క్యాబ్ సర్వీస్ అనగానే అందరికి ఓలా, ఉబర్ వంటివి మాత్రమే గుర్తొస్తాయి. ఈ కంపెనీలకు ధీటుగా పోటీ ఇస్తున్న బ్లూస్మార్ట్.. ప్రస్తుతం ఢిల్లీ, బెంగళూరు, గురుగ్రామ్ ప్రాంతాల్లో మంచి సక్సెస్ చవి చూస్తోంది. ప్రారంభంలో ఒడిదుడుకులను ఎదుర్కొని కంపెనీని ఈ రోజు ఈ స్థాయికి తీసుకురావడంలో ప్రధాన పాత్ర పోషించిన వారిలో ఒకరు, కంపెనీ కో-ఫౌండర్ 'పునీత్ గోయల్' గురించి ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం.
బ్లూస్మార్ట్ కో-ఫౌండర్ 'పునీత్ గోయల్' బ్లూస్మార్ట్ ప్రారంభించడానికి ముందే సొంత వెంచర్‌లను ప్రారంభించి, ఒకదాంట్లో విజయం పొందలేకపోయినట్లు గతంలోనే వెల్లడించారు. ప్రారంభంలో గుజరాత్‌లో 20 మెగావాట్ల సోలార్ పవర్ ప్లాంట్‌ను నెలకొల్పి, దానిని సౌదీ ప్లేయర్‌కు 68 మిలియన్ డాలర్లకు, మహారాష్ట్రలోని మరో 70 మెగావాట్ల పవర్ ప్లాంట్‌ను 55 మిలియన్ డాలర్లకు విక్రయించినట్లు గోయల్ తెలిపారు.
పునీత్ గోయల్ లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్, బర్మింగ్‌హామ్‌లోని ఆస్టన్ బిజినెస్ స్కూల్ నుంచి డబుల్ మాస్టర్స్ పూర్తి చేసి ఆ తరువాత గ్రీన్ ఎనర్జిలోకి ప్రవేశించారు. క్లీన్ ఎనర్జీ ఆలోచన తన జీవితాన్ని మార్చేసినట్లు గోయల్ ఒక సందర్భంలో వెల్లడించారు.
బర్మింగ్‌హామ్‌లో చదువుకునే రోజుల్లో గోయల్ క్లీన్ ఎనర్జీ గురించి చదివినట్లు, ఇది తప్పకుండా భవిష్యత్తులో ఉపయోగపడుతుందని భావించి.. భారతదేశంలో సోలార్ ఫ్యానెల్ తయారీదారులను కలుసుకుని కొన్ని మెళుకువలు తెలుసుకున్నారు. ఆ సమయంలో భారతదేశంలో సోలార్ ఫ్యానెల్స్ తయారు చేసి, ఐరోపాకు ఎగుమతి చేయడానికి మంచి అవకాశం ఉన్నట్లు తెలుసుకున్నారు.
గోయల్ చదువు పూర్తయ్యే సమయానికి సోలార్ ఎనర్జీ అనేది అతి పెద్ద మార్కెట్. దీనిని అదనుగా తీసుకుని, సోలార్ ప్యానెల్ తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని భావించి.. అతని తాత 'పురుషోత్తమ్ లాల్ గోయల్' పేరు మీదుగా PLG పవర్ ఏర్పాటు చేసాడు. 2008లో ప్రారంభమైన కంపెనీ 2012 వరకు సజావుగా ముందుకు సాగింది. ఆ తరువాత యూరప్‌లో సోలార్ ప్యానెల్ మార్కెట్ పడిపోవడంతో నష్టాలను చవి చూడాల్సి వచ్చింది. దీంతో మొదటి వెంచర్ మూసివేయాల్సి వచ్చింది.
మొదటి వెంచర్ మూసివేసిన తరువాత, గుజరాత్ ప్రభుత్వం సోలార్ పాలసీని తీసుకురావడంతో మరో సువర్ణావకాశం లభించింది. ఆ సమయంలో 2 MW పవర్ ప్లాంట్ ఏర్పాటు చేసి.. దానిని రెండు సంవత్సరాలు నిర్వహించి, ఆ తరువాత ఒక పెద్ద సౌదీ కంపెనీకి విక్రయించేశారు.
బ్లూస్మార్ట్ ఆలోచన..
రెండు వెంచర్లు ప్రారంభించి విక్రయించిన తరువాత.. హైపర్‌లూప్ వన్ సీఈఓ షెర్విన్ పిషెవార్.. వర్జిన్ హైపర్‌లూప్ సీఈఓ బ్రెంట్ కల్లినికోస్‌ను లాస్ వెగాస్‌లో కలిసిన తరువాత ఈ బ్లూస్మార్ట్ ఆలోచన వచ్చినట్లు గోయల్ తెలిపాడు.
2019లో ప్రారంభమైన బ్లూస్మార్ట్ భారతదేశంలోని మొదటి ఆల్ ఎలక్ట్రిక్ షేర్డ్ స్మార్ట్ మొబిలిటీ ప్లాట్‌ఫారమ్. ఇందులో ఎంజి జెడ్ఎస్ ఈవీ, హ్యుందాయ్ కోనా ఎలక్ట్రిక్, టాటా ఎలక్ట్రిక్ కాలు, మహీంద్రా ఎలక్ట్రిక్ కార్లు ఉన్నాయి. రానున్న రోజుల్లో మరిన్ని ఎలక్ట్రిక్ కార్లను బ్లూస్మార్ట్‌లో ఉపయోగించనున్నట్లు తెలుస్తోంది.
ఇదీ చదవండి: అనిల్ అంబానీ ఆస్తులు అమ్మకానికి గ్రీన్ సిగ్నల్.. జాబితాలో ఉన్నవేంటో తెలుసా?
క్లీన్ మొబిలిటీ, క్లీన్ ఎనర్జీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ స్పేస్‌లో పునీత్ గోయల్ చేసిన కృషికి జనవరి 2023లో UK ప్రభుత్వం, బ్రిటిష్ కౌన్సిల్, NISAU UK 'ఇండియా-UK 75 ఎట్ 75 అచీవర్స్' అవార్డును, జూలై 2022లో UKలోని ఆస్టన్ యూనివర్సిటీ గౌరవ డాక్టరేట్ ఇన్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ అందించింది.
Comments
Please login to add a commentAdd a comment