విశాఖపట్నం : డిజిటల్ ఇండియా వారోత్సవాల్లో భాగంగా జూలై 6వ తేదీన విశాఖపట్నంలో 'కాన్ఫరెన్స్ ఆన్ డిజిటల్ ఇండియా వీక్' పేరుతో రాష్ట్ర సదస్సు జరుగనుందని ఏపీ ఐటీ శాఖ ప్రభుత్వ కార్యదర్శి బి.శ్రీధర్ తెలిపారు. విశాఖలో శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. 6వ తేదీ ఉదయం 11 గంటలకు ఏయూ ఇంజనీరింగ్ కళాశాల ప్రాంగణంలోని వైవీఎస్ మూర్తి ఆడిటోరియంలో ఈ సదస్సు జరుగనుందన్నారు. ఈసందర్బంగా ఉత్తమ మీ సేవా నిర్వాహకులకు సర్టిఫికెట్ల బహూకరణ, డిజిటల్ ఇండియా-ఏపీ దృక్పథం అనే అంశంపై ఐటీ రంగ నిపుణులతో చర్చా గోష్ఠి ఏర్పాటు చేశామన్నారు.
ఐటీ మంత్రి డాక్టర్ పల్లె రఘునాధ్‌రెడ్డితో పాటు జిల్లా ఇన్‌చార్జి మంత్రి యనమల రామకృష్ణుడు, జిల్లా మంత్రులు గంటా శ్రీనివాసరావు, సీహెచ్ అయ్యన్నపాత్రుడు తదితరులు పాల్గొననున్నారని తెలిపారు. అలాగే మధురవాడలోని ఐటీ ప్రాంతంలో ఉన్న సన్‌రైజ్ స్టార్టప్ ఇన్‌క్యుబేషన్ సెంటర్‌లో వైఫై సేవలను అందుబాటులోకి తీసుకొస్తున్నట్టు శ్రీధర్ చెప్పారు. వైఫై సేవలతో పాటు 1 జీబీపీఎస్ నెట్ కనెక్టవిటీని ఈ సందర్భంగా మంత్రులు ప్రారంభించనున్నారన్నారు.
డిజిటల్ ఇండియా వీక్‌పై రాష్ట్ర సదస్సు
Published Sat, Jul 4 2015 7:04 PM | Last Updated on Sun, Sep 3 2017 4:53 AM
Advertisement
Advertisement