
Courtesy: IPLTwitter
ఐపీఎల్ 2022లో మరో యంగ్ ఆటగాడు తన టాలెంట్ చూపెట్టాడు. ముంబై ఇండియన్స్‌తో మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ బ్యాట్స్‌మన్ జితేశ్ శర్మ ఆకట్టుకునే ఇన్నింగ్స్ ఆడాడు. 15 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్సర్లతో 30 పరుగులు చేశాడు. చివర్లో జితేశ్ ఇన్నింగ్స్‌తోనే పంజాబ్ కింగ్స్ 190 పరుగులు మార్క్‌ను దాటింది. ముఖ్యంగా ఉనాద్కట్ వేసిన ఇన్నింగ్స్ 18వ ఓవర్లో రెండు సిక్సర్లు, రెండు ఫోర్లు సహా మొత్తం 22 పరుగులు పిండుకున్నాడు. కాగా జితేశ్ శర్మను పంజాబ్ కింగ్స్ రూ.20 లక్షల కనీస మద్దతు ధరకే కొనుగోలు చేసింది.
మహారాష్ట్రలోని అమరావతికి చెందిన జితేశ్ శర్మ 2014లో విదర్భ తరపున దేశవాలీ క్రికెట్‌లో అరంగేట్రం చేశాడు. కాగా 2019 సీజన్‌లో విజయ్ హజారే ట్రోపీలో 298 పరుగులు చేసిన జితేశ్ శర్మ విదర్బ తరపున లీడింగ్ స్కోరర్‌గా నిలిచాడు.
చదవండి: IPL 2022: రోహిత్ శర్మ కొత్త చరిత్ర.. టీమిండియా నుంచి రెండో ఆటగాడిగా