్లో వీటిని తరలించాలని యోచిస్తోంది. ఇందుకోసం నాలుగు వరుసల రోడ్లు నిర్మించాలని భావిస్తోంది. ఇందులో భాగంగా సీఆర్డీఏ అధికారులు మూడ్రోజుల క్రితం కన్సెల్టెన్సీలను ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఐదో నంబరు జాతీయ రహదారిలో కృష్ణానదిపై నిర్మించిన కనకదుర్గమ్మ వారధి నుంచి ఉండవల్లి మీదగా సీడ్‌కేపిటల్ ప్రాంతం వరకూ 15 కిలోమీటర్ల మేర నిర్మించ తలపెట్టిన నాలుగు వరుసల యాక్సెస్రోడ్డు పనులను చేపట్టదల్చుకున్న కన్సెల్టెన్సీ సంస్థలు ఈ నెల 8 లోగా తమ సమగ్ర ప్రాజెక్టు నివేదిక(డీపీఆర్)లను అందజేయాల్సి ఉంటుంది. దీన్నిబట్టి చూస్తే మణిపాల్ ఆస్పత్రి ముందున్న కరకట్ట రోడ్డు మీదుగా ఫై్లవోవర్, సీతానగరం రైల్వే లైనుపై రైల్ ఓవర్ బ్రిడ్జి నిర్మిస్తారు. ఇక్కడున్న కొండ చుట్టూ మళ్లీ ఫై్లవోవర్ను కొనసాగించి ప్రకాశం బ్యారేజీ రోడ్డుకు కలుపుతారు. మళ్లీ ఇక్కడి నుంచి నాలుగు వరుసల రోడ్డు మొదలై ఉండవల్లి, పెనుమాక పక్కగా తాళ్లాయిపాలెం వరకూ వెళ్తుంది. కృష్ణా జిల్లా గొల్లపూడి తొమ్మిదో నంబరు జాతీయ రహదారి నుంచి కృష్ణానది మీదగా రాజధాని ముఖద్వారం నుంచి గేట్‌వే పక్కగా వెళ్లే నాలుగు వరసల ఎక్స్‌ప్రెస్ వే మార్గంలో ఈ 15 కి.మీ యాక్సెస్ రోడ్డు కలుస్తుంది. ఐదో నంబరు రహదారి నుంచి మరో ఎక్స్‌ప్రెస్ వే? ఐదో నెంబరు జాతీయ రహదారి నుంచి కూడా మరో ఎక్స్‌ప్రెస్ వేను సీడ్‌కేపిటల్ వరకూ నిర్మించే వీలుంది. సీడ్ కేపిటల్ మాస్టర్‌ప్లాన్‌లో పొందు పర్చిన ప్రకారం తాడేపల్లికు శివారునున్న కొలనుకొండ- కృష్ణా పశ్చిమ డెల్టా కాల్వలకు ఉత్తరంగా హైవే నుంచి మొదలయ్యే నాలుగు వరుసల ఎక్స్‌ప్రెస్ వే తాడేపల్లి మండల కార్యాలయం పక్కగా ఉండవల్లికి ఉత్తరంగా కొండల వరకూ వెళ్తుంది. ఇక్కడున్న కొండకు సొరంగం వేసి పెనుమాక, కృష్ణాయపాలెం, మందడం మీదగా తాళ్లాయిపాలెం వరకూ ఈ రోడ్డు నిర్మాణం ఉంటుంది. దీనికి సంబంధించిన వివరాలను మాత్రం సీఆర్డీఏ నోటిఫికేషన్లో పొందుపర్చలేదు. సీడ్ కేపిటల్‌కు అనుసంధాన(ఆర్టేరియల్) రహదారులన్నింటినీ ఒకే సంస్థకు అప్పగించే అవకాశాలున్నాయని చెబుతున్నారు. భౌగోళిక అంశాలను పరిశీలిస్తే రాజధాని ప్రాంతం మొత్తం గుంటూరు జిల్లా వైపే అభివృద్ధి చెందే వీలున్నందున రోడ్డు మార్గాలన్నీ ఎక్కువగా ఇటువైపే ఉంటాయని అధికారవర్గాలు చెబుతున్నాయి. రాయలసీమ జిల్లాల నుంచి రాజధానికి వచ్చే ప్రధాన రోడ్లన్నింటినీ ఇవి కలుపుకుని సీడ్ కేపిటల్ వరకూ తీసుకెళ్తాయని వీరంటున్నారు. -
ఊళ్ల జోలికొస్తే ఊరుకోం..
కునుకు పట్టని కృష్ణాతీరం సీడ్‌క్యాపిటల్ ప్రణాళిక వెల్లడితో రాజధాని ప్రాంత గ్రామాల్లో భయాందోళనలు గ్రామాలను కదిలిస్తే సహించేదిలేదని హెచ్చరికలు తుళ్లూరు/తాడికొండ : కృష్ణానదీ తీర ప్రాంత గ్రామాల ప్రజలకు కంటిమీద కునుకు కరువైంది. సీడ్ క్యాపిటల్ ప్రణాళిక అనంతరం ఊళ్లు ఖాళీ చేయాల్సి వస్తుందేమోనన్న భయం వారిని వెంటాడుతోంది. భూములిచ్చిన రైతులతో పాటు పొలం పనులు లేక పింఛన్ రాక పస్తులతో బిక్కుబిక్కు మంటూ కాలం గడుపుతున్న వ్యవసాయ కూలీలు, ఇతర వర్గాలు రేపు ఏం జరుగుతుందోననే భయంతో తల్లడిల్లుతున్నారు. కృష్ణానది చెంతనే తరతరాలుగా ఉంటూ ఎన్నో వరద పోట్లు తట్టుకొని నిలబడ్డాం.. ఇప్పుడు ఊళ్లని వదిలి పోయే ప్రసక్తే లేదని ఖరాఖండిగా చెబుతున్నారు. ఊరి కోసం ఉద్యమిస్తామంటూ హెచ్చరిస్తున్నారు. ఈ మేరకు తుళ్ళూరు మండలం ఉద్దండ్రాయునిపాలెం మండల పరిషత్ పాఠశాలలో మంగళ వారం వ్యవసాయకూలీలు, ఇతరవర్గాల ప్రజలు ధర్నా చేపట్టారు. తాళ్లాయపాలెం, మందడం, ఉద్దండ్రాయుని పాలెం, లింగాయపాలెం, రాయపూడి, బోరుపాలెం నదీపరివాహక గ్రామాల జాబితాలోఉన్నాయి. సీడ్ క్యాపిటల్ ప్రణాళిక అనంతరం అందరి దృష్టి లింగాయపాలెం, ఉద్దండ్రాయునిపాలెం, తాళ్ళాయపాలెం గ్రామాలపైనే ఉంది. లింగాయపాలెంలో 613 కుటుంబాలు ఉండగా 1755 మంది జనాభా ఉన్నారు. తాళ్లాయపాలెంలో 460 కుటుంబాలు1700 జనాభా, ఉద్దండ్రాయునిపాలెంలో 630 కుటుంబాలుండగా 1846 మంది జనాభా ఉన్నారు. రాజధాని కోసం భూములిచ్చాం.. ఇప్పుడు ఊళ్ళు ఖాళీ చేయాలంటే అంగీకరించేది లేదని లింగాయపాలెంకు చెందిన కొండెపాటి శ్రీనివాసరావు అనే రైతు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఊళ్లు కదిలించేది లేదని నమ్మబలికి చంద్రబాబు ప్రభుత్వం ప్రజలను మోసగిస్తోందని మండిపడ్డారు. ‘చంద్రబాబు ఎలచ్చన్లపుడు ఇళ్ళు కట్టిత్తామని చెప్పి ఇప్పుడు ఇళ్ళు కూలుత్తానంటునడు..మమ్మల్ని ఏట్లో ముంచి పెద్దపెద్ద భవనాలు కడతానంటున్నాడు’ అని ఉద్ద్దండ్రాయునిపాలెంకు చెందిన 75 ఏళ్ళ కొర్లేమర్ల లక్ష్మీ అనే వృద్ధురాలు వాపోయింది. చంద్రబాబు కడుతున్నది ప్రజలను ఉద్దరించే రాజధాని కాదని అదే గ్రామానికి చెందిన పూల నాగేశ్వరరావు అన్నారు. ఊళ్ళను ఖాళీ చేయించాలనుకుంటే రాజధాని నిర్మాణం సంగతి మరచి పోవాల్సిందేనని ముక్తకంఠంతో చెబుతున్నారు. -
సింగపూర్ భాగస్వామ్యంతో రాజధాని నిర్మాణం
స్విస్ చాలెంజ్ విధానంలో ప్రతిపాదనలు కోరాం * మాస్టర్ప్లాన్లపై త్వరలో కార్యాచరణ * ఈశ్వరన్‌తో కలసి వెల్లడించిన సీఎం చంద్రబాబు * సీడ్ కేపిటల్ ప్రణాళికను సమర్పించిన సింగపూర్ బృందం రాజమండ్రి నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి: అమరావతి రాజధాని నిర్మాణంలో భాగస్వాములయ్యేందుకు సింగపూర్ ప్రభుత్వాన్ని స్విస్ చాలెంజ్ విధానం కింద ప్రతిపాదనలు ఇవ్వాలని కోరినట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు. దీర్ఘకాలిక భాగస్వామ్యం కొనసాగేలా ప్రతిపాదనలు ఉండాలని చెప్పినట్లు తెలిపారు. ఇక్కడితో ఆగిపోతే ఇదంతా కాగితాలకే పరిమితమవుతుందని, అందుకే వారిని నిర్మాణంలో భాగస్వాములు కావాలని కోరుతున్నామన్నారు. సోమవారం రాజమండ్రిలోని ఒక హోటల్లో సింగపూర్ వాణిజ్య శాఖ మంత్రి ఎస్.ఈశ్వరన్ అమరావతి సీడ్ కేపిటల్ ప్రణాళికను ముఖ్యమంత్రికి అందించారు. దీనిపై ఐదుగంటలపాటు సింగపూర్ బృందంతో చర్చించిన తర్వాత సీఎం ఈశ్వరన్‌తో కలసి విలేకరుల సమావేశంలో మాట్లాడారు. రాజధాని నిర్మాణంలో సింగపూర్ ప్రధాన భాగస్వామిగా ఉన్నా జపాన్ను పెట్టుబడులు పెట్టాలని కోరామని, ప్రపంచ స్థాయి కంపెనీలను ఆహ్వానిస్తున్నామని తెలిపారు. సింగపూర్ ఇచ్చిన మూడు ప్రణాళికలపై కార్యాచరణ ప్రణాళిక తయారు చేస్తామన్నారు. నిర్దిష్ట సమయంలో సింగపూర్ రాజధాని రీజియన్, రాజధాని నగరం, సీడ్ రాజధాని ప్రణాళికలు ఇవ్వడం అభినందనీయమన్నారు. ఒక్కపైసా అడక్కుండా సింగపూర్ ప్రభుత్వం ప్రణాళికలు తయారు చేసిందన్నారు. 2018 నాటికి తొలి దశ.. 7,420 చదరపు కి.మీ. రాజధాని ప్రాంతంలో 40 లక్షల జనాభా, 1.8 మిలియన్ ఉద్యోగాలు, 217 చదరపు కి.మీ. రాజధాని నగరంలో 18 లక్షల ఉద్యోగాలు, 16.9 చదరపు కి.మీ. సీడ్ కేపిటల్లో మూడు లక్షల జనాభా 7 లక్షల ఉద్యోగాలుండేలా ప్రణాళిక రూపొందిందని తెలిపారు. 2018 నాటికి తొలి దశగా సీడ్ కేపిటల్ నిర్మాణాన్ని పూర్తి చేయాలని భావిస్తున్నట్లు తెలిపారు. ఏలూరు వరకూ విస్తరణ..: అమరావతి రాజధాని నగరంలో విజయవాడ, గుంటూరు, తెనాలి కలుస్తాయని స్పష్టం చేశారు. రాజధాని ప్రాంతాన్ని ఏలూరు వరకూ విస్తరిస్తామన్నారు. భూసమీకరణ కింద 25 వేల ఎకరాలు తీసుకున్నామని, మిగిలిన భూములను ఇలాగే తీసుకోవాలని చూస్తున్నామని, కుదరకపోతే భూసేకరణకు వెళతామని చెప్పారు. భాగస్వామ్యానికి ప్రతిపాదనలిస్తాం: ఈశ్వరన్ సింగపూర్ మంత్రి ఈశ్వరన్ మాట్లాడుతూ సీడ్ కేపిటల్ నిర్మాణంలో భాగస్వాములయ్యేందుకు స్విస్ చాలెంజ్ విధానంలో ప్రతిపాదనలు ఇస్తామని తెలిపారు. ఇందుకు తమ ప్రభుత్వ కంపెనీలను ఎంపిక చేస్తామన్నారు. ప్రతిపాదనలు దీర్ఘకాలికంగా ఉండేలా చూడాలని సీఎం కోరుతున్నారని చెప్పారు. ఆయన విజన్ ప్రకారమే ప్రణాళికలు తయారుచేశామన్నారు. ప్రపంచస్థాయి ఆర్థికాభివృద్ధి, ఉద్యోగావకాశాలు, మౌలిక వసతులు, నివాస ప్రాంతంగా ఉండేలా రాజధాని మాస్టర్‌ప్లాన్ రూపొందించినట్లు తెలిపారు. రాజధాని నిర్మాణంతోపాటు ఇక్కడి వారికి నైపుణ్యాభివృద్ధిలో శిక్షణ ఇచ్చేందుకు సహకరిస్తామని, ఇప్పటికే తమ సంస్థ సెంటర్ ఫర్ లివబుల్ సొసైటీ కొందరికి శిక్షణ ఇచ్చిందని తెలిపారు. సీడ్ కేపిటల్ ప్రజెంటేషన్‌ను వీక్షించిన తర్వాత సీఎం, ఈశ్వరన్‌తో హోటల్లో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. -
ఇటుకలు గానీ.. డబ్బులు గానీ ఇవ్వండి
-
ఏపీ రాజధానిలో 45 అంతస్తుల టవర్లు
-
గ్రామాలు గల్లంతే !
► రాజధాని ప్రాంతంలో పల్లెల మనుగడకు ప్రమాదం ► అవి ఉంటే మురికివాడలుగా కనిపిస్తాయని పాలకుల భావన ► ఎత్తు పెంపు ప్రణాళికల మాటున ఇక్కడినుంచి ఎత్తివేసే ఎత్తుగడ సాక్షి ప్రతినిధి, గుంటూరు : ప్రతిపాదిత రాజధానిలో పల్లెలు గల్లంతుకానున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధి విధానాలు, మంత్రుల ప్రకటనలు ఇందుకు అనుగుణంగానే ఉండడంతో అక్కడి ప్రజల్లో ఆందోళన ప్రారంభమైంది. సీడ్ కేపిటల్ (తొలిదశ) నిర్మాణాలకు నాలుగు గ్రామాల ఎంపిక, విశాలమైన రహదారులు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ సౌకర్యాల ఏర్పాటుకు భారీ ప్రణాళికలు, ముంపు ప్రమాదం లేకుండా సముద్ర మట్టానికి అనుగుణంగా గ్రామాల ఎత్తు పెంపు వంటి ఆలోచనలు పల్లెల ఎత్తివేతకేనంటున్నారు. వారందరికీ బహుళ అంతస్తుల భవనాల్లో నివాసం కల్పించే దిశగా ప్రభుత్వం ఆలోచనలు చేస్తోంది. అంతర్జాతీయ స్థాయిలో నిర్మించనున్న నవ్యాంధ్ర రాజధానిలోనే పల్లెలు కొనసాగితే అవన్నీ మురికివాడలుగా కనిపించే అవకాశం ఉంది. ఇదే అభిప్రాయంలో ప్రభుత్వం ఉండటంతో వీటిని తొలగించే అవకాశాలే ఎక్కువంటున్నారు. మొదటి నుంచి రాజధానిలోని 29 గ్రామాలను తొలగించేది లేదని, అవన్నీ యథావిధిగా కొనసాగుతాయని అధికారులు, మంత్రులు ప్రకటనలు చేస్తూ వచ్చారు. దీనికి విరుద్ధంగా తొలిగా సీడ్ క్యాపిటల్‌కు నేలపాడు, ఐనవోలు, శాఖమూరు, వెలగపూడి గ్రామాలను ప్రభుత్వం ఎంపిక చేసింది. భూ సమీకరణకు మొదటి నుంచి సానుకూలంగా స్పందించిన ఈ గ్రామాల్లోనే రాజధానికి సంబంధించిన ముఖ్యమైన నిర్మాణాలు చేపట్టే దిశగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. అదే జరిగితే ఈ గ్రామాలు కనుమరుగుకాక తప్పదు. విశాలమైన రోడ్లకు ప్రణాళిక రాజధానికి విశాలమైన రహదారులు, భూగర్భ మురుగునీటి పారుదల సౌకర్యాలు, ముంపు బెడద నుంచి తప్పించేందుకు ప్రభుత్వం ప్రణాళికలు రూపొందిస్తోంది. ప్రస్తుతం రహదారుల వెడల్పు 20 అడుగులకు మించి లేదు. నవ్యాంధ్ర రాజధానికి నాలుగు సమాంతర రహదారుల నిర్మాణాలకు అంచనాలు రూపొందుతున్నాయి. ఆర్ అండ్ బీ, పంచాయతీరాజ్ శాఖలు ఇప్పటికే రాజధాని వరకు రవాణా సౌకర్యం మెరుగుకు 100 అడుగుల నిడివి కలిగిన రహదారుల విస్తరణకు అంచనాలు రూపొందించాయి. వీటికి అనుగుణంగా రహదారుల విస్తరణ జరిపితే అనేక భవనాలను నేలకూల్చక తప్పదు. గ్రామాల స్థానంలో బహుళ అంతస్తుల నిర్మాణం? కొండవీటి వాగు ముంపు నుంచి రాజధానిని కాపాడేందుకు సముద్ర మట్టానికి అనుగుణంగా రాజధాని గ్రామాల ఎత్తు పెంచుతామని మంత్రులు ప్రకటనలు చేస్తున్నారు. ఇది సాధ్యమయ్యే అవకాశం లేకపోవడంతో ఈ గ్రామాలను పూర్తిగా ఎత్తివేసి, అక్కడ నిర్మించనున్న బహుళ అంతస్తుల్లో వారికి నివాసం కల్పించే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్టు తెలుస్తోంది. జోన్ల వారీగా అభివృద్ధి జరుగుతుందని, గ్రామ కంఠాల పరిధి పెరగదనే ప్రకటనలతో రాజధాని గ్రామాల ప్రజల్లో ఆందోళన ప్రారంభమైంది. పొంతనలేని ప్రకటనలకు రాజధాని గ్రామాల ప్రజలు కలత చెందుతున్నారు. పాలకుల మైండ్ గేమ్‌కు తట్టుకోలేక ఏదో ఒక రోజు రాజధాని గ్రామాల రైతులు స్వచ్ఛందంగా అక్కడి నుంచి తరలివెళ్లే అవకాశాలు లేకపోలేదు. వీటికితోడు సీఆర్డీఏ ఏడు వేల చదరపు కిలోమీటర్ల పరిధిలో ఉంది. ఈ పరిధిలో అభివృద్ధి పనులు చేపట్టడానికి సింగపూర్ ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. వీటిలో పారిశ్రామిక, నివాస ప్రాంతాలు, రోడ్ నెట్‌వర్క్‌లు ఉన్నాయి. రాజధాని నగరం 212 చదరపు కిలోమీటర్ల పరిధిలో ఉంది. ఈ పరిధిలో నిర్మాణాలకుతోడు మురుగునీరు, వరదనీటి పారుదలకు సంబంధించిన ప్రాజెక్టులకు ప్రణాళికలు రూపొందుతున్నాయి. వీటిల్లో అనేక ప్రాజెక్టులు రాజధాని గ్రామాల నుంచి కొనసాగుతాయి. ఈ ప్రాజెక్టుల నిర్మాణాలు చేపడితే రాజధాని గ్రామాల్లోని అనేక నివాసాలను తీసివేయాల్సి ఉంటుంది. కొన్నింటిని తొలగించి, మరి కొన్నింటిని కొనసాగించే కంటే మొత్తం గ్రామాలనే తొలగించాలని, లేకుంటే అవన్నీ మురికి వాడలుగా కనిపిస్తాయనే ఉద్దేశంతో ప్రభుత్వం ఉంది. ఒక సమయంలో పురపాలక శాఖ మంత్రి పి.నారాయణ రాజధాని నిర్మాణం జరిగితే ఆ పరిసరాల్లోని రాజధాని గ్రామాలు మురికివాడలుగా కనిపిస్తాయని పేర్కొన్నారు. ఈ అభిప్రాయానికి అనుగుణంగానే ప్రభుత్వ చర్యలు ఉండటంతో రాజధాని గ్రామాల మనుగడపై సందేహాలు వ్యక్తం అవుతున్నాయి.