
హైదరాబాద్: మహబూబ్‌నగర్‌లో ఈ నెల 16, 17వ తేదీల్లో టీఎమ్మార్పీఎస్ రాజకీయ అవగాహన సదస్సు నిర్వహించనున్నట్లు ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు యాతాకుల భాస్కర్, వర్కింగ్ ప్రెసిడెంట్ వంగపల్లి శ్రీనివాస్ తెలిపారు. సోమవారం విద్యానగర్‌లోని రాష్ట్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. 2019 ఎన్నికలే ప్రామాణికంగా అన్ని పార్లమెంట్, అసెంబ్లీ, నియోజకవర్గాలలో నిర్మాణపరమైన కార్యాచరణను ముందుకు తీసుకెళ్ళేందుకు కార్యకర్తలను సిద్ధం చేయడమే వారి లక్ష్యం అన్నారు.
23 సంవత్సరాల ఎమ్మార్పీఎస్ ఉద్యమాన్ని రాజకీయాల వైపు మళ్ళించడంలో అనేక లోటుపాట్లు జరిగాయన్నారు. బహుజన రాజకీయాలపై పట్టు సాధించడానికి అధిక శాతం ఉన్న అణగారిన కులాలను చైతన్యం చేస్తూ, సామాజిక తెలంగాణ సాధించే దిశగా ముందుకు వెళతామన్నారు. కార్యక్రమానికి ప్రముఖ మేధావులను ఆహ్వానిస్తున్నట్లు తెలిపారు. సమావేశంలో నాయకులు మేకల నరేందర్, నాగారం బాబు, బి. చంద్రయ్య, కె.వెంకట్, రమేశ్, జాన్సీ, శ్యాంరావు, గోవర్థన్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment