
రాజధాని రైతులు, కూలీలకు న్యాయం జరగాలి: డొక్కా
గుంటూరు: ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంతంలో రైతులు, రైతు కూలీలు, ఇతర పేద వర్గాలకు ప్రభుత్వం న్యాయం చేయాలని మాజీ మంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్ డిమాండ్ చేశారు. ఆయన గురువారం గుంటూరు పట్టణంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వ్యవసాయం, దాని అనుబంధ రంగాలపై ఆధారపడి జీవించే వారిని ఏపీ ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు.