Kodali Nani: బాబును చెప్పులేసి తరిమికొట‍్టబోయారు | Chandrababu Naidu Amaravathi Tour Today - Sakshi
Sakshi News home page

చంద్రబాబు చేయని మోసం లేదు: కొడాలి నాని

Published Thu, Nov 28 2019 1:51 PM | Last Updated on Thu, Nov 28 2019 3:17 PM

Kodali Nani Fires On Chandrababu Over Babu Amaravati Visit - Sakshi

సాక్షి, విజయవాడ : గత అయిదేళ్ల పాలనలో రాజధాని పేరుతో ఏ కట్టడం నిర్మించని చంద్రబాబు నాయుడు ఇప్పుడు ఏ మొహం పెట్టుకొని అమరావతిలో పర్యటిస్తున్నారని పౌర సరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని ధ్వజమెత్తారు. రాజధాని కోసం భూములు ఇచ్చిన రైతులను గాలికి వదిలేసిన బాబు ఇప్పుడు నేల గుర్తొచ్చి ముద్దులు పెడుతున్నాడని విమర్శించారు.

రాజధానిలో బాబు దిష్టిబొమ్మను దహనం

చంద్రబాబు ఇన్నాళ్లు గ్రాఫిక్స్‌ను ముద్దు పెట్టుకొని కౌగిలించుకున్నాడని, అధికారం పోయాక ప్రజలు గూబ గుయ్యమనించారని ఎద్దేవా చేశారు. రైతులను మోసం చేసినందుకు ఈ రోజు చెప్పులేసి తరిమి కొట్టారని మంత్రి కొడాలి నాని వ్యాఖ్యానించారు.  చంద్రబాబు నిష్ట దరిద్రుడని, అందుకే రాజధానిలో మూడు నియోజకవర్గాల్లో ప్రజలు ఓడించారని విమర్శించారు. రైతులు, దళితుల నుంచి భూములు కొట్టేసిన గుండాలు, రౌడీలతో వచ్చి చం‍ద్రబాబు రాజధానిలో తిరుగుతున్నారని మంత్రి మండిపడ్డారు. కాగా చంద్రబాబు పర్యటనను నిరసిస్తూ రాజధాని ప్రాంత రైతులు నిరసన తెలిపారు. ఆయన పర్యటనను తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఆందోళన చేపట్టారు. చంద్రబాబు రావొద్దంటూ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు.

చదవండిచంద్రబాబుకు నిరసన ఫ్లెక్సీలు స్వాగతం 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement