ఏదైనా వస్తువులను ఫ్లిప్‌కార్ట్, అమెజాన్ వంటి ఈ కామర్స్ సైట్లలో ఆర్డర్ చేస్తే రెండు.. మూడు రోజులు లేదా వారం రోజులలోపు ఆర్డర్ ఇంటికి వచ్చేస్తుంది. అయితే ఓ వ్యక్తికి ఏకంగా రెండేళ్ల తరువాత ఆర్డర్ డెలివరీ అయింది. దీనికి సంబంధించిన ఫోటో కూడా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.
జయ్ అనే యూజర్ 2022 అక్టోబర్ 1న అమెజాన్ వెబ్‌సైట్‌లో ప్రెజర్ కుక్కర్ ఆర్డర్ చేశారు. అయితే ఆ ఆర్డర్ క్యాన్సిల్ చేసాడు. దానికి డబ్బు కూడా రీఫండ్ అయిపోయింది. అయితే ఆర్డర్ క్యాన్సిల్ చేసిన రెండేళ్ల తరువాత డెలివరీ అయింది. ఇది చూసిన యూజర్ ఒక్కసారిగా ఖంగుతిన్నాడు. ఈ విషయాన్ని తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేశారు.
సోషల్ మీడియాలో షేర్ చేస్తూ.. రెండు సంవత్సరాల తరువాత డెలివరీ చేసినందుకు థాంక్యూ అమెజాన్ అంటూ పేర్కొన్నారు. ఇది ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నెటిజన్లు తమదైన రీతిలో కామెంట్స్ చేస్తున్నారు. ఇందులో ఒకరు నాకు కూడా క్యాన్సిల్ చేసిన తరువాత డెలివరీ వచ్చి ఉంటే బాగుండేదని అన్నాడు. మరొకరు ఇది ప్రెస్టీజియస్ కుక్కర్ అని అన్నారు.
Thank you Amazon for delivering my order after 2 years.
The cook is elated after the prolonged wait, must be a very special pressure cooker! 🙏 pic.twitter.com/TA8fszlvKK— Jay (@thetrickytrade) August 29, 2024
Comments
Please login to add a commentAdd a comment