ఏఈ పరీక్షలపై అవగాహన సదస్సు
Published Fri, Aug 26 2016 11:01 PM | Last Updated on Mon, Sep 4 2017 11:01 AM
మధురానగర్ :
ఏలూరు రోడ్డు సీతారాంపురంలోని ఆదిత్య ఇంజినీరింగ్ అకాడమీలో ఏపీపీఎస్సీ భర్తీచేసే ఏఇఇ అసిస్టెంటు ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ ఉద్యోగాల సమాచారంపై ఈనెల 28వ తేదీ ఆదివారం ఉచిత అవగాహన సదస్సు నిర్వహించనున్నట్లు అకాడమీ డైరెక్టర్ బీ శ్రీనివాసులు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. పలు అంశాలపై సుశిక్షితులైన సిబ్బంది తెలియచేస్తారన్నారు. సాయంత్రం 5గంటలనుంచి 7గంటలవరకు జరుగుతుందన్నారు. బీటెక్, సివిల్, మెకానికల్ పట్టభద్రులందరూ హాజరు కావచ్చని తెలిపారు.
Advertisement
Advertisement