ఇరుంబు తిరై సక్సెస్ మీట్‌లో హీరో విశాల్
సాక్షి, చెన్నై: స్టార్ హీరో విశాల్ మరోసారి పొలిటికల్ కామెంట్లు చేశారు. విశాల్ తాజా చిత్రం ఇరుంబు తిరై(తెలుగులో అభిమన్యుడు) సక్సెస్ మీట్ గురువారం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘ప్రస్తుతం మన దేశంలో జరుగుతున్న ఎన్నికల్లో ఈవీఎంలు కీలకంగా మారాయి. నాకు మాత్రం ఈవీఎంలపై నమ్మకం పోయింది. బ్యాలెట్ పేపర్ పైనే నాకు పూర్తి విశ్వాసం ఉంది. సంస్కరణల పేరిట డిజిటల్ ఇండియా, ఆధార్ అంటూ ప్రభుత్వం హడావుడి చేసింది. కానీ, వాటిపై ప్రజల్లో అభద్రతా భావం నెలకొంది. చివరకు సుప్రీం కోర్టు కూడా వాటి విశ్వసనీయతపై అనుమానం వ్యక్తం చేస్తోందంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు’ అని విశాల్ అన్నారు.
వివాహంపై... సామాజిక అంశాలనే ఇరుంబు తిరైలో చూపించామన్న ఆయన, చిత్రం సక్సెస్ పట్ల ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలియజేశారు. ఇక వివాహంపై విశాల్ మరోసారి ప్రకటన చేశారు. ‘జనవరిలో ఓ తమిళ అమ్మాయిని వివాహం చేసుకుంటా. నడిగర్ సంఘం కళ్యాణ మండపంలో మొదటి వివాహం నాదే’ అని చెప్పారు. కాగా, కోలీవుడ్ నటి వరలక్ష్మీ శరత్‌కుమార్‌తో విశాల్ రిలేషన్‌షిప్‌లో ఉన్న విషయం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment