
మీ సేవా కేంద్రాల్లో బ్యాంకింగ్ సేవలు
నగదు రహిత లావాదేవీలపై శిక్షణ కార్యక్రమంలో జేసీ గిరీషా
చిత్తూరు (కలెక్టరేట్): మీసేవా కేంద్రాల్లో బ్యాంకింగ్ సేవలు నిర్వహించాలని జిల్లా జారుుంట్ కలెక్టర్ పీఎస్ గిరీషా తెలిపారు. గురువారం కలెక్టరేట్‌లోని డీఆర్‌డీఏ కార్యాలయ సమావేశ భవనంలో జిల్లాలోని మీ సేవా ఆపరేటర్లకు నగదు రహిత లావాదేవీలు, బ్యాంకింగ్ సేవలపై మూడు రోజుల శిక్షణ కార్యక్రమాన్ని జేసీ ప్రారంభించారు. లో భాగంగా కామన్ సర్వీస్ సెంటరు ద్వారా రాష్ట్రంలోనే ప్రయోగాత్మకంగా మన జిల్లాలో మీసేవా కేంద్రాల ద్వారా నగదు రహిత, బ్యాంకింగ్ సేవలు చేపట్టనున్నామన్నారు. మీసేవా కేంద్రాలకు వివిధ పనుల నిమిత్తం విచ్చేసే ప్రజల నుంచి నగదు రహిత లావాదేవీలు నిర్వహించాలన్నారు. అదేగాక సామాజిక పింఛనుదారులకు పింఛను మొత్తాలను బయోమెట్రిక్ విధానంతో వారి బ్యాంకు ఖాతాలోని నగదును ట్రాన్‌సఫర్ చేసుకుని, పింఛను మొత్తాలను అందించే ప్రక్రియను కూడా చేపట్టాలన్నారు. బ్యాంకుల్లో ఖాతాదారులకు కూడా మీసేవా కేంద్రాల్లో నగదును అందించాలన్నారు. ఇందుకోసం ప్రతి మీసేవా కేంద్రంలో ఈ-పాస్ మిషన్లు ఏర్పాటు చేసుకుని నగదు లావాదేవీలను నడపాలన్నారు.
ప్రస్తుతం అర్బన్ ప్రాంతాల్లో ఈ-పాస్ మిషన్ల ద్వారా నగదు రహిత లావాదేవీలు జరుగుతున్నాయన్నారు. దీనిని వందశాతం మేరకు పెంపొందించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. ఇందుకోసం మీ సేవా ఆపరేటర్లు ఈ-పాస్ యంత్రాలు, మొబైల్స్, ఇంటర్‌నెట్ బ్యాంకింగ్, యాప్, మెబైల్ వాలెట్ల ద్వారా ఆర్థిక లావాదేవీలు ఏవిధంగా జరపాలనే విషయాలను ఈ శిక్షణ ద్వారా పూర్తి స్థారుులో అవగాహన పొందాలన్నారు. ప్రస్తుతం వస్తున్న టెక్నాలజీలోని మార్పులను ఆపరేటర్లు పూర్తిస్థారుులో అవగాహన పెంచుకుని, ప్రజాసేవ చేయాలని డీఆర్‌డీఏ పీడీ రవిప్రకాష్‌రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎల్డీయం రామ్మోహన్, మైనార్టీ కార్పోరేషన్ ఈడీ శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.