సిఫారసుల లెక్క తేలలేదు! | rajamundry master plan issue | Sakshi
Sakshi News home page

సిఫారసుల లెక్క తేలలేదు!

Published Sun, Jan 29 2017 11:46 PM | Last Updated on Tue, Sep 5 2017 2:25 AM

సిఫారసుల లెక్క తేలలేదు!

సిఫారసుల లెక్క తేలలేదు!

  • ముందుకు కదలని రాజమహేంద్రవరంమాస్టర్‌ ప్లాన్
  • కౌన్సిల్‌ ఆమోదం పొంది 2 నెలలు
  • అయినా ప్రభుత్వానికి పంపని వైనం ∙ మార్పులు, చేర్పులకు కార్పొరేటర్ల సూచనలు
  • వాటి ‘లెక్క’ అందనందువల్లనే జాప్యమా అన్న అనుమానాలు
  •  
    సాక్షి, రాజమహేంద్రవరం :
    2031వ సంవత్సరం నాటికి రాజమహేంద్రవరం నగరాభివృద్ధిని ఊహిస్తూ, చుట్టుపక్కల ఐదు కిలోమీటర్ల పరిధిలోని గ్రామ పంచాయతీలను కలుపుతూ రూపొందించిన మాస్లర్‌ ప్లా¯ŒS ఇంతవరకూ ప్రభుత్వానికి చేరకపోవడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. డిసెంబర్‌ 3న జరిగిన నగరపాలక సంస్థ సర్వసభ్య సమావేశంలో ప్రతిపక్షం అనేక అభ్యంతరాలు లేవనెత్తుతున్నా.. కేవలం ఐదంటే ఐదే నిమిషాల్లో మాస్టర్‌ప్లా¯ŒSను ఆమోదించారు. ముందుగా ఎలాంటి సమాచారం లేకుండానే, అప్పటికప్పుడు నోటిమాట ద్వారా కొంతమంది కార్పొరేటర్లు అనేక సిఫారసులు కూడా చేశారు. గందరగోళం మధ్యనే   
    వాటిని ఆమోదిస్తూ మాస్టర్‌ప్లా¯ŒSకు కౌన్సిల్‌ పచ్చజెండా ఊపింది. అంతకుముందు కార్పొరేటర్ల అభ్యంతరాలు, సిఫారసుల పేరుతో అధికార యంత్రాంగం కొంత సమయం ఇచ్చి, మాస్టర్‌ప్లా¯ŒS ముసాయిదాను ఆంగ్లం నుంచి తెలుగులోకి అనువదించి ఇచ్చింది. ఆ సమయంలో పలువురు కార్పొరేటర్లు, ఎమ్మెల్యేలు అనేక సిఫార్సులు చేశారు. వీటిలో రోడ్ల వెడల్పు తగ్గించడం నుంచి ల్యాండ్‌ కన్వర్ష¯ŒS వరకూ అనేకం ఉన్నాయి. కొంతమంది పెద్దల స్థలాలు పోతున్నాయన్న ఉద్దేశంతో కొత్తగా ప్రతిపాదించిన రోడ్లను సైతం ఉపసంహరిస్తూ సిఫారసులు చేశారు. తమతమ బంధువుల స్థలాలకు ధరలు పెరిగేలా, వాటి సమీపంలో అనేక రోడ్లు వేసేందుకు ప్రతిపాదించారు. కొంతమంది అధికార పార్టీ కార్పొరేటర్లు తమ డివిజ¯ŒSలోనివే కాకుండా పక్క డివిజన్లలో స్థలాలు, రోడ్లు తగ్గించడంపై కూడా సిఫారసులు చేశారు. మరికొంతమంది కోలమూరు, పిడింగొయ్యి లాంటి పంచాయతీల్లో భూమి వినియోగ స్థితిపై సిఫారసులు ఇచ్చారు.
    సిఫారసులపై ఆరోపణలు
    ఒక్కో సిఫారసుకు లక్షల రూపాయలు చేతులు మారినట్లు అప్పట్లో బలమైన ఆరోపణలు వచ్చాయి. రోడ్ల వెడల్పు తగ్గించడం, ఎన్విరా¯ŒSమెంటల్‌ బఫర్‌ జో¯ŒSలో ఉన్న భూములను కమర్షియల్‌గా మార్చడం, ఇండస్ట్రియల్‌ జో¯ŒSలో ఉన్న భూములను రెసిడెన్షియల్, మిక్స్‌డ్‌ యూజ్‌గా మార్చడంవంటివి ఈ సిఫారసులలో కొన్ని. వీటి ద్వారా మాస్టర్‌ ప్లా¯ŒSలో అనేక మార్పులు, చేర్పులు చేశారు. ఈ వ్యవహారంలో కోట్ల రూపాయలు చేతులు మారినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. కోలమూరు, కొంతమూరు, కాతేరు తదితర పంచాయతీల్లో వేసిన వందలాది వెంచర్లకు మాస్టర్‌ప్లాన్‌లో ప్రతిపాదించిన రోడ్ల వల్ల నష్టం జరగకుండా, వాటి విలువ పెరిగేలా రోడ్ల మ్యాప్‌లనే మార్చేశారు. ఇందుకు ప్రతిఫలంగా భారీగా ‘లెక్క’, ప్లాట్లు బహుమతులుగా ముట్టినట్లు కొందరు కార్పొరేటర్లే బహిరంగంగా వ్యాఖ్యానిస్తున్నారు.
    మచ్చుకు కొన్ని..
    8 కొందరు కార్పొరేటర్ల సిఫారసులను మేయర్, అధికారులు తోసిపుచ్చారు. అయినప్పటికీ ‘ముఖ్య’ నేత అండ ఉన్న కొందరు సీనియర్‌ కార్పొరేటర్లు వారిపై తీవ్ర స్థాయిలో ఒత్తిడి తెచ్చి మరీ తమ సిఫారసులు ఆమోదింపజేసుకున్నారు. ఉదాహరణకు మోరంపూడి స్టేడియం రోడ్డును 100 అడుగులకు విస్తరించాలని అధికారులు ప్రతిపాదించారు. ఈ రోడ్డు ఐదు డివిజన్ల పరిధిలో ఉంది. మొదట ఇద్దరు కార్పొరేటర్లు ఈ రోడ్డును 80 అడుగులకు తగ్గించాలని సిఫారసు చేశారు. అధికారులు దీనిని తోసిపుచ్చారు. అయితే మాస్టర్‌ప్లా¯ŒS ఆమోదించే రోజున అప్పటికప్పుడు ఐదుగురు కార్పొరేటర్లు 80 అడుగులకు మద్దతుగా సిఫారసులు చేసి, ‘ముఖ్య’ నేతతో ఒత్తిడి తెచ్చారు. దీంతో వాటిని ఆమోదించక తప్పలేదు.
    8 ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్యచౌదరి, దాట్ల సుభద్రాదేవితోపాటు ఇతరులకు చెందిన ప్లాట్లలో రోడ్డు వెళ్తూండడంతో దానిని మాస్టర్‌ప్లా¯ŒS నుంచి తొలగించారు.
    8 కోలమూరు పంచాయతీలో మూడెకరాలను ఇండస్ట్రియల్‌ జో¯ŒS నుంచి కమర్షియల్‌ జో¯ŒSకు మార్చాలని 10వ డివిజ¯ŒS కార్పొరేటర్‌గా ఉన్న డిప్యూటీ మేయర్‌ వాసిరెడ్డి రాంబాబు సిఫారసు చేశారు.
    8 పిడింగొయ్యి పంచాయతీలో 60 అడుగుల రోడ్డు ప్రతిపాదన ఉపసంహరించాలని 8వ డివిజ¯ŒS కార్పొరేటర్, టీడీపీ ఫ్లోర్‌లీడర్‌ వర్రే శ్రీనివాసరావు సిఫారసు చేశారు.
    8 కోలమూరులో ఏడెకరాల భూమిని ఎన్విరా¯ŒSమెంటల్‌ బఫర్‌ జో¯ŒS నుంచి నివాసప్రాంత జో¯ŒSగా మార్చాలని 9వ డివిజ¯ŒS కార్పొరేటర్‌ కోసూరి చండీప్రియ సిఫారసు చేశారు.
    8 కోలమూరు, పిడింగొయ్యి పంచాయతీల్లో పరిశ్రమ జో¯ŒSలో ఉన్న భూమిని రెసిడెన్షియల్‌ జో¯ŒSలోకి మార్చాలని 44, 48, 38 డివిజన్ల కార్పొరేటర్లు పాలవలస వీరభద్రం, గరగా పార్వతి, నండూరి వెంకటరమణ సిఫారసు చేశారు.
    8 వీటితోపాటు చిరునామా లేకుండా, సాధారణ పౌరులకు అర్థం కాని రీతిలో కూడా అనేక సిఫారసులు చేశారు. నగరపాలక సంస్థలో మెజారిటీ సభ్యులు తెలుగుదేశం పార్టీ వారే ఉండడంతో ఈ ప్రతిపాదనలన్నీ ఆమోదం పొందాయి.
    ‘లెక్క’ తేలనందువల్లనేనా..?
    తాము చేసిన సిఫారసుల ‘లెక్క’ తేలనందువల్లనే పలువురు కార్పొరేటర్లు, నేతలు మాస్టర్‌ప్లా¯ŒSను ముందుకు కదలకుండా చేశారని సమాచారం. ‘లెక్క’ తేలకుండా మాస్టర్‌ప్లా¯ŒSపై ప్రభుత్వం జీవో జారీ చేస్తే తమ ‘లెక్క’ తగ్గిపోతుందన్న ఉద్దేశంతోనే సంతకాల దగ్గర ఆపినట్లు తెలిసింది. మరోవైపు మేయర్‌ అభిప్రాయానికి భిన్నంగా పలువురు సీనియర్‌ కార్పొరేటర్లు మాస్టర్‌ప్లా¯ŒSలో మార్పులు చేర్పులకు సిఫారసులు చేశారని, అందువల్లనే మాస్టర్‌ప్లా¯ŒSపై ఆమె ఆచితూచి వ్యవహరిస్తున్నారన్న ప్రచారం జరుగుతోంది.
     
    ప్రభుత్వానికి పంపాల్సి ఉంది
    మాస్టర్‌ప్లా¯ŒS కౌన్సిల్‌ ఆమోదం పొందింది. సంతకాల అనంతరం దీనిని రాష్ట్ర ప్రభుత్వానికి పంపాలి. అనంతరం దీనిని ఆమోదిస్తూ జీవో జారీ అవుతుంది. మరుక్షణం నుంచి నూతన మాస్టర్‌ప్లా¯ŒS అమలులోకి వచ్చినట్లే.
    – వి.విజయరామరాజు, కమిషనర్, నగరపాలక సంస్థ
     
    కొందరు కార్పొరేటర్లు ఒప్పుకోవడం లేదు
    మాస్టర్‌ప్లా¯ŒSలో అనేక మార్పులు చేశారు. ముఖ్యంగా ఆర్టీసీ కాంప్లెక్స్‌ రోడ్డు 100 అడుగులకు విస్తరించాలని ప్రతిపాదించాం. తగ్గించాలన్నా అధికారులు కూడా ఒప్పుకోలేదు. అయితే మాస్టర్‌ప్లా¯ŒS ఆమోదం రోజున ఐదుగురు కార్పొరేటర్లు 80 అడుగులకు తగ్గించాలని నోటిమాట ద్వారా చెప్పారు. ఈ రోడ్డులో రద్దీ ఎక్కువగా ఉంది. 100 అడుగులకు విస్తరించేందుకు 90 శాతం స్థలం ఉంది. కానీ కార్పొరేటర్లు ఒప్పుకోవడం లేదు. అందువల్లనే ఆలస్యమవుతోంది.
    – పంతం రజనీ శేషసాయి, మేయర్, నగరపాలక సంస్థ
     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement