ఆరోగ్య విద్యపై అవగాహన సదస్సు | awareness seminar for Health education | Sakshi
Sakshi News home page

ఆరోగ్య విద్యపై అవగాహన సదస్సు

Published Sat, Mar 4 2017 12:49 PM | Last Updated on Tue, Sep 5 2017 5:12 AM

awareness seminar for Health education

జమ్ము (విజయనగరం రూరల్‌) : మున్సిపాలిటీ పరిధిలోని జమ్ము ప్రాథమిక పాఠశాలలో స్వాస్థ్య కార్యక్రమంలో భాగంగా పాఠశాల విద్యార్థులకు ఆరోగ్యవిద్యపై  శుక్రవారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా రాకోడు పీహెచ్‌సీ వైద్య పర్యవేక్షకుడు కేబీవీ సత్యనారాయణ వేసవిలో అంటువ్యాధులు రాకుండా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో వివరించారు. అలాగే వడదెబ్బ బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు శశికళ, మంత్రి రామ్మోహనరావు, అనురాధ, సీఆర్‌పీ కృష్ణ, తిరుమల నర్సింగ్‌హోమ్‌ విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement