రాజధాని అమరావతి మాస్టర్ ప్లాన్‌పై అవగాహన సదస్సు నిర్వహించేందుకు వచ్చిన అధికారులకు రైతులు షాకిచ్చారు. గుంటూరు జిల్లా మంగళగిరి మండలం నీరుకొండ, పురగల్లు గ్రామాలకు బుధవారం మధ్యాహ్నం అధికారులు సదస్సు ఏర్పాటు చేశారు. ఈ సదస్సుకు హాజరైన రైతులు.. ముందు గ్రామకంఠాల సమస్యలను పరిష్కారించాలని డిమాండ్ చేశారు. ముందుగా గ్రామ కంఠం భూములను తేల్చాకే సదస్సులు పెట్టాలంటూ సమావేశాన్ని ప్రజలు అడ్డుకున్నారు. దీంతో పాటు. తమ గ్రామాల్లోంచి రోడ్లు వేస్తున్నారో లేదో తేల్చి చెప్పాలని కోరారు. దీంతో సరేనంటూ అధికారులు వెనుదిరిగి వెళ్లిపోయారు.