28న సీడ్ క్యాపిటల్ భవనాలకు శంకుస్థాపన | Union Minister Arun Jaitley going to attend sceed capital | Sakshi
Sakshi News home page

28న సీడ్ క్యాపిటల్ భవనాలకు శంకుస్థాపన

Published Wed, Oct 26 2016 1:46 AM | Last Updated on Fri, Nov 9 2018 5:56 PM

28న సీడ్ క్యాపిటల్ భవనాలకు శంకుస్థాపన - Sakshi

28న సీడ్ క్యాపిటల్ భవనాలకు శంకుస్థాపన

హాజరుకానున్న కేంద్రమంత్రి అరుణ్‌జైట్లీ

 తుళ్లూరు రూరల్: రాజధాని ప్రాంతంలోని సీడ్ క్యాపిటల్ పరిధిలో ప్రభుత్వ భవనాల సముదాయాల నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం ముహూర్తం ఖరారు చేసింది. ఈ నెల 28న కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ, సీఎం చంద్రబాబు చేతులమీదుగా శంకుస్థాపన చేయనున్నారు.

లింగాయపాలెం, రాయపూడి గ్రామాల పరిధిలోని 950 ఎకరాల్లో ఈ భవన నిర్మాణం జరుగుతుందని సీఆర్‌డీఏ అధికారులు చెబుతున్నారు. శంకుస్థాపన పురస్కరించుకొని 100 ఎకరాల భూమిని చదును చేస్తున్నట్లు చెప్పారు. ఈ మేరకు గుంటూరు కలెక్టర్ కాంతిలాల్ దండే, సీఆర్‌డీఏ కమిషనర్ చెరుకూరి శ్రీధర్ మంగళవారం ఏర్పాట్లను పర్యవేక్షించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement