సాక్షి, కామారెడ్డి: కామారెడ్డి పట్టణ మాస్టర్ ప్లాన్ ముసాయిదా వివాదం రోజురోజుకీ ముదురుతోంది. మాస్టర్ ప్లాన్ ప్రతిపాదనలపై వ్యతిరేకంగా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. భూమి కోసం.. మాస్టర్ ప్లాన్ నుంచి విముక్తి కోసం రైతుల ఆందోళనలు నెలరోజులుగా కొనసాగుతున్నాయి. తాజాగా మాస్టర్ ప్లాన్ ప్రతిపాదనపై కలెక్టర్ జితేష్ పాటిల్ మరోసారి వివరణ ఇచ్చారు. ఇది కేవలం ప్రతిపాదన మాత్రమేనని.. ఎవరి భూములు తీసుకోవడం లేదని వెల్లడించారు. అందరి అభిప్రాయాలను సేకరిస్తామని, ఇంకా 60 రోజులు పూర్తి కాలేదని తెలిపారు.
జనవరి 11 వరకు అభిప్రాయాలు చెప్పొచ్చని కలెక్టర్ తెలిపారు. 2000 సంవత్సరం పాత మాస్టర్ ప్లాన్‌లో రోడ్లను కూడా చూపించారు. వారి భూములు పోయాయా అని ప్రశ్నించారు. ఇప్పటికీ వారిపేరు మీదే భూములు ఉన్నాయని, రైతు బంధు వస్తోందని గుర్తు చేశారు. కొత్త మాస్టర్ ప్లాన్‌తో ఎవరి భూములు పోవని స్పష్టం చేశారు. కొత్త మాస్టర్ ప్లాన్‌పై ఇప్పటి వరకు వెయ్యి అభ్యంతరాలు వచ్చాయని,అభ్యంతరాలు చెప్పడానికి రైతులకు పూర్తి హక్కు ఉందని పేర్కొన్నారు.
ఇండస్ట్రీయల్ జోన్ అంటే భూ సేకరణ కాదు. అభ్యంతరాలను పరిశీలించి అధికారులు రిమార్క్స్ రాస్తారు. మార్పులు చేర్పులు చేయడానికే డ్రాఫ్ట్. ఇది ప్రతిపాదన మాత్రమే.. మొదటి స్టేజ్‌లోనే ఉంది. ఇండస్ట్రీయల్ జోన్ ప్రకటించిన మాత్రాన పంట పొలాలను లాక్కోరు.’ అని కలెక్టర్ పేర్కొన్నారు.
చదవండి: ఒకేసారి బండి, ఈటల ప్రసంగం.. సాంకేతిక లోపమా? కావాలనే చేశారా?
Comments
Please login to add a commentAdd a comment