సాక్షి, అమరావతి: రాజధాని గ్రామాల ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తామని మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. గత ప్రభుత్వం కంటే మిన్నగా రాజధాని గ్రామాలకు మేలు చేస్తామని పేర్కొన్నారు. ఏపీ శాసనసభ సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. రాజధాని గ్రామాల్లో భూమిలేని నిరుపేదలకు ఇస్తున్న పెన్షన్‌ను రూ.2500 నుంచి రూ.5వేలకు పెంచబోతున్నామని తెలిపారు. రాజధానికి భూములు ఇచ్చిన పట్టా రైతులతో సమానంగా అసైన్డ్ భూములు ఇచ్చిన అసైన్డ్ దారులకు రిటర్న్ ప్లాట్లు కేటాయిస్తామని చెప్పారు. భూములిచ్చిన రైతులకు గతంలో జరీబుకైతే రూ.50 వేలు, మెట్ట భూమికి అయితే రూ.30 వేలు 10 ఏళ్లకు ఇవ్వాలని నిర్ణయించామన్నారు.
అలాగే ప్రతి ఏటా జరీబు భూమికి రూ.5వేలు, మెట్టభూమికి రూ.3వేలు పెంచాలని గతంలో నిర్ణయించారని, ఈ యాన్యునిటీని 10 సంవత్సరాల నుంచి 15 సంవత్సరాలకు పెంచుతూ నిర్ణయించామని చెప్పారు. 10 ఏళ్ల తర్వాత జరీబు భూమికి ఇచ్చే యాన్యునిటీ రూ.1 లక్ష రూపాయిలు, మెట్ట భూమికి రూ.60 వేలు అవుతుందన్నారు. ఇప్పుడు ఒప్పందం ఉన్న 10 ఏళ్ల తర్వాత వచ్చే ఐదేళ్ల పాటు కూడా ఇదే రీతిలో యాన్యునిటీని చెల్లిస్తామని స్పష్టం చేశారు.
(చదవండి: భూముల బండారం బట్టబయలు చేసిన బుగ్గన)
Comments
Please login to add a commentAdd a comment