capital farmers
-
‘వార్షిక కౌలు’ వ్యాజ్యానికి విచారణార్హత ఉంది
సాక్షి, అమరావతి: రాజధాని కోసం భూములిచ్చిన రైతులకు వార్షిక కౌలు చెల్లించేలా సీఆర్డీఏను, రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ అమరావతి రాజధాని సమీకరణ రైతు సమాఖ్య, రాజధాని రైతు పరిరక్షణ సమితి దాఖలు చేసిన వ్యాజ్యానికి విచారణార్హత ఉందని హైకోర్టుస్పష్టం చేసింది. ఈ విషయంలో సీఆర్డీఏ లేవనెత్తిన అభ్యంతరాలను హైకోర్టు తోసిపుచ్చింది. అయితే పిటిషన్లు దాఖలు చేసిన సంఘాల్లో ఉన్న సభ్యులందరి వివరాలను కోర్టు ముందుంచాలని పిటిషనర్లను ఆదేశించింది. అంతేకాక ఆ సంఘాల్లోని ప్రతి సభ్యుడి పేరు మీద కోర్టు ఫీజు చెల్లించాలని కూడా ఆదేశాలిచ్చింది. ఇందుకోసం పది రోజుల గడువు ఇచ్చింది. తదుపరి విచారణను న్యాయస్థానం వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ సత్తి సుబ్బారెడ్డి గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. వార్షిక కౌలు చెల్లించేలా ఆదేశాలివ్వాలంటూ రైతుల తరఫున అమరావతి రాజధాని సమీకరణ రైతు సమాఖ్య, రాజధాని రైతు పరిరక్షణ సమితి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశాయి. ఈ వ్యాజ్యం విచారణార్హతపై సీఆర్డీఏ అభ్యంతరం లేవనెత్తింది. రైతుల తరఫున సంఘాల పేరుతో పిటిషన్ దాఖలు చేయడానికి వీల్లేదని సీఆర్డీఏ తరఫు న్యాయవాది కాసా జగన్మోహన్రెడ్డి వాదనలు వినిపించారు. రైతులే నేరుగా పిటిషన్ దాఖలు చేసుకోవాలన్నారు. విచారణార్హతపై ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి జస్టిస్ సుబ్బారెడ్డి గురువారం తన నిర్ణయాన్ని వెలువరించారు. సీఆర్డీఏ అభ్యంతరాలను తోసిపుచ్చారు. అయితే పిటిషన్ దాఖలు చేసిన రెండు సంఘాల్లో ఉన్న ప్రతీ సభ్యుడి పేరు మీద కోర్టు ఫీజు చెల్లించాలని ఆ సంఘాలను న్యాయమూర్తి ఆదేశించారు. -
ఇది కచ్చితంగా ఫోరం షాపింగే
సాక్షి, అమరావతి: ఉత్తరాంధ్ర అభివృద్ధి పర్యవేక్షణ, సమీక్ష నిమిత్తం విశాఖపట్నంలో ప్రభుత్వ క్యాంప్ కార్యాలయాల ఏర్పాటుకు అనువైన ప్రదేశాలను గుర్తిస్తూ ఐఏఎస్‌ల కమిటీ ఇచ్చిన నివేదికకు అనుగుణంగా ప్రభుత్వం జారీ చేసిన జీవో 2283ని సవాలు చేస్తూ రిట్ పిటిషన్ దాఖలు చేయడం వెనుక రాజధాని రైతుల దురుద్దేశాలను అడ్వొకేట్ జనరల్ (ఏజీ) ఎస్.శ్రీరామ్ హైకోర్టు ముందుంచారు. ఈ జీవోపై రిట్ పిటిషన్ దాఖలు చేయడం ఫోరం షాపింగ్ (కావాల్సిన న్యాయమూర్తి వద్దకు కేసు వచ్చేలా చేయడం) కిందకే వస్తుందని కోర్టుకు నివేదించారు. నీతి లేని వ్యక్తులే ఇలాంటి తప్పుడు మార్గాలను అనుసరిస్తారని తెలిపారు. జీవో 2283ని రద్దు చేయాలని, అప్పటివరకు జీవో అమలును నిలిపేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయాలని కోరుతూ అమరావతి పరిరక్షణ సమితి మేనేజింగ్ ట్రస్టీ గద్దె తిరుపతిరావు, రాజధాని రైతులు మాదాల శ్రీనివాసరావు, వలపర్ల మనోహరం హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యం బుధవారం జస్టిస్ నిమ్మగడ్డ వెంకటేశ్వర్లు ముందుకు విచారణకు వచ్చింది. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఏజీ శ్రీరామ్ వాదనలు వినిపించారు. ఈ వ్యాజ్యంపై రిజిస్ట్రీ ఎలాంటి అభ్యంతరాలు లేవనెత్తకుండా నంబరు కేటాయించడంపై శ్రీరామ్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. గతంలో ప్రభుత్వ కార్యాలయాల తరలింపు జరుగుతోందంటూ ధర్మాసనం ముందు ప్రజా ప్రయోజన వ్యాజ్యాలు (పిల్) దాఖలు చేసిన అమరాతి పరిరక్షణ సమితి, మరికొందరు.. ఇప్పుడు అదే అంశంపై రిట్ పిటిషన్ వేయడం ఆశ్చర్యకరమని ఏజీ అన్నారు. కార్యాలయాల తరలింపు వ్యవహారం రాజధాని అంశంతో ముడిపడి ఉందని, అలా తరలించడం హైకోర్టు త్రిసభ్య ధర్మాసనం తీర్పునకు విరుద్ధమని పిటిషనర్లు వారి వ్యాజ్యంలో స్వయంగా పేర్కొన్నారని, వారికి ఎలాంటి దురుద్దేశాలు లేకుంటే పిల్ దాఖలు చేసి ఉండే వారని తెలిపారు. పిల్ దాఖలు చేస్తే ఈ వ్యవహారం మొత్తం ధర్మాసనం ముందుకే వస్తుందని తెలిసి రిట్ దాఖలు చేశారన్నారు. రాజధానిలో పేదలకు ఇళ్ల స్థలాల పంపిణీ వ్యవహారంలో కూడా ఇలానే ఫోరం షాపింగ్‌కు పాల్పడ్డారని, దీంతో ధర్మాసనమే ఆ వ్యాజ్యాలను తెప్పించుకుని విచారణ జరిపిందన్నారు. రాజధాని వ్యవహారం కేవలం పిటిషనర్లకు మాత్రమే సంబంధించింది కాదని, పెద్ద సంఖ్యలో ప్రజలకు సంబంధించిందన్నారు. అందువల్ల పిల్ మాత్రమే దాఖలు చేయాల్సి ఉంటుందని తెలిపారు. కార్యాలయాల తరలింపు విషయంలో అభ్యంతరాలుంటే తమ వద్దకు రావాలని పిటిషనర్లకు గతంలోనే ధర్మాసనం స్వేచ్ఛనిచ్చిందని, ఈ విషయం వారికీ తెలుసునన్నారు. అయినా ధర్మాసనం ముందుకు వెళ్లకుండా సింగిల్ జడ్జి వద్దకు వచ్చారని వివరించారు. చాలా తెలివిగా పిటిషన్‌ను తయారు చేశారని, అంతే తెలివిగా ధర్మాసనం ముందుకు రాకుండా చేశారన్నారు. వారి అంతిమ ఉద్దేశం ఫోరం షాపింగేనని చెప్పారు. ఫోరం షాపింగ్ విషయంలో సుప్రీంకోర్టు వెలువరించిన పలు తీర్పులను ఆయన కోర్టు ముందుంచారు. అసలు ఈ పిటిషన్ విచారణార్హతపైనే ఏజీ అభ్యంతరాలు లేవనెత్తారు. దాదాపు గంటసేపు వాదనలు వినిపించిన ఏజీ.., తదుపరి వాదనలకు సమయం లేకపోవడంతో విచారణను శుక్రవారానికి వాయిదా వేయాలని కోరారు. దీంతో న్యాయమూర్తి జస్టిస్ నిమ్మగడ్డ విచారణను శుక్రవారానికి వాయిదా వేశారు. -
రాజధాని భూములను ఇతర అవసరాలకు వాడకూడదు
సాక్షి, అమరావతి: రాజధాని కోసం ఇచ్చిన భూములను ఆ ప్రయోజనం కోసం కాకుండా, ఇతర అవసరాలకు ఉపయోగించడం చట్ట విరుద్ధమని అమరావతి రైతుల తరఫు సీనియర్ న్యాయవాది బి.ఆదినారాయణరావు బుధవారం హైకోర్టుకు నివేదించారు. రాజధాని నిర్మాణం కోసం ఉపయోగించాల్సిన భూములను ఇతరులకు ఇళ్ల స్థలాల కోసం కేటాయించడం మాస్టర్ ప్లాన్‌కు విరుద్ధమని అన్నారు. సీఆర్డీఏ చట్ట సవరణ ద్వారా రాజధానిలో రాజధానేతరులకు ఇళ్ల స్థలాలు కేటాయించకుండా మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని హైకోర్టును కోరారు. మధ్యంతర ఉత్తర్వుల జారీ వ్యవహారంలో రైతుల తరఫు న్యాయవాదుల వాదనలు ముగియడంతో ప్రభుత్వం, సీఆర్డీఏ వాదనల నిమిత్తం హైకోర్టు తదుపరి విచారణను ఈ నెల 29కి వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ ఉప్మాక దుర్గాప్రసాదరావు, జస్టిస్ తల్లాప్రగడ మల్లికార్జునరావు ధర్మాసనం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. రాజధాని ప్రాంతంలో ఇతర ప్రాంతాల వారికి కూడా ఇళ్ల స్థలాలు మంజూరుకు ప్రభుత్వం తీసుకున్న చర్యలను సవాలు చేస్తూ అమరావతి రైతు సంఘాలు వేర్వేరుగా వేసిన పిటిషన్లు, ఇళ్ల స్థలాలు కేటాయించకుండా యథాతథస్థితి కొనసాగించేలా మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయాలని కోరుతూ వేసిన అనుబంధ పిటిషన్లపై జస్టిస్ దుర్గాప్రసాదరావు ధర్మాసనం బుధవారం మరోసారి విచారణ జరిపింది. పిటిషనర్ల తరఫున బి.ఆదినారాయణరావు, కారుమంచి ఇంద్రనీల్ వాదనలు వినిపించారు. పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలనుకుంటే తగిన పరిహారం చెల్లించి భూ సేకరణ ద్వారా కేటాయించాలే తప్ప, రాజధాని కోసం తామిచ్చిన భూముల్లో స్థలాలు ఇవ్వడానికి వీల్లేదని అన్నారు. పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వడం ద్వారా రాజధాని నగరాన్ని మురికివాడగా మార్చకూడదన్నదే తమ వాదనని తెలిపారు. -
రాజధాని రైతుల వార్షిక కౌలు రూ.195 కోట్లు విడుదల
సాక్షి, అమరావతి/తాడికొండ: రాజధాని భూసమీకరణ పథకం కింద భూములిచ్చిన రైతులకు చెల్లించాల్సిన వార్షిక కౌలు మొత్తం రూ.195 కోట్లను ప్రభుత్వం విడుదల చేసింది. ఈ మేరకు మున్సిపల్ శాఖ కార్యదర్శి వై శ్రీలక్ష్మి బుధవారం ఉత్తర్వులిచ్చారు. 2020–21కి సంబంధించి రాజధాని రైతులకు ఇవ్వాల్సిన వార్షిక కౌలు కోసం ఈ మొత్తాన్ని బడ్జెట్లో ప్రతిపాదించారు. సీఎం చిత్రపటానికి క్షీరాభిషేకం అమరావతిలో భూములిచ్చిన తమను చంద్రబాబు మోసం చేసినా ఇచ్చిన మాటకు, నమ్మిన సిద్ధాంతానికి కట్టుబడి ఉన్న సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి మాత్రం అక్కున చేర్చుకుని 2021–22 ఏడాదికి రూ.195 కోట్లను విడుదల చేయడంపై రాజధాని రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా గుంటూరు జిల్లా తుళ్లూరులోని వైఎస్సార్సీపీ కార్యాలయం వద్ద సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి చిత్రపటానికి బుధవారం క్షీరాభిషేకం చేశారు. రాజధాని పేరుతో చంద్రబాబు తమ వద్ద 33 వేల ఎకరాలు తీసుకుని నిలువునా ముంచారని, ఇప్పుడు హైదరాబాద్‌లో చేరి 29 గ్రామాల్లో రైతు కుటుంబాలను రోడ్డున పడేశారని మండిపడ్డారు. రియల్ ఎస్టేట్ వ్యాపారంతో బడా బాబులు, పారిశ్రామిక వేత్తలకు తమ భూములు దోచిపెట్టారని ఆరోపించారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ తుళ్లూరు గ్రామ పార్టీ అధ్యక్షుడు ఆలోకం సురేష్, భూములిచ్చిన రైతులు నాయుడు నాగేశ్వరరావు, తుమ్మూరు ప్రకాశ్‌రెడ్డి, సుంకర శ్రీను, గుంతల నాగేశ్వరరావు, గడ్డం జయరామ్ తదితరులు పాల్గొన్నారు. -
‘ఆయన డైరెక్షన్లోనే ఆ దాడి జరిగింది’
సాక్షి, అమరావతి: ఉత్తరాంధ్ర, రాయలసీమకు చంద్రబాబు అన్యాయం చేశారని తెలుగు అకాడమీ చైర్పర్సన్ లక్ష్మీపార్వతి విమర్శించారు. శుక్రవారం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబు స్క్రిప్టునే కాంగ్రెస్ నేతలు చదువుతున్నారని దుయ్యబట్టారు. చంద్రబాబు డైరెక్షన్లోనే ఎంపీ నందిగం సురేష్‌పై దాడి చేశారని మండిపడ్డారు. అమరావతి రైతులను మోసం చేసింది చంద్రబాబేనని.. అమరావతి రైతులకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి న్యాయం చేస్తున్నారని తెలిపారు. రైతుల సంక్షేమానికి సీఎం జగన్ అనేక పథకాలు తీసుకొచ్చారని చెప్పారు. (ఉరిమిన ఉత్తరాంధ్ర) విశాఖపై ఎల్లోమీడియాతో చంద్రబాబు దుష్ప్రచారం చేయించారని ధ్వజమెత్తారు. విశాఖ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్‌ను చంద్రబాబు అడ్డుకున్నారని.. అందుకే విశాఖ ప్రజలు ఆయనను అడ్డుకున్నారని తెలిపారు. చంద్రబాబు అవినీతి పరుడు, స్వార్థపరుడని.. సొంత మామకే వెన్నుపోటు పొడిచి చెప్పులు వేయించారని మండిపడ్డారు. ఇవాళ ప్రజలే చంద్రబాబుపై చెప్పులు వేస్తున్నారని లక్ష్మీపార్వతి పేర్కొన్నారు. -
చంద్రబాబు ట్రాప్‌లో పడొద్దు: ఎమ్మెల్యే ఆర్కే
సాక్షి, గుంటూరు: అవినీతి, అక్రమాలు ఎక్కడ బయట పడతాయోనని ప్రతిపక్ష నేత చంద్రబాబుకు భయం పట్టుకుందని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి అన్నారు. ఆయన ఆదివారం మీడియాతో మాట్లాడుతూ.. సిట్ వేయడంతో చంద్రబాబు అండ్ కో భయపడుతున్నారన్నారు. వ్యవస్థలను మ్యానేజ్ చేసి రైతులు, ప్రభుత్వాన్ని చంద్రబాబు తప్పుదారి పట్టించారని ఆయన మండిపడ్డారు. రాజధానిలో పోలీస్, రెవెన్యూ అధికారులను అడ్డుకోవడం సరికాదన్నారు. రాజధాని రైతుల సమస్యల పరిష్కారం కోసం స్థానిక ఎమ్మెల్యేలు, ప్రభుత్వం అందుబాటులో ఉందని పేర్కొన్నారు. చంద్రబాబు ట్రాప్‌లో పడొద్దని రాజధాని రైతులకు ఎమ్మెల్యే ఆర్కే సూచించారు. -
అమరావతి రైతులకు పవన్ కల్యాణ్ షాక్
సాక్షి, అమరావతి: అమరావతి రైతులకు జనసేన అధినేత పవన్ కల్యాణ్ షాక్ ఇచ్చారు. శనివారం రాజధాని గ్రామాల్లో పర్యటించిన ఆయన తనలో మనసులో మాట బయట పెట్టారు. జై అమరావతి అనాలని పవన్‌ను రైతులు కోరగా.. జై అమరావతి అనలేనని.. జై అమరావతి అంటే మిగతా ప్రాంతాల్లో ఇబ్బంది వస్తుందని తెలిపారు. అన్ని ప్రాంతాలు ముఖ్యమేనని పేర్కొన్నారు. పవన్ మాటలకు రాజధాని రైతులు ఒక్కసారిగా షాక్ అయ్యారు. మరోవైపు తన ప్రసంగాల్లో మాత్రం రాజధానిని అమరావతి నుంచి తరలిస్తే సహించేది లేదంటూ చెప్పడం గమనార్హం. -
లెజిస్లేటివ్ రాజధాని అమరావతే
సాక్షి, అమరావతి: రాష్ట్ర లెజిస్లేటివ్ రాజధానిగా అమరావతే కొనసాగుతుందని, ఎవ్వరికీ ఎట్టి పరిస్థితుల్లోనూ అన్యాయం జరగదని, అన్ని ప్రాంతాలకు సమన్యాయం చేయాలన్నదే తన అభిమతమని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పునరుద్ఘాటించారు. ముఖ్యమంత్రి స్థానంలో కూర్చున్నపుడు తాను ఒక తండ్రిలాగా ఆలోచించాల్సి ఉంటుందని ఆయనన్నారు. గుంటూరు జిల్లా తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో మంగళవారం మధ్యాహ్నం మంత్రి కొడాలి నాని, ఎమ్మెల్యేలు ఉండవల్లి శ్రీదేవి, ఆళ్ల రామకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో రాజధాని ప్రాంత రైతులు సీఎంను కలిశారు. ఈ సందర్భంగా వైఎస్ జగన్ వారితో మాట్లాడుతూ.. అమరావతి అనేది అటు విజయవాడ, ఇటు గుంటూరు కాదని.. అసలు ఆ ప్రాంతంలో సరైన రోడ్లు, డ్రైనేజి, పైపులైన్లు లేవన్నారు. అక్కడ మౌలిక సదుపాయాలకే ఎకరాకు రూ.2 కోట్లు ఖర్చుచేయాల్సి ఉంటుందని, దీని కోసమే రూ.1 లక్ష కోట్లు ఖర్చు చేయాలని గత ప్రభుత్వంలో ఉన్న వారే లెక్కగట్టారని గుర్తుచేశారు. ఇప్పటికి అమరావతిపై ఖర్చు చేసింది రూ.5,674 కోట్లు మాత్రమేనని, ఇంకా రూ.2,297 కోట్ల బకాయీలు చెల్లించాల్సి ఉందని వైఎస్ జగన్ అన్నారు. రూ.లక్ష కోట్లు పెట్టాల్సిన చోట రూ.6 కోట్లు పెడితే అది సముద్రంలో నీటిబొట్టే అవుతుందని ఐదేళ్ల తరువాత మళ్లీ మన పరిస్థితి ఏమిటి? ఉద్యోగాల కోసం మన పిల్లలు ఎక్కడకు పోవాలి? అని ప్రశ్నించారు. హైదరాబాద్, చెన్నై, బెంగళూరుపైనే మన పిల్లలు ఆధారపడాలన్నారు. అదే ఖర్చులో 10 శాతం విశాఖపట్టణంలో పెడితే బాగా అభివృద్ధి చెందుతుందని ఇప్పటికే రాష్ట్రంలో నెంబర్–1 నగరంగా విశాఖ ఉందని ఆయన రైతులకు విపులంగా వివరించారు. కనీసం రానున్న కాలంలో నైనా మన పిల్లలకు ఇక్కడ ఉద్యోగాలు వస్తాయన్నారు. ఏమేం కావాలో చెప్పండి తాడేపల్లి, మంగళగిరిలను మోడల్ మున్సిపాలిటీలుగా చేయడానికి రూ.1,100 కోట్లు ఖర్చవుతుందని.. ఇలాంటి వాటిని వదిలిపెట్టి ఎంత పెట్టినా కనిపించని చోట రూ.లక్ష కోట్లు పెడితే ఏం ఉపయోగం?.. అయినా సరే ఎవరికీ అన్యాయం జరక్కుండా ఇక్కడే లెజిస్లేటివ్ రాజధానిని కొనసాగిస్తామని, కర్నూలులో న్యాయ రాజధాని, విశాఖపట్టణంలో కార్యనిర్వాహక రాజధాని పెడతామని వైఎస్ జగన్ చెప్పారు. తన ముందు ఇవాళ రాజధాని రైతులు పెట్టిన అంశాలన్నీ నెరవేర్చడం ప్రభుత్వం కనీస బాధ్యత అని సీఎం అన్నారు. రాజధాని గ్రామాల్లో ఏమేం కావాలో చెప్పాలని.. 2, 3 నెలల్లో పనులు ప్రారంభిస్తామన్నారు. తాడేపల్లి, మంగళగిరి మున్సిపాలిటీల అభివృద్ధి ప్రణాళికతో పాటు, ఈ గ్రామాల్లో పనులు కూడా ప్రారంభిస్తామన్నారు. అలాగే, రాజధాని గ్రామాల్లో పెన్షన్లు అందని అర్హులు ఎవరైనా ఉంటే వారందరినీ వలంటీర్ల ద్వారా గుర్తించాలని ఆయన చెప్పారు. చంద్రబాబు మాపై కక్ష గట్టారు సమావేశానికి హాజరైన రైతులు మాట్లాడుతూ.. వాస్తవానికి తమవి చాలా సారవంతమైన భూములని, అలాంటి చోట చంద్రబాబు రాజధాని కడతానని ప్రకటించి తమను భయపెట్టడంతో చాలామంది రైతులు భూములిచ్చారని తెలిపారు. భూములివ్వని వారిపై చంద్రబాబు కక్షగట్టి లిఫ్ట్ ఇరిగేషన్‌ను కట్‌చేసి కరెంటు తీసేశారన్నారు. మూడు చెక్‌పోస్టులు పెట్టి వ్యవసాయం చేసుకోనీయకుండా నానా ఇబ్బందులు పెట్టడమే గాక తమ పొలాలను కూడా తగలబెట్టారని వాపోయారు. ప్రస్తుతం గ్రామ సచివాలయాల ద్వారా తమకు అన్ని సేవలు అందుతున్నాయి కనుక పాలన ఎక్కడ నుంచి సాగినా ఇబ్బందిలేదని రైతులు స్పష్టంచేశారు. భూమిలేని వారికి పెన్షన్‌ను రూ.5వేలకు పెంచడం చాలా మంచి నిర్ణయమన్నారు. (చదవండి: వెనకుండి నడిపిందెవరు?) వారు ఇంకా ఏమేం ప్రస్తావించారంటే.. - సీఆర్డీయేను తీసేస్తే తమ పొలాలు బాగుంటాయి. గ్రామాలు అభివృద్ధి చెందుతాయి. - ఇప్పుడున్న కరకట్టను వెడల్పు చేసి అంతర్గత రోడ్లను అభివృద్ధి చేయాలి. - భూసేకరణ నోటిఫికేషన్‌ను ఎత్తివేయాలి. దీనివల్ల ఏమీ చేయలేకపోతున్నాం. బ్యాంకులు లోన్లు కూడా ఇవ్వడంలేదు. దీంతో పిల్లలకు పెళ్లిళ్లు చేయలేకపోతున్నాం. - జోన్లు ఎత్తివేయాలి. (చదవండి: రాష్ట్ర పరిధిలోనే ‘రాజధాని’) -
రాజధాని రైతులకు ఏపీ ప్రభుత్వం వరాలు
సాక్షి, అమరావతి: రాజధాని గ్రామాల ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తామని మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. గత ప్రభుత్వం కంటే మిన్నగా రాజధాని గ్రామాలకు మేలు చేస్తామని పేర్కొన్నారు. ఏపీ శాసనసభ సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. రాజధాని గ్రామాల్లో భూమిలేని నిరుపేదలకు ఇస్తున్న పెన్షన్‌ను రూ.2500 నుంచి రూ.5వేలకు పెంచబోతున్నామని తెలిపారు. రాజధానికి భూములు ఇచ్చిన పట్టా రైతులతో సమానంగా అసైన్డ్ భూములు ఇచ్చిన అసైన్డ్ దారులకు రిటర్న్ ప్లాట్లు కేటాయిస్తామని చెప్పారు. భూములిచ్చిన రైతులకు గతంలో జరీబుకైతే రూ.50 వేలు, మెట్ట భూమికి అయితే రూ.30 వేలు 10 ఏళ్లకు ఇవ్వాలని నిర్ణయించామన్నారు. అలాగే ప్రతి ఏటా జరీబు భూమికి రూ.5వేలు, మెట్టభూమికి రూ.3వేలు పెంచాలని గతంలో నిర్ణయించారని, ఈ యాన్యునిటీని 10 సంవత్సరాల నుంచి 15 సంవత్సరాలకు పెంచుతూ నిర్ణయించామని చెప్పారు. 10 ఏళ్ల తర్వాత జరీబు భూమికి ఇచ్చే యాన్యునిటీ రూ.1 లక్ష రూపాయిలు, మెట్ట భూమికి రూ.60 వేలు అవుతుందన్నారు. ఇప్పుడు ఒప్పందం ఉన్న 10 ఏళ్ల తర్వాత వచ్చే ఐదేళ్ల పాటు కూడా ఇదే రీతిలో యాన్యునిటీని చెల్లిస్తామని స్పష్టం చేశారు. (చదవండి: భూముల బండారం బట్టబయలు చేసిన బుగ్గన) -
రాజధాని రైతులకు మరింత మేలు చేస్తాం
సాక్షి, అమరావతి: రాజధాని రైతులకు ఇంతవరకూ జరిగిన దాని కంటే మెరుగైన ప్రయోజనం చేకూరుస్తామని రాష్ట్ర సమగ్రాభివృద్ధి–వికేంద్రీకరణపై ఏర్పాటైన హైపవర్ కమిటీ సభ్యుడు, మున్సిపల్ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో రైతులతో చేసుకున్న ఒప్పందాలకు అనుగుణంగా వారికి మరింత మేలు చేస్తామని, రాజధాని రైతులు ఉద్యమాలు చేయాల్సిన అవసరం లేదని.. ఇప్పటికైనా ఉపసంహరించుకోవాలని కోరారు. చంద్రబాబు మాయలో పడొద్దని ఆయన రైతులకు విజ్ఞప్తి చేశారు. శుక్రవారం తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డిని హైపవర్ కమిటీ సభ్యులు కలిశారు. రైతులకు సంబంధించిన అంశాలు, జీఎన్ రావు కమిటీ, బీసీజీ నివేదికలపై చర్చించిన అంశాలు, ఇతర విషయాలపై కమిటీ సభ్యులు ముఖ్యమంత్రికి పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ముఖ్యమంత్రితో భేటీ అనంతరం మంత్రి కురసాల కన్నబాబుతో కలిసి బొత్స సత్యనారాయణ మీడియాతో మాట్లాడారు. అమరావతి ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తామని, రాష్ట్రంలోని 13 జిల్లాల్లో ఇది కూడా ఒక భాగమని.. దాని అభివృద్ధి తమ బాధ్యతేనని స్పష్టం చేశారు. రైతులకు చేయాల్సిన మేలు గురించి ముఖ్యమంత్రి కూడా కొన్ని సూచనలు చేశారని, వాటిని కూడా నివేదికలో పొందుపరుస్తామన్నారు. తమ ప్రభుత్వానికి రాష్ట్ర సమగ్రాభివృద్ధి పట్ల స్పష్టమైన విధానం, ప్రణాళిక ఉందని తెలిపారు. అవసరమైతే మరోసారి హైపవర్ కమిటీ సమావేశమవుతుందన్నారు. సీఎం దృష్టికి రైతుల సమస్యలు రాజధాని గ్రామాలకు చెందిన రైతులు తన వద్దకు వచ్చి వారి సమస్యలు చెప్పారని, వార్షిక కౌలు, పెన్షన్ సరిపోవడం లేదని తెలిపారన్నారు. రైతుల సమస్యల్ని సీఎం దృష్టికి తీసుకెళ్లామని, హైపవర్ కమిటీ నివేదికలోనూ ఆ విషయాలను పొందుపరుస్తామని బొత్స చెప్పారు. రైతులతో మాట్లాడేందుకు తాము సిద్ధమని, తమ అభిప్రాయాలను సీఆర్డీఏ అధికారులకు తెలపాలని రైతులకు సూచించామన్నారు. ‘రాజధానిలో 25 శాతానికిపైగా పూర్తయిన భవనాలన్నింటినీ తప్పకుండా పూర్తిచేసి వాడుకలోకి తెస్తాం. అన్నింటికీ ప్రత్యామ్నాయాలు ఉన్నాయి. అన్ని ప్రాంతాల కోరికలు, అభిప్రాయాలను హైపవర్ కమిటీలో చర్చించాం. వాటన్నింటినీ క్రోడీకరించి సమగ్ర ప్రణాళికతో ముందుకు వెళ్తాం’ అని బొత్స తెలిపారు. తమకు వచ్చిన సిఫార్సులో అమరావతిని శాసన రాజధానిగా చేయాలనుందని.. దానిపై చర్చిస్తామని చెప్పారు. తమ ప్రభుత్వం రైతులకు బ్రాండ్ అంబాసిడర్ అని, ఏ రైతుకు చిన్న కష్టం వచ్చినా పెద్ద ఉపద్రవంగా భావిస్తామని, వారికి నష్టం జరగదన్నారు. తాడేపల్లిలోని సీఎం క్యాంప్ ఆఫీస్ వద్ద మీడియాతో మాట్లాడుతున్న మంత్రి బొత్స సత్యనారాయణ. చిత్రంలో మంత్రి కన్నబాబు అసెంబ్లీ తాత్కాలికమని చంద్రబాబు చెప్పలేదా? అమరావతిపై ఐఐటీ మద్రాసు ఇచ్చిన నివేదిక పూర్తి వాస్తవమని మంత్రి బొత్స పేర్కొన్నారు. బీసీజీ నివేదికలో చెప్పిన దాన్ని తప్పంటే ఎలాగని.. కొన్ని పత్రికలు కావాలని తప్పుడు ప్రచారం చేస్తున్నాయని విమర్శించారు. అసెంబ్లీ తాత్కాలికమని ఎవరు చెప్పారంటూ చంద్రబాబు ఇప్పుడు మాట మారుస్తున్నాడని.. మరి గతంలో ఎప్పుడూ అది శాశ్వతమని చంద్రబాబు ఎందుకు చెప్పలేదు? అని ప్రశ్నించారు. అసెంబ్లీ భవనం శాశ్వతమని చంద్రబాబు అన్నాడని ఎవరైనా చెబితే తాను తలవంచుకుని వెళ్లిపోతానని సవాల్ విసిరారు. ఇప్పుడు అసెంబ్లీ శాశ్వతమని చెబుతున్న చంద్రబాబు.. మరో అసెంబ్లీ భవనానికి ఎందుకు పునాది వేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. తన వ్యక్తిగత స్వార్థం కోసం చంద్రబాబు ఆలోచిస్తాడని, ఏ పనిచేసినా అందులో తనకేంటని చూస్తాడని బొత్స ఆరోపించారు. జోలె పట్టిన డబ్బులు ఏం చేశాడు? చంద్రబాబు దేనికి జోలె పడుతున్నాడని.. వచ్చిన డబ్బును ఏంచేశాడో చెప్పాలని డిమాండ్ చేశారు. గతంలో రాజధాని కోసం హుండీ పెట్టాడని.. ఆ డబ్బు ఏంచేశాడో ఎవరికీ తెలియదన్నారు. రాజధానికి 30 వేల ఎకరాల ప్రభుత్వ భూమి కావాలని జగన్మోహన్రెడ్డి చెబితే దాన్ని వక్రీకరించారని విమర్శించారు. పచ్చని పంటలు పండే భూములను తీసుకోవద్దని జగన్ చెప్పారని.. ఆయన మాటలను వక్రీకరించి ప్రచారం చేస్తున్నారని తప్పుపట్టారు. బీజేపీతో జనసేన కలవడంపై స్పందిస్తూ.. వారి విధానం వారిదని, ఉనికి కోసం అవన్నీ జరుగుతున్నాయన్నారు. -
అందరూ పెయిడ్ ఆర్టిస్టులేగా!
సాక్షి, అమరావతి : చంద్రబాబు అమరావతి పర్యటనకు తరలించిన జనమంతా డబ్బులిచ్చి తరలించిన వారేనంటూ ఆ పార్టీ నేతలు స్వయంగా చంద్రబాబుకు చెప్పిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. రాజధాని పర్యటనలో తన పార్టీ ప్రజా ప్రతినిధులు, నాయకులతో కలిసి చంద్రబాబు గురువారం బస్సులో బయల్దేరారు. ‘కార్యకర్తలకు టిఫిన్లు పెట్టారా?’ అంటూ బస్సులో తన ఎదురుగా ఉన్న ఒక టీడీపీ నేతను చంద్రబాబు ప్రశ్నించారు. ‘అంతా డబ్బులే’ అని ఆ నాయకుడు సమాధానమిచ్చారు. డబ్బులు ఇవ్వకుండా ఎవరు వస్తున్నారు అని ఆ నాయకుడు పేర్కొనగా.. ‘అంతా పెయిడ్ ఆర్టిస్ట్‌లేగా’ అని చంద్రబాబు వ్యాఖ్యానించారు. ఈ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. సార్వత్రిక ఎన్నికల్లో పరాజయం తర్వాత చంద్రబాబు ప్రతీ విషయంలో పెయిడ్ ఆర్టిస్ట్‌లను రంగంలోకి దింపి వైఎస్సార్సీపీ ప్రభుత్వంపై బురద జల్లేందుకు ప్రయత్నిస్తూ అభాసుపాలవుతున్న సంగతి తెలిసిందే. చదవండి: రాజధానిలో రక్తికట్టని వీధి నాటకం రాజధానిలో ఒక్క నిర్మాణమైనా పూర్తి చేశావా? మరోవైపు చంద్రబాబు పర్యటనను రైతులు, కూలీలు, దళితులు అడుగడుగునా అడ్డుకున్నారు. నల్ల బ్యాడ్జీలు, జెండాలతో నిరసన వ్యక్తం చేశారు. బంగారంలా పండే తమ భూముల్ని లాక్కుని నాలుగేళ్లుగా పట్టించుకోకుండా ఇప్పుడు ఎందుకు వచ్చారని నిలదీశారు. రాజధాని పేరుతో దగా చేశారని, బలవంతంగా భూములు తీసుకుని రోడ్డున పడేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘ఏడాదికి మూడు పంటలు పండే భూముల్ని బలవంతంగా లాక్కున్నారు. రాజధాని నిర్మాణానికి భూములిస్తే వాటితో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేశారు’ అంటూ దారిపొడవునా రైతులు ప్లకార్డులు, బ్యానర్లు పట్టుకుని గోబ్యాక్ అంటూ నినాదాలు చేశారు. నాలుగేళ్లలో అద్భుతాలు చేస్తానని మాయ మాటలతో మభ్యపెట్టి ఇప్పుడు ఏ ముఖం పెట్టుకుని రాజధానిలో పర్యటిస్తారని చంద్రబాబును నిలదీశారు. తమకు పంపిణీ చేసిన ప్లాట్లు ఎక్కడ ఉన్నాయో చూపించాకే రాజధాని ప్రాంతంలో పర్యటించాలంటూ దారిపొడవునా నినదించారు. ‘బాబూ.. నీ వల్ల మా బతుకులు బుగ్గిపాలయ్యాయి. మాకు తీవ్ర ద్రోహం చేసిన చంద్రబాబు ఈ ప్రాంతంలో పర్యటించవద్దు’ అంటూ వెనక్కివెళ్లిపోవాలని ఆందోళనకు దిగారు. నాలుగేళ్లలో గ్రాఫిక్స్ పేరుతో కాలయాపన చేశారు తప్పితే వాస్తవంగా అమరావతిలో ఒక్క నిర్మాణమైనా పూర్తి చేశారా? అని ఆందోళనలో పాల్గొన్న రైతులు ప్రశ్నించారు. ‘ఈ ప్రాంతంలో ఏం నిర్మించావని చూడడానికి వస్తున్నారు? రాజధాని ప్రజలకు ఉచిత విద్య, వైద్యం అందిస్తామన్న హామీని ఎందుకు అమలుచేయలేదు? గ్రామకంఠాల సమస్యను ఎందుకు పరిష్కరించలేదు? యువత ఉపాధి కోసం ఇస్తానన్న రూ. 25 లక్షల వడ్డీలేని రుణం హామీ ఏమైంది? రాజధాని రైతులకు కేటాయించిన ప్లాట్లు ఎక్కడున్నాయి? మూడేళ్లలో అంతర్జాతీయస్థాయిలో అభివృద్ధి చేసి ఇస్తానన్న ప్లాట్లు ఎందుకు ఇవ్వలేదు?’ అని నిలదీశారు. జీవో 41తో అసైన్డ్ భూములను సాగుచేస్తున్న దళితులకు అన్యాయం చేశారని, పట్టా భూములకు ఒక ప్యాకేజీ.. దళితుల అసైన్డ్ భూములకు మరో ప్యాకేజీ ఎందుకు ఇచ్చారని పలువురు దళిత రైతులు ప్రశ్నించారు. ‘చంద్రబాబు దళిత ద్రోహి. తమ ఆస్తులు కాపాడుకోవడం కోసం, వారి ప్రయోజనాల కోసం రాజధానిపై రాజకీయాలు చేయొద్దు. మా జీవితాలతో ఆడుకోవద్దు’ అని చంద్రబాబు కాన్వాయ్ వెళ్లిన ప్రతిచోట దారిపొడవునా నిలబడి ఆందోళన చేశారు. -
అందుకే బాబును చెప్పులేసి తరిమికొట్టబోయారు..
సాక్షి, విజయవాడ : గత అయిదేళ్ల పాలనలో రాజధాని పేరుతో ఏ కట్టడం నిర్మించని చంద్రబాబు నాయుడు ఇప్పుడు ఏ మొహం పెట్టుకొని అమరావతిలో పర్యటిస్తున్నారని పౌర సరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని ధ్వజమెత్తారు. రాజధాని కోసం భూములు ఇచ్చిన రైతులను గాలికి వదిలేసిన బాబు ఇప్పుడు నేల గుర్తొచ్చి ముద్దులు పెడుతున్నాడని విమర్శించారు. రాజధానిలో బాబు దిష్టిబొమ్మను దహనం చంద్రబాబు ఇన్నాళ్లు గ్రాఫిక్స్‌ను ముద్దు పెట్టుకొని కౌగిలించుకున్నాడని, అధికారం పోయాక ప్రజలు గూబ గుయ్యమనించారని ఎద్దేవా చేశారు. రైతులను మోసం చేసినందుకు ఈ రోజు చెప్పులేసి తరిమి కొట్టారని మంత్రి కొడాలి నాని వ్యాఖ్యానించారు. చంద్రబాబు నిష్ట దరిద్రుడని, అందుకే రాజధానిలో మూడు నియోజకవర్గాల్లో ప్రజలు ఓడించారని విమర్శించారు. రైతులు, దళితుల నుంచి భూములు కొట్టేసిన గుండాలు, రౌడీలతో వచ్చి చంద్రబాబు రాజధానిలో తిరుగుతున్నారని మంత్రి మండిపడ్డారు. కాగా చంద్రబాబు పర్యటనను నిరసిస్తూ రాజధాని ప్రాంత రైతులు నిరసన తెలిపారు. ఆయన పర్యటనను తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఆందోళన చేపట్టారు. చంద్రబాబు రావొద్దంటూ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. చదవండి: చంద్రబాబుకు నిరసన ఫ్లెక్సీలు స్వాగతం -
రాజధానిలో బాబు దిష్టిబొమ్మ దహనం
తాడేపల్లి: రాజధానిలో చంద్రబాబు పర్యటన సందర్భంగా తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు ప్రవర్తించిన తీరుపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. శాంతియుతంగా నిరసన తెలపుతున్న తమపై పచ్చపార్టీ శ్రేణులు గుండాల్లా దాడులు చేయడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. అన్నదాతలపై టీడీపీ నేతల దాడులను నిరసిస్తూ రాజధాని ప్రాంతం రైతులు గురువారం చంద్రబాబు దిష్టిబొమ్మను దహనం చేశారు. రాజధాని పేరుతో భూములు తీసుకుని చంద్రబాబు తమకు అన్యాయం చేశారని, ఈ అన్యాయాన్ని నిలదీయడానికి వస్తే.. చంద్రబాబు విజయవాడ గుంటూరు నుంచి తీసుకువచ్చి రౌడీలను తీసుకొచ్చి తమపై దాడి చేయించారని రైతులు మండిపడుతున్నారు. రాజధానికి భూములు ఇచ్చినందుకు ప్రతిఫలంగా చంద్రబాబు తన పార్టీ కార్యకర్తలతో తమపై దాడి చేయించారని ఆవేదన వ్యక్తం చేశారు. దీనికి చంద్రబాబుకు కచ్చితంగా బుద్ధిచెప్తామని హెచ్చరించారు. రాజధాని ప్రాంత రైతుల ఆందోళనలు, నిరసనల నడుమ చంద్రబాబునాయుడు, టీడీపీ నేతలు రాజధానిలో పర్యటిస్తున్నారు. చదవండి: అమరావతిలో బాబుకు నిరసన సెగ -
అమరావతిలో బాబుకు నిరసన సెగ
సాక్షి, అమరావతి: ప్రతిపక్ష నేత, టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు పర్యటన సందర్భంగా అమరావతిలో ఉద్రిక్తత నెలకొంది. రాజధాని పేరుతో భూములు దోచుకున్న చంద్రబాబునాయుడు అమరావతిలో పర్యటించవద్దంటూ రైతులు పెద్ద ఎత్తున నిరసనకు దిగారు. మా ప్లాట్లు ఎక్కడున్నాయో చూపించిన తర్వాతే రాజధాని ప్రాంతంలో పర్యటించాలంటూ డిమాండ్ చేస్తున్నారు. రాజధాని కోసం ల్యాండ్‌పూలింగ్ పేరిట చంద్రబాబు పెద్ద ఎత్తున రైతుల నుంచి భూములు సేకరించిన సంగతి తెలిసిందే. అయితే, తమ నుంచి సేకరించిన భూములకు బదులుగా కనీసం ప్లాట్లు కూడా ఇవ్వకపోవడంతో తమ జీవితాలు రోడ్డునపడ్డాయని పలువురు అన్నదాతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చంద్రబాబు గోబ్యాక్ అంటూ నిరసనకు దిగారు. బాబూ.. నీ వల్ల మా బతుకులు బుగ్గిపాలయ్యాయంటూ భగ్గుమంటున్నారు. రైతులకు తీవ్ర ద్రోహం చేసిన చంద్రబాబు రాజధాని ప్రాంతంలో పర్యటించవద్దంటూ ఆందోళన చేపట్టారు. అయితే, శాంతియుతంగా నిరసన తెలుపుతున్న రైతులపై టీడీపీ శ్రేణులు గుండాయిజానికి దిగారు. ప్లకార్డులు పట్టుకొని నిరసన తెలిపిన రైతులపై దాడులకు దిగారు. దీంతో అమరావతిలోని వెంకటాయపాలెంలో వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. పోలీసులు రంగప్రవేశం చేసి టీడీపీ కార్యకర్తలను చెదరగొట్టారు. ఈ సందర్భంగా పోలీసులకు, టీడీపీ కార్యకర్తలకు మధ్య తోపులాట చోటుచేసుకుంది. రౌడీల్లా ప్రవర్తించిన టీడీపీ కార్యకర్తలు! చంద్రబాబు పర్యటనకు వ్యతిరేకంగా శాంతియుతంగా నిరసన తెలుపుతున్న తమపై టీడీపీ కార్యకర్తలు రౌడీల్లా ప్రవర్తించారని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. నిరసన తెలుపుతున్న తమను రెచ్చగొడుతూ.. దాడి చేసేందుకు టీడీపీ శ్రేణులు మూకుమ్మడిగా వచ్చారని తెలిపారు. చంద్రబాబు అన్యాయం చేశారనే నిరసన తెలిపేందుకు ఇక్కడికి వచ్చామని, తమపై టీడీపీ కార్యకర్తలు దాడి చేయడంతో ఇద్దరు రైతులు గాయపడ్డారని తెలిపారు. టీడీపీ నేతలు బయటినుంచి జనాలను తీసుకొచ్చారని, మద్యం మాఫియా, ఇసుక మాఫియా వాళ్లు తప్ప చంద్రబాబు వెంట ఎవరూ కనిపించడం లేదని రైతులు అంటున్నారు. అసైన్డ్ రైతులంటే చంద్రబాబుకు అంత అలుసా? అని వారు ప్రశ్నించారు. చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు నిరసన తెలిపేందుకు కనీసం తమను రోడ్డు మీదకు రానివ్వలేదని, రైతు అనేవాడు ఉండకూడదనేది చంద్రబాబు ఆలోచన అని రైతులు ధ్వజమెత్తారు. జరిగిన అన్యాయంపై నిరసన తెలుపుతుంటే.. విజయవాడ, గుంటూరు నుంచి గుండాలను తీసుకొచ్చి తమ దాడి చేశారని రైతులు మండిపడుతున్నారు. చంద్రబాబు రైతు ద్రోహి అని విమర్శిస్తున్నారు. కరకట్ట నుంచి రాయపుడి వరకు నిరసన ఫ్లెక్సీలు ఉండవల్లిలోని తన నివాసం నుంచి చంద్రబాబు రాజధాని పర్యటనకు బయలుదేరి వెళ్లారు. ఆయన వెంట పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, సీనియర్ నేతలు ఉన్నారు. వెంకటాయపాలెం,ఉద్దండరాయ పాలెం, నేలపాడు, రాయపూడి, ఐనవోలు తదితర గ్రామాల మీదుగా చంద్రబాబు పర్యటన సాగుతోంది. రాజధాని పర్యటనలో అడుగడుగునా చంద్రబాబును రైతులు అడ్డుకుంటున్నారు. చంద్రబాబు రాజధాని పర్యటనకు రావొద్దంటూ పెద్ద ఎత్తున ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. కరకట్ట నుంచి రాయపుడి వరకు ఈ నిరసన ఫ్లెక్సీలు ఏర్పాటయ్యాయి. చంద్రబాబుపై ప్రశ్నల వర్షం ‘రాజధాని పేరుతో రైతులను మోసం చేశావు. చంద్రబాబూ.. ఏం మొహం పెట్టుకొని రాజధానిలో పర్యటిస్తున్నావు’ అంటూ రైతులు ప్రశ్నిస్తున్నారు. ‘రాజధాని పేరిట గ్రాఫిక్స్ చూపించి మమ్మల్ని ఎందుకు మోసం చేశారు? ఇలా మోసం చేసినందుకు చంద్రబాబు రైతులకు క్షమాపణ చెప్పాలి. క్షమాపణ చెప్పిన తర్వాతే రాజధానిలో చంద్రబాబు అడుగుపెట్టాలి’ అంటూ ఫెక్సీల్లో రైతులు నినదించారు. ‘ రాజధాని ప్రజలకు ఉచిత విద్య, వైద్యం అందిస్తామన్న హామీని ఎందుకు అమలుచేయలేదు? గ్రామకంఠాల సమస్యను చంద్రబాబు ఎందుకు పరిష్కరించలేదు? యువత ఉపాధి కోసం ఇస్తానన్న రూ. 25లక్షల వడ్డీలేని రుణం హామీ గుర్తుకురాలేదా? రాజధాని రైతులకు కేటాయించిన ప్లాట్లు ఎక్కడున్నాయి? మూడేళ్లలో అంతర్జాతీయస్థాయిలో అభివృద్ధి చేసి ఇస్తానన్న ప్లాట్లు ఎందుకు ఇవ్వలేదు? జీవో 41తో అసైన్డ్ భూములను సాగుచేస్తున్న దళితులకు అన్యాయం చేశారు. పట్టా భూములకు ఒక ప్యాకేజీ.. దళితుల అసైన్డ్ భూములకు మరో ప్యాకేజీ ఎందుకు ఇచ్చారు? చంద్రబాబు దళిత ద్రోహి. మీ ఆస్తులు కాపాడుకోవడం కోసం, మీ ప్రయోనాల కోసం రాజధానిపై రాజకీయాలు చేయొద్దు. మా జీవితాలతో ఆడుకోవద్దు’ అంటూ ఫ్లెక్సీల్లో రైతులు నిప్పులు చెరిగారు. -
అవన్ని చెప్పాకే చంద్రబాబు పర్యటించాలి..
సాక్షి, అమరావతి: ప్యాకేజీలతో దళిత సోదరులకు చేసిన మోసాన్ని ప్రపంచానికి చెప్పి, ఆ తర్వాతే చంద్రబాబు నాయుడు రాజధాని గ్రామాల్లో పర్యటించాలని వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి డిమాండ్ చేశారు. ఎమ్మెల్యే ఆర్కే గురువారమిక్కడ మీడియాతో మాట్లాడుతూ... ‘చేసిన వాగ్దానం ప్రకారం అమరావతిలో చంద్రబాబు చేత శంకుస్థాపన చేయబడి..నిర్మాణం పూర్తి చేసుకున్న 100 అడుగులు బాబా సాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి..చంద్రబాబు తన అమరావతి పర్యటన ప్రారంభించాలి. పేద రైతుల భూములు ఏవిధంగా తన మనుషులకు దోచిపెట్టారు. రాజధాని కోసం చంద్రబాబును నమ్మి భూములు ఇచ్చిన రైతులకు ఏమి చేశారో చెప్పాలి. రైతులకు అన్ని చెప్పాకే చంద్రబాబు తన పర్యటన కొనసాగించాలి. చదవండి: అప్పుడు ఆర్భాటం ఇప్పుడు రాద్ధాంతం కౌలు రైతులు, చేతి వృత్తిదారులకు రాజధాని పేరుతో చంద్రబాబు చేసిన అన్యాయాన్ని చెప్పి ...తన పర్యటన కొనసాగించాలి. తన బినామీ కాంట్రాక్టర్లకు ఏవిధంగా రైతుల భూములు దోచిపెట్టారో చెప్పి గ్రామాల్లో తిరగాలి. తన హయాంలో ఒక్కటి కూడా శాశ్వత భవనం ఎందుకు కట్టలేకపోయారో చెప్పి పర్యటించాలి. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులను రాజధానిలో ఎక్కడ, ఏవిధంగా ఖర్చు పెట్టారో...ఎందుకు యుటిలైజేషన్ సర్టిఫికెట్లు ఇవ్వలేదో.. చెప్పి చంద్రబాబు తన పర్యటన కొనసాగించాలి. చంద్రబాబుకు నిరసన ఫ్లెక్సీలు స్వాగతం భూములు ఇవ్వని రైతులపై ఎందుకు కేసులు పెట్టించి, పోలీసులతో హింసించారో చెప్పాలి. గ్రామ కంఠాలను తేల్చకుండా సామాన్యులను సైతం ఎందుకు ఇబ్బంది పెట్టారు. నిర్మాణ వ్యయం చదరపు అడుగు సుమారు రూ.1500 అవుతుంటే.. ఇసుక, భూమి ఉచితంగా ఇచ్చి తన బినామీ కాంట్రాక్టర్లకు చదరపు అడుగు రూ.15,000లకు ఎందుకు ఇచ్చారో చెప్పి చంద్రబాబు పర్యటన చేయాలి. పేద, దళిత రైతుల భూములు ఎందుకు సింగపూర్ ప్రయివేట్ సంస్థలకు, కేంద్ర ప్రభుత్వ జోక్యం లేకుండా కట్టబెట్టారో చెప్పాలి’ అని డిమాండ్ చేశారు. చదవండి: దళిత ద్రోహి చంద్రబాబు -
రాజధాని రైతులకు ఊరట
సాక్షి, అమరావతి: రాజధాని ప్రాంత రైతులకు ఊరట కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాజధాని అమరావతి నిర్మాణం కోసం భూములు ఇచ్చిన రైతులకు 187.44 కోట్ల రూపాయలు విడుదల చేసింది. 2019-20 ఆర్థిక సంవత్సరానికి రైతులకు కౌలు క్రింద ఈ మొత్తం విడుదల చేసింది. ఈ మేరకు మంగళవారం ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు వెలువరించింది. ప్రభుత్వం నిధులు విడుదల చేయడం పట్ల రాజధాని రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. టీడీపీపై రైతుల ఆగ్రహం రాజధాని తరలిస్తున్నారంటూ తెలుగుదేశం పార్టీ చేస్తున్న తప్పుడు ప్రచారంపై స్థానిక రైతులు మండిపడుతున్నారు. అమరావతిపై టీడీపీ, దాని అనుకూల మీడియా వారం రోజుల నుంచి విష ప్రచారం చేస్తుండటంతో రైతులు స్పందించారు. టీడీపీ సాగిస్తున్న అసత్య ప్రచారంతో రాజధానిలో భూముల ధరలు తగ్గిపోతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. రాజధానిపై తెలుగుదేశం పార్టీ నాయకులు దాని అనుకూల మీడియా చేస్తున్న విషప్రచారం ఆపకపోతే చంద్రబాబు ఇంటిని ముట్టడిస్తామని హెచ్చరించారు. గతంలో టీడీపీ ప్రభుత్వం తమ దగ్గర నుంచి భూములు లాక్కుని తమకు ఏమీ చేయలేదని వాపోయారు. రాజధానిపై అంత ప్రేమ ఉంటే ఒక్క శాశ్వత కార్యాలయం కూడా ఎందుకు కట్టలేదని టీడీపీ నాయకులను సూటిగా ప్రశ్నించారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన అక్రమాలు భయటపడకుండా ఉండేందుకు, ఉనికిని చాటుకునేందుకు టీడీపీ నాయకులు విష ప్రచారం చేస్తున్నారని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. చంద్రబాబు, ఆయన బినామీలు ఇన్సైడ్ ట్రేడింగ్‌కు పాల్పడ్డారని రైతులు ఆరోపించారు. రాజధాని ఎక్కడ పెట్టాలన్న నిర్ణయం జరగకముందే టీడీపీ నాయకులు అమరావతిలో భూములు కొన్నారని రైతులు సాక్ష్యాలు చూపించారు. చంద్రబాబు, లింగమనేని రమేశ్, పయ్యావుల కేశవ్, ధూళిపాల నరేంద్ర, జీవీ ఆంజనేయులు, వేమూరి రవికుమార్ ప్రసాద్, కొమ్మాలపాటి శ్రీధర్, నారాయణ బినామీలు.. కోర్ క్యాపిటల్ ఎక్కడ వస్తుందో తెలుసుకుని ముందుగానే అక్కడ భూములు కొన్నారని రైతులు పూసగుచ్చినట్టు వివరించారు. (చదవండి: ఏపీ రాజధానిపై మహాకుట్ర!) -
గవర్నర్ ప్రసంగంపై మండిపడ్డ రాజధాని రైతులు
సాక్షి, అమరావతి: ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా బుధవారం రోజున ఉభయసభలను ఉద్దేశించి గవర్నర్ నరసింహాన్ చేసిన ప్రసంగంపై రాజధాని రైతులు మండిపడ్డారు. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు చివరకు గవర్నర్ చేత కూడా అబద్ధాలు చెప్పించారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అభివృద్ధి చేసిన ప్లాట్లను ప్రభుత్వం తమకు ఇచ్చినట్టు గవర్నర్ ప్రసంగంలో చెప్పారని.. తమకు ఇవ్వాల్సిన ప్లాట్లు ఎక్కడ అభివృద్ధి చేసి ఇచ్చారో చూపించాలని ప్రభుత్వాన్ని నిలదీశారు. రాజధాని భూములతో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయడం తప్ప చంద్రబాబు రైతులకు చేసింది ఏమి లేదని అన్నారు. రాజధాని ప్రాంతంలో గవర్నర్ కనీసం ఒక్కరోజైనా పర్యటించాలని విజ్ఞప్తి చేశారు. గవర్నర్ పర్యటిస్తే.. చంద్రబాబు ప్రభుత్వం నాలుగేళ్లలో ఏం చేసిందో అర్ధమవుతుందని, వాస్తవాలు వెలుగుచూస్తాయని రాజధాని రైతులు పేర్కొన్నారు. -
బలవంతపు భూసేకరణ నిలిపేయాలి: సీపీఎం
సాక్షి, అమరావతి: రాజధాని పేరుతో బలవంతపు భూసేకరణ చేయడాన్నిచంద్రబాబు ప్రభుత్వం వెంటనే నిలిపి వేయాలని సీపీఎం ఏపీ రాష్ట్ర కార్యదర్శి పి.మధు కోరారు. తాడేపల్లి మండలం ఉండవల్లిలో రాజధాని రైతులతో బుధవారం మధు సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. అన్యాయం అని ప్రశ్నించే గొంతులను నొక్కేస్తారా అని ప్రశ్నించారు. చంద్రబాబు ప్రభుత్వం చేసిన 2013 భూసేకరణ చట్ట సవరణ బిల్లును వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. రైతుల ప్రయోజనాలను దెబ్బతీసే ఈ సవరణలను వామపక్షాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయని తెలిపారు. పార్లమెంటులో ఆమోదించిన 2013 భూసేకరణ చట్టానికి నవంబర్ 20, 2014లో రాష్ట్ర ప్రభుత్వం నిబంధనలు తయారు చేసిందని.. 2013 భూసేకరణ చట్టం రైతులకు కల్పించిన హక్కులను చంద్రబాబు ప్రభుత్వం నిర్వీర్యం చేసిందని విమర్శించారు. భూసేకరణ చట్టం సవరణపై, టీడీపీ ప్రభుత్వంపై యుద్ధం చేస్తామని హెచ్చరించారు. రైతుల కోసం సీపీఎం ఎప్పుడూ అండగా ఉంటుందని తెలిపారు. చాలా ప్రమాదకరమైన భూసేకరణ చట్టాన్ని టీడీపీ ప్రభుత్వం తీసుకువచ్చిందని, చంద్రబాబు ప్రభుత్వం చేసిన చట్టం వల్ల కోర్టుకు వెళ్లినా ఎటువంటి ప్రయోజనం ఉండదని వ్యాఖ్యానించారు. ప్రతిపక్షం అసెంబ్లీలో లేని సమయంలో టీడీపీ ప్రభుత్వం భూసేకరణ చట్టం బిల్లును ప్రవేశపెట్టిందని, ఇలాంటి పని చేయడం చాలా మోసపూరిత చర్య అని విమర్శించారు. -
రూ.10 కోట్లు పలికే చోట రూ.39 లక్షలేనా?
సాక్షి, అమరావతి బ్యూరో: ప్రస్తుతం ఎకరం రూ.6 కోట్ల నుంచి రూ. 10 కోట్ల దాకా పలికే ప్రాంతంలో విలువైన తమ భూములు తీసుకుని ఎకరాకు రూ.39 లక్షలు మాత్రమే పరిహారం ఇస్తామని రాష్ట్ర ప్రభుత్వం చెప్పడం ఎంతవరకు సమంజసమని రాజధాని ప్రాంత రైతులు ప్రశ్నించారు. భూ సేకరణ నోటీసులపై అభ్యంతరాలను స్వీకరించేందుకు బుధవారం ఉండవల్లికి వచ్చిన సీఆర్డీఏ అధికారులను రైతులు పలు ప్రశ్నలతో నిలదీయటంతో ఉక్కిరిబిక్కిరయ్యారు. తమకు సమాధానం చెప్పాలని లేదంటే కార్యక్రమాన్ని వాయిదా వేయాలని రైతులంతా పట్టుబట్టారు. భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది: గజానికి రూ. 4,400 చొప్పున ధర నిర్ణయించామని, దీనికి మల్టిపుల్ ఫ్యాక్టర్ కలిపితే గజానికి రూ.5,500 వస్తుందని స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ బి.రజనీకుమారి రైతులకు చెప్పారు. ఈ మొత్తానికి భూ సేకరణ చట్టం 2013 ప్రకారం రెండున్నర రెట్లు పరిహారం అందజేస్తామన్నారు. ప్రస్తుతం ఈ ప్రాంతంలో గజం రూ.50 వేలు పలుకుతుంటే రూ.5 వేలు ఇస్తామనడం ఏమిటని రైతులు మండిపడ్డారు. సెక్షన్ 21(5) ప్రకారం నోటీసులు తీసుకోని రైతుల వివరాలతో పత్రికల్లో ప్రకటన ఇచ్చిన 30 రోజుల తర్వాత అవార్డు ఎంక్వైరీ చేపట్టాలన్నారు. సెక్షన్ 19(1) ప్రకారం రూఢీ ప్రకటనకు ముందే రైతులకు అందజేసే పరిహారాన్ని కలెక్టర్ ఖాతాకు ప్రభుత్వం జమ చేసి ఉండాలని పేర్కొన్నారు. రైతులు న్యాయపరమైన అంశాలతో నిలదీయటంతో సమాధానం చెప్పలేక అధికారులు తెల్లబోయారు. రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న నియంతృత్వ పోకడలకు సహకరిస్తే అధికారులు భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని రైతులు హెచ్చరించారు. బాబు తాతనైనా ఎదిరిస్తాం: మా భూముల జోలికొస్తే చంద్రబాబునే కాదు.. ఆయన తాతనైనా ప్రశ్నిస్తామని రాజధాని రైతులు హెచ్చరించారు. అభ్యంతరాలను పట్టించుకోకుండా బలవంతంగా భూములు లాక్కునేందుకు ప్రయత్నిస్తే ఎంతటి వారినైనా ఎదిరిస్తామని స్పష్టం చేశారు. తమ భూములకు పరిహారం ఎప్పుడు, ఎంత జమ చేశారో చెప్పాలన్నారు. సీఆర్డీఏ కార్యాలయానికి చేరుకున్న రైతులు: తాడేపల్లి మండలం ఉండవల్లి రైతులకు భూసేకరణ కింద నోటీసులు జారీ చేసిన అధికారులు అభ్యంతరాలుంటే గ్రామంలోని సీఆర్డీఏ కార్యాలయంలో తెలపాలని సూచించారు. దీంతో సుమారు 60 మంది రైతులు బుధవారం కార్యాలయానికి చేరుకుని భూములపై తమ అభ్యంతరాలను ఎందుకు పరిగణనలోకి తీసుకోవడం లేదో చెప్పాలంటూ నిలదీశారు. కాగా, భూ సేకరణ చట్టం సెక్షన్ 12, 20ల ప్రకారం సీఆర్డీఏ అధికారులు చేసిన సర్వే అంతా బోగస్ అని ఇట్టే తెలిసిపోతోందని అడ్వకేట్ సీహెచ్ నిర్మలత తెలిపారు. ఉండవల్లి సెంటర్లో సర్వే నంబర్ 12(1సీ)లో మాడా పున్నారావుకు చెందిన మూడంతస్తుల భవనం ఉంటే అధికారులు అది ఖాళీ స్థలంగా చూపుతున్నారన్నారు. కృష్ణా కరకట్టకు ఉత్తరం వైపున ఇస్కాన్ ఆలయం నిర్మాణం జరుగుతున్న స్థలాన్ని ఖాళీగా చూపిస్తున్నారని, సర్వే అంతా లోపభూయిష్టమన్నారు. -
కౌలు రైతు పొలం ధ్వంసం చేసిన అధికారులు
-
చంద్రబాబుతో నాకు పనిలేదు: వెంకయ్య
న్యూఢిల్లీ: ప్రత్యేక హోదా అనే వాళ్లకు ప్రత్యేకహోదా అంటే ఏమీ తెలియదని కేంద్ర పట్టణాభివృద్ది, సమాచార ప్రసార శాఖ మంత్రి వెంకయ్యనాయుడు అన్నారు. తాను ఆ రోజు పార్లమెంట్ లో మాట్లాడినప్పుడు ఆ రోజు ఎవరూ మాట్లాడలేదని ఆయన చెప్పారు. హోదాకు అవసరమయ్యే లక్షణాలు రాష్ట్రంలో లేనప్పటికీ హైదరాబాద్ లేనందువల్ల ఆదాయం తగ్గుతుందనే ఉద్దేశంతో తానే గట్టిగా వాదించానని చెప్పారు. దానికి అప్పటి ప్రభుత్వం చట్టబద్దత కల్పించలేదన్నారు. కాని ఎందుకు అడిగావు, గొంతు చించుకున్నావు అని అడగడం సరైంది కాదని అన్నారు. 14వ ఆర్థిక సంఘం ప్రత్యేక హోదా ఉన్న రాష్ట్రానికీ, మామూలు రాష్ట్రానికి తేడా పాటించకూడదని నిర్ణయించిందని ఆయన చెప్పారు. ప్రత్యేక హోదా ఉన్నందువల్ల రు. 3 వేల నుంచి 4 వేల కోట్ల మేరకు ఆదాయం లభిస్తుందని, అంత మేరకు ఇవ్వడమే కాక, రూ. 3 లక్షల 50 వేల కోట్లమేరకు పెట్టుబడులతో సంస్థలు వచ్చేందుకు తాము కృషి చేశామన్నారు. ఏపీ రాజధాని అమరావతి నిర్మాణానికి స్వచ్చందంగా భూములు ఇచ్చిన రైతుల సమస్యలను పట్టించుకుని ఆదాయపన్నులో మినహాయింపు ఇచ్చే విషయంలో అండదండగా నిలిచిన వెంకయ్య నాయుడుకు రాజధాని రైతుల సమాఖ్య తరఫున ఢిల్లీకి వచ్చిన దాదాపు వంది మంది రైతు ప్రతినిధులు మంగళవారం ఉదయం ఆయన నివాసంలో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా వెంకయ్య నాయుడు మాట్లాడుతూ... రాజధాని నిర్మాణానికి మొదటి నుంచీ కేంద్ర ప్రభుత్వం పూర్తి సహకరాన్ని అందిస్తోందన్నారు. రాజధాని అమరావతిలో రావడమే అక్కడి రైతుల అదృష్టమని అన్నారు. రాష్ట్రం సర్వతో ముఖాభివృద్ది జరగాలన్నదని తన అభిప్రాయమని, ముఖ్యమంత్రి కూడా అదే అభిప్రాయంతో ఉన్నారని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్దికి అడ్డంకులు లేవన్నారు. తాను ఎన్నికల్లో నిలబడనని.. ఓటు అడగనని, చంద్రబాబుతో తనకు ఏ పనీ లేదని వెంకయ్య స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్ వాడిగా పనిగట్టుకుని రాష్ట్రానికి మేలు జరిగేలా చూస్తానని, తర్వాత తెలుగువాడిలా ఆలోచిస్తానని.. తర్వాత దేశం గురించి యోచిస్తానని చెప్పారు. నరేంద్ర మోదీ, చంద్రబాబులను ప్రశంసించడాన్ని కూడా కొందరు విమర్శిస్తున్నారని వాపోయారు. మోదీ తనకు రాజ్యసభ సీటు ఇచ్చినందుకు ప్రశంసించారని చౌకబారు ఆరోపణలు చేసేవారికి తానే పార్టీ అధ్యక్షుడుగా అనేకమందికి రాజ్యసభ సీట్లు ఇచ్చి పెద్దల సభకు పంపించానన్న విషయం తెలియాలని అన్నారు. -
నిర్వాహకులకు షాకిచ్చిన రాజధాని రైతులు
రాజధాని అమరావతి మాస్టర్ ప్లాన్‌పై అవగాహన సదస్సు నిర్వహించేందుకు వచ్చిన అధికారులకు రైతులు షాకిచ్చారు. గుంటూరు జిల్లా మంగళగిరి మండలం నీరుకొండ, పురగల్లు గ్రామాలకు బుధవారం మధ్యాహ్నం అధికారులు సదస్సు ఏర్పాటు చేశారు. ఈ సదస్సుకు హాజరైన రైతులు.. ముందు గ్రామకంఠాల సమస్యలను పరిష్కారించాలని డిమాండ్ చేశారు. ముందుగా గ్రామ కంఠం భూములను తేల్చాకే సదస్సులు పెట్టాలంటూ సమావేశాన్ని ప్రజలు అడ్డుకున్నారు. దీంతో పాటు. తమ గ్రామాల్లోంచి రోడ్లు వేస్తున్నారో లేదో తేల్చి చెప్పాలని కోరారు. దీంతో సరేనంటూ అధికారులు వెనుదిరిగి వెళ్లిపోయారు. -
నాటకీయంగా సురేశ్‌ను వదిలిన పోలీసులు
వారం రోజులుగా పోలీసుల అదుపులో ఉన్న నూతక్కి సురేశ్‌ను బుధవారం సాయంత్రం ఐదు గంటల ప్రాంతంలో అత్యంత నాటకీయ పరిణామాల మధ్య వదిలేశారు. పోలీసులు సురేశ్‌ను అదుపులోకి తీసుకుని వదలడం లేదంటూ కుటుంబసభ్యులు హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ వేయడం తెలిసిందే. ఈ నేపథ్యంలో పోలీసులు మంగళవారం సాయంత్రం నుంచి సురేశ్ కుటుంబసభ్యులకు ఫోన్లు చేసి అతడిని తీసుకెళ్లాలంటూ హడావుడి చేసినట్లు చెబుతున్నారు. ఎస్.ఐ. రవిబాబు బుధవారం సురేశ్‌ను తెలుగుదేశం పార్టీకి చెందిన తుళ్ళూరు జెడ్పీటీసీ సభ్యుడు బెజవాడ నరేంద్ర వద్ద విడిచి వెళ్లారు. సురేశ్‌ను జెడ్పీటీసీ సభ్యుడి వద్ద ఎలా వదిలి వెళతారంటూ కుటుంబసభ్యులు మండిపడుతున్నారు. సురేశ్‌ను వారం రోజులుగా చిత్రహింసలకు గురిచేసి పంట దహనానికి పాల్పడింది తానేనని, తన మేనమామ చంద్రశేఖర్ చేయించాడని పేపర్లపై రాయించుకుని సంతకాలు చేయించారని కుటుంబ సభ్యులు తెలిపారు. తీవ్రస్థాయిలో భయపెట్టి సెల్ఫోన్లో రికార్డు చేశారని, ఈ కేసులో అన్యాయంగా ఇరికిచేందుకు పోలీసులు కుట్రపన్నడం దారుణమని వాపోతున్నారు. జగన్ వచ్చిపరామర్శించడంజీర్ణించుకోలేకే కుట్ర రాజధాని ప్రాంతంలో ల్యాండ్ పూలింగ్‌కు పొలం ఇవ్వలేదనే కోపంతో గుర్తుతెలియని వ్యక్తులు మల్కాపురంలోని నా చెరకు పంటను దహనం చేశారు. స్పందించిన ప్రతిపక్షనేత వై.ఎస్.జగన్మోహన్రెడ్డి పంట పొలానికి వచ్చి నన్ను పరామర్శించి ప్రభుత్వ తీరును తప్పు పట్టడాన్ని జీర్ణించుకోలేక పోలీసులను అడ్డుపెట్టి నన్ను, నా మేనల్లుడిని కేసు లో ఇరికించేందుకు కుట్ర పన్నుతున్నారు. 29వ తేదీ న విచారణ పేరుతో నామేనల్లుడు సురేశ్‌ను తీసుకెళ్లి డీఎస్పీ విపరీతంగా కొట్టి చిత్రహింసలకు గురిచేశారు. తానే ఈ పంట దగ్ధానికి పాల్పడినట్లుగా సురేశ్‌చేత రాయించుకుని సంతకాలు చేయించి సెల్లో వీడియో రికార్డు కూడా చేశారు. రాజధాని ప్రాంతం లో 13 చోట్ల పంట పొలాల్లో వెదురు బొంగులు దగ్ధమైన సంఘటనలకు సంబంధించి కేసులను సైతం సురేశ్‌పై మోపేందుకు ప్రయత్నిస్తున్నారు. - గద్దే చినచంద్రశేఖర్ -
'ఎక్కడి రైతులకు అక్కడే అభివృద్ధి భూములు'
-
'ఎక్కడి రైతులకు అక్కడే అభివృద్ధి భూములు'
హైదరాబాద్ : నూతన రాజధాని నిర్మాణానికి అక్టోబర్ 22 న శంకుస్థాపన చేస్తామని ఏపీ మంత్రి నారాయణ తెలిపారు. రాజధాని ప్రాంత రైతుల నుంచి ఇప్పటివరకూ 21,500 ఎకరాలకు అగ్రిమెంట్లు కుదిరాయని ఆయన చెప్పారు. ఏ గ్రామంలో రైతులకు అదే గ్రామంలో అభివృద్ధి చెందిన భూములు ఇస్తామన్నారు. హైకోర్టు తీర్పు రాష్ట్ర ప్రభుత్వానికి సానుకూలంగా వచ్చిందని ఆయన అన్నారు. ఈ తీర్పు ఆధారంగా భూ సమీకరణ మరింత సులభంగా సాగుతుందని మంత్రి పేర్కాన్నారు. ఒకవేళ భూములివ్వని రైతుల నుంచి..పంటలు పూర్తయ్యాక భూ సేకరణ చేపట్టనున్నట్లు నారాయణ వివరించారు. -
రాజధాని రైతులు, కూలీలకు న్యాయం జరగాలి: డొక్కా
గుంటూరు: ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంతంలో రైతులు, రైతు కూలీలు, ఇతర పేద వర్గాలకు ప్రభుత్వం న్యాయం చేయాలని మాజీ మంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్ డిమాండ్ చేశారు. ఆయన గురువారం గుంటూరు పట్టణంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వ్యవసాయం, దాని అనుబంధ రంగాలపై ఆధారపడి జీవించే వారిని ఏపీ ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు. -
ఏమిటో అభ్యంతరం
తాడికొండ : రాజధాని రైతుల అభ్యంతరాలను సీఆర్డీఏ అధికారులు పట్టించుకోవడం లేదు. అభ్యంతరాలను తెలుపుతూ అంజేసిన దరఖాస్తులను పరిశీలించడానికి ఉన్న అభ్యంతరం ఏమిటో కూడా వెల్లడికావడం లేదు. నూతన రాజధాని నిర్మాణంలో భాగంగా సీఆర్డీఏ పరిధిలోని 29 గ్రామాల్లో జనవరి 2 తేదీ నుంచి ప్రభుత్వం భూ సమీకరణ ప్రారంభించి పూర్తి చేసింది. ఈ క్రమంలో రైతుల నుంచి 9.2 (అభ్యంతరం), 9.3(అంగీకారం) డిక్లరేషన్ పత్రాలను సేకరించింది. ప్రభుత్వం 9.3 దరఖాస్తులకు ఇచ్చిన ప్రాధాన్యత అదే రైతుల నుంచి తమ భూములకు సంబంధించిన సమస్యలను పరిష్కరించాలని కోరుతూ అందజేసిన 9.2 అభ్యంతరాల దరఖాస్తులను నేటికీ పరిశీలించడం లేదు. రాజధాని ప్రాంతంలోని 29 గ్రామాల్లో 33,400 ఎకరాల భూమిని సమీకరించిన ప్రభుత్వం వెను వెంటనే అనుకూల రైతుల నుంచి అగ్రిమెంట్లు తీసుకొని కౌలు చెక్కులు అందజేయటమేకాక పొలాలను చదునుచేసే కార్యక్రమం చేపట్టింది. ఇప్పటికి మూడునెలలు గడిచినా 9.2 దరఖాస్తులపై దృష్టి సారించలేదు. 9.2 దరఖాస్తులంటే భూ సమీకరణకు వ్యతిరేకమని భావిస్తున్న ప్రభుత్వం కనీసం ఇప్పటివరకు ఎన్ని దరఖాస్తులు వచ్చాయో కూడా పట్టించుకోని స్థితిలో ఉంది. ఈ విషయమై సీఆర్డీఏ అధికారులను ‘సాక్షి’ వివరణ కోరగా, వాటిపై ఇంకా చర్యలు తీసుకోలేదని మాత్రమే సమాధానమిస్తున్నారు. భూ సమస్యలు పరిష్కరించాలని విన్నవించుకున్న రాజధాని రైతుల దరఖాస్తులను ప్రభుత్వం ఏ మాత్రం పరిగణనలోకి తీసుకుందో ఇట్టే అర్థమవుతోంది. మూడు మండలాల నుంచి అధికంగా.. రాజధాని ప్రాంతంలో అధికంగా తుళ్లూరు మండలం జరీబు భూములతోపాటు, మంగళగిరి, తాడేపల్లి మండలాల్లో రైతులు 9.2 దరఖాస్తులను అందజేశారు. వాటిపై ఇప్పటికే పరిశీలన పూర్తి చేసి రైతులకు తగిన సమాధానం ఇవ్వాల్సి ఉండగా, 9.3 దరఖాస్తులు వెనక్కి అడుగుతున్నారని అప్పట్లో ప్రభుత్వం ఎత్తుగడ వేసి 9.2 దరఖాస్తులను కూడా ఆయా గ్రామాల నుంచి తరలించారు. దీంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వం ఈ సమస్యను పరిష్కరించకపోవటంపై పలు విమర్శలు వస్తున్నాయి. నెల నుంచి రాజధాని పరిధిలో భూములిచ్చిన రైతులు తమ సమస్యలను పరిష్కరించటం లేదని కౌలు డీడీలు తీసుకోవడానికి వెనుకాడుతున్నారు. దీంతో అధికారులే స్వయంగా ఫోనులు చేసి, రైతుల ఇళ్లకు వెళ్లి కౌలు డీడీలు అందించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ప్రతి అంశం గోప్యమే... మరో వైపు సీఆర్డీఏలో రైతులకు సంబంధించిన ప్రతి వ్యతిరేక అంశాన్ని గోప్యంగా ఉంచుతున్నారు. తుళ్లూరు సీఆర్డీఏ కార్యాలయంలో రాజధాని ప్రాంత 29 గ్రామాల భూములకు సంబంధించిన అన్ని వివరాలను గోడ ప్రతుల ద్వారా పొందుపరుస్తామన్న సీఆర్డీఏ ఉప చైర్మన్, మున్సిపల్ శాఖ మంత్రి పి. నారాయణ మాటలు ఆచరణలో కానరావడం లేదు. భూ సమీకరణలోని భూముల వివరాలు అందరికి తెలిసేలా అందుబాటులో ఉంచాలని రైతు సంఘాల నాయకులు విన్నవించినా ప్రభుత్వానికి కనువిప్పు కలగటం లేదు. -
అంతన్నారు..ఇంతన్నారు..
► అమరావతి రాజధాని ప్రాంతంలోని 23 వేల మంది రైతులకు ఒకేసారి లక్షన్నర రూపాయల రుణమాఫీ.. అది కూడా 72 గంటల్లోనే రైతుల ఖాతాల్లోకి మార్చి తిరిగి హైదరాబాద్ వెళతా.. ఇది రాష్ర్ట ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు కుటుంబరావు గురువారం చేసిన బహిరంగ ప్రకటన. ఇది ఆచరణ సాధ్యం కాలేదు. ► మంగళవారానికల్లా దాదాపు 7500 మంది రైతుల ఖాతాల్లోకి రుణమాఫీ మొత్తం జమ చేస్తాం.. రాష్ర్ట మంత్రులు పత్తిపాటి పుల్లారావు, పి.నారాయణ మాటలు. ఇది పాతపాటేనంటున్న రాజధాని రైతులు. తాడికొండ : మంత్రులు, అధికారుల ప్రకటనలు రాజధాని రైతులను రుణమాఫీ విషయంలో అయోమయానికి గురిచేస్తున్నాయి. చెప్పే మాటలకు క్షేత్రస్థాయిలో అమలు తీరుకు పొంతన లేకపోవడంతో ఎవరి మాటలు నమ్మాలో అర్ధంకాని స్థితి నెలకొంది. 7500 మంది రైతుల ఖాతాల్లో రుణమాఫీ మొత్తం జమ చేసినట్లు నెల రోజుల క్రితమే ప్రకటించిన మంత్రి మళ్లీ అదే ప్రకటనను చేయడం విడ్డూరం. అంతేకాక నెలాఖరుకు రైతుల ఖాతాల్లో నూరుశాతం రుణమాఫీ నగదు జమ చేస్తామని ప్రకటించిన మంత్రుల మాటలపై రైతులకు అనుమానం కలుగుతోంది. రాష్ర్ట ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు కుటుంబరావు రాజధాని ప్రాంతంలోని 29 గ్రామాల్లో 30 బ్యాంకుల పరిధిలో తిరిగి రుణమాఫీపై పరిశీలించారు. అయినా నేటికీ ఈ ప్రక్రియ ఒక కొలిక్కి రాలేదు. దీంతో రైతులు మళ్లీ కౌలు డీడీలు తీసుకునేందుకు వెనుకాడుతున్నారు. రైతులను భూ సమీకరణ దిశగా ప్రోత్సహించేందుకు ప్రభుత్వం వేసిన ఎత్తుగడ విఫలమవుతోంది. కొద్దిరోజుల క్రితం వ్యవసాయశాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు, పురపాలకశాఖ మంత్రి పి.నారాయణ తుళ్లూరులో రాజధాని రైతులకు సింగిల్ టైం రూ.1.5 లక్షల రుణమాఫీ జరుగుతున్నట్లు ప్రకటించారు. ఎలాంటి ఆటంకాలు లేకుండా బ్యాంకర్లతో చర్చించామని నేడో రేపో బ్యాంకుల్లో ఆయా రైతుల ఖాతాల్లో రుణమాఫీ సొమ్ము జమ అవుతుందని చెప్పారు. కానీ మంత్రుల మాటలు నీటిమీద రాతలే అయ్యాయి. రైతులు మాత్రం బ్యాంకుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. ఇప్పటికి కేవలం 7,500 మందికి రుణమాఫీ జమచేస్తే మిగతా 15,500 మంది రైతులకు ఎప్పటికి చేస్తారన్న ప్రశ్న రైతుల్లో వ్యక్తమవుతోంది. పూటకో ప్రకటనతో రైతుల్ని గందరగోళపర్చకుండా వ్యవసాయ రుణాల మాఫీ విషయంలో ప్రభుత్వం స్పష్టమైన వైఖరి ప్రకటించాలన్న అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది. -
''మా చెయ్యి విరగొట్టాలని బాబు చూస్తున్నారు''
-
'భూములను అన్యాయంగా లాక్కుంటున్నారు'
రైతుల భూములను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అన్యాయంగా లాక్కుంటోందని ఏపీ రాజధాని ప్రాంత రైతు, రైతుకూలీల పరిరక్షణ సంఘం నాయకులు అన్నారు. తమకు జరుగుతున్న అన్యాయాన్ని అన్నా హజారేకు చెప్పడానికే తాము ఢిల్లీ వచ్చామని తెలిపారు. న్యూఢిల్లీలో అన్నా హజారే చేస్తున్న ఆందోళనలో రైతు, రైతుకూలీల పరిరక్షణ సంఘం నాయకులు పలువురు పాల్గొన్నారు. రాజధానికి 2 వేల ఎకరాల భూమి సరిపోతుందని, అలాంటప్పుడు మిగిలిన భూమిని ఎందుకు లాక్కుంటున్నారని ప్రశ్నించారు. చంద్రబాబు రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసం, బినామీల కోసమే రైతుల భూములను లాక్కుంటున్నారని ఆరోపించారు. కాగా, ఏపీ రాజధాని ప్రాంత రైతుల సమస్యలపై ఏర్పాటుచేసిన ఫొటో ఎగ్జిబిషన్‌ను మేధా పాట్కర్ మంగళవారం నాడు జంతర్ మంతర్ వద్ద ప్రారంభిస్తారు. -
రైతులను భూముల్లోకి వెళ్లనివ్వండి: హైకోర్టు
-
రైతులను భూముల్లోకి వెళ్లనివ్వండి: హైకోర్టు
ఏపీ రాజధాని కోసం బలవంతంపు భూసమీకరణను వ్యతిరేకిస్తూ రైతులు దాఖలు చేసిన పిటిషన్‌ను రాష్ట్ర హైకోర్టు విచారణకు స్వీకరించింది. మూడు వారాల్లోగా కౌంటర్ దాఖలు చేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని ఆదేశించింది. తమ భూముల్లోకి వెళ్లేందుకు రైతులకు అవాంతరాలు సృష్టించొద్దని స్పష్టం చేసింది. రైతుల తరఫున హైకోర్టు న్యాయివాది పొన్నవోలు సుధాకర్ రెడ్డి వాదనలు వినిపించారు. -
అధైర్యపడొద్దు.. అండగా ఉంటాం
-
అధైర్యపడొద్దు.. అండగా ఉంటాం
ఆగంతకుల దహనకాండతో భయాందోళనకు గురవుతున్న రాజధాని నిర్మాణ ప్రాంత గ్రామాలను వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ఏర్పాటు చేసిన రాజధాని రైతుల, కౌలు రైతుల, కూలీల హక్కుల పరిరక్షణ కమిటీ సందర్శించి బాధిత రైతులకు అండగా ఉంటామని భరోసానిచ్చింది. ఈ ఘటనపై తక్షణం సీబీఐ లేదా జ్యుడీషియల్ విచారణ జరిపించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. అంతేగాక నిందితులను వెంటనే పట్టుకుని దీని వెనుక ఉన్న కుట్రను బహిర్గతం చేయాలని కోరింది. ముందుగా బాధిత రైతులకు నష్టపరిహారం ప్రకటించాలని లేని పక్షంలో వైఎస్సార్ సీపీ పోరాటం చేస్తుందని హెచ్చరించింది. అరండల్‌పేట (గుంటూరు) : రాజధాని నిర్మాణానికి ఎంపిక చేసిన తుళ్లూరు, తాడేపల్లి మండల గ్రామాల్లో ఆదివారం రాత్రి కొందరు ఆగంతకులు సాగించిన దహనకాండకు రైతుల పొలాల్లోని షెడ్లు, వెదురుబొంగులు, డ్రిప్ పరికరాలు మొత్తం 13 చోట్ల దహనమయ్యాయి. ఈ ప్రాంతాల్లో రాజధాని రైతుల, కౌలు రైతుల, కూలీల హక్కుల పరిరక్షణ కమిటీ మంగళవారం పర్యటించింది. తుళ్లూరు మండలం లింగాయపాలెం, ఉద్దం డ్రాయునిపాలెం, వెంకటపాలెం గ్రామాల్లో దహనమైన షెడ్లు, అరటితోటలను పరిశీలించి బాధిత రైతులతో నేరుగా మాట్లాడింది. వారికి అండగా నిలుస్తామని తెలిపింది. రాజధాని నిర్మాణానికి భూములు ఇవ్వబోమంటూ తీర్మానాలు చేసిన గ్రామాల్లోని ఈ సంఘటనలు జరిగిన తీరు చూస్తుంటే ఎవరో కావాలనే ఇదంతా చేసినట్లుగా అభిప్రాయపడింది. జరిగిన సంఘటనలపై వెంటనే పోలీసులను అప్రమత్తం చేసి నిందితులపై చర్యలు చేపట్టాల్సిన మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు తన బాధ్యత మరిచి పిచ్చిపట్టినట్లుగా మాట్లాడుతున్నారని విమర్శించింది.ప్రభుత్వం చేతిలో పోలీసు వ్యవస్థ ఉండగా, వారితో విచారణ జరపకుండా వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డిపై ఆరోపణలు చేయడం వారి దిగజారుడు రాజకీయాలకు నిదర్శనమని మండిపడింది. పర్యటన సాగిందిలా.... జిల్లా కేంద్రం గుంటూరులోని వైఎస్సార్ సీపీ కార్యాలయం నుంచి మధ్యాహ్నం 12 గంటలకు బయలుదేరిన రాజధాని రైతుల, కౌలు రైతుల, కూలీల హక్కుల పరిరక్షణ కమిటీ సాయంత్రం వరకు తుళ్లూరు మండలం లింగాయపాలెం, ఉద్దాండ్రాయునిపాలెం, వెంకటపాలెం గ్రామాల్లో పర్యటించి రైతులను పరామర్శించింది. తొలుత కమిటీ లింగాయ పాలెం గ్రామానికి చేరుకుంది. బాధిత రైతు గుంటుపల్లి మధుసూదనరావు పొలం వద్దకు వెళ్లి దహనమైన వెదురు బొంగులు, పైపులైనులు, అరటి తోటను పరిశీలించింది. ఈ సందర్భంగా రైతు తెలిపిన వివరాలు ఆయన మాటల్లోనే... ‘పొలంలో 3,500 వెదురు బొంగులు, 300 అరటి చెట్లు, డ్రిప్ పైపులు, షెడ్డు తగలబెట్టారు. ఎంతలేదన్నా రెండున్నర లక్షల నష్టం జరిగింది. నాకు పార్టీలతో సంబంధం లేదు. ఇలా ఎందుకు చేశారో, ఎవరు చేశారో కూడా అర్థం కావడం లేదు. నాకు నష్టపరిహారం అందకపోయినా ఇబ్బంది లేదు, ఇలాంటి సంఘటనలు మళ్లీ జరగకుండా చూస్తే చాలు.’ అదే గ్రామంలో మరో పొలం వద్దకు వెళ్లి కమిటీ పరిశీలిస్తుండగా అక్కడికి చేరుకున్న కౌలు రైతు చిన్న మీరాసాహెబ్ మాటల్లో ఆవేదన వ్యక్తమైంది. ‘ఎకరం పొలం రూ. 30వేలకు కౌలుకు తీసుకుని పంట వేశా, 150 వెదురు బొంగులు, 100 అరటి చెట్లు, డ్రిప్ పైపులు తగలబడ్డాయి. లక్షన్నర వరకు నష్టపోయినట్టే. ఎవరో రెక్కీ నిర్వహించి మరీ వరుసగా తగలబెట్టినట్టు అర్థమవుతోంది. నష్టపరిహారం ఇప్పించి ఆదుకోవాలి.’ అక్కడి నుంచి ఉద్దండ్రాయునిపాలెంలో బూడిదగా మారిన పొలాన్ని పరిశీలించిన కమిటీ రైతు జొన్నలగడ్డ వెంకట్రావును పరామర్శించడంతో ఆయన కన్నీటి పర్యంతమయ్యాడు. నష్టపరిహారం ఇప్పించి ఆదుకోవాలని కోరాడు. ‘ నాకు నాలుగు ఎకరాల పొలం ఉంది. మరో 16 ఎకరాలు కౌలుకు తీసుకుని అరటి వేశా. నెల కిందట 14 వేల వెదురు బొంగులు, 150 ఎరువు బస్తాలు, జనరేటర్ డ్రిప్ పైపులు తగలబెట్టారు.10 లక్షలకు పైగానే నష్టపోయా. నేను రాజధానికి భూమి ఇచ్చేందుకు నిరాకరించాను. అయితే నాతో గ్రామంలోని వారంతా సోదర భావంతో ఉంటారు. ఎందుకిలా చేశారో తెలియడంలేదు.’ అనంతరం కమిటీ వెంకటపాలెం గ్రామాన్ని సందర్శించింది. పలువురు రైతులను పరామర్శించి మనోధైర్యం నింపే ప్రయత్నం చేసింది. ఈ సందర్భంగా కొందరు రైతులు మాట్లాడుతూ, తాము ఎట్టి పరిస్థితుల్లో రాజధానికి భూములు ఇచ్చే ప్రసక్తే లేదని తెగేసి చెప్పారు. ప్రస్తుతం జరుగుతున్న సంఘటనలు భయాందోళనలు కలిగిస్తున్నాయన్నారు. ఆదివారం రాత్రి 10.30 గంటల సమయంలో రైతు లంకా రఘునాధబాబు పొలంలో ఓ ఆగంతకుడు నిప్పు అంటిస్తుండగా, వెంబడించడంతో పారిపోయినట్టు స్థానికులు తెలిపారు. ఈ సందర్భంగా కమిటీ సభ్యులు మాట్లాడుతూ ఈ ప్రాంతంలో రైతులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారని, రేపటి రోజున ఏం జరుగుతుందోనన్న ఆందోళన ప్రతి రైతులో కనిపిస్తుందన్నారు. జరిగిన సంఘటనపై విచారణ జరిపి దోషులను శిక్షించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అదే సమయంలో బాధ్యతాయుత పదవుల్లో ఉన్న మంత్రులు నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలని హెచ్చరించారు. పచ్చని గ్రామాల్లో చిచ్చు పెట్టేందుకు కొంత మంది అధికార పార్టీ నాయకులు ప్రయత్నిస్తున్నారని అనుమానం వ్యక్తం చేశారు. ఈ పర్యటనలో వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు మర్రి రాజశేఖర్, ఎమ్మెల్యేలు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఆళ్ల రామకృష్ణారెడ్డి (ఆర్కే), ఉప్పులేటి కల్పన, గొట్టిపాటి రవికుమార్, మాజీ మంత్రి, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మోపిదేవి వెంకటరమణ, రైతు విభాగం రాష్ట్ర కన్వీనర్ ఎంవీఎస్ నాగిరెడ్డి, ట్రేడ్ యూనియన్ రాష్ట్ర కన్వీనర్ పూనూరి గౌతమ్‌రెడ్డి, తాడికొండ నియోజకవర్గ ఇన్చార్జి హెనీ క్రిస్టినా, వైఎస్సార్ సీపీ మైనార్టీ, ఎస్సీ, సేవాదళ్ విభాగ కన్వీనర్లు సయ్యద్ మాబు, బండారు సాయిబాబు ఇంకా నాయకులు కొత్త చిన్నపరెడ్డి, దర్శనపు శ్రీనివాస్, రాచకొండ ముత్యాలరావు, సుద్దపల్లి నాగరాజు, కిరణ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.