ఇండియా మొబైల్ కాంగ్రెస్ (ఐఎంసీ) 2024 ‘ఆస్పైర్’ స్టార్టప్ ప్రోగ్రామ్ రెండో ఎడిషన్‌ను ప్రారంభించబోతున్నట్లు సంస్థ సీఈఓ పి.రామకృష్ణ తెలిపారు. అక్టోబర్ 15 నుంచి 18 వరకు న్యూఢిల్లీలోని భారత్ మండపంలో ఈ కార్యక్రమంలో నిర్వహిస్తామన్నారు. దేశంలోని వివిధ రంగాల్లో వినూత్న ఆవిష్కరణలు చేస్తున్న దాదాపు 900లకు పైగా స్టార్టప్ కంపెనీలు ఈ సదస్సులు పాల్గొంటాయని పేర్కొన్నారు.
గతేడాది ఇండియా మొబైల్ కాంగ్రెస్ ‘ఆస్పైర్’ స్టార్టప్ ప్రోగ్రామ్‌ను ప్రారంభించింది. మొదటి ఎడిషన్‌లో దాదాపు 400కు పైగా స్టార్టప్ కంపెనీలు ఈ సదస్సులో పాల్గొన్నాయి. ఈసారి జరగబోయే ఆస్పైర్ ఈవెంట్ రెండో ఎడిషన్. అయితే ఐఎంసీకు మాత్రం ఇది ఎనిమిదో ఎడిషన్ కావడం విశేషం. ఐఎంసీ 2024ను భారత టెలికమ్యూనికేషన్స్ శాఖ (డాట్), సెల్యులార్ ఆపరేటర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (సీఓఏఐ) సంయుక్తంగా నిర్వహిస్తున్నాయి.
ఆస్పైర్ స్టార్టప్ ప్రోగ్రామ్ నిర్వహణలో టెలికాం సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్ ఇండియా, టెలికాం ఎక్విప్మెంట్ అండ్ సర్వీసెస్ ఎక్స్ పోర్ట్ ప్రమోషన్ కౌన్సిల్ (టీఈపీసీ), ది ఇండస్ ఎంటర్‌ప్రెన్యూర్స్ ఢిల్లీ వంటి సంస్థలు భాగస్వామ్యం అయ్యాయి. ఈ కార్యక్రమంలో 5జీ వినియోగం, ఏఐ, టెక్నాలజీ, ఎలక్ట్రానిక్స్, ఎంటర్‌ప్రైజ్, గ్రీన్ టెక్, ఇండస్ట్రీ 4.0, సెక్యూరిటీ, సెమీకండక్టర్స్, స్మార్ట్ మొబిలిటీ, సస్టైనబిలిటీ, టెలికమ్యూనికేషన్స్ పరికరాల తయారీ వంటి విభాగాల్లో వివిధ సంస్థలు తమ ఆవిష్కరణలను ప్రదర్శిస్తాయి. దాంతోపాటు ఇతర సంస్థలతో ఒప్పందాలు కుదుర్చుకునే అవకాశం ఉంది.
ఇదీ చదవండి: అనుకున్నదే జరిగింది.. వడ్డీలో మార్పు లేదు
ఈ సందర్భంగా ఐఎంసీ సీఈఓ పి.రామకృష్ణ మాట్లాడుతూ..‘భారత స్టార్టప్ ఎకోసిస్టమ్, భారత ఆర్థిక వ్యవస్థను మెరుగుపరిచేందుకు ఈ కార్యక్రమం ఎంతో ఉపయోగపడుతోంది. ఇది విభిన్న రంగాల్లో స్టార్టప్ కంపెనీలు చేసే ఆవిష్కరణలను అంతర్జాతీయ వేదికలపైకి తీసుకెళ్లేందుకు దోహదం చేస్తోంది. ప్రస్తుతం భారత్‌లో 1.28 లక్షలకుపైగా స్టార్టప్ కంపెనీలున్నాయి. దాంతో ప్రపంచంలోనే మూడో అతిపెద్ద స్టార్టప్ ఆర్థిక వ్యవస్థగా భారత్ ఎదిగింది. స్టార్టప్ ఎకోసిస్టమ్, సుస్థిర ఆర్థిక వ్యవస్థ అభివృద్ధికి ఈ సదస్సు తన వంతు కృషి చేస్తోంది’ అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment