Electronics goods
-
రిలయన్స్ డిజిటల్ ఇండియా సేల్ మళ్లీ వచ్చింది
హైదరాబాద్: రిలయన్స్ డిజిటల్ ప్రతి ఏటా గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రకటించే ‘డిజిటల్ ఇండియా సేల్’ మళ్లీ వచ్చింది. అన్ని రకాలైన ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తులపై రిలయన్స్ డిజిటల్ భారీ ప్రత్యేక ఆఫర్లను ప్రకటించింది. ఏదైనా క్రెడిట్ కార్డు/ డెబిట్‌కార్డు లావాదేవీలపై 6%.., సిటీ బ్యాంక్ క్రిడెట్ కార్డ్స్/డెబిట్ కార్డ్స్ ఈఎంఐ లావాదేవీలపై ఏకంగా 10% తక్షణ తగ్గింపు పొందవచ్చు. అలాగే రూ.5,000కు మించిన కొనుగోళ్లపై డిజిటల్ వోచర్లు అందిస్తున్నట్లు రిలయన్స్ డిజిటల్ ప్రకటించింది. రిలయన్స్ డిజిటల్ స్టోర్లు, మై జియో స్టోర్లలో టీవీలు, స్మార్ట్ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు, రిఫ్రిజిరేటర్లు, వాషింగ్ మెషీన్లు, ఇతర గృహోపకరణాలపై ఈ ఆఫర్లు ఈ నెల 26 వరకూ అమల్లో ఉంటాయని వివరించింది. కంపెనీ వెబ్సైట్ www. reliancedigital.in ద్వారా కూడా కొనుగోలు చేయవచ్చు. -
Amazon Clearance Sale : 70 శాతం వరకు డిస్కౌంట్లు
ఇండియాలో నంబర్ 1 ఈ కామర్స్ సైట్ అమెజాన్ ఎలక్ట్రానిక్ వస్తువులపై క్లియరెన్స్ సేల్ ప్రకటించింది. వేలాది ఎలక్ట్రానిక్ వస్తువులను అమ్మకానికి ఉంచింది. గరిష్టంగా 70 శాతం వరకు పలు వస్తువులపై డిస్కౌంట్ ఆఫర్ ఇస్తున్నట్టు అమెజాన్ ప్రకటించింది. ఈ ఆఫర్‌తో పాటు అమెజాన్ కూపన్లు ఉపయోగించడం ద్వారా మరో రూ. 10,000 రూపాయల వరకు ఎంఆర్పీపై తగ్గింపు పొందవచ్చని అమెజాన్ తెలిపింది. మొబైల్ మిస్ అమెజాన్ ఎలక్ట్రానిక్ క్లియరెన్స్ సేల్స్‌లో లాప్‌ట్యాప్, డెస్క్‌టాప్, కెమెరా, ఇయర్ ఫోన్స్, హెడ్‌ఫోన్స్, పవర్‌బ్యాంక్, హార్డ్డిస్క తదితర వస్తువులపై భారీ ఆఫర్లు ఉన్నాయి. అయితే ఎక్కువ డిమాండ్ ఉండే ఫోన్లు ఈ క్లియరెన్స్ సేల్స్ కేటగిరిలో లేవు. దీంతో వినియోగదారులు కొంత నిరాశకు లోనవుతున్నాయి. అయితే మిగిలిన ఐటమ్స్‌లో అవసరమైనవి తక్కువ ధరకు లభిస్తున్నాయనే వారు ఉన్నారు. చదవండి : ఇక ఆడి పెట్రోల్, డీజిల్ కార్లు ఉండవా? -
భారతీయులు అమితంగా ప్రేమించేది వాటినే..
న్యూఢిల్లీ : బంగారమంటే భారతీయులకు ఎనలేని ప్రేమ. కొంత డబ్బు కూడబెట్టగానే బంగారాన్ని కొనుగోలు చేయాలన్న ఆలోచన చేస్తూ ఉంటారు. తాజాగా బంగారాన్ని మించి ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తులను అమితంగా ప్రేమిస్తున్నారట. తాజాగా వెల్లడించిన గణాంకాల్లో ఈ విషయం వెల్లడైంది. స్మార్ట్ఫోన్లు, టీవీలు, ఇతర ఎలక్ట్రానిక్స్ గూడ్స్ కొనుగోళ్లు అలుపు లేకుండా పెరుగుతూ ఉన్నాయని తెలిసింది. ఆయిల్ తర్వాత భారత్ ఎక్కువగా దిగుమతి చేసుకునే వస్తువులుగా ఎలక్ట్రానిక్సే ఉన్నాయని తాజా గణాంకాల్లో వెల్లడైంది. దీంతో దేశీయ వాణిజ్య లోటు కూడా పెరిగిపోతుందని గణాంకాలు చెబుతున్నాయి. ఇది రూపాయికి బ్యాడ్ న్యూస్ అని ఆర్థిక వేత్తలు అంటున్నారు. ఇప్పటికే ఆయిల్ దిగుమతులతో ఖరీదైనదిగా మారిన రూపాయి, ఎలక్ట్రానిక్స్ దిగుమతులతో మరింత ఆందోళనకరంగా మారిందని తెలిపారు. 2019 మార్చితో ముగిసే ఆర్థిక సంవత్సరానికి కరెంట్ అకౌంట్ లోటు 2.3 శాతానికి పెరుగుతుందని బ్లూమ్‌బర్గ్ పోల్‌లో తెలిసింది. ప్రస్తుతం ఇది 1.9 శాతంగా ఉంది. ఎలక్ట్రానిక్ ఉత్పత్తులు దిగుమతలు పెరుగుతుండటం ఇప్పటికే కరెంట్ అకౌంట్ లోటుపై ప్రభావం చూపుతుందని ముంబైకి చెందిన యాక్సిస్ బ్యాంక్ లిమిటెడ్ చీఫ్ ఎకనామిస్ట్ సౌగత భట్టాచార్య చెప్పారు. అయితే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీసుకొచ్చిన మేకిన్ ఇండియా ప్రొగ్రామ్‌తో స్థానిక తయారీ పెరిగి, దిగుమతులు తగ్గుతుండవచ్చని అభిప్రాయం వ్యక్తం చేశారు. మొబైల్ ఫోన్లు, పీసీలు, ఇతర కన్జ్యూమర్ ఎలక్ట్రానిక్స్ కొనుగోలు చేసేందుకు చైనా అతిపెద్ద వనరుగా ఆర్థిక వేత్తలన్నారు. మొత్తంలో 60 శాతం అక్కడి నుంచే వస్తున్నాయని చెప్పారు. కేవలం ఆయిల్ మాత్రమే కాకుండా ఎలక్ట్రానిక్స్ కూడా దేశీయ కరెంట్ అకౌంట్‌కు సవాల్‌గా నిలుస్తున్నాయని కొటక్ మహింద్రా బ్యాంక్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ ఉదయ్ కొటక్ ట్వీట్ చేశారు. 5 ఏళ్లలో ఎలక్ట్రానిక్స్ దిగుమతులు రెండింతలు పైగా పెరిగాయని చెప్పారు. కాగ, గత 13 నెలల కాలంలో బంగారం దిగుమతులు 35.8 బిలియన్ డాలర్లుగా ఉంటే, బంగారం కంటే అధికంగా ఎలక్ట్రానిక్స్ దిగుమతులు 57.8 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. దీన్ని బట్టి చూస్తే ఇక బంగారం కంటే ఎలక్ట్రానిక్స్ గూడ్స్నే భారతీయులు అమితంగా ప్రేమిస్తున్నారని వెల్లడవుతోంది. -
‘కరెంట్’తో గ్యాస్‌కు లాస్!
♦ ఎలక్ట్రానిక్స్ వస్తువుల రాకతో గ్యాస్ వ్యాపారానికి గండి ♦ వాడకం పెంచాలన్న గ్యాస్ కంపెనీల సేల్ ఆఫీసర్స్ ఒకప్పుడు గ్యాస్ కనెక్షన్ కోసం దరఖాస్తు చేసుకుని ఏళ్ల తరబడి వేచి చూడాల్సివచ్చేది. లేదంటే అధిక మొత్తం వెచ్చించి బ్లాక్‌లో కొనుక్కోవడమే కాకుండా అమ్మినవారి పేరుమీదే ప్రతినెలా సిలెండర్లు తీసుకోవాల్సిన పరిస్థితి ఉండేది. ఇప్పుడు సీన్ మారింది. గ్యాస్ కనెక్షన్ తీసుకునేవారే కరువవడంతో పిలిచి మరీ ఇస్తున్నారు. గ్యాస్ కంపెనీల వ్యాపారానికి ఎలక్ట్రానిక్ వస్తువులు గండికొట్టడం వల్ల ఈ పరిణామాలు చోటుచేసుకున్నాయి. విజయవాడ : నగరంతోపాటు జిల్లాలోని అన్ని ప్రాంతాల్లో గృహావసరాల కోసం వినియోగించే గ్యాస్ వాడకం తగ్గుముఖం పట్టింది. ఆయా కంపెనీలు కొద్ది మాసాలుగా అధ్యయనం చేసి జిల్లాలో డొమెస్టిక్ గ్యాస్ వాడకం తగ్గడానికి గల కారణాలు తెలుసుకున్నాయి. మార్కెట్లో ఎలక్ట్రికల్ కుక్కర్లు, గ్యాస్స్టౌల అమ్మకాలు విరివిగా పెరగడం వల్లే గ్యాస్ వినియోగదారులు తగ్గిపోతున్నట్లు గుర్తించాయి. ఈ క్రమంలో ఆయిల్ కంపెనీల సేల్స్ ఆఫీసర్లు డొమెస్టిక్ గ్యాస్ వాడకాన్ని పెంచాలని ముందుగా ఏజెన్సీలకు లేఖలు రాశారు. జిల్లాలో సగటున ఐదు శాతం డొమెస్టిక్ గ్యాస్ వాడకం పడిపోయినట్లు అధికారులు భావిస్తున్నారు. జిల్లాలో 60 గ్యాస్ ఏజెన్సీలుఉన్నాయి. ఒక్కో ఏజెన్సీలో సుమారు 500 సిలిండర్ల వాడకం తగ్గినట్లు తెలిసింది. అంటే నెలకు 30 వేల సిలిండర్ల అమ్మకాలు తగ్గినట్లు సమాచారం. ఒక్కో లోడుకు 450 చొప్పున నెలకు జిల్లాలో 3 వేల లోడ్లు.. అంటే 1,35,000 సిలిండర్ల అమ్మకాలు జరుగుతుంటాయి. అడిగినవారికి లేదన కుండా కొత్త కనెక్షన్లు గ్యాస్ ఏజెన్సీలు రెండు నెలలుగా కొత్త కనెక్షన్లు అడిగినవారికి లేదనకుండా ఇచ్చేస్తున్నాయి. దరఖాస్తు చేసుకున్నవారికి వెంటనే ఇచ్చేస్తున్నాయి. గతంలో కొత్త కనెక్షన్ పొందాలంటే వినియోగదారులు నానా అగచాట్లు పడేవారు. ఇప్పుడు ఇలా వెళ్లి అలా కనెక్షన్ తీసుకునే రోజులొచ్చాయి. గ్యాస్ వాడకం తగ్గడానికి గల కారణాలివీ.. ► {పతి ఇంట్లో వంటలు చేసుకునేందుకు ఎలక్ట్రికల్ కుక్కర్లు, చపాతీ మేకర్లు అందుబాటులోకి వచ్చాయి. ► వేడి నీళ్లకోసం గ్రీజర్లు ముమ్మరంగా వాడుతున్నారు. ► ఎలక్ట్రికల్ ఇండక్షన్ స్టౌలు కూడా రావడంతో సాధారణ గ్యాస్ స్టౌల వినియోగం తగ్గింది. ► సోలార్ విద్యుత్ కూడా అందుబాటులోకి రావడంతో గ్యాస్ వాడకం తగ్గుముఖం పట్టింది. ► నగరంలో ఇంటింటికీ పైప్లైన్ల ద్వారా భాగ్యనగర్ గ్యాస్‌ను సరఫరా చేస్తున్నారు. ► హోటళ్లు, తినుబండారాలు విక్రయించే చిరు వ్యాపారులో గతంలో దొంగచాటుగా డొమెస్టిక్ గ్యాస్‌నే వినియోగించేవారు. ఇప్పుడా పరిస్థితి లేదు. 19 కేజీల కమర్షియల్ గ్యాస్ సిలిండర్‌ను రూ. 925కే ఇస్తున్నారు. 14 కేజీల డొమెస్టిక్ గ్యాస్ సిలెండర్ రూ. 625లకే లభ్యమవుతోంది. ధరలో రూ. 300 వ్యత్యాసం మాత్రమే ఉండడంతో అధిక శాతం వ్యాపారులు కమర్షియల్ సిలిండర్లనే కొనుగోలు చేస్తున్నారు.