Jitesh
-
కలెక్టర్, పీవో అడవిబాట
దుమ్ముగూడెం: ఇద్దరు ఐఏఎస్‌లు.. వారిలో ఒకరు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకలెక్టర్ జితేష్ వి.పాటిల్, మరొకరు భద్రాచలం ఐటీడీఏ పీవో బి.రాహుల్. పోడు సాగు అంశంపై హైకోర్టులో రైతులు పిటిషన్ దాఖలు చేయగా.. కోర్టు సూచనలతో క్షేత్రస్థాయిలో పరిశీలించేందుకు అడవిబాట పట్టారు. వాహనాలు వెళ్లే మార్గం లేకపోవడంతో రానుపోను 10కి.మీ. నడిచారు. సమస్య ఏంటంటే...భద్రాద్రి జిల్లా దుమ్ముగూడెం మండలం గౌరారం అటవీ రేంజ్ పరిధిలో పలువురు రైతులకు కొన్నాళ్ల క్రితం పోడు పట్టాలు అందాయి. అయితే, ఈ భూమిలో అటవీ అధికారులు తమను సాగు చేసుకోనివ్వడం లేదని, పంటలను ధ్వంసం చేస్తున్నారంటూ 23మంది గిరిజన రైతులు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈమేరకు క్షేత్రస్థాయిలో పరిశీలించి నివేదిక ఇవ్వాలన్న కోర్టు సూచనలతో కలెక్టర్ పాటిల్, పీవో రాహుల్ మంగళవారం అక్కడకు వెళ్లేందుకు సిద్ధమయ్యారు. దుమ్ముగూడెం మండలంలోని ములకనాపల్లి ప్రధానరహదారి వరకు మాత్రమే రహదారి ఉండడంతో వాహనాల్లో వెళ్లారు.అక్కడినుంచి దట్టమైన అడవిలో రెవెన్యూ, అటవీ అధికారులతో కలిసి కాలిబాటన వాగులు, వంకలు దాటుతూ గౌరారం వరకు 5 కి.మీ. వెళ్లి సమస్యపై రైతులు, అటవీ అధికారులతో మాట్లాడారు. అడవిని నరికారని అధికారులు వివరించారు. ఈ విషయాన్ని క్షేత్రస్థాయిలో పరిశీలించగా, ఫారెస్ట్ భూమిని కొందరు ఆక్రమించినట్టు తమ దృష్టికి వచ్చిందని కలెక్టర్ పాటిల్ తెలిపారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడు తూ హక్కు పత్రాల్లో ఉన్నంత మేరకు భూమి సాగు చేసుకోవాలని సూచించారు. మావోయిస్టుల వారోత్సవాలు జరుగుతున్న సమయాన అటవీ ప్రాంతంలో ఇద్దరు ఐఏఎస్‌లు పర్యటించడంతో పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. -
'అతిగా దాచుకోవడం కూడా జబ్బే..' అని మీకు తెలుసా!?
రాజీవ్ ఒక ప్రభుత్వ ఉద్యోగి. పెళ్లయి ఇద్దరు పిల్లలు. భార్య కూడా ప్రభుత్వోద్యోగి. ఇటీవల కాలంలో వారిద్దరూ తరచూ గొడవపడుతున్నారు. కారణం ఆర్థిక ఇబ్బందులో లేక అభిప్రాయభేదాలో కాదు. రాజీవ్‌కున్న వింత అలవాటు. అది దినపత్రికల్లో, మ్యాగజై¯Œ్సలో వచ్చే నచ్చిన స్టోరీలను దాచుకునే అలవాటు. అందులో వింతేముంది? నచ్చిన పుస్తకాలు దాచుకున్నట్లే అదికూడా.. అని మీరు అనుకోవచ్చు. కానీ ఇల్లంతా ఆ ఫైల్స్‌తోనే నిండిపోతే? వాటినుంచి వచ్చే దుమ్ము వల్ల పిల్లలు తరచూ అనారోగ్యానికి గురవుతుంటే? ఆ విషయం తెలిసినా ఆ ఫైల్స్ పడేయడానికి ఒప్పుకోకుంటే? వాటిని బయట పడేయడానికి ప్రయత్నించే భార్యతో గొడవ పడుతుంటే? ఆమె వెళ్లిపోతానని బెదిరించినా పట్టించుకోకపోతే? భార్యాపిల్లల కంటే ఫైల్సే ముఖ్యమనుకుంటే? దాన్నే హోర్డింగ్ డిజార్డర్ అంటారు. అంటే అవసరం లేని వస్తువులను అతిగా దాచుకునే మానసిక వ్యాధి. పేపర్ క్లిపింగ్సే కాదు పెన్నులు, పిన్నులు, రబ్బర్ బ్యాండ్లు, కర్చీఫ్‌లు.. ఇలా ఏదైనా సరే అతిగా దాచుకుంటున్నారంటే ఈ వ్యాధి బారిన పడినట్లే. వస్తువులను దాచుకోవడమే కాదు, అతిగా జంతువులను పెంచుకోవడం కూడా ఈ రుగ్మత కిందకే వస్తుంది. అతిగా ఆస్తులు కూడగట్టుకోవడం, వాటిని ఎవరికీ ఇవ్వకుండా దాచుకోవడం కూడా ఈ రుగ్మత పరిధిలోనిదే. హాబీ, హోర్డింగ్ డిజార్డర్ వేర్వేరు.. హాబీలకు, హోర్డింగ్ డిజార్డర్‌కు తేడా ఉంది. స్టాంపుల సేకరణ, నాణేల సేకరణ వంటి హాబీలున్నవారు అనేక అంశాలు శోధించి, సేకరిస్తారు. వాటిని ప్రదర్శిస్తారు. ఈ సేకరణలు భారీ స్థాయిలో ఉండవచ్చు. కానీ అవి చిందరవందరగా ఉండవు. చక్కగా, ఒక పద్ధతిలో అమర్చి ఉంటాయి. కానీ హోర్డింగ్ డిజార్డర్‌లో ఇందుకు భిన్నంగా చిందరవందరగా ఉంటాయి. అందువల్ల ఇవి రెండూ వేర్వేరు. టీనేజ్ లో మొదలు.. హోర్డింగ్ సాధారణంగా 15 నుంచి 19 సంవత్సరాల వయస్సులో ప్రారంభమవుతుంది. వయసుతో పాటు సమస్య కూడా పెరుగుతుంది. చివరకు భరించలేనిదిగా తయారవుతుంది. ఈ డిజార్డర్ ఉన్నవారిలో కనిపించే లక్షణాలు.. తమకు నచ్చిన వస్తువులు ప్రత్యేకమైనవని లేదా భవిష్యత్తులో ఏదో ఒక సమయంలో అవసరమని నమ్మడం వాటితో మానసికంగా కనెక్ట్ అయినట్లు అనిపించడం.. అవి చుట్టూ ఉన్నప్పుడు సురక్షితంగా ఫీలవ్వడం, ఓదార్పును అనుభవించడం.. అవసరం లేకపోయినా దాచుకోవడం, విలువ లేకపోయినా విసిరేయ లేకపోవడం.. వస్తువులను భద్రపరచాలని భావించడం, వదిలించుకోవాలంటే కలత చెందడం.. మీ గదులను ఉపయోగించలేని స్థాయిలో వస్తువులను నింపడం.. అపరిశుభ్రమైన స్థాయిలకు ఆహారం లేదా చెత్తను దాచడం.. దాచుకున్న వస్తువుల కోసం ఇతరులతో విభేదాలు.. అస్పష్టమైన కారణాలు.. హోర్డింగ్ డిజార్డర్‌కు కారణమేమిటో స్పష్టంగా తెలియలేదు. జన్యుశాస్త్రం, మెదడు పనితీరు, ఒత్తిడితో కూడిన సంఘటనలు సాధ్యమయ్యే కారణాలుగా అధ్యయనాల్లో వెల్లడైంది. ఈ డిజార్డర్ ఉన్న కుటుంబ సభ్యుడిని కలిగి ఉండటం కూడా బలమైన కారణమని తెలుస్తోంది. ప్రేమించిన వ్యక్తి మరణం, విడాకులు తీసుకోవడం లేదా అగ్నిప్రమాదంలో ఆస్తులను కోల్పోవడం వంటి ఒత్తిడితో కూడిన సంఘటనను ఎదుర్కొన్న తర్వాత కొందరిలో ఈ డిజార్డర్ మొదలవుతుంది. తక్షణ చికిత్స అవసరం.. కొందరు తమ జీవితాలపై హోర్డింగ్ డిజార్డర్ చూపించే ప్రతికూల ప్రభావాన్ని గుర్తించరు, చికిత్స అవసరమని భావించరు. ఈ డిజార్డర్‌ను అధిగమించేందుకు సైకోథెరపీ అవసరం. దాంతో పాటు మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు.. దాచుకోవడానికి కారణమైన నమ్మకాలను గుర్తించాలి , వాటిని సవాలు చేయాలి. మరిన్ని వస్తువులను పొందాలనే కోరికల నియంత్రణ అలవరచుకోవాలి. ఏయే వస్తువులను వదిలించుకోవచ్చో వాటిని వదిలించుకోవాలి. డెసిషన్ మేకింగ్‌ను.. కోపింగ్ మెకానిజాన్ని మెరుగుపరచుకోవాలి. గందరగోళాన్ని తగ్గించుకోవడానికి రోజువారీ పనులను షెడ్యూల్ చేసుకోవాలి. ఇంటిని చక్కగా నిర్వహించుకునేందుకు సాయం తీసుకోవాలి. హోర్డింగ్ ఒంటరితనానికి దారితీస్తుంది కాబట్టి ఇతరులకు చేరువవ్వాలి. ఇంటికి సందర్శకుల హడావిడిని వద్దనుకుంటే మీరే బయటకు వెళ్లొచ్చు. హోర్డింగ్ డిజార్డర్ సపోర్ట్ గ్రూప్‌లో చేరాలి. ఆలస్యం చేయకుండా సైకాలజిస్ట్ సహాయం తీసుకోవాలి. హోర్డింగ్ డిజార్డర్‌కి సిఫారసు అయిన మొదటి చికిత్స.. కాగ్నిటివ్ బిహేవియరల్ థెరపీ. ఈ రుగ్మత వల్ల వచ్చే ఆందోళన, నిరాశ వంటి వాటికి మందులు ఇస్తారు. థెరపీ షెడ్యూల్‌ను క్రమం తప్పకుండా అనుసరించాలి. దాచుకోవాలనే కోరికను తగ్గించుకోవడానికి ఇది సహాయపడుతుంది. — సైకాలజిస్ట్ విశేష్ (psy.vishesh@gmail.com) ఇవి చదవండి: హెల్త్: 'గుండె' పెరగడమా..? అవును ఇదొక సమస్యే..! -
పొలాలను లాక్కోరు.. కేవలం ప్రతిపాదన మాత్రమే: కామారెడ్డి కలెక్టర్
సాక్షి, కామారెడ్డి: కామారెడ్డి పట్టణ మాస్టర్ ప్లాన్ ముసాయిదా వివాదం రోజురోజుకీ ముదురుతోంది. మాస్టర్ ప్లాన్ ప్రతిపాదనలపై వ్యతిరేకంగా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. భూమి కోసం.. మాస్టర్ ప్లాన్ నుంచి విముక్తి కోసం రైతుల ఆందోళనలు నెలరోజులుగా కొనసాగుతున్నాయి. తాజాగా మాస్టర్ ప్లాన్ ప్రతిపాదనపై కలెక్టర్ జితేష్ పాటిల్ మరోసారి వివరణ ఇచ్చారు. ఇది కేవలం ప్రతిపాదన మాత్రమేనని.. ఎవరి భూములు తీసుకోవడం లేదని వెల్లడించారు. అందరి అభిప్రాయాలను సేకరిస్తామని, ఇంకా 60 రోజులు పూర్తి కాలేదని తెలిపారు. జనవరి 11 వరకు అభిప్రాయాలు చెప్పొచ్చని కలెక్టర్ తెలిపారు. 2000 సంవత్సరం పాత మాస్టర్ ప్లాన్‌లో రోడ్లను కూడా చూపించారు. వారి భూములు పోయాయా అని ప్రశ్నించారు. ఇప్పటికీ వారిపేరు మీదే భూములు ఉన్నాయని, రైతు బంధు వస్తోందని గుర్తు చేశారు. కొత్త మాస్టర్ ప్లాన్‌తో ఎవరి భూములు పోవని స్పష్టం చేశారు. కొత్త మాస్టర్ ప్లాన్‌పై ఇప్పటి వరకు వెయ్యి అభ్యంతరాలు వచ్చాయని,అభ్యంతరాలు చెప్పడానికి రైతులకు పూర్తి హక్కు ఉందని పేర్కొన్నారు. ఇండస్ట్రీయల్ జోన్ అంటే భూ సేకరణ కాదు. అభ్యంతరాలను పరిశీలించి అధికారులు రిమార్క్స్ రాస్తారు. మార్పులు చేర్పులు చేయడానికే డ్రాఫ్ట్. ఇది ప్రతిపాదన మాత్రమే.. మొదటి స్టేజ్‌లోనే ఉంది. ఇండస్ట్రీయల్ జోన్ ప్రకటించిన మాత్రాన పంట పొలాలను లాక్కోరు.’ అని కలెక్టర్ పేర్కొన్నారు. చదవండి: ఒకేసారి బండి, ఈటల ప్రసంగం.. సాంకేతిక లోపమా? కావాలనే చేశారా? -
ముంబై బౌలర్‌కు చుక్కలు చూపించాడు.. ఎవరీ జితేశ్ శర్మ?
ఐపీఎల్ 2022లో మరో యంగ్ ఆటగాడు తన టాలెంట్ చూపెట్టాడు. ముంబై ఇండియన్స్‌తో మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ బ్యాట్స్‌మన్ జితేశ్ శర్మ ఆకట్టుకునే ఇన్నింగ్స్ ఆడాడు. 15 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్సర్లతో 30 పరుగులు చేశాడు. చివర్లో జితేశ్ ఇన్నింగ్స్‌తోనే పంజాబ్ కింగ్స్ 190 పరుగులు మార్క్‌ను దాటింది. ముఖ్యంగా ఉనాద్కట్ వేసిన ఇన్నింగ్స్ 18వ ఓవర్లో రెండు సిక్సర్లు, రెండు ఫోర్లు సహా మొత్తం 22 పరుగులు పిండుకున్నాడు. కాగా జితేశ్ శర్మను పంజాబ్ కింగ్స్ రూ.20 లక్షల కనీస మద్దతు ధరకే కొనుగోలు చేసింది. మహారాష్ట్రలోని అమరావతికి చెందిన జితేశ్ శర్మ 2014లో విదర్భ తరపున దేశవాలీ క్రికెట్లో అరంగేట్రం చేశాడు. కాగా 2019 సీజన్లో విజయ్ హజారే ట్రోపీలో 298 పరుగులు చేసిన జితేశ్ శర్మ విదర్బ తరపున లీడింగ్ స్కోరర్‌గా నిలిచాడు. చదవండి: IPL 2022: రోహిత్ శర్మ కొత్త చరిత్ర.. టీమిండియా నుంచి రెండో ఆటగాడిగా var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_4141448520.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
యాక్టర్ అయిన పెలైట్
సినిమా ఫ్యాషన్ అయినప్పుడు వేరే వృత్తిపై మనసు లగ్నం కావడం కష్టమే. అలా పెలైట్‌గా శిక్షణ పొంది యాక్టరయ్యూరు జితేష్. ఉపాధ్యాయ కుటుంబానికి చెందిన ఈయన ఏరోనాటికల్ ఇంజనీరింగ్ చదివారు. హీరోగా తొలి చిత్రం చిక్కు ముఖి. మలి చిత్రం తలకోణం ఇటీవలే తెరపైకి వచ్చింది. ఇంతకీ ఈయన కథేంటో ఆయన మాటల్లోనే చూద్దాం. చిన్నప్పటి నుంచి నటన అంటే ఆసక్తి. అందుకే ఏరోనాటికల్ ఇంజనీరింగ్ చదివినా సినిమా రంగంపైనే మొగ్గు చూపాను. చదువుకునే రోజుల నుంచే స్టేజీ అనుభవం ఉంది. పలు నాటకాలు ఆడాను. ఆ తరువాత మోడలింగ్ రంగానికి పరిచయమయ్యాను. ప్రముఖ వాణిజ్య సంస్థలు చెన్నై సిల్క్స్, రామ్రాజ్ శ్రీదేవి టెక్స్‌టైల్స్‌కు మోడల్‌గా నటించాను. యూకేలో 45 నిమిషాల నిడివి గల రెండు చిత్రాల్లో నటించాను. నృత్య దర్శకుడు శ్రీధర్ వద్ద నృత్యంలో శిక్షణ పొందాను. ఒక నాటక ప్రదర్శనలో చూసిన చిక్కిముఖి చిత్ర నిర్మాత ఆ చిత్రంలో కథానాయకుడిగా అవకాశం కల్పించారు. ఆ తరువాత తలకోణం చిత్రంలో నటించే అవకాశం లభించింది. ఇటీవలే విడుదలైన ఈ చిత్రం నాకు మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది. ఈ మధ్యనే నాళై ఇయక్కునర్ (రేపటి దర్శకులు) టీమ్‌కు చెందిన భారతీ బాలకుమారన్ దర్శకత్వంలో సత్య ప్రమాణం అనే లఘు చిత్రంలో నటించాను. ఈ లఘు చిత్రం త్వరలో చలన చిత్రంగా రానుంది. చిన్నతనం నుంచి నటుడు అజిత్ అంటే పిచ్చి అభిమానం. ఒక రకంగా ఆయనే నాకు స్ఫూర్తి అని చెప్పవచ్చు. మంచి చిత్రాలు చేసి నటుడిగా మంచి పేరు తెచ్చుకోవాలని కోరుకుంటున్నాను. గర్ల్ ఫ్రెండ్ అంటూ ఎవరూ లేరు. ప్రస్తుతం నా ముందున్న లక్ష్యం నటుడిగా ఎదగాలన్నదే.