రాజధాని మాస్టర్ ప్లాన్లో మార్పులు!
హైదరాబాద్: సీఆర్డీఏ మాస్టర్ ప్లాన్ పట్ల రాజధాని ప్రాంత రైతుల్లో తీవ్ర అసంతృప్తి నెలకొన్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ పురపాలక శాఖ మంత్రి నారాయణ హుటాహుటిన రెండు రోజులు సింగపూర్ పర్యటనకు వెళ్లొచ్చారు. సీఆర్డీఏ కమిషనర్ శ్రీకాంత్ కూడా మంత్రితో పాటు సింగపూర్ వెళ్లారు. సింగపూర్ ప్రతినిథులతో మాస్టర్ ప్లాన్లో మార్పులపై చర్చించినట్లు సమాచారం.
ఎక్స్ప్రెస్ హైవేలు, అగ్రికల్చరల్ జోన్లను రైతులు తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఆందోళనలు చేపడుతుండటం, సొంత గ్రామాల్లో భూములు దక్కని సీడ్ క్యాపిటల్ గ్రామాల రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్న సందర్భంగా చేపట్టిన సింగపూర్ పర్యటనలో.. మాస్టర్ ప్లాన్లో మార్పులపై నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది.