Bill Cummings Success Story: మనిషిగా పుట్టిన ప్రతి ఒక్కరు ధనవంతులు కావాలని కలలు కంటారు. ఆ కలలు నిజం కావాలంటే అహర్నిశలు కష్టపడాల్సి ఉంటుంది. అలా కష్టపడి పైకొచ్చినవారిలో ఒకరు 'బిల్ కమ్మింగ్స్' (Bill Cummings). ఈ కథనంలో ఈయన ఎలా సక్సెస్ సాధించాడు, ప్రారంభంలో ఏమి చేసేవాడు అనే మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.
అమెరికాలో నివసిస్తున్న బిల్ కమ్మింగ్స్ ప్రస్తుతం బిలినీయర్స్ జాబితాలో ఒకరు. ఈయన 50 సంవత్సరాల క్రితమే బిలియన్ డాలర్స్ కంపెనీ ప్రారంభించి బోస్టన్ రియల్ ఎస్టేట్ రాజుగా నిలిచాడు. ఇదంతా ఒక్క రోజులో వచ్చిన సక్సెస్ కాదు.
చిన్న ఇంట్లో..
బిల్ కమ్మింగ్స్ పుట్టుకతోనే కుబేరుడు కాదు, ఒకప్పుడు తల్లిదండ్రులు, సోదరితో ఒక చిన్న ఇంట్లో ఉండేవాడు. చిన్న చిన్న ఉద్యోగాలు చేస్తూ వ్యాపారంలో మెళుకువలు తెలుసుకున్నాడు. ఆ తరువాత వ్యాపార రంగంలో అడుగు పెట్టి దినదినాభివృద్ధి చెందిన బిలినీయర్స్ జాబితాలోకి చేరిపోయాడు.
బిల్ కమ్మింగ్స్ జీవితం నేటికీ ఎంతోమందికి ఆదర్శం. నేడు కుబేరుడైనప్పటికీ డబ్బును ఊరికే వృధాకానివ్వడు, అతని భార్య కూడా పెద్దగా విలాసవంతమైన జీవితం ఆశించదు. ఇప్పటికి కూడా వారు తమ ఖర్చును తగ్గించుకోవడానే చూస్తారు. దీనికి ప్రధాన కారణం చిన్నప్పుడు తల్లిదండ్రులు తక్కువ ఖర్చుపెట్టాలని అతని నేర్పిన పాఠమే అని తెలుస్తోంది.
ఇదీ చదవండి: పసిడి ప్రియులకు శుభవార్త.. భారీగా తగ్గిన బంగారం & వెండి ధరలు
ఇప్పటికి కూడా విజయం సాధించడానికి ప్రయత్నించాలి, కష్టపడి పనిచేయడానికి వెనుకాడకూడదని విశ్వసిస్తాడు. అంతే కాకుండా హార్డ్ వర్క్, సాధించాలనే కోరిక, అంకిత భావం చాలా ముఖ్యమని చెబుతాడు. ఒక రంగంలో అడుగుపెట్టిన తరువాత ఎదురయ్యే సమస్యలను ఎప్పటికప్పుడు గుర్తించాలి, వాటిని పరిష్కరించుకోవాలి. ఇది సక్సెస్ సాధించడానికి చాలా ముఖ్యమైన అంశం.
ఇదీ చదవండి: వరల్డ్ టాలెంట్ ర్యాంకింగ్‌లో వెనుక పడిన భారత్
ఎనిమిది పదుల వయసు దాటిన తరువాత కూడా ఇప్పటికీ బిల్ కమ్మింగ్స్ తన సమయాన్ని వృధా చేయడానికి ఇష్టపడడు. తన రంగంలో విజయాన్ని కొనసాగిస్తూ ఒక బుక్ కూడా రాసారు. ఇది నేటి తరం యువతకు తప్పకుండా ఉపయోగపడుతుంది.
Comments
Please login to add a commentAdd a comment