ఆహారాన్ని దరిచేర్చే టేస్టీయాప్స్
ప్రస్తుత ప్రపంచం ‘డిజిటిల్‌వరల్డ్’ వైపు పయనిస్తోంది. ఏది కావాలన్నా స్మార్ట్‌ఫోన్‌తోనే.. క్షణాల్లో ముందుంచే టెక్నాలజీ నేటి తరం సొంతం. చివరికి ఆహారంతో సహా. ఇష్టమైన ఫుడ్‌ను ఆన్‌లైన్‌లో ఆర్డర్ చేస్తే.. క్షణాల్లో డెలివరీ చేసే నూతన ఫుడ్‌యాప్‌లు మార్కెట్‌లో చాలా అందుబాటులో ఉన్నాయి. అందులో ముఖ్యమైన, ఎక్కువ మంది వినియోగదారులు ఉపయోగించే యాప్‌ల గురించి తెలుసుకుందాం.
ఫుడ్‌పాండా
భారత్‌లోని అతిపెద్ద ఫుడ్ ఆర్డర్, డెలివరీ సర్వీసుల్లో ఫుడ్‌పాండా ఒకటి. దేశంలోని 100 నగరాల్లో..మంచి డిస్కౌంట్లతో తన సేవలు అందిస్తోంది. దాదాపు అన్ని నగరాల్లోని మంచి రెస్టారెంట్లు ఈ యాప్ ద్వారా అందుబాటులో ఉన్నాయి. ఆకలిగా ఉన్నప్పుడు వెంటనే ఈ యాప్ ద్వారా కావాల్సిన ఆహారాన్ని ఆర్డర్ చేయవచ్చు. ఈ యాప్‌లో దేశంలోని ప్రధాన రెస్టారెంట్ల మెనూలు అందుబాటులో ఉంటాయి. చేయాల్సిందల్లా కేవలం ఈ యాప్ డౌన్‌లోడ్ చేసుకుని నచ్చిన ఫుడ్‌ను ఆర్డర్ చేయటమే. ఆర్డర్ చేసిన గంటలోనే ఆహారం డెలివరీ చేస్తారు. ఆండ్రాయిడ్, ఐఫోన్, విండోస్ ఫోన్ ద్వారా ఈ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
డోమినోస్ పిజ్జా
పిజ్జాలంటే ఇష్టం ఉండి, తరచూ తినాలనుకుంటే..డోమినోస్ పిజ్జా యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలి. ఈ యాప్ ద్వారా పిజ్జాను ఆర్డర్ చేస్తే దగ్గరలోని డోమినోస్ బ్రాంచ్ నుంచి కొద్ది నిమిషాల్లోనే పిజ్జాను డెలివరీ చేస్తారు. ఆండ్రాయిడ్, ఐఫోన్, విండోస్ ఫోన్ ద్వారా ఈ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
జోమాటో
ఇది కూడా పాపులర్ ఫుడ్ డెలివరీ సర్వీసు. ఈ యాప్ ద్వారా మీకు దగ్గరలోని రెస్టారెంట్ల సమాచారాన్ని తెలుసుకోవచ్చు. అందులో మీకు నచ్చిన ఆహారాన్ని ఎంపికచేసుకుని ఆర్డర్ చేయవచ్చు. భారత్‌తో సహా ప్రపంచంలోని 19 దేశాల్లో ఈ కంపెనీ తన సేవలు అందిస్తోంది. దేశంలోని ప్రధాన నగరాలన్నింటిలో ఇది తన సేవలు అందిస్తోంది. ఆండ్రాయిడ్, ఐఫోన్, బ్లాక్‌బెర్రీ, విండోస్ ఫోన్ ద్వారా ఈ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
జస్ట్‌ఈట్
ఆన్‌లైన్‌లో ఫుడ్ ఆర్డర్ సర్వీసుల్లో ఇది ఒకటి. ఈ యాప్ సమీపంలోని రెస్టారెంట్ల వివరాలు, అందులోని ఆహార పదార్థాల సమాచారాన్ని వినియోగదారులకు తెలుపుతుంది. ఆన్‌లైన్‌లో ఫుడ్ ఆర్డర్ చేసే ఈ యాప్ ద్వారా వివిధ రకాల డిస్కౌంట్‌లు కూడా అందుబాటులో ఉన్నాయి. ఇది కూడా భారత్‌లోని ప్రధాన నగరాలన్నింటిలో తన సేవలు అందిస్తోంది. ఆండ్రాయిడ్ ఫోన్ ద్వారా ఈ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.