► ఇళ్ల నిర్మాణ విషయంలో నూతన విధానం
► రీజినల్ వర్క్‌షాప్‌లో వెల్లడించిన
► ఆర్‌డీడీ చంద్రిక
వరంగల్ అర్బన్ : ఇంటి నిర్మాణ అనుమతి పొందే విషయంలో ఇంతకాలం ఎదుర్కొంటున్న కష్టాలకు తెరపడినట్లే! అన్ని పత్రాలు సవ్యంగా ఉన్నా ఉద్యోగులు నిర్మాణ అనుమతి ఇచ్చేందుకు ఏదో ఓ కొర్రీ పెట్టడం.. చేయి తడపగానే అనుమతి ఇచ్చేయడం అంతటా జరిగే తంతే.. ఇక నుంచి అంతా సవ్యంగా ఉంటే చాలు.. ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకుంటే సిటిజన్ చార్టర్ ప్రకారం 30 రోజుల్లో అనుమతి ఇచ్చే విధానం అమలులోకి రానుంది. ఒకవేళ అనుమతి ఇవ్వకపోయినా అందుకు గల కారణాలను వెల్లడించనున్నారు. హైదరాబాద్ మహా నగరాభివృద్ధి సంస్థ(హెచ్‌ఎండీఏ)లో విజయవంతంగా నిర్వహిస్తున్న ఆన్‌లైన్ అనుమతి విధానాన్ని రాష్ర్టవ్యాప్తంగా అమలుచేసేందుకు కసరత్తు జరుగుతోంది. ఈ మేరకు వరంగల్ రీజియన్ పరిధి ఆదిలాబాద్, ఖమ్మం, కరీంనగర్, వరంగల్ జిల్లాల్లోని కార్పొరేషన్లు, మునిసిపాలిటీలు, నగర పంచాయతీ కమిషన్లు, అధికారుల సమావేశం హన్మకొండలోని హరితా హోటల్‌లో సోమవారం ఏర్పాటుచేశారు.
‘సాఫ్టెక్’తో ఎంఓయూ
హన్మకొండలో జరిగిన రీజియన్ సమావేశంలో టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్ ఆర్‌డీడీ చంద్రిక మాట్లాడుతూ ఇళ్ల నిర్మాణ ఆన్‌లైన్ అనుమతుల కోసం సాఫ్టెక్ సంస్థతో రాష్ట్ర టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్ అధికారులు ఎంవోయూ చేసుకున్నట్లు వెల్లడించారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా అయా ముని సిపాలిటీల కమిషనర్లు, టౌన్ ప్లానింగ్ అధికారులకు పవర్ పాయింట్ ప్రజేంటేషన్‌పై శిక్షణ ఇస్తున్నట్లు పేర్కొన్నారు. నగరాలు, పట్టణాల్లోని పూర్తి సమాచారాన్ని క్రోడీకరించి, సాఫ్టెక్ కంపెనీని ప్రతినిధులకు అందచేయాలని కోరారు. అనంతరం సాఫెక్ట్ సంస్ధ మేనేజర్ కింగ్ షూప్ చైల్డ్ పవర్ పాయింట్ ప్రజేంటేషన్ ద్వారా ఆన్‌లైన్‌లో ఇళ్ల నిర్మాణ అనుమతి దరఖాస్తుల పరిశీలన, అనుమతుల జారీపై అవగాహ న కల్పించారు.
కొత్త,పాత మాస్టర్ ప్లాన్ ప్రకారం వివరాల ను అందజేయాలని,ఆ వెంటనే మీ-సేవ కేంద్రాల ద్వారా దరఖాస్తు చేసుకునే విధంగా ఏర్పాట్లు చేస్తామని తెలిపారు. తొలుత ప్రజలు సమగ్ర పత్రాలతోపాటు లై సెన్స్ సర్వేయర్ ప్లాన్‌లు, దరఖాస్తు ఫారాన్ని మీసేవ కేంద్రాల్లో సమర్పిం చాల్సి ఉంటుందన్నారు. ఆ తర్వాత టౌన్ ప్లానింగ్ అధికారులు, సిబ్బంది క్షేత్రస్థాయిలో పరిశీలించి అన్నీ సక్రమమని తేలితే నిర్మాణానికి అనుమతి ఇస్తారని తెలిపారు.
అలాకాకుండా ఏదైనా తేడా ఉంటే నోటీసు జారీ చేస్తారని పేర్కొన్నా రు.ఈవిధానంలో ప్రజలు కార్యాలయంచుట్టూ తిరిగే ఇ బ్బం దులు తొలగిపోతాయని వివరించారు. సదస్సులో ఆర్‌డీడీ శ్యాం జాన్సన్,టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్ డీడీ కోదండరాం రెడ్డి, బల్దియా ఈఈ విశ్వప్రకాశ్,ఏసీపీలు,వివిధ ము నిసిపాలిటీల కమిషనర్లు,టౌన్ ప్లానింగ్ అధికారులు పాల్గొన్నారు.
ఆన్‌లైన్ అనుమతులు
Published Tue, Mar 22 2016 3:04 AM | Last Updated on Tue, Mar 19 2019 6:19 PM
Advertisement