Reliance Digital Republic Day India Biggest Electronics Sale: Check For Special Offers - Sakshi
Sakshi News home page

Republic Day Sale: రిలయన్స్‌ డిజిటల్‌ ఇండియా సేల్‌ మళ్లీ వచ్చింది

Published Mon, Jan 24 2022 4:59 AM | Last Updated on Mon, Jan 24 2022 8:48 AM

Reliance Digital Republic Day Digital India sale - Sakshi

హైదరాబాద్‌: రిలయన్స్‌ డిజిటల్‌ ప్రతి ఏటా గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రకటించే ‘డిజిటల్‌ ఇండియా సేల్‌’ మళ్లీ వచ్చింది. అన్ని రకాలైన ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్‌ ఉత్పత్తులపై రిలయన్స్‌ డిజిటల్‌ భారీ ప్రత్యేక ఆఫర్లను ప్రకటించింది. ఏదైనా క్రెడిట్‌ కార్డు/ డెబిట్‌కార్డు లావాదేవీలపై 6%.., సిటీ బ్యాంక్‌ క్రిడెట్‌ కార్డ్స్‌/డెబిట్‌ కార్డ్స్‌ ఈఎంఐ లావాదేవీలపై ఏకంగా 10% తక్షణ తగ్గింపు పొందవచ్చు. అలాగే రూ.5,000కు మించిన కొనుగోళ్లపై డిజిటల్‌ వోచర్లు అందిస్తున్నట్లు రిలయన్స్‌ డిజిటల్‌ ప్రకటించింది. రిలయన్స్‌ డిజిటల్‌ స్టోర్లు, మై జియో స్టోర్లలో టీవీలు, స్మార్ట్‌ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు, రిఫ్రిజిరేటర్లు, వాషింగ్‌ మెషీన్లు, ఇతర గృహోపకరణాలపై ఈ ఆఫర్లు ఈ నెల 26 వరకూ అమల్లో ఉంటాయని వివరించింది. కంపెనీ వెబ్‌సైట్‌ www. reliancedigital.in ద్వారా కూడా కొనుగోలు చేయవచ్చు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement