ఆంధ్రప్రదేశ్ సీడ్ క్యాపిటల్ మాస్టర్ ప్లాన్ను సింగపూర్ బృందం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడకు అందజేసింది. మొత్తం 16.9 చదరపు కిలోమీటర్ల పరిధిలో సీడ్ క్యాపిటల్ను నిర్మించాలని అందులో ప్రతిపాదించారు. మొత్తం 4,176 ఎకరాల విస్తీర్ణంలో సీడ్ క్యాపిటల్ను ఏర్పాటు చేస్తామన్నారు. 40 లక్షల మంది నివాసానికి వీలుగా ప్రణాళికను రూపొందించారు. అలాగే కృష్ణానది పరివాహక డిజైన్ను కూడా సింగపూర్ బృందం తయారుచేసింది. రాజధాని నగరంలో ఐటీ, బిజినెస్ హబ్లను ఏర్పాటు చేసేలా ప్రణాళికను రూపొందించారు. 45 అంతస్తులతో కూడిన రెండు టవర్స్లో ప్రభుత్వ కార్యాలయాలు ఉంటాయన్నారు. కృష్ణానదిలోని దీవులను పర్యాటక కేంద్రాలుగా అభివృద్ధి చేసేందుకు ప్రణాళిక రూపొందించారు. 2050 వరకు చేపట్టాల్సిన అభివృద్ధిపై సింగపూర్ బృందం సూచనలిచ్చింది. ఒక మహానగరం, 7 ప్రాంతీయ కేంద్రాలు, 7 డెవలప్మెంట్ కారిడార్లతో మాస్టర్ ప్లాన్ రూపొందించారు. వెయ్యి కిలోమీటర్ల పరిధిలో రహదారులతో కూడిన మాస్టర్ ప్లాన్ సిద్ధమైంది.