tasty foods
-
అటుకుల వడ.. తింటే ఆహా అనాల్సిందే!
ఆపిల్ రింగ్స్ కావలసినవి: ఆపిల్ రింగ్స్ – 12 లేదా 15 (ఆపిల్ కాయను శుభ్రం చేసుకుని కొద్దిగా మధ్యలో భాగం తొలగించి రింగ్స్‌లా సిద్ధం చేసుకోవాలి), చిక్కటి మజ్జిగ – 1 కప్పు, గుడ్లు – 3, మైదాపిండి – ఒకటిన్నర కప్పులు, పంచదార పొడి – 3 లేదా 4 టేబుల్ స్పూన్లు, యాలకుల పొడి – అర టీ స్పూన్, దాల్చినచెక్కపొడి – అర టీ స్పూన్, బేకింగ్ పౌడర్ – 1 టీ స్పూన్, జాజికాయ పొడి – పావు టీ స్పూన్, ఉప్పు – కొద్దిగా, నూనె – డీప్‌ఫ్రైకి సరిపడా తయారీ: ముందుగా ఒక బౌల్ తీసుకుని మైదాపిండి, 2 టేబుల్ స్పూన్ల పంచదార పొడి, దాల్చినచెక్క పొడి, యాలకుల పొడి, జాజికాయ పొడి, బేకింగ్ పౌడర్, ఉప్పు వేసుకుని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు అందులో గుడ్లు వేసుకుని.. కొద్దికొద్దిగా మజ్జిగ వేసుకుని బజ్జీల పిండిలా సిద్ధం చేసుకోవాలి. తర్వాత ఆపిల్ రింగ్స్‌ని మైదా మిశ్రమంలో ముంచి నూనెలో డీప్‌ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మిగిలిన పంచదార పొడి వాటిపైన వేసుకుని వేడివేడిగా సర్వ్ చేసుకోవాలి. బ్రెడ్ సమోసా కావలసినవి: బ్రెడ్ స్లైస్ – 10 లేదా 15, శనగపిండి – 1 కప్పు, పసుపు – పావు టీ స్పూన్, కారం – అర టీ స్పూన్, ఉప్పు – తగినంత, బంగాళదుంపలు – 3(ఉడకబెట్టి ముద్ద చేసుకోవాలి), ఆవాలు – అర టీ స్పూన్, కరివేపాకు – 3 రెమ్మలు, పచ్చ బఠానీలు – పావు కప్పు(ఉడకబెట్టుకోవాలి), పసుపు – చిటికెడు, నీళ్లు – తగినన్ని, అల్లం–వెల్లుల్లి పేస్ట్ – 1 టీ స్పూన్, పచ్చిమిర్చి పేస్ట్ – అర టీ స్పూన్, కొత్తిమీర తురుము – ఒక టేబుల్ స్పూన్, నూనె – డీప్‌ఫ్రైకి సరిపడా తయారీ: ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని.. పాత్రలో 2 టేబుల్ స్పూన్ల నూనె వేసుకుని, వేడి కాగానే ఆవాలు, కరివేపాకు వేయించుకోవాలి. తర్వాత బంగాళదుంపల ముద్ద, బఠానీలు, అల్లం–వెల్లుల్లి పేస్ట్, పచ్చిమిర్చి పేస్ట్, కొత్తిమీర తురుము, ఉçప్పు వేసి బాగా కలిపి రెండు నిమిషాల పాటు ఉడికించుకోవాలి. తర్వాత దాన్ని ఒక గిన్నెలోకి తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకుని అందులో శనగపిండి, పసుపు, కారం, ఉప్పు వేసి కొద్దికొద్దిగా నీళ్లు వేసుకుంటూ బజ్జీల పిండిలా కలుపుకోవాలి. ఇప్పడు ఒక బ్రెడ్ స్లైస్ తీసుకుని, నలువైపులా లైట్‌గా తొలగించి.. ఒకసారి నీళ్లలో తడిపి, నీళ్లుపోయేలా ఒత్తుకుని.. దానిపైన కొద్దిగా ఆలూ మిశ్రమాన్ని పెట్టుకోవాలి. దానిపై నలువైపులా తొలగించి తడిపిన మరొక బ్రెడ్ స్లైస్ పెట్టి సమోసాలా చుట్టుకోవాలి. ఇప్పుడు వాటిని శనగపిండి మిశ్రమంలో ముంచి నూనెలో డీప్ ఫ్రై చేసుకోవాలి. అటుకుల వడ కావలసినవి: అటుకులు – 1 కప్పు(నీళ్లలో తడిపి పిండుకోవాలి), ఉల్లిపాయ ముక్కలు – 2 టేబుల్ స్పూన్లు, శనగపిండి – 1 టేబుల్ స్పూన్, బియ్యప్పిండి – 2 టేబుల్ స్పూన్లు, అల్లం పేస్ట్ – 1 టీ స్పూన్, పచ్చిమిర్చి పేస్ట్ – ఒకటిన్నర టీ స్పూన్లు, పసుపు – పావు టీ స్పూన్, జీలకర్ర – అర టీ స్పూన్, కొత్తిమీర తురుము –3 టేబుల్ స్పూన్లు, ఉప్పు – తగినంత, నూనె – డీప్‌ఫ్రైకి సరిపడా తయారీ: ముందుగా ఒక బౌల్ తీసుకుని అందులో ఉల్లిపాయ ముక్కలు, అటుకులు, బియ్యప్పిండి, శనగపిండి, అల్లం పేస్ట్, పచ్చిమిర్చి పేస్ట్ వేసుకుని బాగా కలుపుకోవాలి. పసుపు, జీలకర్ర, కొత్తిమీర తురుము, ఉప్పు వేసుకుని మరోసారి కలుపుకోవాలి. అవసరాన్ని బట్టి కొద్దిగా నీళ్లు వేసుకుని ముద్దలా చేసుకోవాలి. ఇప్పుడు చిన్న చిన్న ఉండలు చేసుకుని చేతులతో వడల్లా ఒత్తుకుని నూనెలో డీప్‌ఫ్రై చేసుకుంటే రుచిగా ఉంటాయి. సేకరణ: సంహిత నిమ్మన -
విదేశీ రుచులకు ఫిదా..
సాక్షి, విశాఖపట్నం : ఒకప్పుడు ఏదైనా విదేశీ వంటకం టేస్ట్ చేయాలి అంటే కాస్తా శ్రమించేవారు. ఏ దేశం స్పెషల్ కావాలంటే.. ఆ దేశానికి వెళ్లి తీరాల్సిందే. అది వీలుకాని వారు.. విదేశాల నుంచి వచ్చిన వారితో మాట్లాడుతూ.. అక్కడి ఫుడ్ గురించి చెబితే తిన్నంత హ్యాపీగా ఫీల్ అయ్యేవాళ్లు. కానీ ఇప్పుడు ట్రెండ్ మారింది. పర్యాటక స్వర్గధామంగా భాసిల్లుతున్న నగరంలో రోజుకో రెస్టారెంట్ పుట్టుకొస్తోంది. దేశ, విదేశాల ఫుడ్ మెనూ అంతా నగరం నలుమూలల వ్యాపించేసింది. ఆయా రెస్టారెంట్లలో ఇటాలియన్, మెక్సికో, చైనా, ఫ్రాన్స్, ఆఫ్ఘనిస్తాన్ వంటి దేశాల వంటలు నగర ప్రజల నోరూరిస్తున్నాయి. ఫ్యామిలీతో కలసి నచ్చిన వంటకాలు రుచి చూడాలంటే ఖచ్చితంగా గులాబీ నోటు జేబులో ఉండాల్సిందే. సిటీలో ఫుడ్లవర్స్ని నోరూరిస్తున్న వంటకాలను మనం ఓసారి టేస్ట్ చేద్దాం.... ఇరగదీస్తున్న ఇటాలియన్ రుచులు... ఇటలీ దేశానికి ప్రపంచవ్యాప్తంగా ఎంత ప్రఖ్యాతి ఉందో..అక్కడ లభించే ఫుడ్‌కు అంతకంటే ఎక్కువ క్రేజ్ ఉంది. ఒకప్పుడు ఇటలీకే పరిమితమైన ఫిష్, పొటాటోస్, రైస్, కార్న్, సాసేజెస్, పోర్క్, విభిన్న రకాల ఛీజ్‌లు... ఇటాలియన్ వంటకాలను చవులూరించేలా మారుస్తున్నాయి. కార్న్‌తో చేసే ‘పొలెంటా’ నగరంలో కూడా నోరూరిస్తున్నాయి. ఇద్దరు కలసి ఇటాలియ న్ రుచులను చూడాలంటే కనీసం రూ.1000 నుంచి రూ.2వేలు వెచ్చించాల్సిందే. లెబనీస్... వెరీ వెరీ టేస్టీ బాస్... డ్రైఫ్రూట్స్‌ను విరివిగా ఉపయోగించే లెబనీస్ శైలి వంటకాలు కూడా నగరంలో ఆదరణకు నోచుకుంటున్నాయి. శెనగలు ఎక్కువగా వాడే వీరి వంటకాల్లో... ఆల్ షీమీ కోఫ్తాడజాజ్, కబ్సా బిర్యానీ, ఖబ్సాలాహమ్ వంటివి నగరంలో ఫుడీస్‌కు చేరువయ్యాయి. ఆలివ్ ఆయిల్‌తో ఈ వంటకాలు చేయడం కూడా ఆరోగ్యప్రియుల ఆదరణకు కారణం. మైండ్‌లో ఫిక్సయితే..మెక్సికన్ టేస్ట్ చెయ్యాల్సిందే... మెక్సికన్‌ను మనం సినిమాల్లో చూసి ఉంటాం. సిటీలో సైతం మెక్సికన్ వంటకాలు మైండ్‌బ్లోయింగ్ అనిపిస్తున్నాయి. స్పైసీగా ఉండాలంటే మాత్రం మెక్సికన్ ఫుడ్‌పై ఓ కన్నెయ్యాల్సిందే. భారతీయ వంటకాల శైలికి దగ్గరగా ఉండడం కూడా మెక్సికన్ క్యుజిన్ని సిటీæజనులకు దగ్గర చేస్తోంది. వ్రోప్స్, నాథూస్, కేజూన్స్పైస్... వంటివి నగరంలో బాగా ఫేమస్ ఫుడ్‌గా పేరొందింది. చిప్టోల్ చికెన్ నగర భోజన ప్రియులు మెచ్చే స్టార్టర్‌గా మారిపోయింది. ఫ్యామిలీతో వెళ్లి మెక్సికన్ రుచులను ఆరగించాలంటే రూ.750నుంచి రూ.2వేలు ఉండాల్సిందే. గ్రీక్ ఫుడ్.. వెరీ గుడ్.. లేట్‌గా వచ్చినా లే‘టేస్ట్’ అనిపించుకుంటున్నాయి గ్రీక్ రుచులు. రోజ్మేరీ, థైమ్, బేసిల్ (తులసి) వంటి హెర్బ్స్ (వివిధ రకాల ఆకులు) అధికంగా మేళవించే ఈ వంటకాలు ఇప్పుడిప్పుడే నగరానికి పరిచయమవుతున్నాయి. అలాగే వెరైటీ బ్రెడ్స్ కూడా ఈ గ్రీక్ క్యుజిన్కు స్పెషల్. ప్రస్తుతానికి వెజ్ ముసాకా, ఎమిస్టా వంటి వంటకాలు బాగా ప్రాచుర్యం పొందాయి. హాట్.. హాట్.. ఆఫ్ఘాన్ ఫుడ్... ఆఫ్ఘనిస్తాన్ వంటకాలు కూడా.. ఫుడీస్ని కట్టిపడేస్తున్నాయి. అక్కడి ప్రజల అభిరుచుల మేరకు తయారు చేసే వంటకాలన్నీ ఇప్పుడు నగరంలోని ఫుడ్డీలకు అందించడం హాట్టాప్క్గా మారుతోంది. నగరంలోని పలు రెస్టారెంట్లలో లభిస్తున్న విదేశీ వంటకాలను టెక్కీలు టేస్ట్ చేస్తున్నారు. ఆఫ్ఘనిస్తాన్‌కు చెందిన ‘కుబ్లీ పలావ్’ భోజనప్రియుల్ని లొట్టలేయిస్తోంది. అదిరే.. అదిరే.. అరేబియన్ అమెరికా క్యుజిన్‌ను పోలి ఉండే అరేబియన్ శైలి వంటకాలు కూడా నగరంలో ఇప్పుడిప్పుడే ప్రాచుర్యం పొందుతున్నాయి. కబ్సా, మురమ్మరాతో పాటు బఖాదరా వంటి డిజర్ట్లు కూడా నగర ఫుడీస్‌కు ఫేమస్. అరేబియన్ వంటకాల్లో డ్రైఫ్రూట్స్ బాగా వినియోగించడం సిటీలో మరింత ఆదరణకు కారణమైంది. థాయ్.. ఇది చాలా టేస్ట్ గురూ... థాయ్‌లాండ్ అంటే గుర్తొచ్చేది ఒక్క మసాజే కాదు.. వంటకాలు కూడా ఆ దేశంలో మైమరిపిస్తాయి. ఉడికించిన, కాస్త కఠినంగా ఉండే రైస్, లెమన్‌గ్రాస్, స్వీట్ జింజిర్, నూనెలు తక్కువగా ఉపయోగించే ఆరోగ్యకరమైన ఆహారశైలిగా దీనికి పేరు. నగరంలో తోఫూ, బేసిల్–లెమన్ సూప్, పహాడ్క్రాపావో మొదలైన థాయ్ఫుడ్ బాగా ఆదరణ పొందుతున్నాయి. ఇక రొయ్యల వంటకాలంటే లొట్టలేసే ప్రియులకైతే థాయ్... సూపరోయ్. థాయ్ వంటకాల్ని ఇద్దరు కలసి టేస్ట్ చేయాలంటే రూ.1000 పైనే ఖర్చవుతుంది. అభిరుచులకు అనుగుణంగా.... సిటీలోని ఫుడ్డీల అభిరుచికి అనుగుణంగా రెస్టారెంట్లు వస్తున్నాయి. దీన్నిబట్టి సిటీలోని పలు రెస్టారెంట్లలో విదేశీ వంటకాలు హల్చల్ చేస్తున్నాయి. రుచులతో పాటు ఆయా రెస్టారెంట్లలో వినోదం కూడా ఉండటం విశేషం. వివిధ దేశాల ప్రజలు విశాఖలో పర్యటిస్తున్నారు. వారి అభిరుచులకు అనుగుణంగా సిద్ధం చేస్తున్న ఫుడ్.. నగర వాసులకూ ఫేవరెట్‌గా మారుతున్నాయి.– శ్రీధర్, ఎగ్జిక్యూటివ్ చెఫ్ -
టేస్టీ.. సీజన్
సాక్షి,సిటీబ్యూరో: ప్రస్తుత సీజన్‌ను దృష్టిలో ఉంచుకుని టీజీఐ ఫ్రైడేస్ రెస్టారెంట్ సరికొత్త రుచులను అందుబాటులోకి తెచ్చింది. స్పైసీ మ్యారీ వింగ్స్, కుంగ్ పావో వింగ్స్, చిమిచుర్రి చికెన్ స్క్యూవర్స్, పోర్క్ బెల్లీ టోస్టాడాస్, గ్లేజ్డ్పోర్క్ బెల్లీ... వగైరా అరుదుగా లభించే నాన్‌వెజ్ వెరైటీలను మెనూలో చేర్చినట్టు రెస్టారెంట్ నిర్వాహకులు వివరించారు. విభిన్నపానీయాలు కూడా అందజేస్తున్నామన్నారు. నగరంలోని తమ అన్ని రెస్టారెంట్స్‌లో అందుబాటులొ ఉంటాయన్నారు. -
ఆహారాన్ని దరిచేర్చే టేస్టీయాప్స్
ప్రస్తుత ప్రపంచం ‘డిజిటిల్వరల్డ్’ వైపు పయనిస్తోంది. ఏది కావాలన్నా స్మార్ట్‌ఫోన్‌తోనే.. క్షణాల్లో ముందుంచే టెక్నాలజీ నేటి తరం సొంతం. చివరికి ఆహారంతో సహా. ఇష్టమైన ఫుడ్‌ను ఆన్లైన్లో ఆర్డర్ చేస్తే.. క్షణాల్లో డెలివరీ చేసే నూతన ఫుడ్యాప్లు మార్కెట్లో చాలా అందుబాటులో ఉన్నాయి. అందులో ముఖ్యమైన, ఎక్కువ మంది వినియోగదారులు ఉపయోగించే యాప్‌ల గురించి తెలుసుకుందాం. ఫుడ్‌పాండా భారత్‌లోని అతిపెద్ద ఫుడ్ ఆర్డర్, డెలివరీ సర్వీసుల్లో ఫుడ్‌పాండా ఒకటి. దేశంలోని 100 నగరాల్లో..మంచి డిస్కౌంట్లతో తన సేవలు అందిస్తోంది. దాదాపు అన్ని నగరాల్లోని మంచి రెస్టారెంట్లు ఈ యాప్ ద్వారా అందుబాటులో ఉన్నాయి. ఆకలిగా ఉన్నప్పుడు వెంటనే ఈ యాప్ ద్వారా కావాల్సిన ఆహారాన్ని ఆర్డర్ చేయవచ్చు. ఈ యాప్‌లో దేశంలోని ప్రధాన రెస్టారెంట్ల మెనూలు అందుబాటులో ఉంటాయి. చేయాల్సిందల్లా కేవలం ఈ యాప్ డౌన్లోడ్ చేసుకుని నచ్చిన ఫుడ్‌ను ఆర్డర్ చేయటమే. ఆర్డర్ చేసిన గంటలోనే ఆహారం డెలివరీ చేస్తారు. ఆండ్రాయిడ్, ఐఫోన్, విండోస్ ఫోన్ ద్వారా ఈ యాప్‌ను డౌన్లోడ్ చేసుకోవచ్చు. డోమినోస్ పిజ్జా పిజ్జాలంటే ఇష్టం ఉండి, తరచూ తినాలనుకుంటే..డోమినోస్ పిజ్జా యాప్‌ను డౌన్లోడ్ చేసుకోవాలి. ఈ యాప్ ద్వారా పిజ్జాను ఆర్డర్ చేస్తే దగ్గరలోని డోమినోస్ బ్రాంచ్ నుంచి కొద్ది నిమిషాల్లోనే పిజ్జాను డెలివరీ చేస్తారు. ఆండ్రాయిడ్, ఐఫోన్, విండోస్ ఫోన్ ద్వారా ఈ యాప్‌ను డౌన్లోడ్ చేసుకోవచ్చు. జోమాటో ఇది కూడా పాపులర్ ఫుడ్ డెలివరీ సర్వీసు. ఈ యాప్ ద్వారా మీకు దగ్గరలోని రెస్టారెంట్ల సమాచారాన్ని తెలుసుకోవచ్చు. అందులో మీకు నచ్చిన ఆహారాన్ని ఎంపికచేసుకుని ఆర్డర్ చేయవచ్చు. భారత్‌తో సహా ప్రపంచంలోని 19 దేశాల్లో ఈ కంపెనీ తన సేవలు అందిస్తోంది. దేశంలోని ప్రధాన నగరాలన్నింటిలో ఇది తన సేవలు అందిస్తోంది. ఆండ్రాయిడ్, ఐఫోన్, బ్లాక్‌బెర్రీ, విండోస్ ఫోన్ ద్వారా ఈ యాప్‌ను డౌన్లోడ్ చేసుకోవచ్చు. జస్ట్ఈట్ ఆన్లైన్లో ఫుడ్ ఆర్డర్ సర్వీసుల్లో ఇది ఒకటి. ఈ యాప్ సమీపంలోని రెస్టారెంట్ల వివరాలు, అందులోని ఆహార పదార్థాల సమాచారాన్ని వినియోగదారులకు తెలుపుతుంది. ఆన్లైన్లో ఫుడ్ ఆర్డర్ చేసే ఈ యాప్ ద్వారా వివిధ రకాల డిస్కౌంట్లు కూడా అందుబాటులో ఉన్నాయి. ఇది కూడా భారత్‌లోని ప్రధాన నగరాలన్నింటిలో తన సేవలు అందిస్తోంది. ఆండ్రాయిడ్ ఫోన్ ద్వారా ఈ యాప్‌ను డౌన్లోడ్ చేసుకోవచ్చు.